విండీస్‌తో వన్డే సిరీస్‌.. అరుదైన రికార్డులపై కన్నేసిన ధావన్‌ | Shikhar Dhawan Looks Surpass Rohit Sharma-MS Dhoni ODI Batting List | Sakshi
Sakshi News home page

IND Vs WI: విండీస్‌తో వన్డే సిరీస్‌.. అరుదైన రికార్డులపై కన్నేసిన ధావన్‌

Published Thu, Jul 21 2022 9:16 PM | Last Updated on Sat, Jul 30 2022 1:54 PM

Shikhar Dhawan Looks Surpass Rohit Sharma-MS Dhoni ODI Batting List - Sakshi

వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌ ఆడనున్న నేపథ్యంలో శిఖర్‌ ధావన్‌ అరుదైన రికార్డులపై కన్నేశాడు. జూలై 22(శుక్రవారం) విండీస్‌, టీమిండియా మధ్య తొలి వన్డే జరగనుంది. ఈ సిరీస్‌కు రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు విశ్రాంతి ఇవ్వడంతో ధావన్‌ స్టాండింగ్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.

రోహిత్‌ సహా కోహ్లి, బుమ్రా, భువనేశ్వర్‌, పంత్‌, కేఎల్‌ రాహుల్‌, పాండ్యాలకు రెస్ట్‌ ఇవ్వడంతో శ్రేయాస్‌ అయ్యర్‌, శుబ్‌మన్‌ గిల్‌, రుతురాజ్‌, దీపక్‌ హుడా, సంజూ శాంసన్‌, ఆవేశ్‌ ఖాన్‌లకు సిరీస్‌ కీలకం కానుంది. ఈ నేపథ్యంలోనే విండీస్‌తో సిరీస్‌కు కెప్టెన్‌గా వ్యవహరించనున్న ధావన్‌ ముంగిట ఉన్న అరుదైన రికార్డులను పరిశీలిద్దాం.

►వెస్టిండీస్‌ గడ్డపై అత్యధిక వన్డేలు ఆడిన టీమిండియా ఆటగాడిగా ధావన్‌ నిలవనున్నాడు. ఇప్పటివరకు 14 వన్డేలు ఆడిన ధావన్‌ శుక్రవారం విండీస్‌తో ఆడబోయేది వన్డేతో 15వ మ్యాచ్‌. తద్వారా కోహ్లి 15 వన్డేలను ధావన్‌ అధిగమించనున్నాడు.

►వెస్టిండీస్‌ గడ్డపై ధావన్‌ 14 వన్డేల్లో 348 పరుగులు సాధించాడు. విండీస్‌ గడ్డపై వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన టీమిండియా ఆటగాళ్లలో ధావన్‌ ఐదో స్థానంలో ఉన్నాడు. ఒకవేళ మూడు వన్డేల సిరీస్‌లో ధావన్‌ 110 పరుగులు చేస్తే ధోని, రోహిత్‌, యువరాజ్‌లను అధిగమించి రెండో స్థానానికి చేరుకోనున్నాడు.

విండీస్‌ గడ్డపై అత్యధిక పరుగులు సాధించిన టాప్‌-5 టీమిండియా బ్యాటర్స్‌
కోహ్లి (15 మ్యాచ్‌ల్లో 790 పరుగులు)
ఎంఎస్‌ ధోని(15 మ్యాచ్‌ల్లో 458 పరుగులు)
యువరాజ్‌ సింగ్‌(14 మ్యాచ్‌ల్లో 419 పరుగులు)
రోహిత్‌ శర్మ(14 మ్యాచ్‌ల్లో 408 పరుగులు)
శిఖర్‌ ధావన్‌(14 మ్యాచ్‌ల్లో 348 పరుగులు)

అయితే శిఖర్‌ ధావన్‌ ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో అంతగా ఆకట్టుకోలేకపోయాడు. మూడు వన్డేలు కలిపి కేవలం 31 పరుగులు మాత్రమే చేసి తన పూర్‌ ఫామ్‌ను కొనసాగించాడు. మరి విండీస్‌ గడ్డపై స్టాండింగ్‌ కెప్టెన్‌గా ఉన్న శిఖర్‌ ధావన్‌ వన్డే సిరీస్‌లో మెరుస్తాడేమో వేచి చూడాలి

చదవండి: వీళ్లతో అంత వీజీ కాదు! ఏమరపాటుగా ఉంటే మూల్యం చెల్లించకతప్పదు!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement