Ind Vs WI: Cricket Fans Praising Rohit Sharma After 4 Successful Reviews In 2nd ODI - Sakshi
Sakshi News home page

Rohit Sharma DRS Reviews: రోహిత్‌ శర్మ.. పట్టిందల్లా బంగారమే

Published Wed, Feb 9 2022 9:15 PM | Last Updated on Thu, Feb 10 2022 9:09 AM

Cricket Fans Says Rohit Sharma Becoming King Of DRS Reviews Viral - Sakshi

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ పట్టిందల్లా బంగారమే అవుతుందంటూ క్రికెట్‌ ఫ్యాన్స్‌ పేర్కొంటున్నారు. ఇంతకీ ఆ బంగారం ఏంటో తెలుసా.. డీఆర్‌ఎస్‌లు. అవును రోహిత్‌ నిజంగానే రివ్యూలకు రారాజుగా మారిపోతున్నాడు. మన టీమిండియా కెప్టెన్లకు రివ్యూలు ఎక్కువగా కలిసి రాలేదు. డీఆర్‌ఎస్‌ ప్రవేశపెట్టినప్పటి నుంచి ధోని, కోహ్లిలకు రివ్యూలు పెద్దగా కలిసిరాలేదు. అడపాదడపా కలిసొచ్చాయే తప్ప నష్టమే ఎక్కువసార్లు జరిగింది. కోహ్లి విషయంలో ఇది చాలా ఎక్కువగా కనిపించేది. అయితే రోహిత్‌ విషయంలో పూర్తిగా రివర్స్‌ అయింది. తాను ఎప్పుడు రివ్యూకు వెళ్లినా అనుకూలంగానే వస్తుంది. కోహ్లి గైర్హాజరీలో రోహిత్‌ పలుమార్లు జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో రోహిత్‌కు రివ్యూలు అనుకూలంగానే వచ్చేవి. ఇక తాజాగా పూర్తిస్థాయి కెప్టెన్‌ అయిన తర్వాత రోహిత్‌కు రివ్యూలు మరింతగా కలిసివస్తున్నాయి. 

చదవండి: ఫ్యాబ్‌-ఫోర్‌పై బీసీసీఐ కీలక నిర్ణయం!

విండీస్‌తో సిరీస్‌లో తొలి వన్డేలో రివ్యూపై తన నిర్ణయాలతో రోహిత్‌ అందరిని ఆకట్టుకున్నాడు. తొలి వన్డేలో బ్రూక్స్‌ విషయంలో పంత్‌ వద్దన్నా కోహ్లి సలహాతో రోహిత్‌ రివ్యూకు వెళ్లాడు. ఫలితం అనుకూలంగా వచ్చింది. తాజాగా రెండో వన్డేలోనూ డారెన్‌ బ్రావో విషయంలో రోహిత్‌ రివ్యూకు వెళ్లాడు. పంత్‌పై నమ్మకంతో రివ్యూకు వెళ్లి సక్సెస్‌ కావడంతో అభిమానులు రోహిత్‌ను రివ్యూల రారాజుగా అభివర్ణిస్తున్నారు. ప్రస్తుతం రోహిత్‌పై అభిమానులు చేస్తున్న మీమ్స్‌ ప్రత్యేక ఆకర్షణగా మారాయి. మీరు ఒక లుక్కేయండి.
చదవండి: Rohit Sharma-Pant: పంత్‌ను గుడ్డిగా నమ్మి రివ్యూకు వెళ్లిన రోహిత్‌.... ఫలితం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement