LBW
-
జడేజా సూపర్ డెలివరీ.. స్టోక్స్‌కు మైండ్ బ్లాంక్! వీడియో వైరల్
రాంఛీ వేదికగా టీమిండియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 3 పరుగులు మాత్రమే చేసి స్టోక్స్ ఔటయ్యాడు. భారత స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అద్బుతమైన బంతితో స్టోక్సీని బోల్తా కొట్టించాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 25వ ఓవర్ వేసిన జడేజా తొలి బంతిని గుడ్ లెంగ్త్ డెలివరీగా సంధించాడు. ఆ బంతిని స్టోక్సీ డిఫెన్స్ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే బంతి తక్కువ ఎత్తులో బౌన్స్ అయ్యి స్టోక్స్ ఫ్రంట్ప్యాడ్ను తాకింది. వెంటనే ఎల్బీకి అప్పీల్ చేయగా.. అంపైర్ సైతం అంతే వేగంగా ఔట్ అంటూ వేలు పైకెత్తాడు. స్టోక్స్ కనీసం రివ్యూ కూడా తీసుకోకుండానే మైదానాన్ని వీడాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా తొలి ఇన్నింగ్స్‌లో 40 ఓవర్లకు ఇంగ్లండ్ 5 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. భారత బౌలర్లలో అరంగేట్ర పేసర్ ఆకాష్ దీప్ 3 వికెట్లు పడగొట్టి ఆరంభంలోనే ఇంగ్లండ్‌ను దెబ్బతీశాడు. pic.twitter.com/nNAMrv788e — Sitaraman (@Sitaraman112971) February 23, 2024 -
ఏంటి కోహ్లి అంత ఈజీగా వికెట్ ఇచ్చేశావు.. వీడియో వైరల్
ఛాటోగ్రామ్ వేదికగా తొలి టెస్టులో బంగ్లాదేశ్‌తో టీమిండియా తలపడుతోంది. ఈ మ్యాచ్ తొలిసెషన్లో భారత్‌పై బంగ్లాదేశ్ బౌలర్లు పైచేయి సాధించారు. తొలి సెషన్లో బంగ్లా బౌలర్లు కేవలం 85 పరుగులిచ్చి మూడు కీలక వికెట్లు పడగొట్టారు. భారత టాప్ ఆర్డర్ బ్యాటర్లలో శుబ్మాన్ గిల్(22), కేఎల్ రాహుల్(22), విరాట్ కోహ్లి(1) తీవ్రనిరాశపరిచారు. అయితే భారత వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ మాత్రం బంగ్లాదేశ్ బౌలర్లపై కాసేపు ఎదురు దాడికి దిగాడు. 45 బంతులు ఎదుర్కొన్న పంత్ 2 ఫోర్లు, 6 ఫోర్లతో 46 పరుగులు చేసి దురదృష్టవశాత్తూ పెవిలియన్‌కు చేరాడు. ట్రాప్‌లో చిక్కుకున్న కోహ్లి తొలి ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లిని అద్భుతమైన బంతితో బంగ్లా స్పిన్నర్ తైజుల్ ఇస్లామ్ బోల్తా కొట్టించాడు. 20 ఓవర్ వేసిన తైజుల్ ఇస్లామ్ బౌలింగ్‌లో మూడో బంతిని లెగ్ సైడ్ ఆడటానికి కోహ్లి ప్రయత్నించాడు. అయితే పిచ్ మిడిల్లో పడ్డ బంతి అద్భుతంగా టర్న్ అవుతూ కోహ్లి వెనుక ప్యాడ్‌కు తాకింది. వెంటనే బౌలర్‌తో వికెట్ కీపర్ ఎల్బీకి అప్పీల్ చేయగా..అంపైర్ వెంటనే వేలు పైకెత్తాడు. అయితే కోహ్లి రివ్యూ తీసుకున్నప్పటికీ ఎటువంటి ఫలితం లేదు. ఎందుకంటే విరాట్ క్లియర్‌గా వికెట్ల ముందు దొరికిపోయాడు. దీంతో కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసిన కోహ్లి నిరాశతో మైదానాన్ని వీడాడు. చదవండి: BAN Vs IND: చాలా దూకుడుగా ఆడావు! ‘శభాష్’ రాహుల్.. కెప్టెన్‌పై నెటిజన్ల సెటైర్లు! Back to back wicket for bangladesh.. Virat Kohli was only 99 runs away from the century 🥲🥲#ViratKohli𓃵 #ViratKohli #indvsbang #INDvBAN #klrahul #TestCricket pic.twitter.com/smsRJhC4xL — Nikesh Gohite🇮🇳 (@nikesh_gohite) December 14, 2022 -
థర్డ్ అంపైర్ నిర్ణయం.. బంగ్లా కెప్టెన్‌కు శాపం
ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టి20 ప్రపంచకప్‌లో ఒకపక్క వరుణుడు ఇబ్బంది పడుతుంటే.. మరోపక్క అంపైర్లు తప్పుడు నిర్ణయాలతో బ్యాటర్లు బలవుతున్నారు. తాజాగా ఆదివారం పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ థర్డ్ అంపైర్ తప్పుడు నిర్ణయానికి బలవ్వాల్సి వచ్చింది. ఇన్నింగ్స్ 11వ ఓవర్లో నాలుగో బంతికి షకీబ్ ఎల్బీగా వెనుదిరిగాడు. స్పిన్నర్ షాదాబ్ వేసిన ఈ ఓవర్లో మొదట సౌమ్యా సర్కార్ ఔట్ అవగా తర్వాతి బంతికే షకీబ్ ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. దీంతో పాక్ ఆటగాళ్లు అప్పీ్ల్‌కు వెళ్లగా ఫీల్డ్ అంపైర్ ఔట్ ఇచ్చాడు. ఆలస్యం చేయకుండా షకీబ్ రివ్యూకు వెళ్లాడు. అయితే రివ్యూలో బంతికి ముందుగా బ్యాట్ ను తగిలినట్టు అల్ట్రా ఎడ్జ్‌లో స్పష్టంగా స్పైక్ కనిపించింది. ఆ తర్వాతే బంతి షకీబ్ ప్యాడ్లను తాకింది. కానీ, ఇన్ సైడ్ ఎడ్జ్ క్లియర్ గా ఉన్నప్పటికీ థర్డ్ అంపైర్ ఎల్బీడబ్ల్యూ ఇచ్చాడు. బ్యాట్ నేలను తాకడం వల్లే అల్ట్రా ఎడ్జ్ లో స్పైక్ వచ్చినట్టు పేర్కొన్నాడు. కానీ, స్పైక్ వచ్చిన సమయంలో బ్యాట్ కు, నేలకు మధ్య ఖాళీ టీవీ రీప్లేల్లో కనిపించింది. అయినప్పటికీ థర్డ్ అంపైర్ ఎల్బీ ఇవ్వడం చర్చనీయాంశమైంది. ఈ నిర్ణయం వెలువడిన వెంటనే బంగ్లా కెప్టెన్ షకీబ్ షాకయ్యాడు. దీనిపై ఫీల్డ్ అంపైర్లతో మాట్లాడాడు. థర్డ్ అంపైర్ నిర్ణయంపై అసహనం వ్యక్తం చేసి ఏం చేయలేక నిరాశతో మైదానం వీడాడు. ఆ తర్వాత బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఆర్డర్ తడబడింది. దీంతో బంగ్లాదేశ్ పెద్దగా స్కోరు చేయలేకపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. అనంతరం పాకిస్తాన్ 18.1 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. ఈ విజయంతో పాకిస్తా్న్ అనూహ్యంగా సెమీస్‌లో అడుగుపెట్టగా.. బంగ్లాదేశ్ ఓటమితో ఇంటిబాట పట్టింది. Shakib’s bat didn’t touch the ground at all. Just focus on bat’s shadow. There was a spike. It couldn’t have been anything else except the ball hitting the bat. Bangladesh at the receiving end of a poor umpiring decision. #PakvBan #T20WorldCup — Aakash Chopra (@cricketaakash) November 6, 2022 Big moment in the match. Looked like Shakib Al Hasan edged it. The umpiring in this tournament hasn't been great#T20WorldCup #PAKvBAN pic.twitter.com/4zoJcVVPkm — Saj Sadiq (@SajSadiqCricket) November 6, 2022 చదవండి: ఇప్పటి వరకు ఇదే అత్యుత్తమ ప్రదర్శన.. కానీ నేనైతే: బంగ్లాదేశ్ కెప్టెన్ -
మహ్మద్ నవాజ్ రనౌటా లేక ఎల్బీనా?
టి20 ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్తాన్, సౌతాఫ్రికా మధ్య మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. పాక్ ఇన్నింగ్స్ సమయంలో బ్యాటర్ మహ్మద్ నవాజ్ ఔటైన తీరు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇన్నింగ్స్ 13వ ఓవర్ ఆఖరి బంతికి నవాజ్ ప్యాడ్లను తాకుతూ ఇన్సైడ్ ఎడ్జ్ అయింది. సౌతాఫ్రికా ఆటగాళ్లు అప్పీల్ చేయగా అంపైర్ ఔటిచ్చాడు. కానీ నవాజ్ ఎలాంటి రివ్యూ తీసుకోకుండానే పెవిలియన్ బాట పట్టాడు. అయితే రిప్లేలో మాత్రం బంతి ముందు బ్యాట్‌ను తాకినట్లు స్పైక్స్ కనిపించాయి. ఒకవేళ నవాజ్ రివ్యూకు వెళ్లి ఉంటే నాటౌట్ అయ్యేవాడు. అయితే ఇక్కడే ఊహించని ట్విస్ట్ జరిగింది. అంపైర్ ఔట్ ఇచ్చేసరికే మహ్మద్ నవాజ్ క్రీజు బయట ఉన్నాడు. అప్పుడే బంతిని అందుకున్న ఫీల్డర్ డైరెక్ట్ త్రోతో వికెట్లను గిరాటేశాడు. అప్పటికి నవాజ్ క్రీజులోకి చేరుకోలేదు. అయితే నవాజ్ పెవిలియన్ బాట పట్టింది రనౌట్ అయినందుకా లేక ఎల్బీగానా అన్నది ఎవరికి అర్థం కాలేదు. ఒకవేళ నవాజ్ రివ్యూ తీసుకొని ఫలితం అనుకూలంగా వచ్చినా రనౌట్‌గా వెనుదిరగాల్సి వచ్చేది. కానీ క్రికెట్ రూల్స్ ప్రకారం అంపైర్ ఒకసారి తన వేలిని పైకెత్తిన తర్వాత బంతిని డెడ్‌బాల్‌గా పరిగణిస్తారు. ఈ దశలో రనౌట్ చేసినా పనికిరాదు. మొత్తానికి తాను ఎలా ఔటయ్యాననే దానిపై క్లారిటీ లేకుండానే మహ్మద్ నవాజ్ పెవిలియన్ చేరడం ఆసక్తి కలిగించింది. ఇక పాకిస్తాన్‌కు సెమీస్ ఆశలు నిలవాలంటే కచ్చితంగా సౌతాఫ్రికాపై నెగ్గాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. ఇప్తికర్ అహ్మద్ 51, షాదాబ్ ఖాన్ 52 అర్థసెంచరీలతో చెలరేగగా.. మహ్మద్ హారిస్, మహ్మద్ నవాజ్‌లు తలా 28 పరుగులు చేశారు. pic.twitter.com/8lZ6zc7Qr9 — Guess Karo (@KuchNahiUkhada) November 3, 2022 చదవండి: పదే పదే మైదానంలోకి.. టీమిండియాతో ఉన్న సంబంధం? -
తెలివిగా వ్యవహరించిన కార్తిక్.. లాస్ట్ మ్యాచ్ హీరో జీరో అయ్యాడు
టి20 ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియా, సౌతాఫ్రికా మధ్య మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో సెంచరీతో మెరిసిన రొసౌ డకౌట్‌గా వెనుదిరిగాడు. అయితే అతను ఔట్ కావడంలో దినేశ్ కార్తిక్‌ది కీలకపాత్ర అని చెప్పొచ్చు. విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్ రెండో ఓవర్ అర్ష్‌దీప్ సింగ్ వేశాడు. ఓవర్లో మూడో బంతి ఇన్‌స్వింగ్ అయి రొసౌ ప్యాడ్లను తాకుతూ వెళ్లింది. దీంతో టీమిండియా అప్పీల్‌కు వెళ్లగా అంపైర్ ఔటివ్వలేదు. అయితే బౌలర్ అర్ష్‌దీప్ ఎల్బీ విషయంలో అంత కాన్ఫిడెంట్‌గా లేకపోవడంతో రోహిత్ కూడా రివ్వూకు మొగ్గుచూపలేదు. కానీ కార్తిక్ మాత్రం మిడిల్ స్టంప్‌ను తాకుతుందని కచ్చితంగా పేర్కొన్నాడు. కార్తిక్‌పై నమ్మకంతో రివ్యూకు వెళ్లిన రోహిత్ ఫలితం సాధించాడు. రిప్లేలో బంతి ఇన్‌స్వింగ్ అయి మిడిల్ స్టంప్‌ను ఎగురగొడుతున్నట్లు కనిపించింది. రొసౌ ఔట్ అని అంపైర్ ప్రకటించాడు. దీంతో కార్తిక్‌ను టీమిండియా కెప్టెన్ రోహిత్ సహా మిగతా ఆటగాళ్లంతా అభినందనల్లో ముంచెత్తారు. ఫలితంగా లాస్ట్ మ్యాచ్‌లో సెంచరీతో హీరోగా నిలిచిన రొసౌ ఈ మ్యాచ్‌లో జీరోగా నిలిచాడు. Courtesy: CAPTAIN ROHIT SHARMA pic.twitter.com/RWYW6lnJuy — ✨ᕼ𝒾𝕋мάn 𝐌𝐁 ✨ (@satti45_) October 30, 2022 చదవండి: తీరు మారని కేఎల్ రాహుల్.. పక్కనబెట్టాల్సిందే! -
రివ్యూ విషయంలో పంత్ తడబాటు.. రోహిత్ ఆగ్రహం
సౌతాఫ్రికాతో తొలి టి20లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియాకు శుభారంభం లభించింది. ఆరంభంలోనే దీపక్ చహర్, అర్ష్‌దీప్ సింగ్‌లు బౌలింగ్‌లో చెలరేగడంతో సౌతాఫ్రికా వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ వచ్చింది. 47 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఇక విషయానికి వస్తే టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ కెప్టెన్ రోహిత్ శర్మ ఆగ్రహానికి గురయ్యాడు. రివ్యూ విషయంలో పంత్ తడబాటుకు గురవ్వడం రోహిత్‌కు కోపం తెప్పించింది. హర్షల్ పటేల్ బౌలింగ్‌లో మార్ర్కమ్ 8వ ఓవర్ చివరి బంతిని ఆడే ప్రయత్నం చేయగా.. బంతి ప్యాడ్లను తాకింది. దీంతో హర్షల్ పటేల్ అప్పీల్ చేయగా.. అంపైర్ ఔటివ్వలేదు. దీంతో రోహిత్ శర్మ హర్షల్ పటేల్‌తో మాట్లాడి పంత్‌ను అడిగాడు. ఎల్బీ విషయంలో కీపర్‌కు ఉన్న స్పష్టత ఎవరికి ఉండదని అందరికి తెలిసిందే. అయితే పంత్ మాత్రం అంత కాన్ఫిడెంట్‌గా లేకపోవడంతో రోహిత్.. ''అరె ఏంటిది?'' అన్నట్లు అసహనం వ్యక్తం చేశాడు. అయితే స్లిప్‌లో ఉన్న కోహ్లి మాత్రం రివ్యూకు వెళ్లు అన్నట్లుగా సైగ చేశాడు. దీంతో రోహిత్ రివ్యూకు వెళ్లాడు. ఇక రిప్లైలో బంతి క్లియర్‌గా మిడిల్ స్టంప్‌ను ఎగురగొడుతున్నట్లు చూపించడంతో మార్ర్కమ్ ఔట్ అని అంపైర్ ప్రకటించాడు. కాగా బ్రేక్ సమయంలో రోహిత్.. పంత్‌ను బంతిపై కాస్త దృష్టిపెట్టు అన్నట్లుగా పేర్కొన్నాడు. ఇక కోహ్లి మాత్రం తన అంచనా నిజమైందని తెగ సంతోషపడిపోయాడు. చదవండి: టీమిండియా గబ్బర్ను గుర్తుచేసిన అర్ష్‌దీప్ సింగ్.. -
'ఇన్నేళ్ల నీ అనుభవం ఇదేనా స్మిత్.. సిగ్గుచేటు'
ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో శ్రీలంక ఇన్నింగ్స్ 39 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లంక రెండు టెస్టుల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఆస్ట్రేలియా సీనియర్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ రెండో ఇన్నింగ్స్‌లో తాను చేసిన ఒక పొరపాటు అతని మెడకు చుట్టుకునేలా చేసింది. ఔట్ అని క్లియర్‌గా తెలుస్తున్నప్పటికి అనవరసంగా రివ్యూకు పోయి చేతులు కాల్చుకోవడమే కాదు క్రికెట్ ఫ్యాన్స్ విమర్శలను సైతం అందుకున్నాడు. విషయంలోకి వెళితే తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో మెరిసిన స్మిత్.. రెండో ఇన్నింగ్స్‌లోనూ అదే జోరు చూపించాలనుకున్నాడు. కానీ స్మిత్ రెండో ఇన్నింగ్స్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు. ప్రభాత్ జయసూర్య వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్లో ఐదో బంతి నేరుగా స్మిత్ ప్యాడ్లను తాకింది. లంక జట్టు అప్పీల్ చేయగా.. అంపైర్ ఔటిచ్చాడు. బంతి కేవలం ప్యాడ్లను మాత్రమే తాకి లెగ్‌స్టంప్‌ను ఎగురగొడతున్నట్లు క్లియర్‌గా తెలిసిపోయింది. దీనికి తోడూ బ్యాట్‌కు బంతి తగల్లేదు. అయినా కూడా స్మిత్ రివ్యూకు వెళ్లడం ఆశ్చర్యం కలిగించింది. రిప్లేలో అతను క్లియర్ ఔట్ అని తేలింది. అంతే స్మిత్ రివ్యూపై నెటిజన్లు విరుచుకుపడ్డారు. ''క్లియర్ ఔట్ అని తెలిసినప్పటికి రివ్యూ కోరి చేతులు కాల్చుకున్నాడు.. క్రికెట్ చరిత్రలో స్మిత్ తీసుకున్న రివ్యూ అత్యంత చెత్త నిర్ణయం.. ఇన్నేళ్ల అనుభవం ఇదేనా స్మిత్.. సిగ్గుచేటు'' అంటూ కామెంట్స్ చేశారు. ఇక ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 151 పరుగులకే కుప్పకూలడంతో లంక ఇన్నింగ్స్ విజయాన్ని సాధించింది. అంతకముందు చండీమల్ డబుల్ సెంచరీతో మెరవడంతో లంక 554 పరుగుల భారీ స్కోరు సాధించింది. అంతకముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 364 పరుగులకు ఆలౌట్ అయింది. Steve Smith should be banned from international cricket for two years after that review, — Jon “Semi-Fungible Airships” Kudelka (@jonkudelka) July 11, 2022 Whether it’s his outburst after his First Test run out or this, I remain of the view is that Steve Smith should do a Joe Root and not have any leadership responsibilities - he’s so self-obsessed about his batting as to be a great batter but also a poor leader. #SLvAUS https://t.co/Ex62fgXmt1 — Kevin Yam 任建峰 (@kevinkfyam) July 11, 2022 చదవండి: David Warner:'ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లోనూ ప్రేమను పంచారు.. థాంక్యూ' -
కొంప ముంచిన డీఆర్ఎస్.. కివీస్ బ్యాటర్‌ది దురదృష్టమే
ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఆఖరి టెస్టులో న్యూజిలాండ్ బ్యాటర్లను దురదృష్టం వెంటాడుతుంది. తొలి రోజు ఆటలో హెన్రీ నికోల్స్ ఔటైన తీరు మరిచిపోకముందే మరో ఘటన చోటుచేసుకుంది. నిలకడగా ఆడుతున్న టామ్ బ్లండన్(55 పరుగులు) మాటీ పాట్స్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. ఇంగ్లండ్ ఆటగాళ్లు అప్పీల్ చేయగానే ఫీల్డ్ అంపైర్ రిచర్డ్ కెటిల్‌బరో ఔట్ ఇచ్చాడు. అయితే టామ్ బ్లండన్కు రివ్యూ వెళ్లే అవకాశం లేకుండా పోయింది. డీఆర్ఎస్ లేకపోవడంతో బ్లండన్ నిరాశగా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత రిప్లేలో బంతి ఆఫ్ స్టంప్ పై నుంచి వెళ్తున్నట్లు కనిపించింది. పాపం డీఆర్ఎస్ ఉండుంటే.. టామ్ బ్లండన్ కచ్చితంగా ఔట్ అయ్యేవాడు కాదు.. అప్పుడప్పుడు తప్పుడు నిర్ణయాలతో కొంప ముంచిన డీఆర్ఎస్ తాజాగా మాత్రం అందుబాటులో లేకపోవడంతో న్యూజిలాండ్ బ్యాటర్‌ది దురదృష్టమనే చెప్పొచ్చు. ఇక బ్లండన్ ఔట్ కావడంతో డారిల్ మిచెల్‌తో ఏర్పడిన శతక భాగస్వామ్యానికి తెరపడింది. ఇద్దరు కలిసి ఆరో వికెట్‌కు 120 పరుగులు జోడించడం విశేషం. ఇక టామ్ బ్లండన్ ఔటైన తర్వాత డారిల్ మిచెల్ మరో సెంచరీతో మెరిశాడు. మిచెల్‌కు ఇది వరుసగా నాలుగో సెంచరీ కావడం విశేషం. మైకెల్ బ్రాస్‌వెల్(13 పరుగులు), టిమ్ సౌథీ(33 పరుగులు)లతో కలిసి కీలక భాగస్వామ్యాలు నమోదు చేసిన డారిల్ మిచెల్ (228 బంతుల్లో 109 పరుగులు, 9 ఫోర్లు, 3 సిక్సర్లు) ఎనిమిదో వికెట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత న్యూజిలాండ్ 329 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ బౌలర్లలో జాక్ లీచ్ 5, స్టువర్ట్ బ్రాడ్ 3, మాటీ పాట్స్, జేమ్స్ ఓవర్టన్ చెరొక వికెట్ తీశారు. Nobody deserves that wicket more. Great perseverance Pottsy! 👏 Scorecard/clips: https://t.co/AIVHwaRwQv 🏴 #ENGvNZ 🇳🇿 pic.twitter.com/NKAIKL2NGI — England Cricket (@englandcricket) June 24, 2022 చదవండి: IND Vs LEIC: పుజారా డకౌట్.. షమీ వింత సెలబ్రేషన్ రూట్ మ్యాజిక్ ట్రిక్‌ను అనుకరించబోయి బొక్కబోర్లా! -
మయాంక్ అగర్వాల్ ఔట్ విషయంలో ఫ్యాన్స్ అసంతృప్తి
టీమిండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్ సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో అర్థసెంచరీతో మెరిసిన సంగతి తెలిసిందే. రోహిత్ గైర్హాజరీలో కేఎల్ రాహుల్‌తో కలిసి తొలి వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యం నమోదు చేసి టీమిండియాను పటిష్టస్థితిలో నిలిపాడు. 37 పరుగుల వద్ద మయాంక్ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఇక 149 బంతుల్లో 10 బౌండరీల సాయంతో 60 పరుగులు చేసిన మయాంక్.. ఎన్గిడి బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. చదవండి: Virat Kohli: మళ్లీ అదే నిర్లక్క్ష్యం.. మంచి ఆరంభం వచ్చాకా కూడా! ఎన్గిడి బంతిని ఆఫ్‌స్టంప్ లైన్ మీదుగా విసరగా ఇన్సైడ్ ఎడ్జ్ అయి మయాంక్ ప్యాడ్లను తాకింది. దక్షిణాఫ్రికా అప్పీల్‌కు వెళ్లగా.. అంపైర్ ఔట్ ఇవ్వలేదు. దీంతో డీఆర్ఎస్కు వెళ్లి ప్రొటీస్ ఫలితం రాబట్టింది. అల్ట్రాఎడ్జ్‌లో బంతి టాప్ఎండ్ నుంచి లెగ్‌స్టంప్‌ను ఎగురగొట్టినట్లు కనిపించడంతో మయాంక్ ఔటయ్యాడు. అయితే ఈ నిర్ణయంపై టీమిండియా ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేశారు. బంతి అంత హైట్‌లో వెళ్తున్నప్పుడు అంపైర్ కాల్ తీసుకోవాల్సింది అంటూ కామెంట్స్ చేశారు. ఇక మయాంక్ ఔటైన తర్వాతి బంతికే పుజారా గోల్డెన్ డక్ అయ్యాడు. ఇన్నింగ్స్ 40వ ఓవర్ మూడో బంతి పుజారా డిఫెన్స్ చేసే ప్రయత్నంలో బ్యాట్ ఇన్సైడ్ ఎడ్జ్ అయి కీగన్ పీటర్సన్ చేతిలో పడింది. ఇక సౌతాఫ్రికా గడ్డపై పుజారా గోల్డెన్ డక్ కావడం ఇది రెండోసారి. యాదృశ్చికంగా రెండుసార్లు ఎన్గిడి బౌలింగ్‌లోనే పుజారా ఔట్ కావడం ఇక్కడ మరో విశేషం.ఇక తొలిరోజు ఆటలో అన్ని సెషన్లలో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన టీమిండియా 3 వికెట్ల నష్టానికి 272 పరుగుల వద్ద తొలిరోజు ఆటను ముగించింది. కేఎల్ రాహుల్ 122 పరుగులు, రహానే 40 పరుగులతో ఆడుతున్నారు. చదవండి: KL Rahul: కేఎల్ రాహుల్ శతకం.. టెస్టు ఓపెనర్‌గా పలు రికార్డులు బద్దలు Mayank Agarwal LBW Wicket, India vs South Africa 1st Test#Wicket#SAvIND #Mayank#Agarwal#Ngidi#Cricket pic.twitter.com/j6ayNJW1RT — Error in Thinking (@Errorinthinking) December 26, 2021 -
అంపైర్‌తో అశ్విన్ గొడవ.. అది మనసులో పెట్టుకొనేనా?
Heated Argument Between Ravichandran Ashwin And Umpire Nithin Menon.. న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, అంపైర్ నితిన్ మీనన్ మధ్య చిన్నపాటి వాగ్వాదం చోటుచేసుకుంది. ఆఫ్ స్పిన్నర్ అయిన అశ్విన్ రౌండ్ ది వికెట్ బౌలింగ్ చేయడం సహజమే. అయితే ఇన్నింగ్స్ 77వ ఓవర్లో అశ్విన్ ఒక తన శైలికి విరుద్ధంగా స్టంప్స్‌కు దగ్గరగా వెళ్తూ బౌలింగ్ చేశాడు. వరుసగా మూడు బంతులను అశ్విన్ అలాగే వేశాడు. చదవండి: Tom Latham: రెండో బ్యాట్స్‌మన్‌గా టామ్ లాథమ్ .. 30 ఏళ్ల తర్వాత ఓవర్ ముగిసిన తర్వాత అంపైర్ నితిన్ మీనన్ అశ్విన్‌ను పిలిచి..''నువ్వు స్టంప్స్‌కు దగ్గరగా వెళ్తూ బౌలింగ్ చేయడం ద్వారా నా దృష్టికి అడ్డుతగులుతున్నావు. ఎల్బీ కాల్స్ సరిగా ఇవ్వలేకపోతున్నా.. అంతేగాక పరోక్షంగా నన్ను.. నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న బ్యాట్స్‌మన్‌ను ఇబ్బందికి గురిచేశావు'' అంటూ తెలిపాడు. చదవండి: అరె ఇద్దరూ ఒకేసారి పరిగెత్తారు.. ఇద్దరూ ఒకేసారి డైవ్ చేశారు.. ఆఖరికి ఇది విన్న అశ్విన్.. '' ఎలాగో మీరు ఎల్బీ విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం లేదు.. ఇంకెందుకు'' అంటూ చురకలంటించాడు. ఇంతలో అక్కడికి చేరుకున్న కెప్టెన్ రహానే.. అశ్విన్ డేంజర్ జోన్లో(పిచ్‌పైకి) అయితే పరిగెత్తడం లేదు కదా అంటూ తెలిపాడు. దాదాపు అశ్విన్ వేసిన మూడు ఓవర్ల పాటు అంపైర్ నితిన్ మీనన్‌కు.. అతనికి చర్చ జరగడం విశేషం. కాగా అంతకముందు ఇన్నింగ్స్ 73వ ఓవర్లో లాథమ్ 66 పరుగుల వద్ద ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అశ్విన్ వేసిన ఆ ఓవర్లో మూడో బంతి లెగ్ స్టంప్ దిశలో వెళ్లి లాథమ్ ప్యాడ్లను తాకింది. అయితే అశ్విన్ అప్పీల్ చేయగా.. నితిన్ మీనన్ ఔటివ్వలేదు. టీమిండియా కూడా రివ్యూకు వెళ్లలేదు. అయితే ఆ తర్వాత రిప్లేలో అల్ట్రాఎడ్జ్‌లో మాత్రం బంతి క్లీన్‌గా స్టంప్స్‌కు తగిలినట్లు చూపించింది. ఇది చూసిన అశ్విన్ కోపంతో తన కాలితో గట్టిగా తన్నడం కెమెరాల్లో చిక్కడం వైరల్‌గా మారింది. Ashwin argues with umpire Nitin Menon pic.twitter.com/R5qMxyeDi0 — Sunaina Gosh (@Sunainagosh7) November 27, 2021 Latham out LBW at 66, given not out, review not taken by India. Are the matches going to get decided on the basis of a team’s judgment to take (or not to) DRS? pic.twitter.com/WzDoWrTQri — Bhupesh Juneja (@BhupeshJuneja1) November 27, 2021 -
కెప్టెన్‌గా ఇదే చివరిసారి.. అంపైర్‌తో కోహ్లి వాగ్వాదం
Virat Kohli Argument With Umpire Virender Sharma.. ఐపీఎల్లో ఆర్సీబీ కెప్టెన్‌గా కోహ్లి తనకు ఇదే చివరి సీజన్ అని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈసారి ఎలాగైనా కప్ అందించి కోహ్లికి కెప్టెన్‌గా ఘనమైన వీడ్కోలు ఇవ్వాలని ఆర్సీబీ భావిస్తోంది. కాగా కేకేఆర్‌తో జరుగుతున్న ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఓడితే ఆర్సీబీ ఇంటిబాట పడుతుంది. అందుకే ఈ మ్యాచ్ ఆర్సీబీకి ప్రతిష్టాత్మకంగా మారింది. ఇక మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 138 పరుగులు మాత్రమే చేయగలిగింది. అయితే స్వల్ప లక్ష్యమే అయినప్పటికీ కాపాడుకునే అవకాశం ఉండడంతో ఆర్సీబీ గట్టిగానే ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే కేకేఆర్ బ్యాటర్ ఔట్ నిర్ణయంపై అంపైర్ తీరుపై కోహ్లి వాగ్వాదానికి దిగాడు. విషయంలోకి వెళితే.. కేకేఆర్ ఇన్నింగ్స్‌లో ఏడో ఓవర్ చహల్ వేశాడు. ఓవర్ ఆఖరి బంతిని త్రిపాఠి పుల్ చేయబోయి మిస్ అయ్యాడు. దీంతో బంతి ప్యాడ్లను తాకింది. చహల్ ఎల్బీకి అప్పీల్ చేయగా.. అంపైర్ వీరేందర్ శర్మ నాటౌట్ ఇచ్చాడు. చహల్ అప్పీల్‌తో కోహ్లి వెంటనే రివ్యూ కోరాడు. అల్ట్రాఎడ్జ్‌లో బంతి మొదట ప్యాడ్లను తాకి నేరుగా లెగ్‌స్టంప్‌ను ఎగరగొట్టినట్లు స్పష్టంగా కనిపించడంతో త్రిపాఠి అవుట్ అని తేలింది. దీంతో కోహ్లి ఓవర్ ముగిసిన తర్వాత అంపైర్ వీరేందర్ శర్మ వద్దకు వెళ్లి ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాసేపు ఇద్దరి మధ్య సీరియస్ చర్య నడిచింది. అనంతరం కోహ్లి నవ్వుతూ అక్కడినుంచి వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా 139 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ 12 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది. చదవండి: Glenn Maxwell: మ్యాక్స్‌వెల్ కొత్త చరిత్ర.. ఆర్సీబీ తరపున తొలిసారి pic.twitter.com/4tRKN5lSnB — pant shirt fc (@pant_fc) October 11, 2021 -
అంపైర్ చీటింగ్.. అసలు అది ఔట్ కాదు
సిడ్నీ : ఆస్ట్రేలియా -ఎతో జరుగుతున్న మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో టీమిండియా ఆటగాడు శుబ్‌మన్ గిల్ అవుటైన విధానం సోషల్ మీడియాలో కాంట్రవర్సీగా మారింది. అసలు అంపైర్ దేనిని పరిగణలోకి తీసుకొని గిల్ విషయంలో ఔట్ ఇచ్చాడో అర్థం కావడం లేదని నెటిజన్లు తలగోక్కున్నారు. అసలు విషయంలోకి వెళితే.. ఆసీస్ ఎతో మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో 65 పరుగులతో మంచి టచ్‌లో ఉన్న శుబ్‌మన్ గిల్‌ను ఆసీస్ బౌలర్ మిచెల్ స్వేప్సన్ ఔట్ చేశాడు. అయితే స్వేప్సన్ వేసిన బంతి గిల్ ప్యాడ్లను తాగి స్లిప్‌లోకి వెళ్లింది.. స్లిప్‌లో ఉన్న సీన్ అబాట్ దాన్ని క్యాచ్‌గా అందుకున్నాడు. అప్పటికే స్వేప్సన్ అంపైర్‌కు అప్పీల్ చేయగా.. అంపైర్ ఔట్ అని ప్రకటించాడు. కాగా స్కోరుబోర్డులో గిల్ క్యాచ్ అవుట్ అయినట్లుగా చూపించారు. (చదవండి : 'క్రికెటర్ కాకపోయుంటే రైతు అయ్యేవాడు') అంపైర్ ఎల్బీ లేక క్యాచ్‌లో ఏది పరిగణలోకి తీసుకొని అవుట్‌గా ఇచ్చాడనే దానిపై స్పష్టత రాలేదు. దీంతో షాక్ తిన్న గిల్ అసలు ఔటా.. కాదా అన్న సందేహంతో కాసేపు అక్కడే నిలుచుండిపోయాడు. ప్రాక్టీస్ మ్యాచ్ కావడంతో డీఆర్ఎస్ అవకాశం లేకపోవడంతో గిల్ నిరాశగా వెళ్లిపోయాడు. వాస్తవానికి రీప్లేలో స్వేప్సన్ వేసిన బంతి గిల్ ప్యాడ్లను తాకి ఆఫ్‌స్టంట్ పై నుంచి వెళ్తున్నట్లు కనిపించింది.. దీంతో అతను ఎల్బీగా అవుట్ కాదు. ఇక బంతి బ్యాట్‌ను తాకకుండా కేవలం గిల్ ప్యాడ్లను మాత్రమే తాకి స్లిప్‌లో ఉన్న అబాట్ చేతుల్లో పడింది. అలా చూసినా గిల్ ఔట్ కాదని స్పష్టంగా తెలుస్తుంది. కాగా దీనికి సంబంధించిన వీడియో ట్విటర్లో షేర్ చేశారు. ఇది చీటింగ్ అసలు గిల్ ఔట్ కానే కాదు.. అది అంపైర్ తప్పుడు నిర్ణయం.. గిల్ నాటౌట్.. రాంగ్ అంపైరింగ్ అంటూ కామెంట్లు పెట్టారు. ఇదే విషయమై టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా స్పందించాడు. 'శుబ్‌మన్ ఎలా అవుటయ్యాడో అంపైర్ చెప్పాలి.. కచ్చితంగా ఎల్బీ మాత్రం కాదు.. క్యాచ్ అవుటా అంటే ఆ చాన్సే లేదు..' అంటూ చురకలంటించాడు. (చదవండి : రషీద్‌ను దంచేసిన ఆసీస్ బ్యాట్స్‌మన్) Gill given out caught, and what a catch it was too! What's your call? #AUSAvIND pic.twitter.com/fDFwB7IUBU — cricket.com.au (@cricketcomau) December 12, 2020 ఇక ఆసీస్-ఎ, టీమిండియాల మధ్య జరిగిన మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. 472 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్-ఎ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 307 పరుగులు చేసింది. ఆసీస్ బ్యాట్స్మెన్లలో జాక్ వైల్డర్ మత్ సెంచరీతో మెరవగా.. కెప్టెన్ అలెక్స్ కేరీ 58 పరుగులతో రాణించాడు. మొదటి ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోరుకే ఆలౌట్ చేసిన టీమిండియా బౌలర్లు రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం దానిని రిపీట్ చేయలేకపోయారు.అంతకముందు టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో రిషబ్ పంత్, హనుమ విహారిలు సెంచరీలతో కథం తొక్కిన సంగతి తెలిసిందే.(చదవండి : పేడ మొహాలు, చెత్త గేమ్‌ప్లే అంటూ..) -
‘ఎల్బీల్లో ఆ నిబంధనకు చరమగీతం పాడాలి’
సిడ్నీ: ప్రపంచ క్రికెట్లో ఎల్బీడబ్యూ విషయంలో ప్రస్తుతం ఉన్న నిబంధనను సమూలంగా మార్చాల్సిన అవసరం ఉందని ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు, మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్ అభిప్రాయపడ్డాడు. బంతి బ్యాట్స్‌మన్ బ్యాట్‌కు తగలకుండా ప్యాడ్లను తాకి వికెట్ల మీదుగా వెళుతున్నట్లు భావిస్తే అది కచ్చితంగా ఔట్ ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశాడు. ఇక్కడ బంతి ఎక్కడ పిచ్ అయ్యిందనే విషయానికి చరమగీతం పాడాలన్నాడు. ప్రస్తుత రూల్ ప్రకారం ఏ బంతైనా లైన్‌కు అవతల పిచ్ అయి బ్యాట్స్‌మన్ బ్యాట్‌కు తగలకుండా ప్యాడ్‌కు తాకినా ఎల్బీగా పరిగణించరు. ప్రధానంగా బంతి ఆఫ్ స్టంప్‌పై కానీ, లెగ్ స్టంప్‌పై కానీ పడి ప్యాడ్ తగిలి వికెట్ల మీదకు వెళుతున్నా అది ఔట్ కాదు. కచ్చితంగా లైన్లో పడి మాత్రమే పడి బ్యాట్మన్ బంతిని టచ్ చేయలేని క్రమంలో ప్యాడ్‌కు తగిలి వికెట్ల మీదుకు వెళుతున్నప్పుడు ఎల్బీగా ఇస్తారు. దీని వల్ల ఎక్కువగా స్పిన్నర్లు నష్టపోతూ ఉంటారు. కాగా, ఈ విషయంలో కీలక మార్పులు చేయాలని అంటున్నాడు ఇయాన్ చాపెల్. బంతి ఎక్కడ పడింది అనేది ప్రధానం కాదని, బ్యాట్స్‌మన్ ప్యాడ్‌కు తగిలి వికెట్లను గిరాటేస్తుందని తేలితే అది ఔట్‌గానే పరిగణించాలన్నాడు. (అప్పుడు గెలిచారు.. ఇప్పుడు గెలవండి..!) బంతి ఎక్కడ పిచ్ అయిందనేది లెక్కల్లోకి తీసుకోకూడదన్నాడు. అలా నిబంధనను మార్చిన క్రమంలో బ్యాట్స్‌మన్ ఎప్పుడూ బ్యాట్‌తోనే వికెట్‌ను కాపాడుకోవడానికి చూస్తాడన్నాడు. అదే సమయంలో బౌలర్ కూడా స్టంప్సే లక్ష్యంగా బంతులను సంధిస్తాడని చాపెల్ పేర్కొన్నాడు. ఒకవేళ ప్యాడ్లకు తాకితే అది కేవలం గాయం నుంచి తప్పించుకునేలా ఉండాలి కానీ, ఔట్ నుంచి తప్పించుకునే విధంగా ఉండకూడదన్నాడు. కొంతమంది కావాలనే ప్యాడ్లతో కొన్ని బంతుల్ని ఎదుర్కోవడాన్ని చాపెల్ పరోక్షంగా ప్రస్తావించాడు. ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియా-భారత్‌ల టెస్టు సిరీస్ గురించి ఇటీవల మాట్లాడిన చాపెల్.. ఈసారి టీమిండియా సిరీస్‌ను సాధించడం చాలా కష్టమన్నాడు. గతంలో ఆస్ట్రేలియాలో పర్యటించిన భారత్ టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకుని ఉండవచ్చు కానీ, రాబోవు సిరీస్‌లో మాత్రం ఆసీస్ అంత తేలిగ్గా లొంగదన్నాడు. డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్‌లను తొందరగా పెవిలియన్‌కు పంపిస్తేనే టీమిండియా గెలిచే అవకాశం ఉంటుందని, అలా కాని పక్షంలో ఆసీస్‌దే గెలుపు అని చాపెల్ పేర్కొన్నాడు.(వార్నర్ నోట ‘పోకిరి’ డైలాగ్) -
కోహ్లి ఔట్: అదే బంతి.. బౌలర్ మారాడంతే!
క్రైస్ట్‌చర్చ్: ‘మార్చిలో ఓ లెక్క రాలేదు ఫెయిల్ అయ్యావు.. సెప్టెంబర్‌లో మళ్లీ అదే లెక్క వచ్చింది. ఏం చేస్తావ్.. ఈ లోపల ఏం నేర్చుకున్నావ్.. మార్చికి సెప్టెంబర్‌కు తేడా చూపించు’అని జులాయి సినిమా క్లైమ్యాక్స్ పవర్ ఫుల్ డైలాగ్ ఉంటుంది. ప్రస్తుతం ఇదే డైలాగ్‌ను టీమిండియా సారథి విరాట్ కోహ్లికి వర్తింపజేస్తూ నెటిజన్లు మీమ్స్ క్రియేట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సంబరం టీమిండియాకు ఎంతో సేపు నిలవేలేదు. ఏడు పరుగుల స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ చేపట్టిన టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ (3), పృథ్వీ షా(14) ఘోరంగా విఫలమయ్యారు. ఈ క్రమంలో టీమిండియా ఎన్నో ఆశలు పెట్టుకున్న కోహ్లి (14) సైతం మరోసారి దారుణంగా నిరుత్సాహపరిచాడు. ఈ సిరీస్‌లో పేలవ ఫామ్‌లో ఉన్న కోహ్లి రెండో ఇన్నింగ్స్‌లో గ్రాండ్‌హోమ్ వేసిన 18 ఓవర్ తొలి బంతికి ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఆఫ్‌సైడ్ ఫ్రంట్ ఫూట్ బంతిని అంచనా వేయడంలో మరోసారి తడబడిన కోహ్లి వికెట్ల ముందు అడ్డంగా దొరికిపోయాడు. దీంతో అప్పటికే ఓపెనర్ల వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న టీమిండియాను మరింత కష్టాల్లోకి నెట్టేస్తూ పెవిలియన్ బాట పట్టాడు. అయితే అవతలి ఎండ్‌లో ఉన్న పుజారా రివ్యూ తీసుకొమ్మని సూచించినా కోహ్లి నిరాకరించి క్రీజు వదిలి వెళ్లాడు. తర్వాత ఫర్ఫెక్ట్ అవుటని టీవీలో తేలడంతో కోహ్లి మరోసారి డీఆర్ఎస్ అవకాశాన్ని వృథా చేయలేదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో టిమ్ సౌతీ వేసిన సేమ్ అదే బంతికే కోహ్లి అదేరీతిలో ఎల్బీడబ్ల్యూ కావడం గమనార్హం. 2018లో కేప్‌టౌన్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సైతం కోహ్లి ఇదే విధంగా ఔటయ్యాడంటూ కామెంటేటర్లు పేర్కొన్నారు. ఇక ప్రపంచ నంబర్ వన్ బ్యాట్స్‌మన్ ఇలా పలుమార్లు ఒకే విధంగా ఔటవ్వడం విమర్శలకు ఊతమిచ్చే అవకాశం ఉంది. కోహ్లి ఆటతీరుపై నెటిజన్లు సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు. తొలి ఇన్నింగ్స్‌కు రెండో ఇన్నింగ్స్‌కు తేడా చూపించలేదని.. నేర్చుకోవడంలో సారథే వెనుకంజలో ఉంటే సహచర, యువ క్రికెటర్లు అతడి నుంచి ఏం నేర్చుకుంటారని ప్రశ్నిస్తున్నారు. కాగా, కివీస్ టెయిలెండర్లు సులువుగా బ్యాటింగ్ చేసిన చోట భారత బ్యాట్స్‌మెన్ ఘోరంగా విఫలమవడాన్ని టీమిండియా ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. చదవండి: కోహ్లి.. అందుకే విఫలం సలాం జడ్డూ భాయ్.. -
స్మిత్ లాగే... పెరీరా!
ఇటీవలే భారత్ పర్యటనలో ఆసీస్ కెప్టెన్ స్మిత్ మాదిరిగానే శ్రీలంక బ్యాట్స్‌మన్ దిల్రువాన్ పెరీరా కూడా డీఆర్ఎస్ కోసం పెవిలియన్‌ను ఆశ్రయించాడు. అయితే కోహ్లి సేన నుంచి అభ్యంతరం లేకపోవడంతో మొత్తానికి ఇదేమంత వివాదం కాలేదు. షమీ వేసిన 57వ ఓవర్ చివరి బంతికి పెరీరా ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. నాన్ స్ట్రయిక్ ఎండ్‌లో హెరాత్‌ను సంప్రదిస్తూనే వెనుదిరిగాడు. అయితే డ్రెస్సింగ్ రూమ్‌వైపు చూసి ఉన్నపళంగా ఆగి... రివ్యూ కోరడం చర్చనీయాంశమైంది. రీప్లేలో నాటౌట్‌గా తేలడంతో అతను ఓ 5 పరుగులు చేసేశాడు. ఈ ఘటనతో డీఆర్ఎస్ మళ్లీ డ్రెస్సింగ్ రూమ్ సమీక్షా పద్ధతైంది! చూశాడేమో కానీ... తమ ఆటగాడు డ్రెస్సింగ్ రూమ్ వైపు చూశాడేమో కానీ... రివ్యూపై సాయం కోరలేదని, సంజ్ఞలేవీ చేయలేదని లంక బోర్డు (ఎస్ఎల్సీ) వివరణ ఇచ్చింది. ఆసీస్ కెప్టెన్ స్మిత్ -
ఎల్బీడబ్ల్యు నిబంధనల్లో మార్పులు!
ఐసీసీ ఆమోదం ఎడిన్బర్గ్: డీఆర్ఎస్ (అంపైర్ నిర్ణయ సమీక్ష పద్ధతి)లో అంపైర్లు ఇచ్చే ఎల్బీడబ్ల్యు నిర్ణయాలకు సంబంధించిన నిబంధనలు మార్చేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఆమోదం తెలిపింది. దీనివల్ల బౌలర్లకు మరింత ప్రయోజనం చేకూరనుంది. అయితే కొత్త వన్డే లీగ్‌తో పాటు టెస్టు క్రికెట్‌ను రెండు డివిజన్లుగా చేయాలన్న ప్రతిపాదనను మాత్రం వాయిదా వేసింది. ఎడిన్బర్గ్లో శనివారం రాత్రి ముగిసిన ఐసీసీ వార్షిక సమావేశంలో పలు అంశాలపై చర్చించిన చైర్మన్ శశాంక్ మనోహర్ నేతృత్వంలోని బోర్డు కొన్ని ప్రధాన నిర్ణయాలు తీసుకుంది. డీఆర్ఎస్ ఎల్బీకి సంబంధించిన కొత్త నిబంధన ప్రకారం... ఆఫ్, లెగ్ స్టంప్ మధ్య ఉండే జోన్‌తో పాటు బార్డర్స్‌కు సగం బంతి తగిలినా ఎల్బీ ఇవ్వనున్నారు. గతంలో బంతి జోన్ మధ్యలో తగిలితేనే అవుట్‌గా ప్రకటించేవారు. ఈ నిబంధన అక్టోబర్ 1 నుంచి లేదా అంతకంటే ముందు డీఆర్ఎస్తో కూడిన సిరీస్ జరిగితే అప్పట్నించి అమల్లోకి వస్తుంది. ఇక కొత్తగా ‘నోబాల్స్’ను గుర్తించేందు థర్డ్ అంపైర్‌కు కూడా అవకాశం ఇచ్చారు. బంతి పడిన కొన్ని సెకన్లలోనే అతను ఫీల్డ్ అంపైర్లకు ఈ విషయాన్ని తెలియజేయవచ్చు. ఐసీసీ పాలన, పునర్నిర్మాణంపై చేపడుతున్న చర్యలపై కూడా ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. డర్బన్ (2022)లో జరిగే కామన్వెల్త్ గేమ్స్‌లో క్రికెట్‌ను ప్రవేశపెట్టేందుకు మద్దతివ్వాలని నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన దరఖాస్తును గేమ్స్ సమాఖ్యకు అందజేయనుంది. క్రికెట్‌ను ఒలింపిక్స్‌లో చేర్చేందుకు అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం (ఐఓసీ)తో చర్చలు జరపాలని నిర్ణయం తీసుకున్నారు.