‘ఎల్బీల్లో ఆ నిబంధనకు చరమగీతం పాడాలి’ | Ian Chappell Proposes A Radical Change In LBW Rule | Sakshi
Sakshi News home page

‘ఎల్బీల్లో ఆ నిబంధనకు చరమగీతం పాడాలి’

Published Mon, May 11 2020 10:00 AM | Last Updated on Mon, May 11 2020 10:00 AM

Ian Chappell Proposes A Radical Change In LBW Rule - Sakshi

సిడ్నీ:  ప్రపంచ క్రికెట్‌లో ఎల్బీడబ్యూ విషయంలో ప్రస్తుతం ఉన్న నిబంధనను సమూలంగా మార్చాల్సిన అవసరం ఉందని ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు, మాజీ కెప్టెన్‌ ఇయాన్‌ చాపెల్‌ అభిప్రాయపడ్డాడు. బంతి బ్యాట్స్‌మన్‌ బ్యాట్‌కు తగలకుండా ప్యాడ్లను తాకి వికెట్ల మీదుగా వెళుతున్నట్లు భావిస్తే అది కచ్చితంగా ఔట్‌ ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశాడు. ఇక్కడ బంతి ఎక్కడ పిచ్‌ అయ్యిందనే విషయానికి చరమగీతం పాడాలన్నాడు.  ప్రస్తుత రూల్‌ ప్రకారం ఏ బంతైనా లైన్‌కు అవతల పిచ్‌ అయి బ్యాట్స్‌మన్‌ బ్యాట్‌కు తగలకుండా ప్యాడ్‌కు తాకినా ఎల్బీగా పరిగణించరు. ప్రధానంగా బంతి ఆఫ్‌ స్టంప్‌పై కానీ, లెగ్‌ స్టంప్‌పై కానీ పడి ప్యాడ్‌ తగిలి వికెట్ల మీదకు వెళుతున్నా అది ఔట్‌ కాదు. కచ్చితంగా లైన్‌లో పడి మాత్రమే పడి బ్యాట్‌మన్‌ బంతిని టచ్‌ చేయలేని క‍్రమంలో ప్యాడ్‌కు తగిలి వికెట్ల మీదుకు వెళుతున్నప్పుడు  ఎల్బీగా ఇస్తారు. దీని వల్ల ఎక్కువగా స్పిన్నర్లు నష్టపోతూ ఉంటారు. కాగా, ఈ విషయంలో కీలక మార్పులు చేయాలని అంటున్నాడు ఇయాన్‌ చాపెల్‌. బంతి ఎక్కడ పడింది అనేది ప్రధానం కాదని, బ్యాట్స్‌మన్‌ ప్యాడ్‌కు తగిలి వికెట్లను గిరాటేస్తుందని తేలితే అది ఔట్‌గానే పరిగణించాలన్నాడు. (అప్పుడు గెలిచారు.. ఇప్పుడు గెలవండి..!)

బంతి ఎక్కడ పిచ్‌ అయిందనేది లెక్కల్లోకి తీసుకోకూడదన్నాడు. అలా నిబంధనను మార్చిన క్రమంలో బ్యాట్స్‌మన్‌ ఎప్పుడూ బ్యాట్‌తోనే వికెట్‌ను కాపాడుకోవడానికి చూస్తాడన్నాడు. అదే సమయంలో బౌలర్‌ కూడా స్టంప్సే లక్ష్యంగా బంతులను సంధిస్తాడని చాపెల్‌ పేర్కొన్నాడు. ఒకవేళ ప్యాడ్లకు తాకితే అది కేవలం గాయం నుంచి తప్పించుకునేలా ఉండాలి కానీ, ఔట్‌ నుంచి తప్పించుకునే విధంగా ఉండకూడదన్నాడు. కొంతమంది కావాలనే ప్యాడ్లతో కొన్ని బంతుల్ని ఎదుర్కోవడాన్ని చాపెల్‌ పరోక్షంగా ప్రస్తావించాడు. ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియా-భారత్‌ల టెస్టు సిరీస్‌ గురించి ఇటీవల మాట్లాడిన చాపెల్‌.. ఈసారి టీమిండియా సిరీస్‌ను సాధించడం చాలా కష్టమన్నాడు. గతంలో ఆస్ట్రేలియాలో పర్యటించిన భారత్‌ టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకుని ఉండవచ్చు కానీ, రాబోవు సిరీస్‌లో మాత్రం ఆసీస్‌ అంత తేలిగ్గా లొంగదన్నాడు. డేవిడ్‌ వార్నర్‌, స్టీవ్‌ స్మిత్‌లను తొందరగా పెవిలియన్‌కు పంపిస్తేనే టీమిండియా గెలిచే అవకాశం ఉంటుందని, అలా కాని పక్షంలో ఆసీస్‌దే గెలుపు అని చాపెల్‌ పేర్కొన్నాడు.(వార్నర్‌ నోట ‘పోకిరి’ డైలాగ్)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement