Sheffield Shield
-
హ్యాట్రిక్ సాధించిన ఆస్ట్రేలియా బౌలర్
ఆస్ట్రేలియాలో జరిగే షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో హ్యాట్రిక్ నమోదైంది. టస్మానియాతో జరిగిన మ్యాచ్‌లో వెస్ట్రన్ ఆస్ట్రేలియా బౌలర్ బ్రాడీ కౌచ్ హ్యాట్రిక్ వికెట్లతో విరుచుకుపడ్డాడు. కౌచ్ హ్యాట్రిక్ వికెట్లతో చెలరేగడంతో టస్మానియాపై వెస్ట్రన్ ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 45 పరుగుల తేడాతో గెలుపొందింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టస్మానియా తొలి ఇన్నింగ్స్‌లో 317 పరుగులకు ఆలౌటైంది. కాలెబ్ జువెల్ (61), మిచెల్ ఓవెన్ (83) అర్ద సెంచరీలతో రాణించారు. వెస్ట్రన్ ఆస్ట్రేలియా బౌలర్లలో జోయెల్ పారిస్ నాలుగు వికెట్లతో సత్తా చాటాడు.అనంతరం బరిలోకి దిగిన వెస్ట్రన్ ఆస్ట్రేలియా 9 వికెట్ల నష్టానికి 460 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. వెస్ట్రన్ ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో కార్ట్‌రైట్ భారీ సెంచరీతో (153) సత్తా చాటగా.. సామ్ ఫాన్నింగ్ (68), గుడ్విన్ (94), ఆస్టన్ అగర్ (74) అర్ద సెంచరీలతో రాణించారు. టస్మానియా బౌలర్లలో కున్హేమన్ ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు.143 పరుగులు వెనుకపడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టస్మానియా.. బ్రాడీ కౌచ్ (14-8-15-3), అస్టన్ అగర్ (17.5-11-12-3), జోయెల్ పారిస్ (15-9-18-2), కెమరూన్ గ్యానన్ (16-6-25-2) దెబ్బకు 98 పరుగులకు ఆలౌటైంది. తద్వారా వెస్ట్రన్ ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ తేడాతో ఘన విజయం సాధించింది. టస్మానియా సెకెండ్ ఇన్నింగ్స్‌లో బ్రాడ్లీ హోప్ (24) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.HAT-TRICK! LBW, bowled, bowled - well done Brody Couch! #SheffieldShield pic.twitter.com/B1CjUWmO6l— cricket.com.au (@cricketcomau) November 4, 2024హ్యాట్రిక్ వికెట్లు తీసిన బ్రాడీ కౌచ్ఈ మ్యాచ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో వెస్ట్రన్ ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ బ్రాడీ కౌచ్ హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టాడు. షెఫీల్డ్ షీల్డ్ టోర్నీ చరిత్రలో హ్యాట్రిక్ సాధించిన తొలి వెస్ట్రన్ ఆస్ట్రేలియా బౌలర్ బ్రాడీనే. మ్యాచ్ చివరి రోజు (నవంబర్ 4) టీ విరామం తర్వాత బ్రాడీ వరుసగా జేక్ డోరన్, లారెన్స్ నీల్ స్మిత్, కీరన్ ఇలియట్ వికెట్లు పడగొట్టాడు. టస్మానియా స్కోర్ 89 పరుగుల వద్ద నుండగా బ్రాడీ ఈ ఘనత సాధించాడు. -
పొదల్లోకి వెళ్లిన బంతి.. నవ్వులు పూయించిన ఆసీస్ స్టార్ ప్లేయర్( వీడియో)
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా జట్టు ఇప్పటినుంచే సన్నాహాకాలు ప్రారంభించింది. దేశీవాళీ టోర్నీ షెఫీల్డ్ షీల్డ్ 2024-25 సీజన్లో కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్, స్టార్క్, హాజిల్‌వుడ్ మినహా మిగితా ఆసీస్ అగ్రశ్రేణి ఆటగాళ్లంతా పాల్గోంటున్నారు.అయితే ఈ టోర్నీలో భాగంగా సిడ్నీ వేదికగా న్యూ సౌత్ వేల్స్, సౌత్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో ఓ ఫన్నీ సంఘటన చోటు చేసుకుంది. ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ నాథన్ లియాన్ గల్లీ క్రికెట్ మాదరి బంతిని పొదల్లో వెతుకుతూ నవ్వులు పూయించాడు. ఈ మ్యాచ్‌లో న్యూ సౌత్ వేల్స్‌కు లియాన్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.అసలేం జరిగిందంటే?సౌత్ ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 56 ఓవర్ వేసిన లియాన్ బౌలింగ్‌లో ఆఖరి బంతికి క్యారీ భారీ సిక్సర్ బాదాడు. దెబ్బకు బంతి మైదానం వెలుపుల ఉన్న పొదల్లో పడింది. ఈ క్రమంలో న్యూ సౌత్ వేల్స్ ఫీల్డర్లు బంతిని ఆ పొదల్లో వెతకడం ప్రారంభించారు. కానీ బంతి కన్పించలేదు. దీంతో బంతిని వెతికేందుకు లియాన్ స్వయంగా రంగంలోకి దిగాడు. అయితే అతడికి ఓ బంతి దొరికింది. కానీ లియాన్‌కు దొరికింది రెడ్ బాల్ కాదు వైట్ బాల్. దీంతో అందరూ ఒక్కసారిగా నవ్వుకున్నారు. ఇంతకుముందు ఎప్పుడో కన్పించకుండా పోయిన బంతి ఇప్పుడు నాథన్‌కు దొరింది. కానీ తాజాగా పోయిన బంతి మాత్రం వారికి దొరకలేదు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతుంది. కాగా ఎటువంటి సంఘటనలు ఎక్కువగా గల్లీ క్రికెట్లో జరుగుతూ ఉంటాయి. View this post on Instagram A post shared by cricket.com.au (@cricketcomau) -
Sheffield Shield 2024 Final: సెంచరీతో కదంతొక్కిన సామ్
ఫెఫీల్డ్ షీల్డ్ 2023-24 ఎడిషన్ ఫైనల్ ఇవాళ (మార్చి 21) ప్రారంభమైంది. టస్మానియాతో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న వెస్ట్రన్ ఆస్ట్రేలియా.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 8 వికెట్ల నష్టానికి 325 పరుగులు చేసింది. కెప్టెన్ సామ్ వైట్మన్ (104) సెంచరీతో కదంతొక్కగా.. ఆర్కీ షార్ట్ (50), హిల్టన్ కార్ట్‌వైట్ (55), కూపర్ కొన్నొల్లీ (73 నాటౌట్) అర్దసెంచరీలతో రాణించారు. మరి కొద్ది సమయంలో తొలి రోజు ఆట ముగుస్తుందనగా.. కూపర్ చెలరేగిపోయాడు. టస్మానియా బౌలర్లపై బౌండీరలు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. టస్మానియా బౌలర్లలో ఫ్రీమన్ 3 వికెట్లు పడగొట్టగా.. లియాన్ కర్లిసైల్ 2, రిలే మెరిడిత్, గేబ్ బెల్, వెబ్‌స్టర్ తలో వికెట్ దక్కించుకున్నారు. ఈ మ్యాచ్‌లో టస్మానియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. 130 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఈ టోర్నీలో ఈ సారి కూడా ఫైనలిస్ట్ అయిన వెస్ట్రన్ ఆస్ట్రేలియా డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఉంది. ఈ జట్టు గడిచిన రెండు సీజన్లలో ఛాంపియన్‌గా కొనసాగుతూ హ్యాట్రిక్‌పై కన్నేసింది. -
శతక్కొట్టిన టర్నర్.. వెస్ట్రన్ ఆస్ట్రేలియా ఖాతాలో 17వ షెఫీల్డ్ షీల్డ్ టైటిల్
వెస్ట్రన్ ఆస్ట్రేలియా.. షెఫీల్డ్ షీల్డ్ 2022-23 టైటిల్‌ను 17వ సారి సొంతం చేసుకుంది. విక్టోరియాతో జరిగిన ఫైనల్లో వెస్ట్రన్ ఆస్ట్రేలియా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆట నాలుగో రోజైన ఇవాళ (మార్చి 26) విక్టోరియా నిర్ధేశించిన 91 పరుగుల లక్ష్యాన్ని వెస్ట్రన్ ఆస్ట్రేలియా వికెట్ కోల్పోయి ఛేదించింది. కెమారూన్ బాన్‌క్రాఫ్ట్ (39), టీగ్ వైల్లీ (43) వెస్ట్రన్ ఆస్ట్రేలియాను విజయతీరాలకు చేర్చారు. Western Australia clinched their 17th #SheffieldShield title with a thumping nine-wicket win over Victoria! Full recap from @ARamseyCricket at the WACA + full highlights 👇https://t.co/uAEk4nL5CL — cricket.com.au (@cricketcomau) March 26, 2023 ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన విక్టోరియా తొలి ఇన్నింగ్స్‌లో 195 పరుగులకు ఆలౌట్ కాగా.. వెస్ట్రన్ ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 315 పరుగులు సాధించి 120 పరుగుల తొలి ఇన్నింగ్స్ లీడ్‌ను దక్కించుకుంది. విక్టోరియా తొలి ఇన్నింగ్స్‌లో ఆష్లే చంద్రసింఘే (46) టాప్ స్కోరర్‌గా నిలువగా.. వెస్ట్రన్ ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో ఆస్టన్ టర్నర్ (128) సెంచరీతో కదం తొక్కాడు. What a way to go back-to-back!! Western Australia are the 2022-23 #SheffieldShield champions! #PlayOfTheDay | @MarshGlobal pic.twitter.com/gdsFuNWgqb — cricket.com.au (@cricketcomau) March 26, 2023 అనంతరం విక్టోరియా రెండో ఇన్నింగ్స్‌లోనూ విఫలమై 210 పరుగులకే చాపచుట్టేసి, వెస్ట్రన్ ఆస్ట్రేలియా ముందు 91 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. దీన్ని వెస్ట్రన్ ఆస్ట్రేలియా ఆటగాళ్లు వికెట్ మాత్రమే కోల్పోయి ఆడుతూ పాడుతూ ఛేదించారు. ఈ మ్యాచ్‌లో వెస్ట్రన్ ఆస్ట్రేలియా వికెట్‌కీపర్ జోష్ ఫిలిప్స్ తొలి ఇన్నింగ్స్‌లో ఆరుగురిని, రెండో ఇన్నింగ్స్‌లో ఇద్దరిని ఔట్ చేయడంలో భాగం కావడం విశేషం. -
జిడ్డు బ్యాటింగ్‌లో ఈ బ్యాటర్‌ను మించినోడు లేడు.. 400 నిమిషాలు క్రీజ్‌లో ఉండి..!
131 ఏళ్ల షెఫీల్డ్ షీల్డ్ టోర్నీ చరిత్రలో అత్యంత జిడ్డు బ్యాటింగ్ ప్రస్తుత సీజన్లో నమోదైంది. వెస్ట్రన్ ఆస్ట్రేలియాతో జరుగుతున్న షీల్డ్ 2022-23 ఫైనల్లో విక్టోరియా ఆటగాడు ఆష్లే చంద్రసింఘే 403 నిమిషాలు క్రీజ్‌లో నిలబడి, 280 బంతులను ఎదుర్కొని 46 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన విక్టోరియా 195 పరుగులకు ఆలౌట్ కాగా.. ఓపెనర్‌గా బరిలోకి దిగిన చంద్రసింఘే చివరి దాకా అజేయంగా క్రీజ్‌లో నిలబడి ఓ అరుదైన రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. షీల్డ్ ఫైనల్లో కనీసం 250 బంతులను ఎదుర్కొని చివరి దాకా అజేయంగా క్రీజ్‌లో నిలబడిన రెండో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. 1997-98 సీజన్ ఫైనల్లో టాస్మానియా ఆటగాడు జేమీ కాక్స్ 267 బంతులు ఎదుర్కొని 115 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ రికార్డుతో పాటు చంద్రసింఘే మరిన్ని రికార్డులు కూడా కొల్లగొట్టాడు. షీల్డ్ టోర్నీ చరిత్రలో 46 పరుగులు చేసేందుకు అత్యధిక బంతులను ఎదుర్కొన్న ఆటగాడిగా నిలిచాడు. అలాగే కనీసం హాఫ్ సెంచరీ కూడా చేయకుండా షీల్డ్ ఫైనల్లో చివరి వరకు క్రీజ్‌లో నిలబడిన ఓపెనర్‌గా రికార్డు నెలకొల్పాడు. 16.43 స్ట్రయిక్ రేట్‌తో బ్యాటింగ్ చేసిన చంద్రసింఘే.. తొలి పరుగు చేసేందుకు ఏకంగా 49 బంతులు తీసుకోవడం కూడా ఓ రికార్డే. కాగా, చంద్రసింఘే జిడ్డు బ్యాటింగ్‌ను కొందరు విమర్శిస్తుంటే, మరికొందరేమో ప్రశంశిస్తున్నారు. చంద్రసింఘే ఓపికగా క్రీజ్‌లో నిలబడిన విధానాన్ని టెస్ట్ క్రికెట్ ప్రేమికులు ఆకాశానికెత్తుతున్నారు. శ్రీలంక బీజాలు కలిగిన చంద్రసింఘే కుమార సంగక్కర, మైక్ హస్సీలను ఆదర్శంగా తీసుకుని క్రికెట్ ఆడటం మొదలుపెట్టాడు. ఇదిలా ఉంటే, షీల్డ్ ఫైనల్లో మూడో రోజు ఆట ముగిసే సమయానికి విక్టోరియా 2 పరుగుల లీగ్‌లో ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో ఆ జట్టు 195 పరుగులకు ఆలౌట్ కాగా.. రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు కోల్పోయి 122 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. అంతకుముందు వెస్ట్రన్ ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 315 పరుగులకు ఆలౌటైంది. -
క్రికెట్ జట్టు వాహనంలో చోరీ.. లబోదిబోమంటున్న ఆసీస్ క్రికెటర్
Queensland Cricketer Jimmy peirson Cricket Kit Stolen: క్రికెట్ జట్టుపై దొంగలు దాడి చేసి, అందులోని క్రికెట్ సామాగ్రిని దోచుకెళ్లిన ఘటన ఆస్ట్రేలియాలోని అడిలైడ్ నగరంలో చోటుచేసుకుంది. షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో భాగంగా టాస్మానియాతో మ్యాచ్‌కు ముందు క్వీన్స్‌ల్యాండ్ జట్టు వాహనంపై దొంగలు దాడి చేసి క్రికెట్ కిట్లతో పాటు ఇతర సామాగ్రిని అపహరించారు. క్వీన్స్‌ల్యాండ్ జట్టు బస చేసే హోటల్ పార్కింగ్‌లో ఉన్న వాహనం అద్దాలను పగలగొట్టి లోపలికి ప్రవేశించిన దొంగలు.. ఆ జట్టు వికెట్ కీపర్ జిమ్మీ పియర్సన్కు చెందిన రెండు బ్యాట్లతో పాటు ఇతర క్రికెట్ సామాగ్రిని దొంగిలించారు. View this post on Instagram A post shared by Jimmy Peirson (@jimmypeirson) ఈ విషయాన్ని పియర్సన్ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తూ.. తన సరికొత్త గ్యారీ నికెల్స్ స్టిక్కర్ బ్యాట్లు చోరీ అయ్యాయని, ఎవరికైనా దొరికితే తనకు తెలియజేయాలంటూ రాసుకొచ్చాడు. ఈ విషయమై కేసు నమోదు చేసిన దక్షిణ ఆస్ట్రేలియా పోలీసులు.. హోటల్లోని సీసీ కెమెరాల ద్వారా మిస్టరీని ఛేదించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉంటే, క్వీన్స్‌ల్యాండ్-టాస్మానియా జట్ల మధ్య మ్యాచ్ సెప్టెంబర్ 30న బ్రిస్బేన్‌లో జరగాల్సి ఉండింది. అయితే, బ్రిస్బేన్ నగరంలో కొత్తగా కరోనా కేసులు నమోదు కావడంతో మ్యాచ్ వాయిదా పడింది. చదవండి: విజయానందంలో ఆ ఢిల్లీ ఆటగాడు ఏం చేశాడో చూడండి..! -
ఆ క్యాచ్‌పై తీవ్ర చర్చ.. మీరు కూడా ఓ లుక్కేయండి
న్యూసౌత్‌వేల్స్: క్రికెట్లో కొన్ని అసాధారణ క్యాచ్‌లు ఎప్పటికీ మనకు గుర్తుండిపోతాయి. సింగిల్ హ్యాండెడ్ క్యాచ్, బౌండరీ లైన్‌పై క్యాచ్‌లు, డైవ్ కొట్టి పట్టిన క్యాచ్‌లు, రన్నింగ్ బ్యాక్ క్యాచ్‌లు ఎక్కువగా అభిమానుల్ని అలరిస్తూ ఉంటాయి. కాగా, ఇప్పుడు ఒక రన్నింగ్ బ్యాక్ క్యాచ్ సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. అది అసాధారణ క్యాచ్ అయినప్పటికీ కూడా దాన్ని ఎలా క్యాచ్ ఇస్తారంటూ ట్వీటర్లో ప్రశ్నల వర్షం కురుస్తోంది. వివరాల్లోకి వెళితే.. షెఫల్డ్ షీల్డ్ టోర్నీలో భాగంగా న్యూసౌత్‌వేల్స్-క్వీన్‌లాండ్స్ మధ్య నిన్న మ్యాచ్ ఆరంభమైంది. ఈ మ్యాచ్‌లో క్వీన్‌లాండ్స్ ఆటగాడు లబూషేన్ ఒక మంచి క్యాచ్‌ను అందుకున్నాడు. మిచెల్ స్వీప్సెన్ బౌలింగ్‌లో న్యూసౌత్‌వేల్స్ ఆటగాడు బాక్స్టర్ హోల్ట్ ఒక షాట్ ఆడగా అది కాస్తా అవుట్ సైడ్ ఎడ్జ్ పట్టుకుని గాల్లోకి లేచింది. ఆ సమయంలో కవర్స్‌లో ఫీల్డింగ్ చేస్తున్న లబూషేన్ వెనక్కి పరుగెత్తుకుంటూ వెళ్లి క్యాచ్ అందుకున్నాడు. బాల్‌ను వెంటాడీ మరీ క్యాచ్ తీసుకున్నాడు. అయితే క్యాచ్‌ను అందుకున్న మరుక్షణమే అంటే ఇంకా పూర్తి నియంత్రణ రాకుండా ఆ క్యాచ్‌ను కిందికి విసిరేశాడు. దీనిపైనే చర్చ నడుస్తోంది. ఆ క్యాచ్‌ను పట్టిన వెంటనే ఇలా కావాలనే కిందికి విసిరేయడాన్ని కామెంటేటర్లు కూడా అనుమానం వ్యక్తం చేశారు. అది క్యాచ్ తీసుకున్నాడా.. లేక డ్రాప్ చేశాడా అనే అనుమానం లేవనెత్తారు. ఇదే విషయాన్ని ట్వీటర్లో అభిమానులు కూడా వేలెత్తిచూపుతున్నారు. ఇది లీగల్ క్యాచ్ ఎలా అవుతుందంటూ ప్రశ్నిస్తున్నారు. మరి కొంతమంది ఇది కచ్చితంగా క్యాచ్ అంటూ కౌంటర్ ఎటాక్ ఇస్తున్నారు. ఇక్కడ కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం లేదని, క్యాచ్ పట్టిన తర్వాత కిందికి విసిరేయవచ్చని బదులిస్తున్నారు. ఇక్కడ గత మెగా ఈవెంట్లలో జరిగిన సందర్భాలను కూడా ప్రస్తావిస్తున్నారు. 1999 వరల్డ్‌కప్‌లో భాగంగా సూపర్ సిక్స్ మ్యాచ్‌లో ఆసీస్ ఆటగాడు స్టీవ్ స్మిత్ ఇచ్చిన క్యాచ్‌ను దక్షిణాఫ్రికా ఆటగాడు గిబ్స్ ఇలానే పట్టి వదిలేశాడని అంటున్నారు. అప్పుడు అది క్యాచ్ ఔట్ ఇవ్వలేదని నిలదీస్తున్నారు. దానికి-దీనికి కూడా ఒకే తరహా పోలికలున్నాయని వాదనకు దిగుతున్నారు. A 'peculiar' ending to the NSW innings, with this deemed to be a legal catch #SheffieldShield pic.twitter.com/T4gQgr1Rc2 — cricket.com.au (@cricketcomau) April 4, 2021 -
పాపం.. చేతికి చిక్కినట్లే చిక్కి జారిపోయింది
సిడ్నీ: షెఫీల్డ్ షీల్డ్ 2020-21 సిరీస్‌లో భాగంగా సౌత్ ఆస్ట్రేలియా, వెస్ట్రన్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. కచ్చితంగా మ్యాచ్ గెలుస్తామని భావించిన జట్టు ఎవరు ఊహించని విధంగా డ్రాతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. సౌత్ ఆస్ట్రేలియా విధించిన 332 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో మూడోరోజు ఆటగ ముగిసే సమయానికి వెస్ట్రన్ ఆస్ట్రేలియా 88 పరుగులకు 4 వికెట్లు కోల్పోయింది. ఆట చివరిరోజైన నాలుగో రోజు మూడు సెషన్ల పాటు ఓపికగా ఆడినా వెస్ట్రన్ ఆస్ట్రేలియా వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. అలా ఆట ఐదు ఓవర్లలో ముగుస్తుందనగా 143 పరుగుల వద్ద 9వ వికెట్ కోల్పోయింది. సౌత్ ఆస్ట్రేలియాకు విజయానికి ఒక వికెట్ అవసరం.. క్రీజులో టెయిలెండర్లు మాత్రమే ఉన్నారు. దీంతో సర్కిల్లోనే దాదాపు 9 మంది ఉన్నారు. ఏకంగా స్లిప్‌లో 6గురు ఫీల్డర్లు ఉన్నారు. 4వ ఓవర్ల పాటు ఓపికగా ఆడిన వెస్ట్రన్ ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ 5 పరుగులు జత చేశారు. ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్‌ను చాడ్ సేయర్స్ వేశాడు. క్రీజులో లియామ్ ఓ కోనర్, లియామ్ గుత్రేయి ఉన్నారు. ఆఖరి బంతిని కోనర్ ఫ్లిక్ చేయగా.. బ్యాట్ ఎడ్జ్ తాకి గాల్లోకి లేచి స్లిప్‌లో పడింది. అప్పటికే ఆరుగురు ఫీల్డర్లు ఉండడంతో క్యాచ్ అని భావించారు. అయితే అనూహ్యంగా ఫీల్డర్ చేతిని తప్పించుకొని బంతి కింద పడింది. అలా మ్యాచ్ డ్రాగా ముగిసింది. దీంతో విజయం చేతికి చిక్కినట్లే చిక్కి చేజారిపోయిందనుకుంటూ సౌత్ ఆస్ట్రేలియా ఆటగాళ్లు నిరాశలో మునిగిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సౌత్ ఆస్ట్రేలియా బ్యాటింగ్ మొదటి ఇన్నింగ్స్: 510/8 డిక్లెర్డ్ రెండో ఇన్నింగ్స్: 230/9 డిక్లెర్డ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియా బ్యాటింగ్ మొదటి ఇన్నింగ్స్: 409/5 డిక్లెర్డ్ రెండో ఇన్నింగ్స్: 148/9 చదవండి: 169 నాటౌట్.. అయినా గెలిపించలేకపోయాడు రెండు రన్స్‌తో డబుల్ సెంచరీ మిస్.. కేకేఆర్‌లో జోష్ One ball remaining. One wicket needed. No.11 on strike Gotta love #SheffieldShield cricket 😊 pic.twitter.com/8HgC2xYPf4 — cricket.com.au (@cricketcomau) February 28, 2021 -
ఆసీస్ మాజీ ఆల్‌రౌండర్ కన్నుమూత
సిడ్నీ: ఆస్ట్రేలియా మాజీ ఆల్ రౌండర్ గ్రేమ్ వాట్సన్(75) కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న గ్రేమ్ వాట్సన్ తుది శ్వాస విడిచిన విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) తన ట్వీటర్ అకౌంట్ ద్వారా తెలిపింది. 1966-72 వరకూ ఆసీస్ క్రికెట్ జట్టులో కొనసాగిన వాట్సన్.. ఐదు టెస్టు మ్యాచ్‌లు, రెండు వన్డేలు ఆడారు. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్, మీడియం పేసర్ అయిన గ్రేమ్ వాట్సన్ 1966-67 సీజన్లో దక్షిణాఫ్రికా పర్యటనతో అంతర్జాతీయ అరంగేట్రం చేశారు. ఆ పర్యటన రెండో టెస్టులో వాట్సన్ హాఫ్ సెంచరీ మెరిశాడు. కాగా, గాయం కారణంగా ఆ తర్వాత టెస్ట్‌కి దూరమయ్యారు. ఇక నాలుగో టెస్టులో వాట్సన్ తన కెరీర్లోనే అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన చేసినప్పటికీ ఆస్ట్రేలియా సిరీస్ కోల్పోయింది. వాట్సన్ తన కెరీర్లో తరుచు గాయాలతోనే సతమతమయ్యేవారు. (ఆత్మహత్య ఆలోచనలో నా భార్య గుర్తొచ్చింది..) ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 4, 674 పరుగులు సాధించిన గ్రేమ్ వాట్సన్.. 186 వికెట్లను తీశారు. తన క్రికెట్ కెరీర్‌ను విక్టోరియా తరఫున ఆరంభించిన వాట్సన్..ఆపై వెస్ట్రన్ ఆస్ట్రేలియాకు మారారు. 1971-72, 1972-73, 1974-75 సీజన్లలో వెస్ట్రన్ ఆస్ట్రేలియా షెఫల్డ్ షీల్డ్ ట్రోఫీలు గెలవడంలో వాట్సన్ కీలక పాత్ర పోషించారు. ఆస్ట్రేలియా రూల్స్ ఫుట్‌బాల్ క్రీడలో కూడా వాట్సన్‌కు ప్రావీణ్యం ఉంది. మెల్బోర్న్ జట్టు తరఫున ఆస్ట్రేలియా రూల్స్ ఫుట్‌బాల్ మ్యాచ్‌లను వాట్సన్ ఆడారు. గ్రేమ్ వాట్సన్ మృతికి ఆసీస్ దిగ్గజ ఆటగాడు ఇయాన్ చాపెల్ సంతాపం వ్యక్తం చేశారు. -
ఇదేమి బ్యాటింగ్‌రా నాయనా..!
-
ఇదేమి బ్యాటింగ్‌రా నాయనా..!
హోబార్ట్: జార్జ్ బెయిలీ.. అంతర్జాతీయ క్రికెట్లోకి దూసుకొచ్చిన అతి కొద్దికాలంలోనే జాతీయ జట్టుకు దూరమయ్యాడు. దాదాపు మూడేళ్ల క్రితం ఆసీస్ తరఫున చివరిసారి ఆడిన బెయిలీ. 2016, డిసెంబర్ నుంచి ఇప్పటివరకూ జాతీయ జట్టుకు మళ్లీ ప్రాతినిథ్యం వహించలేదు. అయినప్పటికీ దేశవాళీ క్రికెట్ ఆడుతూనే ఉన్నాడు బెయిలీ. కాగా, ఇటీవల షెఫీల్డ్ షీల్డ్ ట్రోఫీలో భాగంగా తస్మానియా తరఫున ఆడిన బెయిలీ మరొకసారి వార్తల్లో నిలిచాడు. గురువారం విక్టోరియాతో జరిగిన మ్యాచ్‌లో బెయిలీ తన బ్యాటింగ్ శైలితో హాట్ టాపిక్ అయ్యాడు. తస్మానియా ఇన్నింగ్స్ 25వ ఓవర్లో బెయిలీ మొత్తం వికెట్లను కవర్ చేసి ఆడటం అభిమానుల్లో నవ్వులు పూయించింది. అటు బౌలర్లను, ఇటు చూసే వాళ్లను బెయిలీ తన బ్యాటింగ్ తికమకపెట్టాడు. ఇదేం బ్యాటింగ్‌రా నాయనా అనుకునేంతగా బెయిలీ తన శైలితో మరి కాస్త వినోదాన్ని తీసుకొచ్చాడు. దీనికి సంబంధించి వీడియో వైరల్‌గా మారడంతో క్రికెట్ ఫ్యాన్స్ సెటైర్లు వేస్తున్నారు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 41 పరుగులు చేసిన బెయిలీ.. రెండో ఇన్నింగ్స్‌లో 10 పరుగులు చేశాడు.బెయిలీ ప్రాతినిథ్యం వహించిన తస్మానియా ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. జార్జ్ బెయిలీ.. అంతర్జాతీయ క్రికెట్లోకి దూసుకొచ్చిన అతి కొద్దికాలంలోనే జాతీయ జట్టుకు దూరమయ్యాడు. దాదాపు మూడేళ్ల క్రితం ఆసీస్ తరఫున చివరిసారి ఆడిన బెయిలీ. 2016, డిసెంబర్ నుంచి ఇప్పటివరకూ జాతీయ జట్టుకు మళ్లీ ప్రాతినిథ్యం వహించలేదు. అయినప్పటికీ దేశవాళీ క్రికెట్ ఆడుతూనే ఉన్నాడు బెయిలీ. కాగా, ఇటీవల షెఫీల్డ్ షీల్డ్ ట్రోఫీలో భాగంగా తస్మానియా తరఫున ఆడిన బెయిలీ మరొకసారి వార్తల్లో నిలిచాడు. గురువారం విక్టోరియాతో జరిగిన మ్యాచ్‌లో బెయిలీ తన బ్యాటింగ్ శైలితో హాట్ టాపిక్ అయ్యాడు. It gets more complex every time you watch it 🙈#SheffieldShield #TASvVIC pic.twitter.com/Zi2hh5i3JD — cricket.com.au (@cricketcomau) October 31, 2019 -
గోడకు పంచ్ ఇచ్చి తీవ్రంగా గాయపడ్డ క్రికెటర్
పెర్త్: ఇటీవల ముగిసిన యాషెస్ సిరీస్‌లో భాగంగా చివరి టెస్టులో ఐదు వికెట్లతో సత్తాచాటిన ఆసీస్ ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ తన స్వీయ తప్పిదంతో తీవ్రంగా గాయపడ్డాడు. తన కుడి చేతితో గోడకు పంచ్ ఇచ్చి గాయం బారిన పడ్డాడు. ప్రస్తుతం షెఫిల్డ్ షీల్డ్ టోర్నీలో భాగంగా వెస్ట్రన్ ఆస్ట్రేలియాకు సారథిగా చేస్తున్న మిచెల్ మార్ష్.. పెర్త్‌లో తస్మానియాతో జరిగిన మ్యాచ్ తర్వాత నిరాశకు గురయ్యాడు. ఆ మ్యాచ్‌లో మిచెల్ మార్ష్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. జాక్సన్ బర్డ్ బౌలింగ్‌లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. కాగా, ఆ మ్యాచ్ డ్రాగా ముగియడంతో కలత చెందిన మార్ష్ తన చేతిలో డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్న గోడను గట్టిగా కొట్టాడు. అనంతరం గాయంతో విలవిల్లాడిపోయాడు. అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. ఈ క్రమంలోనే అతని చేతికి పలు స్కానింగ్‌లు చేసిన తర్వాత మణికట్టు చిట్లినట్లు వైద్యులు తేల్చారు. దాంతో అతను ఫెఫిల్డ్ షీల్డ్ టోర్నీలో కొన్ని మ్యాచ్‌లకు దూరం అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ‘ మిచెల్ మార్ష్ చేతికి తీవ్ర గాయమైంది. అతని కుడిచేయి నొప్పి ఇంకా బాధిస్తుంది. ఈ టోర్నీలో మార్ష్ ఆడతాడా..లేదా అంటే వేచిచూడాల్సిందే. మార్ష్ గాయంపై స్పష్టత రావాలంటే మరికొన్ని రోజులు ఆగాలి’ అని అతని జట్టు ఓ ప్రకటనలో పేర్కొంది. తరచుగా గాయాల బారిన పడుతూ ఆసీస్ జట్టులో చోటు దక్కించుకోవడంలో ఎక్కువగా విఫలమవుతున్న మార్ష్.. ఇలా తన తప్పిదం కారణంగా గాయం చేసుకోవడమే విడ్డూరంగా ఉంది. -
అదృష్టం అడ్డం తిరిగితే..
-
దురదృష్టమంటే నీదే నాయనా?
ఏ ఆటలోనైనా అదృష్టమనేది ముఖ్య భూమిక పోషిస్తుంది. ముఖ్యంగా క్రికెట్లో అంపైర్ల తప్పిదాలు, క్యాచ్ వదిలేయడం, రనౌట్ మిస్ చేయడం ఇలాంటివి బ్యాట్స్‌మెన్ పాలిట ఒక్కోసారి వరాలుగా మారుతాయి. అలా ఆటగాళ్లు ఆ అదృష్టాన్ని అందిపుచ్చుకొని భారీ స్కోర్లు సాధిస్తారు. అయితే కొన్ని సార్లు దురదృష్టం వెంటాడి బ్యాట్స్‌మన్ ఔటవ్వడం కూడా చూస్తుంటాం. ప్రస్తుతం అదృష్టం అడ్డం తిరిగితే అరటి పండు తిన్నా పన్ను విరుగుతుందన్న సామెత విక్టోరియా బ్యాట్స్‌మన్ విల్ పుకౌస్సీకి వర్తిస్తుంది. మరో 18 పరుగులు చేస్తే సెంచరీ సాధిస్తాడునుకున్న తరుణంలో విల్ దురదృష్టవశాత్తు ఔటయ్యాడు. ఆసీస్‌లో జరుగుతున్న షెఫీల్డ్ షీల్డ్ ట్రోఫీలో భాగంగా సౌత్ ఆస్ట్రేలియా- విక్టోరియా జట్లు తలపడుతున్నాయి. ఈ తరుణంలో సౌత్ ఆస్ట్రేలియా పార్ట్ టైమ్ స్పిన్నర్ హెడ్ వేసిన బంతిని షార్ట్ లెగ్‌లో ఆడే ప్రయత్నం చేశాడు. అయితే బంతి అనూహ్యంగా బౌన్స్ అవడంతో అక్కడ ఫీల్డింగ్ చేస్తున ఫీల్డర్ కాలికి తగిలి కీపర్ చేతుల్లోకి వెళ్లింది. దీంతో నిరాశగా విల్ క్రీజు వదిలి వెళ్లాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ హల్ చేస్తోంది. ‘దురదృష్టమంటే నీదే నాయనా?’ అంటూ దీనిపై నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. (వాట్ ఏ క్యాచ్.. ఇది టీమ్ వర్క్ అంటే!) -
వాట్ ఏ క్యాచ్.. ఇది టీమ్ వర్క్ అంటే!
-
వాట్ ఏ క్యాచ్.. ఇది టీమ్ వర్క్ అంటే!
హోబర్ట్ : క్రికెట్లో ఇప్పటివరకు బౌండరీ లైన్ వద్దనే ఫీల్డర్లు కళ్లు చెదిరే రీతిలో క్యాచ్ అందుకోవడం చూసుంటాం. కానీ స్లిప్‌లో మిరాకిల్ క్యాచ్‌లు చూడటం చాలా అరుదు. ఎందుకంటే అనూహ్యంగా వచ్చే బంతులను అందుకోవాలంటే.. ఫీల్డర్లు ఎంతో చురుకుగా, చాకచక్యంగా ఉండాలి. దీంతో బౌండరీల వద్ద కంటే స్లిప్‌లో ఫీల్డిండ్ చేయడమే యమా డేంజరు. అయితే స్లిప్‌లో అనూహ్య క్యాచ్‌లు అందుకొని జట్టుకు విజయాలు అందించిన ఆటగాళ్లు ఎందరో ఉన్నారు. తాజాగా ఆస్ట్రేలియా క్రికెటర్ మాథ్యూ వేడ్ స్లిప్‌లో పట్టిన క్యాచ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన ప్రతీ ఒక్కరూ వేడ్‌ను, ఆ జట్టు ఆటగాళ్లను తెగ మెచ్చుకుంటున్నారు. టీమ్ వర్క్ అంటే ఇది అని కామెంట్ చేస్తున్నారు. ఆసీస్‌లో జరుగుతున్న షెఫీల్డ్ షీల్డ్ ట్రోఫీలో భాగంగా న్యూసౌత్ వేల్స్, టాస్మానియా మధ్య జరిగిన మ్యాచ్‌లో మాథ్యూ వేడ్ పట్టిన క్యాచ్ క్రికెట్లోని అత్యుత్తమ క్యాచ్లలో ఒకటిగా విశ్లేషకులు అభిప్రాయపడతున్నారు. దాదాపు నేలపాలైందనుకున్న క్యాచ్‌ను వేడ్ ఎంతో చాకచక్యంగా అందుకున్నాడు. జాక్సన్ బర్డ్ బౌలింగ్‌లో న్యూ సౌత్ వేల్స్ బ్యాట్స్‌మన్ డేనియల్ హ్యూస్ ఇచ్చిన క్యాచ్‌ను రెండో స్లిప్‌లో ఉన్న అలెక్స్ డూలాన్ వదిలేశాడు. ఆ బాల్ నేలను తాకుతుందనగా.. క్షణాల్లో తన ఎడమవైపు డైవ్ చేసి దానిని అందుకున్నాడు మాథ్యూ వేడ్. సహజంగా వికెట్ కీపర్ అయిన వేడ్.. ఆ స్కిల్స్‌ను ఉపోయోగించి క్యాచ్ అందుకున్నాడు. -
ఇలాంటి ఔట్ ఎప్పుడైనా చూశారా?
సిడ్నీ: క్రికెట్లో బ్యాట్స్‌మన్ ఔట్ కావడమనేది సర్వసాధారణం. మరి బ్యాట్స్‌మన్ కొట్టిన బంతి ఫీల్డర్ హెల్మెట్‌కు తగిలి, అది కాస్తా పైకి లేచి బౌలర్ చేతిలో పడితే.. అక్కడ బ్యాట్స్‌మన్‌ను దురదృష్టం వెంటాడిందనే చెప్పాలి. ఈ తరహాలో బ్యాట్స్‌మన్ ఔటైన ఘటన ఆస్ట్రేలియా క్రికెట్లో చోటు చేసుకుంది. షెఫల్డ్ షీల్డ్ టోర్నీలో భాగంగా న్యూసౌత్‌వేల్స్-వెస్ట్రన్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగింది. ఇక్కడ వెస్ట్రన్ ఆస్ట్రేలియా తరఫున ఆడుతున్న హిల్టన్ కార్ట్‌రైట్ రెండో ఇన్నింగ్స్‌లో న్యూసౌత్‌వేల్స్ లెగ్ స్పిన్నర్ జాసన్ సంగా వేసిన బంతిని హిట్ చేసేందుకు ప్రయత్నించాడు. అప్పటివరకూ 45 బంతులాడి 3 పరుగులు మాత్రమే చేసిన కార్ట్‌రైట్ కాస్త దూకుడు పెంచే క్రమంలో భారీగా షాట్ ఆడబోయాడు. అయితే అది కాస్తా షార్ట్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న నిక్ లార్కిన్ హెల్మెట్‌కు తగిలి అంతే వేగంతో పైకి లేచింది. గాల్లోకి లేచిన ఆ బంతిని బౌలర్ సంగా క్యాచ్ పట్టుకోవడంతో కార్ట్‌రైట్ వెనుదిరిగాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. Of all the ways to get out 🙈#SheffieldShield | #NSWvWA pic.twitter.com/iTLUxQ3CfF — #7Cricket (@7Cricket) 26 February 2019