వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో విజయం ద్వారా ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే టీమిండియా 2-0తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇక మూడో మ్యాచ్‌లోనూ భారత్ వెస్టిండీస్‌ను ఓడించి క్లీన్‌స్వీప్ చేస్తే పలు రికార్డులు బద్దలవ్వనున్నాయి. అంతేకాదు టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మ కూడా కొత్త చరిత్ర సృష్టించనున్నాడు. ఆ రికార్డులేంటో ఒకసారి పరిశీలిద్దాం.
►2014లో స్వదేశంలో శ్రీలంకతో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌ను 5-0 తో టీమిండియా క్లీన్‌స్వీప్ చేయడం ఆఖరుసారి. ఆ తర్వాత జరిగిన దైపాక్షిక సిరీస్‌లు గెలిచినప్పటికి క్లీన్‌స్వీప్ చేయలేదు. తాజాగా విండీస్‌తో సిరీస్‌లో ఆ అవకాశం మరోసారి వచ్చింది.
►టీమిండియా విండీస్‌తో వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేస్తే.. స్వదేశంలో ఒక జట్టును వైట్‌వాష్ చేసిన ఎనిమిదో కెప్టెన్‌గా రోహిత్ శర్మ నిలుస్తాడు. కపిల్‌దేవ్, దిలీప్ వెంగ్‌సర్కార్, మహ్మద్ అజారుద్దీన్, ఎంఎస్ ధోని, గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లి, అజింక్యా రహానేలు ఈ ఫీట్‌ను నమోదు చేశారు.
►ఇక వెస్టిండీస్‌ను ఇప్పటివరకు ఒక్కసారి కూడా టీమిండియా వైట్‌వాష్ చేయలేదు. ఈసారి మాత్రం దానిని బ్రేక్ చేసే చాన్స్ వచ్చింది
►విండీస్‌పై మూడో వన్డేలో విజయం సాధిస్తే.. స్వదేశంలో టీమిండియాకు 12వ వైట్‌వాష్ సిరీస్ విక్టరీ అవుతుంది.
►టీమిండియా గడ్డపై శ్రీలంక, న్యూజిలాండ్, జింబాబ్వే, ఇంగ్లండ్‌లు వైట్‌వాష్ అయ్యాయి. ఇక మూడో వన్డేలో ఓటమిపాలయ్యి వెస్టిండీస్ వైట్‌వాష్ అయితే ఈ జాబితాలో చేరనుంది.
►ఇక వెస్టిండీస్ ఇప్పటివరకు 19 వన్డే సిరీస్‌ల్లో వైట్‌వాష్ అయింది. టీమిండియా చేతిలోనూ వైట్‌వాష్ అయితే ఆ సంఖ్య 20కి చేరనుంది.
Comments
Please login to add a commentAdd a comment