షెల్డాన్ జాక్సన్ వీరవిహారం | sheldon jackson smashes goa | Sakshi
Sakshi News home page

షెల్డాన్ జాక్సన్ వీరవిహారం

Dec 12 2015 8:32 PM | Updated on Sep 3 2017 1:53 PM

షెల్డాన్ జాక్సన్ వీరవిహారం

షెల్డాన్ జాక్సన్ వీరవిహారం

దేశవాళీ లీగ్ మ్యాచ్ ల్లో భాగంగా విజయ్ హజారే వన్డే ట్రోఫీలో సౌరాష్ట్ర ఓపెనర్ షెల్డాన్ జాక్సన్ వీరవిహారం చేశాడు.

రాజ్ కోట్:దేశవాళీ లీగ్ మ్యాచ్ ల్లో భాగంగా విజయ్ హజారే వన్డే ట్రోఫీలో సౌరాష్ట్ర ఓపెనర్ షెల్డాన్ జాక్సన్ వీరవిహారం చేశాడు. గ్రూప్-డిలో భాగంగా శనివారం గోవాతో జరిగిన మ్యాచ్ లో జాక్సన్(150 నాటౌట్; 103 బంతుల్లో 22 ఫోర్లు, 4 సిక్సర్లు) దూకుడుగా ఆడటంతో సౌరాష్ట్రకు ఘన విజయం సాధించింది. అతనికి జతగా మరో ఓపెనర్ బారోట్ (49 నాటౌట్:56 బంతుల్లో 4 ఫోర్లు) చక్కటి సహకారం అందించాడు. దీంతో సౌరాష్ట్ర  26.3 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా అద్భుతమైన విజయాన్ని కైవసం చేసుకుంది. ఇంకా 141 బంతులు మిగిలి ఉండగానే సౌరాష్ట్ర  గెలుపును సొంతం చేసుకోవడం ఈమ్యాచ్ లో విశేషం.

టాస్ గెలిచిన సౌరాష్ట్ర తొలుత బ్యాటింగ్ చేయాల్సిందిగా గోవాను కోరింది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన గోవా 47.4 ఓవర్లలో 199 పరుగులకే పరిమితమైంది. గోవా ఆటగాళ్లలో కామత్(95) మినహా ఎవరూ ఆకట్టుకోలేదు.సౌరాష్ట్ర బౌలర్లలో సనాన్ దియాకు మూడు వికెట్లు లభించగా, రవీంద్ర జడేజాకు రెండు వికెట్లు లభించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement