జార్జ్ బెయిలీ.. అంతర్జాతీయ క్రికెట్‌లోకి దూసుకొచ్చిన అతి కొద్దికాలంలోనే జాతీయ జట్టుకు దూరమయ్యాడు. దాదాపు మూడేళ్ల క్రితం ఆసీస్ తరఫున చివరిసారి ఆడిన బెయిలీ. 2016, డిసెంబర్ నుంచి ఇప్పటివరకూ జాతీయ జట్టుకు మళ్లీ ప్రాతినిథ్యం వహించలేదు. అయినప్పటికీ దేశవాళీ క్రికెట్ ఆడుతూనే ఉన్నాడు బెయిలీ. కాగా, ఇటీవల షెఫీల్డ్ షీల్డ్ ట్రోఫీలో భాగంగా తస్మానియా తరఫున ఆడిన బెయిలీ మరొకసారి వార్తల్లో నిలిచాడు. గురువారం విక్టోరియాతో జరిగిన మ్యాచ్‌లో బెయిలీ తన బ్యాటింగ్ శైలితో హాట్ టాపిక్ అయ్యాడు.