ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఆఖరి టెస్టులో న్యూజిలాండ్ బ్యాటర్లను దురదృష్టం వెంటాడుతుంది. తొలి రోజు ఆటలో హెన్రీ నికోల్స్ ఔటైన తీరు మరిచిపోకముందే మరో ఘటన చోటుచేసుకుంది. నిలకడగా ఆడుతున్న టామ్ బ్లండన్(55 పరుగులు) మాటీ పాట్స్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. ఇంగ్లండ్ ఆటగాళ్లు అప్పీల్ చేయగానే ఫీల్డ్ అంపైర్ రిచర్డ్ కెటిల్‌బరో ఔట్ ఇచ్చాడు. అయితే టామ్ బ్లండన్‌కు రివ్యూ వెళ్లే అవకాశం లేకుండా పోయింది.
డీఆర్‌ఎస్ లేకపోవడంతో బ్లండన్ నిరాశగా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత రిప్లేలో బంతి ఆఫ్ స్టంప్ పై నుంచి వెళ్తున్నట్లు కనిపించింది. పాపం డీఆర్‌ఎస్ ఉండుంటే.. టామ్ బ్లండన్ కచ్చితంగా ఔట్ అయ్యేవాడు కాదు.. అప్పుడప్పుడు తప్పుడు నిర్ణయాలతో కొంప ముంచిన డీఆర్‌ఎస్ తాజాగా మాత్రం అందుబాటులో లేకపోవడంతో న్యూజిలాండ్ బ్యాటర్‌ది దురదృష్టమనే చెప్పొచ్చు. ఇక బ్లండన్ ఔట్ కావడంతో డారిల్ మిచెల్‌తో ఏర్పడిన శతక భాగస్వామ్యానికి తెరపడింది. ఇద్దరు కలిసి ఆరో వికెట్‌కు 120 పరుగులు జోడించడం విశేషం.
ఇక టామ్ బ్లండన్ ఔటైన తర్వాత డారిల్ మిచెల్ మరో సెంచరీతో మెరిశాడు. మిచెల్‌కు ఇది వరుసగా నాలుగో సెంచరీ కావడం విశేషం. మైకెల్ బ్రాస్‌వెల్(13 పరుగులు), టిమ్ సౌథీ(33 పరుగులు)లతో కలిసి కీలక భాగస్వామ్యాలు నమోదు చేసిన డారిల్ మిచెల్ (228 బంతుల్లో 109 పరుగులు, 9 ఫోర్లు, 3 సిక్సర్లు) ఎనిమిదో వికెట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత న్యూజిలాండ్ 329 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ బౌలర్లలో జాక్ లీచ్ 5, స్టువర్ట్ బ్రాడ్ 3, మాటీ పాట్స్, జేమ్స్ ఓవర్టన్ చెరొక వికెట్ తీశారు.
Nobody deserves that wicket more. Great perseverance Pottsy! 👏
— England Cricket (@englandcricket) June 24, 2022
Scorecard/clips: https://t.co/AIVHwaRwQv
🏴 #ENGvNZ 🇳🇿 pic.twitter.com/NKAIKL2NGI
Comments
Please login to add a commentAdd a comment