Never Call Selectors Ask Why Batter Explosive Rant After Repeated Snubs Dhoni DK - Sakshi
Sakshi News home page

నాకేమీ 75 ఏళ్లు కాదు.. ధోని, డీకేను చూసినప్పుడల్లా! వినీ వినీ విసుగొచ్చింది!

Published Fri, Jun 30 2023 1:37 PM | Last Updated on Fri, Jun 30 2023 2:11 PM

Never Call Selectors Ask Why Batter Explosive Rant After Repeated Snubs Dhoni DK - Sakshi

Ind Vs WI: ‘‘నేను నైరాశ్యంలో మునిగిపోయినప్పుడల్లా దినేశ్‌ కార్తిక్‌, మహేంద్ర సింగ్‌ ధోనిని గుర్తు చేసుకుంటాను. నేను కేకేఆర్‌కు ఆడుతున్న సమయంలో కార్తిక్‌ని దగ్గరగా గమనించాను. అతడి కెరీర్‌ ఎలాంటి మలుపులు తిరిగిందో చూశాను. నాకు డీకే స్ఫూర్తి. కెరీర్‌ పరంగా నిరాశ ఎదురైనపుడు అతడే నా మోటివేషన్‌’’ అని సౌరాష్ట్ర వెటరన్‌ బ్యాటర్‌ షెల్డన్‌ జాక్సన్‌ ఉద్వేగానికి లోనయ్యాడు.

36 ఏళ్ల వయసులో..
గుజరాత్‌లోని భావ్‌నగర్‌కు చెందిన ఈ వికెట్‌ కీపర్‌ ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో గత కొన్నేళ్లుగా నిలకడగా ఆడుతున్నాడు. దేశవాళీ మ్యాచ్‌లలో సౌరాష్ట్ర తరఫున టన్నుల కొద్ది పరుగులు సాధిస్తున్నాడు. కానీ 36 ఏళ్ల జాక్సన్‌కు ఇంతవరకు ఒక్కసారి కూడా టీమిండియా సెలక్టర్ల నుంచి పిలుపు రాలేదు. మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నప్పటికీ ప్రతిసారి మొండిచేయే ఎదురైంది. కనీసం ఇండియా- ఏ జట్టుకు కూడా అతడిని ఎంపికచేయలేదు. 

ఈ నేపథ్యంలో గతేడాది ట్విటర్‌ వేదికగా సెలక్టర్ల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన షెల్డన్‌ జాక్సన్‌.. తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలతో ముందుకు వచ్చాడు. స్పోర్ట్స్‌కీడాతో మాట్లాడుతూ.. ‘‘మనకసలు అవకాశమే ఇవ్వకపోతే మనల్ని మనం ఎలా నిరూపించుకుంటాం? 

వాళ్లను ఒక్కమాట కూడా అనను
సెలక్షన్‌ విధానంపై నేనెప్పుడూ ఎలాంటి కామెంట్‌ చేయను. నన్నెందుకు ఎంపిక చేయలేదని అడిగే హక్కు మాత్రం ఉంటుంది కదా! కానీ నేనెప్పుడూ ఏ సెలక్టర్‌ను కూడా ఎప్పుడూ సంప్రదించలేదు. నన్ను ఎందుకు బలి చేశారని అడుగలేదు.

ఒకవేళ నిజంగానే నా ఆట తీరు మరీ అంత ఘోరంగా ఉంటే 90కి పైగా మ్యాచ్‌లు ఎలా ఆడి ఉంటాను. నా సగటు 50. పరిమిత ఓవర్లు, రెడ్‌బాల్‌ క్రికెట్లో ప్రభావం చూపగలుగుతున్నా. నిజానికి ఇన్నాళ్లుగా నాకు అండగా నిలుస్తున్న సౌరాష్ట్ర క్రికెట్‌ అసోసియేషన్‌కు ధన్యవాదాలు చెప్పాలి. 

నాకు షా కుటుంబం మద్దుతు ఉంది..అందుకే
ముఖ్యంగా షా(జయదేవ్‌ షా, నిరంజన్‌ షాలను ఉద్దేశించి) కుటుంబం నుంచి పూర్తి మద్దతు ఉంది. వంద మ్యాచ్‌లకు నేను చేరువవుతున్నానంటే అందుకు వాళ్లే కారణం. ఏదేమైనా జట్టు ఎంపిక విషయంలో సెలక్టర్లు మనల్ని విస్మరించినప్పుడు విసుగు, కోపం, అసహనం రావడం సహజమే కదా!’’ అని షెల్డన్‌ జాక్సన్‌ ఆవేదన వ్యక్తం చేశాడు.

గతంలో సెలక్టర్లను ఉద్దేశించి షెల్డన్‌ జాక్సన్‌ చేసిన ట్వీట్‌
‘‘గత మూడు సీజన్లలో అద్భుతంగా ఆడాను కాబట్టి జాతీయ జట్టుకు ఎంపికవ్వాలనే కల నెరవేరుతుందని ఆశించే హక్కు నాకుంటుంది. నా వయసును బట్టి కాదు.. నా ఆట తీరును బట్టి నా పేరును పరిశీలనలోకి తీసుకోండి.

నువ్వు మంచి ఆటగాడివి కానీ.. ఇలాంటి మాటలు వినీ వినీ విసుగొచ్చింది. నాకు వయసైపోయిందన్న మాట వాస్తవమే. కానీ నాకిప్పుడు 35 ఏళ్లే.. 75 కాదు’’ అని జాక్సన్‌ 2022 ఆగష్టులో సెలక్టర్లకు దిమ్మతిరిగేలా విమర్శనాస్త్రాలు సంధించాడు. కాగా వెస్టిండీస్ పర్యటన నేపథ్యంలో టీమిండియా టెస్టు జట్టు ఎంపిక నేపథ్యంలో షెల్డన్‌ జాక్సన్‌ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. 

చదవండి: ఆర్నెళ్లుగా జట్టుకు దూరం.. ఏకంగా టీమిండియా కెప్టెన్‌గా రీఎంట్రీ!
WC 2023: వెస్టిండీస్‌ కొంపముంచిన జింబాబ్వే! ఇక ఆశలు వదులుకోవాల్సిందే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement