అజింక్య రహానే
India’s squad for West Indies Tests: టీమిండియా వెటరన్ బ్యాటర్ అజింక్య రహానేకు మంచిరోజులు వచ్చాయి. ఐపీఎల్-2023లో అదరగొట్టిన ఈ మహారాష్ట్ర ఆటగాడు.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్-2023 ద్వారా జాతీయ జట్టులో పునరాగమనం చేశాడు. ఒకప్పుడు టీమిండియా వైస్ కెప్టెన్‌గా వెలుగొందిన రహానేకు జట్టులో స్థానమే కరువైన వేళ ఏకంగా ఐసీసీ మెగా పోరులో పాల్గొనే అవకాశం వచ్చింది.
డబ్ల్యూటీసీ ఫైనల్లో అదరగొట్టి
ఇంగ్లండ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఐదో స్థానంలో బ్యాటింగ్ దిగిన అతడు తొలి ఇన్నింగ్స్‌లో 89 పరుగులు చేశాడు. తద్వారా భారత ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లోనూ 46 పరుగులతో రాణించాడు.
ఈ క్రమంలో మరోసారి సెలక్టర్ల నుంచి పిలుపు అందుకున్నాడు రహానే. అయితే, ఈసారి కేవలం ఆటగాడిగా కాకుండా వైస్ కెప్టెన్ హోదాలో బరిలోకి దిగనున్నాడు. వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్ నేపథ్యంలో రోహిత్ శర్మ డిప్యూటీగా నియమితుడయ్యాడు. ఈ నేపథ్యంలో రహానే అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
నాడు చిరస్మరణీయ విజయంతో
కాగా విరాట్ కోహ్లి గైర్హాజరీలో ఆస్ట్రేలియా గడ్డపై బోర్డర్- గావస్కర్ ట్రోఫీ గెలిపించిన అజింక్య రహానే గత కొంతకాలంగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలో ఐపీఎల్-2023 మినీ వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ అతడిని కొనుగోలు చేయడంతో దశ తిరిగింది.
సీఎస్‌కే సారథి మహేంద్ర సింగ్ ధోని రహానేపై నమ్మకం ఉంచి.. అతడికి వరుస అవకాశాలు ఇచ్చాడు. ఈ క్రమంలో అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్న ఈ రైట్ హ్యాండ్ బ్యాటర్ జట్టు విజయాల్లో తన వంతు పాత్ర పోషించాడు. గుజరాత్ టైటాన్స్‌తో ఫైనల్లో 13 బంతుల్లో 27 పరుగులతో రాణించి సీఎస్‌కేను చాంపియన్‌గా నిలపడంలో సహాయపడ్డాడు.
ఐపీఎల్‌లో దుమ్ములేపాడు!
ఇక ఈ ఎడిషన్‌లో మొత్తంగా 14 మ్యాచ్‌లు ఆడిన 35 ఏళ్ల అజింక్య రహానే 326 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోరు 71 నాటౌట్. ఈ నేపథ్యంలో టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ గాయం కారణంగా జట్టుకు దూరం కావడంతో డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఎంపికయ్యాడు.
ప్రతిష్టాత్మక మ్యాచ్‌లో తనను తాను నిరూపించుకుని తిరిగి వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. కాగా డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా 209 పరుగుల భారీ తేడాతో ఆసీస్ చేతిలో ఓటమి పాలై.. వరుసగా రెండోసారి ట్రోఫీ లేకుండానే ఇంటిబాటపట్టింది. ఈ క్రమంలో జూలై 12- ఆగష్టు 13 వరకు వెస్టిండీస్ పర్యటనలో బిజీ కానుంది. రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌తో ఈ టూర్ మొదలుకానుంది.
విండీస్‌తో రెండు టెస్టులకు భారత జట్టు ఇదే:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్య రహానే (వైస్ కెప్టెన్), కేఎస్ భరత్ (వికెట్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్ , మహ్మద్ సిరాజ్, ముకేష్ కుమార్, జయదేవ్ ఉనాద్కట్, నవదీప్ సైనీ.
చదవండి: ధోని నమ్మకం నిలబెట్టిన ప్రపంచకప్ విజేత, 2 సార్లు ఐపీఎల్ ‘విన్నర్’.. ఇప్పుడు పోలీస్
The fastest 50 of the season so far and it's from @ajinkyarahane88 💪#MIvCSK #TATAIPL #IPLonJioCinema #IPL2023 | @ChennaiIPL pic.twitter.com/PZzmJJ999V
— JioCinema (@JioCinema) April 8, 2023
Comments
Please login to add a commentAdd a comment