గ్రేమ్ వాట్సన్(ఫైల్‌ఫొటో)
సిడ్నీ: ఆస్ట్రేలియా మాజీ ఆల్ రౌండర్ గ్రేమ్ వాట్సన్(75) కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న గ్రేమ్ వాట్సన్ తుది శ్వాస విడిచిన విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) తన ట్వీటర్ అకౌంట్ ద్వారా తెలిపింది. 1966-72 వరకూ ఆసీస్ క్రికెట్ జట్టులో కొనసాగిన వాట్సన్.. ఐదు టెస్టు మ్యాచ్‌లు, రెండు వన్డేలు ఆడారు. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్, మీడియం పేసర్ అయిన గ్రేమ్ వాట్సన్ 1966-67 సీజన్‌లో దక్షిణాఫ్రికా పర్యటనతో అంతర్జాతీయ అరంగేట్రం చేశారు. ఆ పర్యటన రెండో టెస్టులో వాట్సన్ హాఫ్ సెంచరీ మెరిశాడు. కాగా, గాయం కారణంగా ఆ తర్వాత టెస్ట్‌కి దూరమయ్యారు. ఇక నాలుగో టెస్టులో వాట్సన్ తన కెరీర్‌లోనే అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన చేసినప్పటికీ ఆస్ట్రేలియా సిరీస్ కోల్పోయింది. వాట్సన్ తన కెరీర్‌లో తరుచు గాయాలతోనే సతమతమయ్యేవారు. (ఆత్మహత్య ఆలోచనలో నా భార్య గుర్తొచ్చింది..)
ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 4, 674 పరుగులు సాధించిన గ్రేమ్ వాట్సన్.. 186 వికెట్లను తీశారు. తన క్రికెట్ కెరీర్‌ను విక్టోరియా తరఫున ఆరంభించిన వాట్సన్..ఆపై వెస్ట్రన్ ఆస్ట్రేలియాకు మారారు. 1971-72, 1972-73, 1974-75 సీజన్లలో వెస్ట్రన్ ఆస్ట్రేలియా షెఫల్డ్ షీల్డ్ ట్రోఫీలు గెలవడంలో వాట్సన్ కీలక పాత్ర పోషించారు. ఆస్ట్రేలియా రూల్స్ ఫుట్‌బాల్ క్రీడలో కూడా వాట్సన్‌కు ప్రావీణ్యం ఉంది. మెల్‌బోర్న్ జట్టు తరఫున ఆస్ట్రేలియా రూల్స్ ఫుట్‌బాల్ మ్యాచ్‌లను వాట్సన్ ఆడారు. గ్రేమ్ వాట్సన్ మృతికి ఆసీస్ దిగ్గజ ఆటగాడు ఇయాన్ చాపెల్ సంతాపం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment