George Bailey
-
వార్నర్‌ను పరిగణలోకి తీసుకోం..!
అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగాలనుకున్న డేవిడ్ వార్నర్ ఆశలపై ఆస్ట్రేలియా చీఫ్ సెలెక్టర్ జార్జ్ బెయిలీ నీళ్లు చల్లాడు. వచ్చే ఏడాది పాక్ వేదికగా జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి వార్నర్‌ను పరిగణలోకి తీసుకోవడం లేదని వెల్లడించాడు. వార్నర్ ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్‌కప్ 2024తో క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలికాడు. అనంతరం కొద్ది రోజుల్లోనే మనసు మార్చుకుని ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి అందుబాటులో ఉంటానని ప్రకటించాడు. వార్నర్ ప్రకటనపై తాజాగా జార్జ్ బెయిలీ స్పందించాడు. తమ ఫ్యూచర్ ప్లాన్స్‌లో వార్నర్ లేడని స్పష్టం చేశాడు. తమకున్న సమాచారం మేరకు వార్నర్ మూడు ఫార్మాట్ల నుంచి రిటైరయ్యాడని తెలిపాడు. వార్నర్ ఎప్పుడు జోక్ చేస్తాడో.. ఎప్పుడు సీరియస్‌గా ఉంటాడో తెలీదని అన్నాడు. వార్నర్ కెరీర్ అద్బుతంగా సాగిందని గుర్తు చేశాడు. తమ ప్రణాళికల్లో కొత్త ఆటగాళ్లు ఉన్నారని పేర్కొన్నాడు. బెయిలీ మాటలను బట్టి చూస్తే వార్నర్ తిరిగి జట్టులోకి రావాలనుకున్నా అవకాశం లేదన్న విషయం స్పష్టమవుతుంది.ఇదిలా ఉంటే, టీ20 వరల్డ్‌కప్ 2024లో సూపర్-8 దశలోనే నిష్క్రమించిన ఆస్ట్రేలియా.. త్వరలో ఇంగ్లండ్, స్కాట్లాండ్తో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం సన్నద్దమవుతుంది. ఈ రెండు సిరీస్‌లకు ఆసీస్ సెలెక్టర్లు ఇవాళ (జులై 15) జట్లను ప్రకటించారు. ఆస్ట్రేలియా తొలుత స్కాట్లాండ్తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ (సెప్టెంబర్ 4, 6, 7) ఆడనుంది. అనంతరం సెప్టెంబర్ 11 నుంచి ఇంగ్లండ్ పర్యటన మొదలవుతుంది. ఈ పర్యటనలో ఆసీస్ మూడు టీ20లు (సెప్టెబంర్ 11, 13, 15).. ఐదు వన్డేలు (సెప్టెంబర్ 19, 21, 24, 27, 29) ఆడనుంది. స్కాట్లాండ్, ఇంగ్లండ్‌తో టీ20లకు ఆసీస్ జట్టు..మిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్లెట్, కూపర్ కొన్నోలీ, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్, కామెరాన్ గ్రీన్, ఆరోన్ హార్డీ, జోష్ హాజిల్‌వుడ్, ట్రవిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, స్పెన్సర్ జాన్సన్, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా.ఇంగ్లండ్‌తో వన్డేలకు ఆస్ట్రేలియా జట్టు..మిచెల్ మార్ష్ (కెప్టెన్), సీన్ అబాట్, అలెక్స్ కారీ, నాథన్ ఎల్లిస్, జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్, ఆరోన్ హార్డీ, కామెరాన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, ట్రవిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మార్నస్ లాబూషేన్, గ్లెన్ మాక్స్వెల్, మాథ్యూ షార్ట్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా. -
T20 World Cup 2024: ఫీల్డర్‌గా మారిన ఆసీస్ చీఫ్ సెలెక్టర్
ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు చీఫ్ సెలెక్టర్ జార్జ్ బెయిలీ ఫీల్డర్ అవతారమెత్తాడు. నమీబియాతో జరిగిన టీ20 వరల్డ్‌కప్ 2024 వార్మప్ మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. రెగ్యులర్ ఆటగాళ్లు అందుబాటులో లేకపోవడంతో బెయిలీ బరిలోకి దిగాల్సి వచ్చింది. ఐపీఎల్ విధుల కారణంగా ఆరుగురు ఆసీస్ ఆటగాళ్లు (కమిన్స్, స్టార్క్, హెడ్, మ్యాక్స్‌వెల్, గ్రీన్, స్టోయినిస్) మ్యాచ్ సమయానికి అందుబాటులోకి రాలేకపోయారు. అతి త్వరలో వీరు జట్టుతో కలుస్తారని సమాచారం. నబీమియాతో మ్యాచ్‌లో బెయిలీతో పాటు ఆసీస్ ఫీల్డింగ్ కోచ్ ఆండ్రీ బోరోవెక్ కూడా బరిలోకి దిగాల్సి వచ్చింది. వీరిద్దరే కాక ఆసీస్ బ్యాటింగ్ కోచ్ బ్రాడ్ హాడ్జ్, హెడ్ కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ కూడా కాసేపు ఫీల్డింగ్ చేశారు. మిచెల్ మార్ష్, హాజిల్‌వుడ్ విరామం తీసుకున్న సమయంలో వీరు బరిలోకి దిగారు.ఇదిలా ఉంటే, ఆటగాళ్ల కొరత ఉన్నా నమీబియాతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేయగా.. ఆస్ట్రేలియా కేవలం 10 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఆసీస్ తరఫున తొలుత హాజిల్‌వుడ్.. ఆతర్వాత డేవిడ్ వార్నర్ రెచ్చిపోయారు. హాజిల్‌వుడ్ నాలుగు ఓవర్లు బౌల్ చేసి కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టగా.. వార్నర్ 21 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో అజేయమైన 54 పరుగులు చేశాడు. హాజిల్‌వుడ్ తన నాలుగు ఓవర్ల స్పెల్‌లో ఏకంగా మూడు మెయిడిన్ ఓవర్లు వేయడం విశేషం. -
ఇదేమి బ్యాటింగ్‌రా నాయనా..!
-
ఇదేమి బ్యాటింగ్‌రా నాయనా..!
హోబార్ట్: జార్జ్ బెయిలీ.. అంతర్జాతీయ క్రికెట్లోకి దూసుకొచ్చిన అతి కొద్దికాలంలోనే జాతీయ జట్టుకు దూరమయ్యాడు. దాదాపు మూడేళ్ల క్రితం ఆసీస్ తరఫున చివరిసారి ఆడిన బెయిలీ. 2016, డిసెంబర్ నుంచి ఇప్పటివరకూ జాతీయ జట్టుకు మళ్లీ ప్రాతినిథ్యం వహించలేదు. అయినప్పటికీ దేశవాళీ క్రికెట్ ఆడుతూనే ఉన్నాడు బెయిలీ. కాగా, ఇటీవల షెఫీల్డ్ షీల్డ్ ట్రోఫీలో భాగంగా తస్మానియా తరఫున ఆడిన బెయిలీ మరొకసారి వార్తల్లో నిలిచాడు. గురువారం విక్టోరియాతో జరిగిన మ్యాచ్‌లో బెయిలీ తన బ్యాటింగ్ శైలితో హాట్ టాపిక్ అయ్యాడు. తస్మానియా ఇన్నింగ్స్ 25వ ఓవర్లో బెయిలీ మొత్తం వికెట్లను కవర్ చేసి ఆడటం అభిమానుల్లో నవ్వులు పూయించింది. అటు బౌలర్లను, ఇటు చూసే వాళ్లను బెయిలీ తన బ్యాటింగ్ తికమకపెట్టాడు. ఇదేం బ్యాటింగ్‌రా నాయనా అనుకునేంతగా బెయిలీ తన శైలితో మరి కాస్త వినోదాన్ని తీసుకొచ్చాడు. దీనికి సంబంధించి వీడియో వైరల్‌గా మారడంతో క్రికెట్ ఫ్యాన్స్ సెటైర్లు వేస్తున్నారు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 41 పరుగులు చేసిన బెయిలీ.. రెండో ఇన్నింగ్స్‌లో 10 పరుగులు చేశాడు.బెయిలీ ప్రాతినిథ్యం వహించిన తస్మానియా ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. జార్జ్ బెయిలీ.. అంతర్జాతీయ క్రికెట్లోకి దూసుకొచ్చిన అతి కొద్దికాలంలోనే జాతీయ జట్టుకు దూరమయ్యాడు. దాదాపు మూడేళ్ల క్రితం ఆసీస్ తరఫున చివరిసారి ఆడిన బెయిలీ. 2016, డిసెంబర్ నుంచి ఇప్పటివరకూ జాతీయ జట్టుకు మళ్లీ ప్రాతినిథ్యం వహించలేదు. అయినప్పటికీ దేశవాళీ క్రికెట్ ఆడుతూనే ఉన్నాడు బెయిలీ. కాగా, ఇటీవల షెఫీల్డ్ షీల్డ్ ట్రోఫీలో భాగంగా తస్మానియా తరఫున ఆడిన బెయిలీ మరొకసారి వార్తల్లో నిలిచాడు. గురువారం విక్టోరియాతో జరిగిన మ్యాచ్‌లో బెయిలీ తన బ్యాటింగ్ శైలితో హాట్ టాపిక్ అయ్యాడు. It gets more complex every time you watch it 🙈#SheffieldShield #TASvVIC pic.twitter.com/Zi2hh5i3JD — cricket.com.au (@cricketcomau) October 31, 2019 -
ఇలా కూడా బ్యాటింగ్ చేస్తారా?
కాన్బెర్రా: తమ టెక్నిక్‌ను మెరుగుపరుచుకునే క్రమంలో క్రికెటర్లు ఫుట్‌వర్క్‌ను సరిచేసుకోవడమనేది సాధారణ విషయమే. తన ఫుట్‌వర్క్‌ను గతం కంటే భిన్నంగా సవరించుకున్నఆసీస్ క్రికెటర్ జార్జ్ బెయిలీ ఇప్పుడు అందర్నీ సర్ప్రైజ్ చేస్తున్నాడు. ఇలా కూడా బ్యాటింగ్ చేస్తారా అనే చందంగా తన బ్యాటింగ్ శైలిని మార్చుకున్నాడు బెయిలీ. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో దక్షిణాఫ్రికా పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా బుధవారం ప్రెసిడెంట్ ఎలెవన్-దక్షిణాఫ్రికాల మధ్య ఒక రోజు ప్రాక్టీస్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌కు ప్రెసిడెంట్ ఎలెవన్‌కు బెయిలీ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇదిలా ఉంచితే, ఇక్కడ తన బ్యాటింగ్ స్టైల్‌తో అందర్నీ అలరించాడు బెయిలీ. కుడిచేత వాటం బ్యాట్స్‌మన్ అయిన బెయిలీ.. తన కుడి కాలిని లెగ్ వికెట్‌కు బాగా బయటకు చాపుతూ బ్యాటింగ్ చేయడం అభిమానుల్లో నవ్వులు పూయించింది. ప్రధానంగా పేస్ బౌలింగ్‌ను ఎదుర్కొనేటప్పుడు బెయిలీ ఈ తరహాలో బ్యాటింగ్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఈ మ్యాచ్‌లో అజేయంగా 51 పరుగులు చేసిన బెయిలీ.. ప్రెసిడెంట్ ఎలెవన్ విజయంలోముఖ్య భూమిక పోషించాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 42 ఓవర్లలో 173 పరుగులు చేయగా, ఆపై ప్రెసిడెంట్ ఎలెవన్ 36.3 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని ఛేదించింది. బెయిలీ హాఫ్ సెంచరీకి తోడుగా జాస్ ఫిలిప్పి(57) అర్థ శతకం సాధించాడు. -
ఫించ్, బెయిలీలపై వేటు
మెల్బోర్న్:త్వరలో పాకిస్తాన్ తో జరిగే ఐదు వన్డేల సిరీస్ లో పాల్గొనే ఆస్ట్రేలియా జట్టు నుంచి స్టార్ ఆటగాళ్లు ఆరోన్ పింఛ్, జార్జ్ బెయిలీలను తొలగించారు. ఈ ఇద్దరికీ ఆసీస్ వన్డే జట్టులో చోటు దక్కుతుందని తొలుత భావించినా.. అనూహ్యంగా వారిపై వేటు వేస్తూ క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత ఆసీస్ జట్టులో యువ క్రికెటర్ల నుంచి పోటీ ఎక్కువగా ఉండటంతో పింఛ్, బెయిలీలను తప్పించక తప్పలేదు. అయితే క్రిస్ లయన్ తొలిసారి జాతీయ జట్టులో చోటు కల్పిస్తూ సీఏ సెలక్టర్లు నిర్ణయం తీసుకున్నారు. బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్)లో ఆకట్టుకోవడంతో క్రిస్ లయన్ కు అవకాశం దక్కింది. ఈ మేరకు 15 సభ్యులతో కూడిన జట్టును ఆసీస్ శనివారం ప్రకటించింది. ఆసీస్ వన్డే జట్టు స్టీవ్ స్మిత్(కెప్టెన్), డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖాజా, మిచెల్ మార్ష్, ట్రావిస్ హెడ్, క్రిస్ లయన్, జేమ్స్ ఫల్కనర్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మాథ్యూవేడ్, మిచెల్ స్టార్క్, హజల్ వుడ్, పాట్ కమ్మిన్స్, ఆడమ్ జంపా, బిలీ స్టాన్లేక్ -
బౌన్సర్ దెబ్బకు హెల్మెట్ ఊడిపడింది!
న్యూఢిల్లీ: పుణెతో ఢిల్లీ డేర్ డేవిల్స్ మ్యాచ్ సందర్భంగా ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ జార్జ్ బెయిలీ ఒకింత భయానక అనుభవాన్ని ఎదుర్కొన్నాడు. రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ తరఫున బ్యాటింగ్ కు దిగిన బెయిలీని స్వదేశం ఆటగాడైన నాథన్ కౌల్టర్ నీల్ వేసిన బౌన్సర్ భయపెట్టింది. ఏడో ఓవర్లో కౌల్టర్ నీల్ వేసిన బౌన్సర్ బెయిలీ బ్యాటును తప్పించుకొని మరీ అతని హెల్మెట్‌ను బలంగా ఢీకొట్టింది. దీంతో అమాంతం తల నుంచి హెల్మెట్ ఊడి గాల్లోకి ఎగిరింది. ఈ ఘటనతో బెయిలీ బిత్తరపోయాడు. షాక్ తిన్న ఢిల్లీ డేర్ డేవిల్స్ ఫీల్డర్లు, బౌలరు బెయిలీ వద్దకు ఉరికొచ్చి.. అతనికి ఏమైనా అయిందా అని ఆరా తీశారు. ప్రమాదకరమైన బౌన్సర్ దూసుకొచ్చినప్పటికీ అదృష్టవశాత్తు అతనికి ఏం కాలేదు. యథాతథంగా బెయిలీ బ్యాటింగ్ కొనసాగించాడు. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఢిల్లీ డేర్ డేవిల్స్కు షాకిస్తూ.. పుణె జట్టు ఘన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. OUCH! A rapid Coulter-Nile bouncer sends George Bailey's helmet flying in #IPL2016 https://t.co/ph9pho4HVm pic.twitter.com/TAUWHkkUfk — ABC Grandstand (@abcgrandstand) 18 May 2016 -
'యువ పేసర్ బరిందర్ బౌలింగ్ భేష్'
పెర్త్: ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్, టి-20 కెప్టెన్ జార్జి బెయిలీ.. భారత యువ పేసర్ బరిందర్ను ప్రశంసించాడు. బరిందర్ పేస్ బౌలింగ్ బాగుందని, అతనికి ఉజ్వల భవిష్యత్ ఉందని బెయిలీ అన్నాడు. మంగళవారం ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా తరపున బరిందర్ అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్ వేదిక పెర్త్ వాకా స్టేడియం బ్యాటింగ్‌కు అనుకూలించినా బరిందర్ తన తొలి వన్డే మ్యాచ్‌లోనే సత్తాచాటాడు. బరిందర్ మూడు వికెట్లు పడగొట్టగా, ఇతర భారత బౌలర్లు భువనేశ్వర్, ఉమేష్, జడేజా ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. ఈ మ్యాచ్‌లో భారత్ భారీ స్కోరు (309/3) చేసినా.. ఆస్ట్రేలియా విజయం సాధించింది. రోహిత్ శర్మ (171) అజేయ భారీ సెంచరీ వృథా కాగా, ఆసీస్ ఆటగాళ్లు స్మిత్, బెయిలీ శతకాలతో తమ జట్టును గెలిపించారు. మ్యాచ్ అనంతరం బెయిలీ.. బరిందర్ బౌలింగ్‌ను మెచ్చుకున్నాడు. టీమిండియా కెప్టెన్ ధోనీ మాట్లాడుతూ.. పెర్త్ పిచ్‌పై 309 మంచి స్కోరు అయినా, తాము మరింత మెరుగ్గా ఆడాల్సిందని అన్నాడు. -
కెప్టెన్సీపై నమ్మకం లేదు
మెల్ బోర్న్:ఆస్ట్రేలియా క్రికెట్ జట్టులో అడపా దడపా స్థానం సంపాదించుకుంటున్న జార్జ్ బెయిలీ తన మనసులోని మాటను తాజాగా బయటపెట్టాడు. ఆస్ట్రేలియా జట్టుకు తాను పూర్తి స్థాయి కెప్టెన్సీ బాధ్యతలు చేపడతానని అనుకోవడం లేదని స్పష్టం చేశాడు. ఈ వరల్డ్ కప్ లో ఇంగ్లండ్ పై తాత్కాలిక కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టిన బెయిలీ హాఫ్ సెంచరీ సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అనంతరం మైకేల్ క్లార్క్ జట్టు పగ్గాలు చేపట్టడంతో బెయిలీకి ఆ తరువాత జట్టులో స్థానం దక్కలేదు. గత రెండు సంవత్సరాల నుంచి జట్టులోకి వస్తూ పోతూ ఉన్న బెయిలీ.. క్లార్క్ వన్డేలకు వీడ్కోలు చెప్పిన అనంతరం ఆసీస్ కెప్టెన్సీ బాధ్యతలు చేపడతారని అంతా భావించారు. కానీ అనూహ్యంగా స్టీవ్ స్మిత్ కు ఆసీస్ పగ్గాలు అప్పజెప్పడంతో బెయిల్ స్పందించాడు. ఇప్పటికీ వన్డేల్లో సుస్థిర స్థానాన్ని ఏర్పరుచుకోని బెయిల్ తాను ఆసీస్ కు రెగ్యూలర్ కెప్టెన్ గా ఎంపిక అవుతానని అనుకోవడం లేదని తెలిపాడు. -
కెప్టెన్సీకి బెయిలీ గుడ్ బై
మెల్బోర్న్: ఆస్ట్రేలియా టి-20 జట్టు కెప్టెన్ పదవి నుంచి జార్జి బెయిలీ వైదొలిగాడు. టెస్టు కెరీర్‌పై పూర్తిగా దృష్టిసారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు బెయిలీ చెప్పాడు. 2012లో కెప్టెన్‌గా నియమితుడైన బెయిలీ 27 మ్యాచ్‌లకు సారథ్యం వహించాడు. బెయిలీ రాజీనామాను క్రికెట్ ఆస్ట్రేలియా ధ్రువీకరించింది. 2016లో జరిగే ప్రపంచ కప్‌కు జట్టును పటిష్టం చేయడంపై దృష్టిసారిస్తోంది. ఆసీస్ పొట్టి ఫార్మాట్‌కు కొత్త కెప్టెన్‌ను ఎంపిక చేయాల్సివుంది. బెయిలీ స్థానంలో అరోన్ ఫించ్‌ను నియమించే అవకాశముంది. -
రాత మారుతుందా?
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఓనర్: ప్రీతి జింటా, నెస్వాడియా, ఒబెరాయ్ గ్రూప్ కెప్టెన్: జార్జ్ బెయిలీ కోచ్: సంజయ్ బంగర్ ఫీల్డింగ్ కోచ్: ఆర్. శ్రీధర్ (హైదరాబాద్) గత ఉత్తమ ప్రదర్శన: సెమీఫైనల్ (2008) కీలక ఆటగాళ్లు: బెయిలీ, సెహ్వాగ్, మార్ష్, మిషెల్ జాన్సన్, మాక్స్వెల్, మిల్లర్ ఐపీఎల్ తొలి సీజన్లో సెమీస్‌కు చేరిన జట్టు... ఆ తర్వాతి సీజన్లలో కనీసం లీగ్ స్టేజ్ కూడా దాటలేకపోయిందనే విమర్శలను మూటగట్టుకున్నా పంజాబ్ కింగ్స్ ఎలెవన్ ఈసారి భారీ ఆశలే పెట్టుకుంది. వీరేంద్ర సెహ్వాగ్‌లాంటి డాషింగ్ బ్యాట్స్‌మన్‌ను వేలంలో తీసుకోవడంతో కనీసం ఈసారైనా రాత మార్చుకోవాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. జట్టులో భారీ హిట్టర్లకు కొదువలేకున్నా... సమష్టిగా ఆడటంలో ఆటగాళ్లు విఫలమవుతున్నారు. దీంతో కచ్చితంగా గెలుస్తామనుకున్న మ్యాచ్‌ల్లోనూ చతికిలపడుతున్నారు. గత ఐదు సీజన్లలో యువరాజ్, జయవర్ధనే, గిల్‌క్రిస్ట్‌లాంటి మేటి ఆటగాళ్లు నాయకత్వం వహించినా... జట్టును విజయపథాన నడిపించలేకపోయారు. అయితే ఈసారి ఆస్ట్రేలియా టి20 జట్టు సారథి జార్జి బెయిలీ పంజాబ్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో కంగారూల జట్టుకు నాయకత్వం వహించిన అనుభవంతో పాటు బ్యాటింగ్‌లోనూ బెయిలీ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. డేవిడ్ మిల్లర్ (దక్షిణాఫ్రికా), మానన్ వోహ్రాలను రిటైన్ చేసుకున్నా... కీలక ఆటగాళ్ల కోసం పంజాబ్ భారీ మొత్తంలో వెచ్చించింది. జాన్సన్ (రూ. 6.5 కోట్లు), మాక్స్వెల్ (రూ. 6 కోట్లు), బెయిలీ (రూ. 3.25 కోట్లు), సెహ్వాగ్ (రూ. 3.2 కోట్లు)లపైనే జట్టు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఆధారపడి ఉన్నాయి. దేశవాళీ ఆల్‌రౌండర్ రిషి ధావన్‌కు రూ. 3 కోట్లు పెట్టడం ఆసక్తికరం. బలాలు.. తమదైన రోజున ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించే ఆల్‌రౌండర్లు ఉండటం. మాక్స్వెల్, సెహ్వాగ్ ప్రమాదకర బ్యాట్స్‌మెన్. యాషెస్ హీరో మిషెల్ జాన్సన్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇతర బౌలర్లు రాణిస్తే పంజాబ్ విజయాన్ని అడ్డుకోవడం సులువు కాదు. బలహీనతలు... బ్యాటింగ్‌లో నిలకడలేమి. ఒకటి రెండు ఓవర్లలో భారీ పరుగులు చేసినా... ఆ తర్వాత టపటపా వికెట్లు కోల్పోవడం. దేశవాళీ క్రికెటర్లలో హిట్టర్లు లేకపోవడం. విదేశీ ఆటగాళ్లపై ఎక్కువగా ఆధారపడాల్సి రావడం బలహీనతలు. ఫీల్డింగ్ లోపాలను సవరించుకోవాల్సి ఉంది. జట్టు: భారత్‌కు ఆడిన క్రికెటర్ల్లు: సెహ్వాగ్, పుజారా, సాహా, బాలాజీ, మురళీ కార్తీక్, పర్వీందర్ అవానా. విదేశీ క్రికెటర్లు: బెయిలీ, జాన్సన్, మార్ష్, మాక్స్వెల్ (ఆస్ట్రేలియా), డేవిడ్ మిల్లర్, హెండ్రిక్స్ (దక్షిణాఫ్రికా) , తిసారా పెరీరా (శ్రీలంక). భారత దేశవాళీ క్రికెటర్లు: అనురీత్ సింగ్, రిషి ధావన్, గురుకీరత్ సింగ్, కరణ్వీర్ సింగ్, మన్దీప్ సింగ్, అక్షర్ పటేల్, సందీప్ వర్మ, శివం శర్మ, శార్దుల్ ఠాకూర్, మన్నన్ వోహ్రా. -
లారా రికార్డును సమం చేసిన బెయిలీ
పెర్త్: టెస్టుల్లో ఒక ఓవర్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డును ఆస్ట్రేలియా ఆటగాడు జార్జి బెయిలీ సమం చేశాడు. యాషెస్ సిరిస్‌లో భాగంగా మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో అతడీ ఘనత సాధించాడు. ఆట నాలుగు రోజు ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ డిక్లేర్ చేసే ముందు ఇంగ్లండ్ బౌలర్ జిమ్మీ ఆండర్సన్ వేసిన ఓవర్లో 28 పరుగులు రాబట్టాడు. మూడు సిక్సర్లు, రెండు ఫోర్లు బాదాడు. వన్డే ఆటగాడిగా ముద్రపడిన బెయిలీ మూడో టెస్టులోనే ఈ ఫీట్ సాధించాడు. ఇప్పటివరకు ఈ రికార్డు వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం బ్రియన్ లారా పేరు మీద కొనసాగుతోంది. జోహెన్నెస్‌బర్గ్‌లో 2003లో దక్షిణాఫ్రికాపై ఈ ఘనత సాధించాడు. రాబిన్ పీటర్సన్ వేసిన ఓవర్లో 28 పరుగులు సాధించాడు. -
సచిన్ స్థానాన్ని రోహిత్ భర్తీ చేస్తాడు: బెయిలీ
బెంగళూరు: టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ సూపర్ ఇన్నింగ్స్‌పై ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కెప్టెన్ జార్జి బెయిలీ ప్రశంసలు కురిపించాడు. భారత జట్టులో సచిన్ టెండూల్కర్ లేని లోటును అతడు పూడ్చగలడని పేర్కొన్నాడు. మాస్టర్ బ్లాస్టర్ రిటైర్మెంట్తో ఖాళీ అయిన స్థానాన్ని రోహిత్ భర్తీ చేస్తాగనే విశ్వాసాన్ని బెయిలీ వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియాతో శనివారం జరిగిన చివరి వన్డేలో రోహిత్ శర్మ డబుల్ సెంచరీ సాధించాడు. 16 సిక్సర్లు కొట్టి అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. రోహిత్ శర్మ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడని మ్యాచ్ ముగిసిన తర్వాత బెయిలీ అన్నాడు. ఓపెనర్‌గా సచిన్ స్థానాన్ని అతడు భర్తీ చేయగలడని పేర్కొన్నాడు. నెమ్మదిగా ఇన్నింగ్స్ ఆరంభించి విరుచుపడిన రోహిత్ ఆటతీరు తననెంతో ఆకట్టుకుందని తెలిపాడు. చూడ చక్కని షాట్లతో కట్టిపడేశాడని కితాబిచ్చాడు. -
జైపూర్ వన్డేలో ధోనీసేనకు చుక్కలు
-
తొలి వన్డేలో భారత్ ఓటమి
బ్యాటింగ్‌లో ఎలాంటి మెరుపులు లేవు. దూకుడు అస్సలే కనిపించలేదు. గతంలో అనేక సార్లు అలవోకగా ఛేదించిన లక్ష్యానికి కనీసం చేరువలోకి కూడా వెళ్లలేక ధోని సేన చేతులెత్తేసింది. మితిమీరిన విశ్వాసమో, ప్రత్యర్థిని తక్కువగా అంచనా వేయడమో కానీ తొలి వన్డేలో భారత్ బోర్లా పడింది. టెస్టుల్లో ఎంతటి చెత్త ప్రదర్శన కనబర్చినా... వన్డేల్లో మాత్రం భారత గడ్డపై ఉన్న మెరుగైన రికార్డును నిలబెట్టుకుంటూ సిరీస్‌లో ఆస్ట్రేలియా బోణీ చేసింది. పుణే: ఏకైక టి20 మ్యాచ్‌లో ఎదురైన పరాజయం నుంచి ఆస్ట్రేలియా వెంటనే కోలుకుంది. ఏడు వన్డేల సిరీస్‌లో శుభారంభం అందుకుంది. ఆదివారం ఇక్కడ ఏకపక్షంగా జరిగిన తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 72 పరుగుల ఆధిక్యంతో భారత్‌ను చిత్తుగా ఓడించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ కెప్టెన్ బెయిలీ (82 బంతుల్లో 85; 10 ఫోర్లు) స్ఫూర్తిదాయక ఇన్నింగ్స్‌తో జట్టును నడిపించాడు. ఆరోన్ ఫించ్ (79 బంతుల్లో 72; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) మరోసారి చెలరేగగా... హ్యూస్ (53 బంతుల్లో 47; 5 ఫోర్లు) అతనికి అండగా నిలిచాడు. అనంతరం భారత్ 49.4 ఓవర్లలో 232 పరుగులకే ఆలౌటైంది. విరాట్ కోహ్లి (85 బంతుల్లో 61; 6 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించాడు. రోహిత్ శర్మ (47 బంతుల్లో 42; 6 ఫోర్లు), రైనా (45 బంతుల్లో 39; 2 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించారు. ఆసీస్ బౌలర్లలో ఫాల్క్‌నర్ (3/47) రాణించాడు. వాట్సన్, మెక్కే చెరో 2 వికెట్లు తీశారు. సిరీస్‌లో భాగంగా రెండో వన్డే బుధవారం జైపూర్‌లో జరుగుతుంది. ఓపెనర్ల శుభారంభం టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు హ్యూస్, ఫించ్ ఆచితూచి ఆడారు. తొలుత ఆసీస్ తొలి ఆరు ఓవర్లలో 13 పరుగులు మాత్రమే చేయగలిగింది. అయితే ఏడో ఓవర్ నుంచి ఆసీస్ జోరు మొదలైంది. భువనేశ్వర్ వేసిన ఆ ఓవర్లో ఫించ్ రెండు ఫోర్లు, ఒక సిక్స్ బాదడంతో 15 పరుగులు వచ్చాయి. ఇద్దరు ఓపెనర్లు చక్కటి షాట్లతో స్కోరు బోర్డును పరుగెత్తించారు. 54 బంతుల్లో ఫించ్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగా, భాగస్వామ్యం కూడా వంద పరుగులు దాటింది. కట్టడి చేసిన యువీ, జడేజా 19వ ఓవర్ రెండో బంతికి భారత్‌కు తొలి బ్రేక్ లభించింది. జడేజా బంతిని ఫ్లిక్ చేయబోయి హ్యూస్ లెగ్‌స్లిప్‌లో ఉన్న రైనాకు క్యాచ్ ఇవ్వడంతో తొలి వికెట్ పడింది. ఆ వెంటనే ఆసీస్‌కు యువరాజ్ షాక్ ఇచ్చాడు. తాను వేసిన తొలి బంతికే అతను వాట్సన్ (2)ను పెవిలియన్ పంపించాడు. 2011 వరల్డ్ కప్ తర్వాత యువీకి ఇదే మొదటి వికెట్ కావడం విశేషం. ఆ తర్వాత కొద్ది సేపటికే దూకుడుగా ఆడుతున్న ఫించ్‌ను కూడా అవుట్ చేసిన యువీ... డెరైక్ట్ త్రోతో వోజెస్ (7)ను రనౌట్ చేశాడు. మరోవైపు కెప్టెన్ బెయిలీ మాత్రం జోరు తగ్గనివ్వలేదు. చివర్లో ఫాల్క్‌నర్ (22 బంతుల్లో 27; 2 సిక్స్‌లు) కూడా ధాటిగా ఆడటంతో ఆసీస్ స్కోరు 300 పరుగులు దాటింది. కోహ్లి మినహా భారత ఇన్నింగ్స్ కూడా నెమ్మదిగానే ప్రారంభమైంది. క్రీజ్‌లో నిలదొక్కుకోవడంలో ఇబ్బంది పడిన శిఖర్ ధావన్ (7) తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు. రోహిత్ అవుటయ్యాక కోహ్లి, రైనా కలిసి భారత ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. మూడో వికెట్‌కు 71 పరుగులు జోడించిన అనంతరం ఫాల్క్‌నర్ ఈ జోడీని విడదీశాడు. భారీ సిక్స్‌తో పరుగుల ఖాతా తెరచిన యువరాజ్ (7) ఈసారి ఎలాంటి వీరంగం సృష్టించకుండానే అవుటయ్యాడు. నిలకడగా ఆడుతున్న కోహ్లి నిష్ర్కమణ తర్వాత... రవీంద్ర జడేజా (11), కెప్టెన్ ధోని (19) కూడా పెవిలియన్ చేరు కోవడంతో భారత పరాజయం ఖాయమైంది. స్కోరు వివరాలు ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: హ్యూస్ (సి) రైనా (బి) జడేజా 47; ఫించ్ (సి) కోహ్లి (బి) యువరాజ్ 72; వాట్సన్ (సి) జడేజా (బి) యువరాజ్ 2; బెయిలీ (సి) రైనా (బి) అశ్విన్ 85; వోజెస్ (రనౌట్) 7; మ్యాక్స్‌వెల్ (సి) రోహిత్ (బి) వినయ్ 31; హాడిన్ (ఎల్బీ) (బి) అశ్విన్ 10; ఫాల్క్‌నర్ (సి) వినయ్ (బి) ఇషాంత్ 27; జాన్సన్ (నాటౌట్) 9; మెక్కే (నాటౌట్) 11; ఎక్స్‌ట్రాలు (లెగ్‌బై 3) 3; మొత్తం (50 ఓవర్లలో 8 వికెట్లకు) 304 వికెట్ల పతనం: 1-110; 2-113; 3-146; 4-172; 5-214; 6-231; 7-264; 8-293. బౌలింగ్: భువనేశ్వర్ 7-2-41-0; వినయ్ కుమార్ 9-1-68-1; ఇషాంత్ 7-0-56-1; అశ్విన్ 10-0-55-2; జడేజా 10-0-35-1; కోహ్లి 1-0-12-0; యువరాజ్ 6-0-34-2. భారత్ ఇన్నింగ్స్: శిఖర్ ధావన్ (సి) హాడిన్ (బి) ఫాల్క్‌నర్ 7; రోహిత్ శర్మ (సి) హ్యూస్ (బి) వాట్సన్ 42; కోహ్లి (ఎల్బీ) (బి) వాట్సన్ 61; రైనా (సి) డోహర్తి (బి) ఫాల్క్‌నర్ 39; యువరాజ్ (సి) హ్యూస్ (బి) జాన్సన్ 7; ధోని (బి) మెక్కే 19; రవీంద్ర జడేజా (సి) బెయిలీ (బి) ఫాల్క్‌నర్ 11; అశ్విన్ (సి) వాట్సన్ (బి) మెక్కే 5; భువనేశ్వర్ (సి) వోజెస్ (బి) ఫించ్ 18; వినయ్ కుమార్ (బి) వోజెస్ 11; ఇషాంత్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు (బై 2, లెగ్‌బై 4, వైడ్ 5) 11; మొత్తం (49.4 ఓవర్లలో ఆలౌట్) 232 వికెట్ల పతనం: 1-26; 2-66; 3-137; 4-147; 5-166; 6-192; 7-196; 8-200; 9-230; 10-232. బౌలింగ్: జాన్సన్ 10-0-38-1; మెక్కే 10-0-36-2; ఫాల్క్‌నర్ 8-0-47-3; డోహర్తి 10-1-54-0; వాట్సన్ 8-0-31-2; వోజెస్ 3-0-18-1; ఫించ్ 0.4-0-2-1.