West Indies vs India, 2nd Test: వెస్టిండీస్‌తో రెండో టెస్టులోనూ టీమిండియా వైస్ కెప్టెన్ అజింక్య రహానే విఫలమయ్యాడు. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అతడు 36 బంతులు ఎదుర్కొని కేవలం 8 పరుగులు మాత్రమే చేయగలిగాడు. విండీస్ పేసర్ షానన్ గాబ్రియెల్ బౌలింగ్‌లో బౌల్డ్ అయి వికెట్ సమర్పించుకున్నాడు. దీంతో రహానే ఆట తీరుపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఐపీఎల్‌లో సత్తా చాటి పునరాగమనం
ఐపీఎల్-2023లో చెన్నై సూపర్‌కింగ్స్ తరఫున అదరగొట్టిన రహానే ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్-2023 ఫైనల్ సందర్భంగా భారత జట్టులో పునరాగమనం చేసిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఈ మెగా పోరులో మిగతా వాళ్లు విఫలమైన వేళ రహానే ఒక్కడే రాణించాడు.
ఆ మ్యాచ్‌లో మొత్తంగా 138 పరుగులు సాధించి టీమిండియా టాప్ స్కోరర్‌గా నిలిచాడు. దీంతో విండీస్ టెస్టు సిరీస్‌కు వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. కానీ అంచనాలు అందుకోలేక పూర్తిగా నిరాశపరిచాడు. తొలి టెస్టులో కేవలం 3 పరుగులు చేసిన రహానే.. మలి మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 8 పరుగులకే పెవిలియన్ చేరాడు.
పుజారాను కూడా పక్కనపెట్టి
ఇలా రెండు సందర్భాల్లోనూ ఉప నాయకుడు సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితం కావడంతో సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ‘‘అభిమన్యు ఈశ్వరన్, సర్ఫరాజ్ ఖాన్ వంటి యువ ఆటగాళ్లు టెస్టుల్లో అరంగేట్రం కోసం ఎదురుచూస్తున్నారు. కౌంటీల్లో రాణించిన పుజారాపై వేటు వేశారు. రహానేకు మాత్రం వైస్ కెప్టెన్ పదవి కట్టబెట్టారు.
ధోని భయ్యా ఉంటేనే
అయినా.. ఐపీఎల్(టీ20ల)లో ప్రదర్శన ఆధారంగా టెస్టు జట్టులోకి తీసుకోకూడదన్న అభిప్రాయాన్ని సీనియర్ బ్యాటర్ అయిన రహానే మరోసారి నిరూపించాడు. పుజారాను కాదని రహానేను సెలక్ట్ చేసినందుకు బాగానే బుద్ధి చెప్పాడు.
ఇప్పటికైనా యువకులకు అవకాశం ఇస్తే బాగుంటుంది. రహానే అరుదుగా విఫలమయ్యే బ్యాటర్ కాదు.. అరుదుగా విజయాలు అందుకునే ఆటగాడు. అయినా ధోని భాయ్ ఉంటేనే రహానే పరుగులు సాధిస్తాడేమోలే!’’ అని ట్రోల్ చేస్తున్నారు.
కాగా ఐపీఎల్-2023లో సీఎస్‌కేకు ప్రాతినిథ్యం వహించిన రహానేకు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని వరుస అవకాశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 11 ఇన్నింగ్స్ ఆడి 326 పరుగులు సాధించాడు. ఇదిలా ఉంటే.. ట్రినిడాడ్‌లోని పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా విండీస్- భారత్ మధ్య జూలై 20న రెండో టెస్టు ఆరంభమైంది. టాస్ గెలిచిన ఆతిథ్య జట్టు బౌలింగ్ ఎంచుకోగా రోహిత్ సేన బ్యాటింగ్‌కు దిగింది.
తొలిరోజు ఆటలో..
గురువారం నాటి తొలిరోజు ఆట ముగిసే సరికి టీమిండియా 4 వికెట్లు కోల్పోయి 288 పరుగులు చేసింది. ఓపెనర్లు యశస్వి జైశ్వాల్(57), రోహిత్ శర్మ(80) అర్ధ శతకాలతో రాణించగా.. విరాట్ కోహ్లి 87, జడేజా 36 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇక ఈ మ్యాచ్‌లో రహానేతో పాటు వన్‌డౌన్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ కూడా నిరాశపరిచాడు. 12 బంతులు ఎదుర్కొన్న గిల్.. 10 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు.
చదవండి: SL Vs Pak: లంకపై పాక్ విజయం! ప్రైజ్‌మనీ ఎంతంటే! సారీ చెప్పిన బోర్డు..
Comments
Please login to add a commentAdd a comment