టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఎంఎస్ ధోనీ రికార్డును బ్రేక్ చేశాడు. వెస్టిండీస్ తో జరుగుతున్న రెండో టెస్ట్ తొలి రోజు 80 పరుగులు చేసిన రోహిత్.. అరుదైన ఘనత సాధించాడు. ఇండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో రోహిత్ ఐదో స్థానానికి చేరుకున్నాడు. ఈ క్రమంలో ధోనిని అధిగమించాడు.
ఇప్పటివరకు అంతర్జాతీయంగా అన్ని ఫార్మాట్లు కలిపి రోహిత్ పరుగుల సంఖ్య 17,298కి చేరింది. ఇప్పటి వరకూ ఇండియా తరఫున 443 మ్యాచ్ లు ఆడిన రోహిత్.. 42.92 సగటుతో ఈ పరుగులు చేశాడు. అతని ఖాతాలో 44 సెంచరీలు, 92 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యుత్తమ స్కోరు 264. వెస్టిండీస్ తో తొలి టెస్ట్ లో సెంచరీ చేసిన రోహిత్ రెండో టెస్టులోనూ 80 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇక ధోనీ 535 మ్యాచ్ లలో 17092 రన్స్ చేశాడు. ధోనీ తన కెరీర్లో 15సెంచరీలు, 108 హాఫ్ సెంచరీలు చేశాడు. బెస్ట్ స్కోరు 224.
ఇక టెస్టుల్లో కెప్టెన్‌గా అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా రోహిత్ ఐదో స్థానానికి చేరుకున్నాడు. విండీస్‌తో రెండో టెస్టులో 80 పరుగులు చేసిన రోహిత్ ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. తాజా వాటితో కలిపి కెప్టెన్‌గా రోహిత్ ఇప్పటివరకు 150 సిక్సర్లు బాదాడు. ఈ జాబితాలో రోహిత్ కంటే ముందు మోర్గాన్(233 సిక్సర్లు) తొలి స్థానంలో ఉండగా.. 211 సిక్సర్లతో ధోని రెండో స్థానంలో, రికీ పాంటింగ్ 171 సిక్సర్లతో మూడో స్థానంలో, 170 సిక్సర్లతో మెక్‌కల్లమ్ నాలుగో స్థానంలో ఉన్నాడు. ఇక కోహ్లి 138 సిక్సర్లతో రోహిత్ తర్వాతి స్థానంలో ఉన్నాడు.
ఇక రోహిత్ విషయానికి వస్తే వన్డే ఫార్మాట్‌లో 243 వన్డేల్లో 9825 రన్స్ చేశాడు. సగటు 48.63 కాగా.. 30 సెంచరీలు, 48 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బెస్ట్ స్కోరు 264. ఇక టెస్టుల్లో 52 మ్యాచ్ లలో 3620 రన్స్ చేశాడు. సగటు 46.41 కాగా.. 10 సెంచరీలు, 15 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బెస్ట్ స్కోరు 212. రోహిత్ తన కెరీర్లో 148 టి20లు ఆడి 3853 రన్స్ చేశాడు. సగటు 31.32 కాగా.. నాలుగు సెంచరీలు, 29 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బెస్ట్ స్కోరు 118.
ఇక టీమిండియా తరఫునే గాకుండా అంతర్జాతీయంగా అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ సచిన్ టెండూల్కర్. అతడు 664 మ్యాచ్ లలో 34,357 రన్స్ చేశాడు. ఆ తర్వాతి స్థానాల్లో విరాట్ కోహ్లి (500 మ్యాచ్ లు, 25,484 రన్స్), రాహుల్ ద్రవిడ్ (504 మ్యాచ్ లు, 24,064 రన్స్), సౌరవ్ గంగూలీ (421 మ్యాచ్ లు, 18433 రన్స్) ఉన్నారు.
ఇప్పుడీ జాబితాలో ధోనీని దాటి రోహిత్ ఐదో స్థానానికి దూసుకెళ్లాడు. దీంతోపాటు మరో రికార్డు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. విండీస్‌తో టెస్టు సందర్భంగా ఓపెనర్‌గా 2 వేల పరుగుల మైలురాయిని రోహిత్ అందుకున్నాడు.
Captain Rohit Sharma brings up his half-century with a MAXIMUM! 🔥#WIvsIND #RohitSharma #CricketTwitter pic.twitter.com/3UfBHrZhw1
— OneCricket (@OneCricketApp) July 20, 2023
Most 6s as Captain
— Shubham 🇮🇳 (@DankShubham) July 20, 2023
233 - Morgan
211 - Dhoni
171 - Ponting
170 - McCullum
150 - Rohit*
138 - Kohli
Rohit Sharma Passes Chokli in span of 2 Year of His Captaincy #RohitSharma | #WIvIND pic.twitter.com/GOFr2f4Z22
Comments
Please login to add a commentAdd a comment