బౌన్సర్ దెబ్బకు హెల్మెట్‌ ఊడిపడింది! | George Bailey helmet goes flying after being hit on head by Nathan Coulter Nile | Sakshi
Sakshi News home page

బౌన్సర్ దెబ్బకు హెల్మెట్‌ ఊడిపడింది!

Published Wed, May 18 2016 12:20 PM | Last Updated on Mon, Sep 4 2017 12:23 AM

బౌన్సర్ దెబ్బకు హెల్మెట్‌ ఊడిపడింది!

బౌన్సర్ దెబ్బకు హెల్మెట్‌ ఊడిపడింది!

న్యూఢిల్లీ: పుణెతో ఢిల్లీ డేర్‌ డేవిల్స్ మ్యాచ్‌ సందర్భంగా ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌ జార్జ్‌ బెయిలీ ఒకింత భయానక అనుభవాన్ని ఎదుర్కొన్నాడు. రైజింగ్‌ పుణె సూపర్ జెయింట్స్‌ తరఫున బ్యాటింగ్‌ కు దిగిన బెయిలీని స్వదేశం ఆటగాడైన నాథన్‌ కౌల్టర్‌ నీల్‌ వేసిన బౌన్సర్‌ భయపెట్టింది.

ఏడో ఓవర్లో కౌల్టర్‌ నీల్‌ వేసిన బౌన్సర్‌ బెయిలీ బ్యాటును తప్పించుకొని మరీ అతని హెల్మెట్‌ను బలంగా ఢీకొట్టింది. దీంతో అమాంతం తల నుంచి హెల్మెట్‌ ఊడి గాల్లోకి ఎగిరింది. ఈ ఘటనతో బెయిలీ బిత్తరపోయాడు. షాక్‌ తిన్న ఢిల్లీ డేర్‌ డేవిల్స్ ఫీల్డర్లు, బౌలరు బెయిలీ వద్దకు ఉరికొచ్చి.. అతనికి ఏమైనా అయిందా అని ఆరా తీశారు. ప్రమాదకరమైన బౌన్సర్‌ దూసుకొచ్చినప్పటికీ అదృష్టవశాత్తు అతనికి ఏం కాలేదు. యథాతథంగా బెయిలీ బ్యాటింగ్ కొనసాగించాడు. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌ డేవిల్స్‌కు షాకిస్తూ.. పుణె జట్టు ఘన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement