వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను టీమిండియా 3-0తో క్లీన్‌స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా పలు రికార్డులు బద్దలు కొట్టింది. అంతేకాదు టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మ కొత్త రికార్డు సృష్టించాడు. ఆ విశేషాలేంటో ఒకసారి పరిశీలిద్దాం.
►2014లో స్వదేశంలో శ్రీలంకతో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌ను 5-0 తో టీమిండియా క్లీన్‌స్వీప్ చేయడం ఆఖరుసారి. మళ్లీ ఏడేళ్ల తర్వాత టీమిండియా స్వదేశంలో ఒక జట్టును క్లీన్‌స్వీప్ చేసింది.
►విండీస్‌ను క్లీన్‌స్వీప్ చేయడం ద్వారా స్వదేశంలో ఒక జట్టును వైట్‌వాష్ చేసిన ఎనిమిదో కెప్టెన్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. కపిల్‌దేవ్, దిలీప్ వెంగ్‌సర్కార్, మహ్మద్ అజారుద్దీన్, ఎంఎస్ ధోని, గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లి, అజింక్యా రహానేల సరసన చేరిన రోహిత్ శర్మ
►ఇక వెస్టిండీస్‌ను టీమిండియా వైట్‌వాష్ చేయడం ఇదే తొలిసారి
►ఇక స్వదేశంలో టీమిండియాకు ఇది 12వ వైట్‌వాష్ సిరీస్ కావడం విశేషం.
►టీమిండియా గడ్డపై శ్రీలంక, న్యూజిలాండ్, జింబాబ్వే, ఇంగ్లండ్‌లు వైట్‌వాష్ అయ్యాయి. ఈ జాబితాలో తాజాగా వెస్టిండీస్ చేరింది
►తాజాగా టీమిండియా చేతిలో క్లీన్‌స్వీప్ అయిన వెస్టిండీస్.. ఒక సిరీస్‌లో వైట్‌వాష్ కావడం ఇది 20వ సారి.
Comments
Please login to add a commentAdd a comment