విండీస్ తొలి ఇన్నింగ్స్ సందర్భంగా స్టెప్పులేసిన గిల్ (PC: Twitter)
West Indies vs India, 1st Test: వెస్టిండీస్‌తో తొలి టెస్టులో టీమిండియా యువ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ పూర్తిగా నిరాశపరిచాడు. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన ఈ ఓపెనర్ మొదటి ఇన్నింగ్స్‌లో 6 పరుగులు మాత్రమే చేయగలిగాడు. రెండో రోజు సెకండ్ సెషన్‌లో విండీస్ స్పిన్నర్ వారికన్ బౌలింగ్‌లో అథనాజ్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.
ఏరికోరి వచ్చావు? ఏమైందిపుడు?
కాగా టీమిండియా నయావాల్ ఛతేశ్వర్ పుజారాను జట్టు నుంచి తప్పించగా గిల్‌కు మూడో స్థానంలో బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చింది. ఓపెనర్‌గా రావాల్సిన గిల్.. తనకు మూడు లేదంటే నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయాలని ఉందని యాజమాన్యంతో చెప్పడం.. అందుకు సానుకూల స్పందన రావడంతో వన్‌డౌన్‌లో వచ్చాడు. ఈ క్రమంలో కెప్టెన్ రోహిత్ శర్మకు జోడీగా ఓపెనర్‌గా అరంగేట్ర ఆటగాడు యశస్వి జైశ్వాల్‌కు అవకాశం వచ్చింది.
సెంచరీతో కదం తొక్కిన యశస్వి
ఇక తొలి అంతర్జాతీయ మ్యాచ్‌లోనే యశస్వి సెంచరీ(143 నాటౌట్)తో చెలరేగగా.. ఓపెనింగ్ స్థానం కాదని ఏరికోరి మూడో స్థానంలో వచ్చిన గిల్ ఉసూరుమనిపించాడు. దీంతో అభిమానులు అతడిపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ‘‘బ్యాటింగ్ పొజిషన్‌లో కోరుకున్న స్థానంలో ఆడే అవకాశం ఇస్తే సద్వినియోగం చేసుకోలేకపోయావు. ఎవరికి ఏది కరెక్ట్ ఇప్పటికైనా తెలుసుకో!
ఏదేమైనా యశస్వికి ఛాన్స్ వచ్చింది. నిరూపించుకున్నాడు. సంతోషం’ అని సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా సైతం గిల్ ఆట తీరుపై పెదవి విరిచాడు. ‘‘మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన శుబ్‌మన్ గిల్‌కు.. ఆ పొజిషన్‌లో ఆడటం ఎంత కష్టమో ఇప్పటికైనా అర్థమై ఉంటుంది. తన ఫస్ట్‌క్లాస్ క్రికెట్ కెరీర్‌లో అతడు ఎక్కువగా ఓపెనర్‌గానే వచ్చాడు.
అప్పుడు కూడా ఇలాగే
ఇక ఇప్పుడు భారీ భాగస్వామ్యం తర్వాత మూడో స్థానంలో వచ్చి విఫలమయ్యాడు. ఆస్ట్రేలియాతో స్వదేశంలో ఇండోర్ మ్యాచ్‌లోనూ ఇదే తరహాలో అవుటయ్యాడు. ఆసీస్ స్పిన్నర్ మాథ్యూ కుహ్నెమన్ బౌలింగ్‌లో స్మిత్‌కు క్యాచ్ ఇచ్చాడు. గిల్ తన టెక్నిక్‌పై సమీక్ష చేసుకోవాలి’’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు.
స్టెప్పులేశాడు
ఇదిలా ఉంటే.. రెండో రోజు ఆట ముగిసే సరికి టీమిండియా రెండు వికెట్లు నష్టపోయి 312 పరుగులు చేసింది. యశస్వి(143), విరాట్ కోహ్లి (36) క్రీజులో ఉన్నారు. మొత్తంగా టీమిండియా 162 పరుగుల ఆధిక్యంలో ఉంది. విండీస్ బౌలర్లలో స్పిన్నర్లు కార్న్‌వాల్, వారికన్ ఒక్కో వికెట్ తీశారు. ఇదిలా ఉంటే.. మొదటి రోజు ఆటలో అశ్విన్ చెలరేగడంతో విండీస్ బ్యాటర్లు విలవిల్లాడగా.. షార్ట్‌లెగ్ పొజిషన్‌లో ఫీల్డింగ్ చేస్తున్న గిల్ స్టెప్పులేసిన వీడియో వైరల్‌గా మారింది.
చదవండి: విండీస్ ఆటగాడిపై జైశ్వాల్ దూషణల పర్వం; కోహ్లి సీరియస్
టీమిండియా ప్రధాన సమస్య అదే! ఏమాత్రం తేడా జరిగినా.. అంతే సంగతులు!
DO NOT MISS! Keep your eyes 👀 on the right side of the screen, we have a surprise Shubman Gill package for you!
— FanCode (@FanCode) July 12, 2023
He is truly enjoying the Caribbean atmosphere 🥳 🎉🕺🏻#INDvWIonFanCode #WIvIND pic.twitter.com/jZRlqFdofl
Comments
Please login to add a commentAdd a comment