Decision Review System
-
క్రికెట్లో కొత్త పంథా.. ఐపీఎల్ 2023 నుంచే మొదలు
ఐపీఎల్ జట్లకు గుడ్‌న్యూస్. తాజాగా మొదలుకానున్న ఐపీఎల్ 16వ సీజన్ నుంచి డీఆర్ఎస్ను మరింత విస్తరించనున్నారు. ఔట్, నాటౌట్‌కే కాకుండా ఇకపై నోబాల్, వైడ్ బాల్‌కు ఆటగాళ్లు సమీక్ష కోరేలా రూల్స్ మార్చారు. అయితే ఈ నిబంధనను ఇప్పటికే వుమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL 2023)లో ఉపయోగిస్తున్నారు. శనివారం ప్రారంభమైన డబ్ల్యూపీఎల్ తొలి ఎడిషన్‌లో గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్‌లో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ వైడ్ బాల్ విషయంలో డీఆర్ఎస్ కోరింది. ఈ ఫలితం హర్మన్‌కు అనుకూలంగా వచ్చింది. ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పోరులోనూ ఈ రూల్‌ను వాడారు. మేఘన్ షూట్ ఫుల్‌టాస్‌గా వేసిన డెలివరీని అంపైర్ నోబాల్‌గా ప్రకటించలేదు. దాంతో బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ సమీక్ష కోరింది. అయితే సఫలం కాలేదు. యూపీ వారియర్స్, గుజరాత్ టైటాన్స్ మ్యాచులోనూ ఇలాంటి సమీక్షే కోరారు. ఒక్కోసారి అంపైర్ తీసుకొనే ఒక తప్పుడు నిర్ణయంతో మ్యాచ్ గమనమే మారిపోతుంది. కొన్నిసార్లు గెలవాల్సిన మ్యాచ్‌లు ఓడిపోవాల్సి వస్తోంది. గతంలో ఇన్నింగ్స్ ఆఖరి బంతులు నోబాల్ అయినా అంపైర్లు ఇవ్వకపోవడంతో భారీ విమర్శలు వెల్లువెత్తాయి. కొందరు ఆటగాళ్లు ఔటై పెవిలియన్‌కు చేరారు ఇకపై ఇలాంటి విమర్శలు రాకుండా ఉండేందుకు, ఆటగాళ్లకు మరో అవకాశం ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయించింది. ప్రస్తుతం జరుగుతున్న వుమెన్ ప్రీమియర్ లీగ్‌లో నోబాల్, వైడ్ బాల్ కోసం సమీక్ష కోరేలా నిబంధనలు సవరించింది. ''మైదానంలోని అంపైర్లు తీసుకున్న నిర్ణయాన్ని సమీక్షించాలని క్రికెటర్లు కోరొచ్చు. బ్యాటర్ ఔటయ్యారో లేదో తెలుసుకోవచ్చు. వైడ్ బాల్, నోబాల్ విషయంలోనూ ఆన్‌ఫీల్డ్ అంపైర్ నిర్ణయంపై సమీక్ష అడగొచ్చు'' అని డబ్ల్యూపీఎల్ నిబంధనల్లో పేర్కొన్నారు. రానున్న ఐపీఎల్ 2023 సీజన్లోనూ ఈ రూల్ వర్తించనుంది. చదవండి: పిచ్‌తో మైండ్‌గేమ్.. కలవరపడుతున్న 'కంగారూలు' -
కొంప ముంచిన డీఆర్ఎస్.. కివీస్ బ్యాటర్‌ది దురదృష్టమే
ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఆఖరి టెస్టులో న్యూజిలాండ్ బ్యాటర్లను దురదృష్టం వెంటాడుతుంది. తొలి రోజు ఆటలో హెన్రీ నికోల్స్ ఔటైన తీరు మరిచిపోకముందే మరో ఘటన చోటుచేసుకుంది. నిలకడగా ఆడుతున్న టామ్ బ్లండన్(55 పరుగులు) మాటీ పాట్స్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. ఇంగ్లండ్ ఆటగాళ్లు అప్పీల్ చేయగానే ఫీల్డ్ అంపైర్ రిచర్డ్ కెటిల్‌బరో ఔట్ ఇచ్చాడు. అయితే టామ్ బ్లండన్కు రివ్యూ వెళ్లే అవకాశం లేకుండా పోయింది. డీఆర్ఎస్ లేకపోవడంతో బ్లండన్ నిరాశగా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత రిప్లేలో బంతి ఆఫ్ స్టంప్ పై నుంచి వెళ్తున్నట్లు కనిపించింది. పాపం డీఆర్ఎస్ ఉండుంటే.. టామ్ బ్లండన్ కచ్చితంగా ఔట్ అయ్యేవాడు కాదు.. అప్పుడప్పుడు తప్పుడు నిర్ణయాలతో కొంప ముంచిన డీఆర్ఎస్ తాజాగా మాత్రం అందుబాటులో లేకపోవడంతో న్యూజిలాండ్ బ్యాటర్‌ది దురదృష్టమనే చెప్పొచ్చు. ఇక బ్లండన్ ఔట్ కావడంతో డారిల్ మిచెల్‌తో ఏర్పడిన శతక భాగస్వామ్యానికి తెరపడింది. ఇద్దరు కలిసి ఆరో వికెట్‌కు 120 పరుగులు జోడించడం విశేషం. ఇక టామ్ బ్లండన్ ఔటైన తర్వాత డారిల్ మిచెల్ మరో సెంచరీతో మెరిశాడు. మిచెల్‌కు ఇది వరుసగా నాలుగో సెంచరీ కావడం విశేషం. మైకెల్ బ్రాస్‌వెల్(13 పరుగులు), టిమ్ సౌథీ(33 పరుగులు)లతో కలిసి కీలక భాగస్వామ్యాలు నమోదు చేసిన డారిల్ మిచెల్ (228 బంతుల్లో 109 పరుగులు, 9 ఫోర్లు, 3 సిక్సర్లు) ఎనిమిదో వికెట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత న్యూజిలాండ్ 329 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ బౌలర్లలో జాక్ లీచ్ 5, స్టువర్ట్ బ్రాడ్ 3, మాటీ పాట్స్, జేమ్స్ ఓవర్టన్ చెరొక వికెట్ తీశారు. Nobody deserves that wicket more. Great perseverance Pottsy! 👏 Scorecard/clips: https://t.co/AIVHwaRwQv 🏴 #ENGvNZ 🇳🇿 pic.twitter.com/NKAIKL2NGI — England Cricket (@englandcricket) June 24, 2022 చదవండి: IND Vs LEIC: పుజారా డకౌట్.. షమీ వింత సెలబ్రేషన్ రూట్ మ్యాజిక్ ట్రిక్‌ను అనుకరించబోయి బొక్కబోర్లా! -
రోహిత్ శర్మ.. పట్టిందల్లా బంగారమే
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పట్టిందల్లా బంగారమే అవుతుందంటూ క్రికెట్ ఫ్యాన్స్ పేర్కొంటున్నారు. ఇంతకీ ఆ బంగారం ఏంటో తెలుసా.. డీఆర్ఎస్లు. అవును రోహిత్ నిజంగానే రివ్యూలకు రారాజుగా మారిపోతున్నాడు. మన టీమిండియా కెప్టెన్లకు రివ్యూలు ఎక్కువగా కలిసి రాలేదు. డీఆర్ఎస్ ప్రవేశపెట్టినప్పటి నుంచి ధోని, కోహ్లిలకు రివ్యూలు పెద్దగా కలిసిరాలేదు. అడపాదడపా కలిసొచ్చాయే తప్ప నష్టమే ఎక్కువసార్లు జరిగింది. కోహ్లి విషయంలో ఇది చాలా ఎక్కువగా కనిపించేది. అయితే రోహిత్ విషయంలో పూర్తిగా రివర్స్ అయింది. తాను ఎప్పుడు రివ్యూకు వెళ్లినా అనుకూలంగానే వస్తుంది. కోహ్లి గైర్హాజరీలో రోహిత్ పలుమార్లు జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో రోహిత్‌కు రివ్యూలు అనుకూలంగానే వచ్చేవి. ఇక తాజాగా పూర్తిస్థాయి కెప్టెన్ అయిన తర్వాత రోహిత్‌కు రివ్యూలు మరింతగా కలిసివస్తున్నాయి. చదవండి: ఫ్యాబ్-ఫోర్‌పై బీసీసీఐ కీలక నిర్ణయం! విండీస్‌తో సిరీస్‌లో తొలి వన్డేలో రివ్యూపై తన నిర్ణయాలతో రోహిత్ అందరిని ఆకట్టుకున్నాడు. తొలి వన్డేలో బ్రూక్స్ విషయంలో పంత్ వద్దన్నా కోహ్లి సలహాతో రోహిత్ రివ్యూకు వెళ్లాడు. ఫలితం అనుకూలంగా వచ్చింది. తాజాగా రెండో వన్డేలోనూ డారెన్ బ్రావో విషయంలో రోహిత్ రివ్యూకు వెళ్లాడు. పంత్‌పై నమ్మకంతో రివ్యూకు వెళ్లి సక్సెస్ కావడంతో అభిమానులు రోహిత్‌ను రివ్యూల రారాజుగా అభివర్ణిస్తున్నారు. ప్రస్తుతం రోహిత్‌పై అభిమానులు చేస్తున్న మీమ్స్ ప్రత్యేక ఆకర్షణగా మారాయి. మీరు ఒక లుక్కేయండి. చదవండి: Rohit Sharma-Pant: పంత్‌ను గుడ్డిగా నమ్మి రివ్యూకు వెళ్లిన రోహిత్.... ఫలితం Decision by Rohit Sharma 🔥#INDvsWI #RohitSharma #INDvWI pic.twitter.com/SoVBnNPsEw — Asif Ali (@DargaAsifAli) February 9, 2022 4 out of 4 for ROHIT REVIEW SYSTEM in this ODI series. #INDvWI #INDvsWI #RohitSharma — Dr. Cric Point (@drcricpoint) February 9, 2022 4th consecutive successful drs for captain Rohit sharma inside 2 odi's After took permanent Captainship. Rohit review system#INDvWI #INDvsWI — Somnath chakraborty ⚽🏏 (@somnath20094585) February 9, 2022 -
T20WC 2021: డీఆర్ఎస్ విషయంలో ఐసీసీ కీలక నిర్ణయం
ICC Says DRS Introduced In Mens T20 WC 2021.. డెసిషన్ రివ్యూ సిస్టమ్(డీఆర్ఎస్) విషయంలో ఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. టి20 ప్రపంచకప్ టోర్నీలో డీఆర్ఎస్ను అమలు చేయనున్నట్లు ఐసీసీ ఒక ప్రకటనలో దృవీకరించింది. కాగా మెన్స్ టి20 ప్రపంచకప్‌లో డీఆర్ఎస్ ఉయోగించడం ఇదే తొలిసారి కావడం విశేషం. సాధారణంగా టి20 మ్యాచ్‌లో ఇరు జట్లకు ప్రతీ ఇన్నింగ్స్‌లో ఒక రివ్యూ కోరే అవకాశం ఉంటుంది. కోవిడ్-19 మహమ్మారి కారణంగా టోర్నీలో తక్కువ అనుభవం ఉన్న అంపైర్లు పనిచేసే అవకాశం ఉన్నందున అదనంగా ఇరు జట్లకు మరో రివ్యూను ఇవ్వనున్నట్లు తెలిపింది. తాజా రూల్స్ ప్రకారం మ్యాచ్‌లో ఇరు జట్లకు రెండు ఇన్నింగ్స్‌లోనూ రెండు రివ్యూలు కోరే అవకాశం ఉంటుంది. చదవండి: T20 World Cup 2021: ఉమ్రాన్ మాలిక్‌కు బంపర్ ఆఫర్! దీంతోపాటు డక్‌వర్త్ లూయిస్ పద్దతి ఆధారంగా వచ్చే ఫలితాల నిర్ణయాల్లోనూ ఐసీసీ కీలక మార్పులు చేసింది. టి20 ప్రపంచకప్‌లో లీగ్ దశలో ఏవైనా మ్యాచ్‌లకు వర్షం అంతరాయం కలిగిస్తే.. డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో ఫలితం రావాలంటే ఇకపై ప్రతీ జట్టు కనీసం ఐదు ఓవర్లు బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. అదే సెమీ ఫైనల్స్.. ఫైనల్స్‌లో మాత్రం 10 ఓవర్లు పాటు బ్యాటింగ్ చేస్తేనే డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో ఫలితం తేల్చేందుకు అవకాశం ఉంటుంది. 2018 టి20 వుమెన్స్ టోర్నీలో డక్‌వర్త్ లూయిస్ పద్దతిని ఇదే విధంగా అమలు చేశారు. చదవండి: Team India Squad T20WC: ఏం మార్పులుండకపోవచ్చు.. చహల్ మాత్రం! ఇక మెన్స్ టి20 ప్రపంచకప్ టోర్నీలో డీఆర్ఎస్ ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి. అంతకముందు వుమెన్స్ టి20 ప్రపంచకప్ 2018లో తొలిసారి డీఆర్ఎస్ను ప్రవేశపెట్టారు. ఇక మెన్స్ క్రికెట్లో ఐసీసీ లాంటి మేజర్ టోర్నీల్లో చూసుకుంటే 2017 చాంపియన్స్ ట్రోఫీ, 2019 వన్డే ప్రపంచకప్, తొలి ఐసీసీ ప్రపంచటెస్టు చాంపియన్‌షిప్‌లో డీఆర్ఎస్ను అమలుపరిచారు. మ్యాచ్‌లో భాగంగా కొన్నిసార్లు మార్జిన్ ఆఫ్ ఎర్రర్స్లో ఫీల్డ్ అంపైర్ల తప్పుడు నిర్ణయాల వల్ల ఆటగాళ్లకు నష్టం కలుగుతుందని భావించిన ఐసీసీ డీఆర్ఎస్ రూల్‌ను ప్రవేశపెట్టింది. ఆటగాళ్లు తమ ఔట్‌పై ఏవైనా అనుమానాలు ఉంటే థర్డ్‌అంపైర్‌కు రివ్యూ కోరే అవకాశం ఉంటుంది. ఇక టి20 ప్రపంచకప్ 2021 అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు యూఏఈ, ఒమన్ వేదికగా జరగనుంది. చదవండి: T20 World Cup: ఓపెనర్‌గా సెలక్ట్ అయ్యానని విరాట్ భాయ్ చెప్పాడు! -
ఐపీఎల్లో డీఆర్ఎస్..?
సాక్షి, హైదరాబాద్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లోకి డీఆర్ఎస్(డిసిషన్ రివ్యూ సిస్టమ్)ను తీసుకురావాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. టెక్నాలజీ విస్తరిస్తున్న సమయంలో క్రికెట్లో కీలకంగా మారిన అంపైర్ తుది సమీక్ష నిర్ణయం రాను రాను అన్ని ఫార్మట్లకు విస్తరించనుంది. దీంతో ఐపీఎల్-2018 సీజన్లో డీఆర్ఎస్ ప్రేశపెట్టాలని బీసీసీఐ భావిస్తున్నదని, దీనికి కసరత్తులు మొదలు పెట్టినట్లు సమాచారం. అయితే విశాఖపట్టణంలో ఐసీసీ ప్యానెల్‌కు బయట ఉన్నభారత టాప్ పది మంది అంపైర్లతో బీసీసీఐ వర్క్‌షాప్ నిర్ణయించినట్లు ఓ జాతీయ ఛానెల్ పేర్కొంది. ఆ సదరు ఛానెల్‌తో ఓ బీసీసీఐ అధికారి మాట్లాడారు. డీఆర్ఎస్ విషయంలో బీసీసీఐ వర్క్‌షాప్ నిర్వహించటం ఇదే తొలిసారని, ఇక భవిష్యత్తులో అంపైర్ తుది నిర్ణయంలో టెక్నాలజీ కీలక మారునుందన్నారు. ఈ నేపథ్యంలో డీఆర్ఎస్పై అంపైర్లకు అవగాహన కల్పించేందుకు ఈ వర్క్‌షాప్ నిర్వహించినట్లు తెలిపారు. ఇక ఐపీఎల్లో డీఆర్ఎస్ ప్రవేశ పెట్టడంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. ఈ వర్క్‌షాప్ ఐసీసీ అంపైర్ల కోచ్ డెనిస్ బర్న్స్, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ పాల్ రిఫ్ఫిల్ల నేతృత్వంలో జరిగినట్లు తెలుస్తోంది. పాల్ రిఫ్పిల్ 2004-05 లో అంపైర్‌గా మారారు.