టీమిండియా, వెస్టిండీస్ మధ్య రెండో వన్డేలో ఒక ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. వెస్టిండీస్ బ్యాటింగ్ సమయంలో ఇన్నింగ్స్ 9వ ఓవర్‌ను ప్రసిధ్ కృష్ణ వేశాడు. క్రీజులో డారెన్ బ్రావో ఉన్నాడు. ఓవర్ తొలి బంతిని బ్రావో టచ్ చేయడంలో విఫలమయ్యాడు. బంతి స్లిక్ అయి కీపర్ పంత్ చేతుల్లో పడింది. అంతే పంత్‌తో పాటు స్లిప్‌లో ఉన్న రోహిత్ కూడా ఔట్ అంటూ అంపైర్‌కు అప్పీల్ చేశాడు. ఫీల్డ్ అంపైర్ నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో రోహిత్‌కు ఏ మూలనో బ్యాట్‌కు తగల్లేదేమోనని చిన్న అనుమానం ఉంది.
కానీ పంత్ మాత్రం లేదు బంతి బ్యాట్‌కు తాకింది అంటూ కాన్ఫిడెన్స్‌తో చెప్పాడు. దీంతో రోహిత్ పంత్‌ను గుడ్డిగా నమ్మి రివ్య్వూకు వెళ్లాడు. అల్ట్రాఎడ్జ్‌లో బంతి కీపర్ చేతుల్లో పడకముందు స్పైక్ రావడం.. బ్యాట్‌కు బంతి తాకినట్లు తేలడంతో థర్డ్ అంపైర్ ఔట్ అని సాప్ట్ సిగ్నల్ ఇచ్చాడు. దీంతో ఫీల్డ్ అంపైర్ నితిన్ మీనన్ క్షమాపణ కోరుతూ బ్రావోను ఔట్‌గా పేర్కొన్నాడు.
టీమిండియా సంబరాల్లో మునిగిపోయింది. మొన్న పంత్‌ను కాదని కోహ్లిని అడిగి ఫలితం సాధించిన రోహిత్.. ఈరోజు మాత్రం పంత్‌ను నమ్మి రివ్య్వూకు వెళ్లాడు. మళ్లీ సేమ్ సీన్ రిపీట్ కావడం ఆసక్తికరంగా మారింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అలా ప్రసిధ్ కృష్ణ రెండు వరుస ఓవర్లలో రెండు వికెట్లు తీశాడు.
Brilliant review by Team India 😍🔥 pic.twitter.com/OA26ce7jzA
— Sports Hustle (@SportsHustle3) February 9, 2022
Brandon King☝️
— CricTracker (@Cricketracker) February 9, 2022
Darren Bravo☝️
Two wickets for Prasidh Krishna👏
📸: Disney+Hotstar#PrasidhKrishna #INDvsWI pic.twitter.com/6Z7zPVBPXh
Comments
Please login to add a commentAdd a comment