whitewash
-
మూడో వన్డేలో టీమిండియా గెలిస్తే చరిత్ర సృష్టించనున్న రోహిత్ శర్మ
వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో విజయం ద్వారా ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే టీమిండియా 2-0తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇక మూడో మ్యాచ్‌లోనూ భారత్ వెస్టిండీస్‌ను ఓడించి క్లీన్‌స్వీప్ చేస్తే పలు రికార్డులు బద్దలవ్వనున్నాయి. అంతేకాదు టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మ కూడా కొత్త చరిత్ర సృష్టించనున్నాడు. ఆ రికార్డులేంటో ఒకసారి పరిశీలిద్దాం. ►2014లో స్వదేశంలో శ్రీలంకతో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌ను 5-0 తో టీమిండియా క్లీన్‌స్వీప్ చేయడం ఆఖరుసారి. ఆ తర్వాత జరిగిన దైపాక్షిక సిరీస్‌లు గెలిచినప్పటికి క్లీన్‌స్వీప్ చేయలేదు. తాజాగా విండీస్‌తో సిరీస్‌లో ఆ అవకాశం మరోసారి వచ్చింది. ►టీమిండియా విండీస్‌తో వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేస్తే.. స్వదేశంలో ఒక జట్టును వైట్‌వాష్ చేసిన ఎనిమిదో కెప్టెన్‌గా రోహిత్ శర్మ నిలుస్తాడు. కపిల్‌దేవ్, దిలీప్ వెంగ్‌సర్కార్, మహ్మద్ అజారుద్దీన్, ఎంఎస్ ధోని, గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లి, అజింక్యా రహానేలు ఈ ఫీట్‌ను నమోదు చేశారు. ►ఇక వెస్టిండీస్‌ను ఇప్పటివరకు ఒక్కసారి కూడా టీమిండియా వైట్‌వాష్ చేయలేదు. ఈసారి మాత్రం దానిని బ్రేక్ చేసే చాన్స్ వచ్చింది ►విండీస్‌పై మూడో వన్డేలో విజయం సాధిస్తే.. స్వదేశంలో టీమిండియాకు 12వ వైట్‌వాష్ సిరీస్ విక్టరీ అవుతుంది. ►టీమిండియా గడ్డపై శ్రీలంక, న్యూజిలాండ్, జింబాబ్వే, ఇంగ్లండ్‌లు వైట్‌వాష్ అయ్యాయి. ఇక మూడో వన్డేలో ఓటమిపాలయ్యి వెస్టిండీస్ వైట్‌వాష్ అయితే ఈ జాబితాలో చేరనుంది. ►ఇక వెస్టిండీస్ ఇప్పటివరకు 19 వన్డే సిరీస్‌ల్లో వైట్‌వాష్ అయింది. టీమిండియా చేతిలోనూ వైట్‌వాష్ అయితే ఆ సంఖ్య 20కి చేరనుంది. -
న్యూజిలాండ్ క్లీన్‌స్వీప్
డ్యూనెడిన్: బంగ్లాదేశ్‌తో మూడు వన్డేల సిరీస్‌ను న్యూజిలాండ్ 3–0తో క్లీన్‌స్వీప్ చేసింది. బుధవారం జరిగిన మూడో వన్డేలో కివీస్ 88 పరుగుల తేడాతో బంగ్లాపై జయభేరి మోగించింది. ముందుగా న్యూజిలాండ్ 50 ఓవర్లలో 6 వికెట్లకు 330 పరుగులు చేసింది. రాస్ టేలర్ (69; 7 ఫోర్లు), నికోల్స్ (64; 7 ఫోర్లు), కెప్టెన్ లాథమ్ (59; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధసెంచరీలు సాధించారు. 47వ అర్ధసెంచరీ సాధించిన రాస్ టేలర్ వన్డేల్లో అత్యధిక పరుగులు (8,026) చేసిన న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్‌గా ఘనతకెక్కాడు. ఇప్పటిదాకా ఈ రికార్డు స్టీఫెన్ ఫ్లెమింగ్ (8,007) పేరిట ఉండేది. తర్వాత భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 47.2 ఓవర్లలో 242 పరుగుల వద్ద ఆలౌటైంది. షబ్బీర్ రహమాన్ (102; 12 ఫోర్లు, 2 సిక్సర్లు) శతక్కొట్టాడు. టిమ్ సౌతీ (6/65) ధాటికి బంగ్లా విలవిల్లాడింది. -
టీమిండియా ఫస్ట్ ర్యాంకు కొట్టాలంటే!
హైదరాబాద్ : సుదీర్ఘ ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత్ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) వన్డే ర్యాంకింగ్స్‌లో తిరిగి నెం1 స్థానాన్ని సాధించాలంటే వన్డే సిరీస్‌ను వైట్‌వాష్ చేయాలి. ఇప్పటికే మూడు టీ20ల సిరీస్‌ను 2-1తో గెలిచిన భారత్.. గురువారం ఆతిథ్య జట్టుతో తొలి వన్డే ఆడనుంది. ప్రస్తుతం వన్డే ర్యాంకింగ్స్‌లో 126 రేటింగ్ పాయింట్లతో ఇంగ్లండ్ టాప్‌లో ఉండగా..123 పాయింట్లతో కోహ్లి సేన రెండో ర్యాంకులో కొనసాగుతోంది. గత మే నెలలో ఇంగ్లండ్ భారత్‌ను వెనక్కు నెట్టి తొలి ర్యాంకును సాధించిన విషయం తెలిసిందే. అయితే భారత్ మళ్లీ ఆ ర్యాంకు పొందాలంటే ప్రస్తుత వన్డే సిరీస్‌ను 3-0తో వైట్ వాష్ చేయాలి. ఇక ఇంగ్లండ్ సైతం అగ్రస్థానాన్ని నిలబెట్టుకోవాలంటే మరో 10 పాయింట్లు సాధించాలి. భారత్‌ను వైట్‌వాష్ చేస్తేనే సాధ్యమవుతోంది. ప్రపంచకప్ సన్నాహకల్లో భాగంగా అన్ని జట్లు ఈ ఏడాది బీజీ షెడ్యూల్‌ను గడపనున్నాయి. ఈ సిరీస్‌ల్లోని ఫలితాలతో ర్యాంకులు తారుమారయ్యే అవకాశం ఉంది. జూలై 17న ఇంగ్లండ్-భారత్ సిరీస్ ముగియనుండగా.. జూలై 13 నుంచి జింబాంబ్వే వేదికగా పాకిస్థాన్ 5 వన్డే మ్యాచ్‌లు ఆడనుంది. జూలై 22 నుంచి వెస్టిండీస్ మూడు వన్డేలకు బంగ్లాదేశ్‌కు ఆతిథ్యమివ్వనుంది. జూలై 29 నుంచి దక్షిణాఫ్రికా శ్రీలంక వేదికగా 5 వన్డే మ్యాచ్‌లు ఆడనుంది. ఇక నెపాల్, నెదార్లండ్‌పై రెండు వన్డే మ్యాచ్‌లు ఆడనుంది. జింబాంబ్వేపై పాక్ 4-1తో సిరీస్ గెలిస్తేనే తన ర్యాంకు నిలబెట్టుకోనుంది. అలాగే దక్షిణాఫ్రికా సైతం తన ర్యాంకు కోల్పోవద్దంటే శ్రీలంకను వైట్ వాష్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుత ర్యాంకులు 1. ఇంగ్లండ్ 126 రేటింగ్ పాయింట్స్ 2. భారత్ 123 3. దక్షిణాఫ్రికా 113 4. న్యూజిలాండ్ 112 5. పాకిస్తాన్ 102 6. ఆస్ట్రేలియా 100 -
పాక్ చేతిలో విండీస్ వైట్‌వాష్
కరాచీ : అనుకున్నట్లే జరిగింది. టీ20లో అద్భుతాలకు మారుపేరైన వెస్టిండీస్ క్రికెట్ జట్టు పాకిస్తాన్ వేదిక జరిగిన సిరీస్‌లో ఎలాంటి మ్యాజిక్‌లు చేయలేదు. ద్వితీయ శ్రేణి జట్టుతో బరిలోకి దిగిన విండీస్ ఓటమితోనే సిరీస్‌ను ముగించింది. విండీస్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను పాకిస్తాన్ క్లీన్‌స్వీప్ చేసింది. మంగళవారం జరిగిన మూడో టీ20లో 8 వికెట్ల తేడాతో పాకిస్తాన్ విజయం సాధించింది. ఇదివరకే రెండు టీ20లను పాక్ గెలిచిన విషయం తెలిసిందే. పాక్ బ్యాట్స్‌మెన్ ఫఖర్ జామన్‌కు ‘ప్లెయర్ ఆఫ్ ది మ్యాచ్’, బాబర్ అజామ్‌కు ‘ప్లెయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులు లభించాయి. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేపట్టిన విండీస్.. బ్యాట్స్‌మెన్ ప్లెచర్(52; 43బంతుల్లో 4ఫోర్లు, 3సిక్సర్లు), శ్యాముల్స్(31; 25బంతుల్లో 2ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. చివర్లో రామ్‌దిన్ (42; 18బంతుల్లో 4ఫోర్లు, 3సిక్సర్లు) మెరవడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 153 పరుగుల చేసింది. పాక్ బౌలర్లలో షాదాబ్ ఖాన్ రెండు వికెట్లు తీయగా నవాజ్, ఉస్మాన్ ఖాన్, అష్రాష్ తలో వికెట్ తీశారు. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన పాక్ 16.5 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు కోల్పోయి 154 పరుగుల లక్ష్యాన్ని చేరుకుంది. పాక్ ఓపెనర్లు ఫఖర్ జామన్ (40; 17బంతుల్లో 6ఫోర్లు, 2సిక్సర్లు), బాబర్ అజామ్(51; 40బంతుల్లో 6ఫోర్లు) శుభారంభం ఇవ్వగా, హుస్సేన్(31నాటౌట్; 28బంతుల్లో 3ఫోర్లు), ఆసిఫ్ (25 నాటౌట్; 16బంతుల్లో 2ఫోర్లు, 1సిక్సర్) రాణించారు. స్వదేశంలో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు లేక నిరాశ చెందిన పాక్ అభిమానులకు ఈ సిరీస్‌తో భవిష్యత్తు సిరీస్‌లపై ఆశలు చిగురించాయి. -
నాలుగోసారీ నగుబాటు
ఆసీస్ చేతిలో పాక్ మళ్లీ ‘వైట్‌వాష్’ • చివరి టెస్టులోనూ పరాజయం • 220 పరుగులతో నెగ్గిన ఆసీస్ • 3–0తో సిరీస్ క్లీన్‌స్వీప్ సిడ్నీ: పోరాటమేమీ లేదు. అదే నిలకడలేమి. చివరి రోజు తొమ్మిది వికెట్లు చేతిలో ఉన్నా కూడా ‘డ్రా’ కోసం రోజంతా ఆడలేని స్థితిలో పాకిస్తాన్ జట్టు బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. 465 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన పాకిస్తాన్ శనివారం 80.2 ఓవర్లలో టీ విరామానికి ముందే 244 పరుగులకు కుప్పకూలింది. ఫలితంగా ఆస్ట్రేలియా జట్టు 220 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో మూడు టెస్టుల సిరీస్‌ను 3–0తో క్లీన్‌స్వీప్ చేసింది. అటు ఆసీస్ గడ్డపై పాకిస్తాన్ జట్టుకిది వరుసగా నాలుగో టెస్టు సిరీస్ ‘వైట్‌వాష్’ కావడం గమనార్హం. సర్ఫరాజ్ అహ్మద్ (70 బంతుల్లో 72 నాటౌట్; 8 ఫోర్లు, 1 సిక్స్) ఆసీస్ బౌలర్లపై విరుచుకుపడడటంతో ఓటమి పరుగుల తేడా కాస్తయినా తగ్గింది. షర్జీల్ ఖాన్ (38 బంతుల్లో 40; 6 ఫోర్లు, 1 సిక్స్), మిస్బా ఉల్ హక్ (98 బంతుల్లో 38; 4 ఫోర్లు, 1 సిక్స్) çపర్వాలేదనిపించారు. పేసర్ హాజెల్‌వుడ్, స్పిన్నర్ స్టీవ్ ఓ కీఫ్ మూడేసి వికెట్లు తీయగా, మరో స్పిన్నర్ లియోన్ రెండు వికెట్లు పడగొట్టాడు. ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’గా ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్... ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా డేవిడ్ వార్నర్ నిలిచాడు. ఈ రెండు జట్ల మధ్య ఐదు వన్డేల సిరీస్ ఈనెల 13 నుంచి 26 వరకు జరుగుతుంది. టపటపా వికెట్లు... ఓవర్‌నైట్ స్కోరు 55/1తో చివరి రోజు శనివారం తమ రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన పాక్ తొలి సెషన్లోనే నాలుగు వికెట్లను కోల్పోయి తడబడింది. సిరీస్‌లో అద్భుతంగా రాణిస్తున్న అజహర్ అలీ (11)ని ప్రారంభ ఓవర్లోనే హాజెల్‌వుడ్ రిటర్న్ క్యాచ్‌తో పెవిలియన్‌కు చేర్చాడు. సీనియర్ బ్యాట్స్‌మన్ యూనిస్ ఖాన్ (13) కూడా తక్కువ స్కోరుకే అవుట్ కావడంతో పాక్ 96 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో మిస్బా, అసద్ షఫీఖ్ (55 బంతుల్లో 30; 4 ఫోర్లు) కాసేపు క్రీజులో నిలదొక్కుకుని ఆరో వికెట్‌కు 40 పరుగులు జోడించారు. అనంతరం మిస్బాతో జత కట్టిన సర్ఫరాజ్ తుఫాన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. ఈ జోడీ ఏడో వికెట్‌కు 52 పరుగులు జత చేసింది. ఇన్నింగ్స్ 80వ ఓవర్లో మూడు ఫోర్లు, ఓ సిక్స్‌తో చెలరేగిన తను 20 పరుగులు రాబట్టినా మరుసటి ఓవర్లోనే పాక్ తన చివరి వికెట్‌ను కోల్పోవడంతో పరాజయం పాలైంది. 4. ఆస్ట్రేలియా గడ్డపై పాక్‌కు ఇది వరుసగా నాలుగో వైట్‌వాష్. 1999–2000; 2004–2005; 2009–2010, 2016–2017 టెస్టు సిరీస్‌లలో పాక్ 0–3తో ఓడింది. 12.ఆస్ట్రేలియాలో పాకిస్తాన్ వరుస పరాజయాల సంఖ్య 4. సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా వచ్చి అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఫీల్డర్ రికార్డును జాక్సన్ బర్డ్ (ఆస్ట్రేలియా) సమం చేశాడు. ఈ మ్యాచ్‌లో అతను నాలుగు క్యాచ్‌లు తీసుకున్నాడు. గతంలో గురుశరణ్ సింగ్ (భారత్–వెస్టిండీస్‌పై 1983లో), యూనిస్ ఖాన్ (పాకిస్తాన్–బంగ్లాదేశ్‌పై 2001లో), వీరేంద్ర సెహ్వాగ్ (భారత్–జింబాబ్వేపై 2002లో) కూడా నాలుగేసి క్యాచ్‌లు పట్టారు. 2. ఈ సిరీస్‌లో రెండు జట్ల బౌలర్లు ఒక్క ఇన్నింగ్స్‌లోనూ ఐదు వికెట్లు తీయలేకపోవడం గమనార్హం. మూడు అంతకన్నా ఎక్కువ టెస్టులు ఆడిన సిరీస్‌లో ఇలా జరగడం ఇది రెండోసారి మాత్రమే. చివరిసారి పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య 1964–1965 సీజన్లో ఇలా జరిగింది. -
వైట్‌వాష్‌పై టీమిండియా గురి
హరారే: జింబాబ్వే పర్యటనలో రాణిస్తున్న భారత కుర్రాళ్లు మరో పోరుకు సిద్ధమయ్యారు. తొలి రెండు వన్డేల్లో విజయం సాధించి సిరీస్ సొంతం చేసుకున్న టీమిండియా చివరి, మూడో మ్యాచ్‌లోనూ నెగ్గి క్లీన్ స్వీప్ చేయాలనే లక్ష్యంతో ఉంది. మంగళవారం భారత్, జింబాబ్వేల మధ్య మూడే వన్డే జరగనుంది. అజింక్యా రహానే సారథ్యంలోని భారత్ తొలి వన్డేలో చెమటోడ్చినా, రెండో వన్డేలో ఆల్‌రౌండ్ షోతో రాణించి ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. కాగా తొలి మ్యాచ్‌లో సెంచరీతోనూ, రెండో వన్డేలో కీలక ఇన్నింగ్స్‌తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన తెలుగుతేజం అంబటి రాయుడు గాయం కారణంగా జింబాబ్వే పర్యటన నుంచి వైదొలగడం కాస్త ప్రతికూలం. భారత బ్యాట్స్‌మెన్ గాడిలో పడటం కలిసొచ్చే అంశం. రెండో మ్యాచ్‌లో ఓపెనర్లు రహానె, మురళీ విజయం బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడారు. మిడిలార్డర్లోనూ రాణిస్తే బ్యాటింగ్ సమస్యలు తీరినట్టే. ఇక భారత బౌలర్లు సమష్టిగా రాణిస్తున్నారు. భారత్ ఇదే జోరు కొనసాగిస్తే క్లీన్ స్వీప్ చేయడం పెద్ద కష్టమేకాదు. ఇక జింబాబ్వే విషయానికొస్తే సొంతగడ్డపై సానుకూల పరిస్థితులను ఉపయోగించుకోలేకపోయింది. బ్యాటింగ్‌లో చిగుంబుర, మసకద్జ, చిబాబా.. బౌలింగ్‌లో మడ్విజా, టిరిపనో, విటోరి కీలకం. -
క్లీన్ స్వీప్‌పై భారత్ గురి
మీర్పూర్: బంగ్లాదేశ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో జోరు మీదున్న భారత్ క్లీన్ స్వీప్‌పై దృష్టిసారిస్తోంది. వరుసగా తొలి రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించి 2-0తో సిరీస్ సొంతం చేసుకున్న టీమిండియా చివరి, మూడో వన్డేలోనూ సత్తాచాటేందుకు సన్నద్ధమవుతోంది. గురువారం జరిగే మూడో ఈ మ్యాచ్‌లో భారత్, బంగ్లా తలపడుతున్నాయి. రెండో వన్డేలో అత్యల్ప లక్ష్యాన్ని ఉంచినా భారత్ అసాధారణ విజయం సాధించింది. వర్షం ఆటంకం కలిగించిన ఈ మ్యాచ్‌లో 105 పరుగులకే ఆలౌటైంది. అయితే స్టువర్ట్ బిన్నీ (4 పరుగులకు 6 వికెట్లు) సూపర్ స్పెల్‌తో చెలరేగడంతో బంగ్లాకు ఓటమి తప్పలేదు. సురేష్ రైనా సారథ్యంలోని భారత్ అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉంది.