
న్యూఢిల్లీ: సౌరాష్ట్ర సీనియర్ ఆటగాడు, దేశవాలీ స్టార్ బ్యాటర్ షెల్డన్ జాక్సన్ (Sheldon Jackson)... ప్రొఫెషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. దేశవాళీ క్రికెట్‌లో సుదీర్ఘ కాలంగా రాణిస్తున్న 38 ఏళ్ల షెల్డన్ జాక్సన్... రంజీ ట్రోఫీలో గుజరాత్‌తో క్వార్టర్ ఫైనల్ పరాజయం అనంతరం తన నిర్ణయాన్ని వెల్లడించాడు.
ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 106 మ్యాచ్‌లాడిన షెల్డన్ 45.80 సగటుతో 7,283 పరుగులు చేశాడు. ఇందులో 21 శతకాలు, 39 అర్ధశతకాలు ఉన్నాయి. కేవలం బ్యాటర్‌గానే కాకుండా... మంచి ఫీల్డర్‌గా, వికెట్ కీపర్‌గానూ షెల్డన్ జాక్సన్ సౌరాష్ట్ర జట్టుకు సేవలందించాడు.
2011లో అరంగేట్రం చేసిన జాక్సన్... 2015–16 సీజన్‌లో సౌరాష్ట్ర జట్టు రంజీ ట్రోఫీ చేజిక్కించుకోవడంలో కీలకపాత్ర పోషించాడు. ఇప్పటికే పరిమిత ఓవర్ల క్రికెట్‌కు వీడ్కోలు పలికిన షెల్డన్ భారత ‘ఎ’ జట్టుకు కూడా ప్రాతినిధ్యం వహించాడు. జాక్సన్‌కు ఐపీఎల్‌లోనూ ప్రవేశముంది. 2017-22 ఎడిషన్ల మధ్యలో జాక్సన్ క్యాష్ రిచ్ లీగ్‌లో 9 మ్యాచ్‌లు ఆడాడు.
Comments
Please login to add a commentAdd a comment