‘What Else Does He Need to Do’ – Harbhajan Singh: షెల్డన్ జాక్సన్.. దేశవాళీ క్రికెట్‌లో ఇప్పటికే తనను తాను నిరూపించుకున్న వెటరన్ ప్లేయర్. 35 ఏళ్ల షెల్డన్.. ఎప్పటికైనా జాతీయ జట్టులో తనకు చోటు దక్కుతుందని ఆశగా ఎదురుచూస్తున్నాడు. ఈ క్రమంలో త్వరలో న్యూజిలాండ్‌తో టీమిండియా సిరీస్, ఇండియా ఏ దక్షిణాఫ్రికా టూర్ నేపథ్యంలో సెలక్టర్లు తనను పరిగణనలోకి తీసుకుంటారని ఆశలు పెట్టుకున్నాడు. కానీ.. నవంబరు 9న బీసీసీఐ ప్రకటించిన జట్టులో అతడికి స్థానం దక్కలేదు. దీంతో సౌరాష్ట్ర ఆటగాడు షెల్డన్‌కు మరోసారి నిరాశ తప్పలేదు.
ఈ నేపథ్యంలో టీమిండియా వెటరన్ క్రికెటర్ హర్భజన్ సింగ్ సెలక్టర్ల తీరుపై మండిపడ్డాడు. దేశవాళీ టోర్నీలో అద్బుతంగా రాణిస్తున్నా అతడిని ఎంపిక చేయకపోవడం ఏమిటని ప్రశ్నించాడు. అతడేం పాపం చేశాడని... ఇంకేం చేస్తే షెల్డన్‌ను జట్టులోకి తీసుకుంటారంటూ ధ్వజమెత్తాడు. ఈ మేరకు... ‘‘ 2019/19 రంజీ సీజన్‌లో 854 పరుగులు, 2019/2020లో 809 పరుగులు.. రంజీ చాంపియన్.
ఈ ఏడాది కూడా అద్భుతమైన ఫామ్.. అయినా కూడా కసీం ఇండియా ఏ టీమ్‌కు కూడా సెలక్ట్ కాలేదు. పరుగులు చేయడం కాకుండా ఇంకేం చేస్తే... అతడిని పరిగణనలోకి తీసుకుంటారో భారత సెలక్టర్లు చెప్పగలరా?’’ అని ట్విటర్ వేదికగా భజ్జీ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
IPL
కాగా భజ్జీ మాటల్లో వాస్తవం లేకపోలేదు. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ నేపథ్యంలో ఐపీఎల్‌లో నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకున్న వెంకటేశ్ అయ్యర్ (కోల్‌కతా నైట్‌రైడర్స్), హర్షల్ పటేల్ (రాయల్ చాలెంజర్స్ బెంగళూరు), అవేశ్ ఖాన్ (ఢిల్లీ క్యాపిటల్స్)లకు తొలిసారి జాతీయ జట్టులో స్థానం దక్కిన సంగతి తెలిసిందే.
అయితే, ప్రస్తుత సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2021లోనూ అద్భుతంగా రాణిస్తున్న షెల్డన్ జాక్సన్‌ను మాత్రం పక్కనపెట్టేశారు. ఇక ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లలో షెల్డన్ జాక్సన్.. వరుసగా 62 నాటౌట్, 70, 79 నాటౌట్ స్కోరు చేశాడు. ఇక ఫస్ట్‌క్లాస్ క్రికెట్ విషయానికొస్తే.. 5634 పరుగులు చేసిన షెల్డన్... పరిమిత ఓవర్ల క్రికెట్‌లోనూ గత దశాబ్ద కాలంగా సౌరాష్ట్ర జట్టులో తన వంతు పాత్ర పోషిస్తున్నాడు.
భారత టి20 జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), వెంకటేశ్ అయ్యర్, యజువేంద్ర చహల్, అశ్విన్, అక్షర్ పటేల్, అవేశ్ ఖాన్, భువనేశ్వర్, దీపక్ చహర్, హర్షల్ పటేల్, మొహమ్మద్ సిరాజ్.
చదవండి: Sheldon Jackson: అంతా గంభీర్ భయ్యా వల్లే.. లేదంటే రోడ్డు మీద పానీపూరీ అమ్ముకునేవాడిని
#JusticeForSanjuSamson: మా గుండె పగిలింది.. అసలేంటి ఇదంతా?!
Ranji season 2018/19 scored 854 and 2019/2020 scored 809 and also Ranji champion that year plus this year current form👇yet not getting picked even for India A team.can 🇮🇳selector tell him what else he need to do to ply for india apart from scoring runs #shame @ShelJackson27 pic.twitter.com/HcwQDwhGsZ
— Harbhajan Turbanator (@harbhajan_singh) November 9, 2021
Comments
Please login to add a commentAdd a comment