This BTech graduate became renowned cricketer: మన దేశంలో ఇంజనీరింగ్ విద్యకున్న ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇంజనీరింగ్‌లో పట్టా పుచ్చుకుని.. నైపుణ్యాలు అభివృద్ధి చేసుకుంటే పేరెన్నికగన్న కంపెనీల్లో ఐదంకెల జీతంతో ఉద్యోగంలో చేరే అవకాశం ఉంటుంది. ఇక ప్రతిభావంతులైన బీటెక్ గ్రాడ్యుయేట్ల గురించి చెప్పేదేముంది.
ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్, ఐటీ విభాగాల్లో డిగ్రీ అందుకున్న వాళ్లకు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులుగా విదేశాల్లో సైతం కళ్లు చెదిరే మొత్తంతో ప్యాకేజీలు లభిస్తాయి. మరి.. మన క్రికెటర్లలో.. ప్రస్తుతం లైమ్‌లైట్‌లో ఉన్న ఓ ఆటగాడు కూడా బీటెక్ చదివాడన్న సంగతి తెలుసా?!
చదువుతో పాటు క్రికెట్ కూడా!
రవిచంద్రన్ అశ్విన్.. టీమిండియా మేటి స్పిన్నర్లలో ఒకడిగా ఎదిగాడు. 1986, సెప్టెంబరు 17న తమిళనాడులోని చెన్నైలో జన్మించిన అశూ క్రికెటర్ కావాలనుకున్నాడు. అయితే, చదువును నిర్లక్ష్యం చేయలేదు.
పద్మ శేషాద్రి బాల భవన్, సెయింట్ బీడ్స్ ఆంగ్లో ఇండియన్ పాఠశాలల్లో సెకండరీ విద్యను పూర్తి చేసిన అశ్విన్.. చెన్నైలోని ఎస్‌ఎస్‌ఎన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో బీటెక్ చదివాడు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బ్రాంచ్‌లో చేరిన అశూ మంచి మార్కులతో పాసయ్యాడు.
వాళ్ల ప్రోత్సాహం
అయితే, స్కూల్ డేస్‌లోనే క్రికెట్‌పై మక్కువ పెంచుకున్న అశ్విన్‌కు.. సెయింట్ బీడ్ స్కూళ్లో సీకే విజయ్, చంద్ర ప్రోత్సాహం అందించి క్రికెటర్‌గా ఎదగడంలో కీలక పాత్ర పోషించారు. ఈ విషయాన్ని అశూనే స్వయంగా వెల్లడించాడు.
తిరుగులేని బౌలర్‌గా
ఇక టీమిండియా ప్రధాన స్పిన్నర్‌గా అరుదైన ఘనతలు సాధిస్తున్న రవిచంద్రన్ అశ్విన్.. ఐపీఎల్‌లోనూ రాణిస్తున్నాడు. ఈ ఏడాది వేలంలో రాజస్తాన్ రాయల్స్ అతడిని రూ. 5 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ సీజన్‌లో అశ్విన్ 13 ఇన్నింగ్స్ ఆడి 14 వికెట్లు పడగొట్టాడు. ఇక.. తాజాగా వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్ నేపథ్యంలో అశ్విన్.. రెండు మ్యాచ్‌లలో కలిపి ఏకంగా 15 వికెట్లతో సత్తా చాటాడు.
నికర ఆస్తి విలువ ఎంతంటే!
ఇక బీసీసీఐ కాంట్రాక్ట్‌లో ఏ గ్రేడ్‌లో ఉన్న అశ్విన్.. ఏడాదికి 5 కోట్లు అందుకుంటున్నాడు. ఐపీఎల్‌తోనూ బాగానే వెనకేసుకుంటున్నాడు. ఈ క్రమంలో రవిచంద్రన్ అశ్విన్ నికర ఆస్తి విలువ 100 కోట్ల దాకా ఉంటుందని పలు స్పోర్ట్స్ వెబ్‌సైట్ల అంచనా.
కాగా అంతర్జాతీయ క్రికెట్‌లో అశ్విన్ ఇప్పటి వరకు 712 వికెట్లు పడగొట్టాడు. మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లి సారథ్యంలో ఆడిన అశూ.. ప్రస్తుతం జట్టులో ప్రధాన స్పిన్నర్‌గా ఉన్నాడు. అశ్విన్ వ్యక్తిగత విషయానికొస్తే.. తన చిన్ననాటి స్నేహితురాలు ప్రీతి నారాయణ్‌ను 2011లో పెళ్లాడాడు. ఈ జంటకు ఇద్దరు కూతుళ్లు అకీరా, ఆద్య ఉన్నారు.
చదవండి: టీమిండియా క్రికెటర్లలో ప్రభుత్వ ఉద్యోగులు వీరే! లిస్టులో ఊహించని పేర్లు..
ఏడాదికి 50 కోట్ల సంపాదన! మరి.. ధోని సొంత అక్క పరిస్థితి ఎలా ఉందంటే!
Comments
Please login to add a commentAdd a comment