Nathan Coulter Nile
-
కౌల్టర్ నైల్ బ్యాట్‌తో మెరిశాడు
-
‘ఎనిమిది’లో వచ్చి.. దంచికొట్టాడు
నాటింగ్‌హామ్: ప్రపంచకప్‌లో భాగంగా వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ నాథన్ కౌల్టర్ నైల్ బ్యాట్‌తో మెరిశాడు. విండీస్ బౌలర్ల ధాటికి ఆసీస్ ఒకానొక దశలో 147 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ తరుణంలో స్టీవ్ స్మిత్‌తో కలిసి కౌల్టర్ నైల్ రెచ్చిపోయాడు. వచ్చిరాగనే కరేబియన్ బౌలర్లపై విరుచకుపడ్డాడు. దీంతో సెంచరీ సాధిస్తాడునుకున్న తరుణంలో 92 పరుగుల వద్ద బ్రాత్‌వైట్ బౌలింగ్‌లో క్యాచ్ఔట్గా వెనుదిరుగుతాడు. అయితే ఈ సమయంలో కౌల్టర్ నైల్ పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచకప్‌లో ఎనిమిది, ఆ తర్వాతి స్థానంలో బ్యాటింగ్‌కు దిగి అత్యధిక పరుగులు(92) సాధించిన ఆసీస్ ఆటగాడిగా కౌల్టర్ రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో ఆండీ బికెల్(65 పరుగులు, 2003లో ఇంగ్లండ్‌పై)రికార్డును అధిగమించాడు. ఇక ఓవరాల్‌గా వన్డేల్లో ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి అత్యధిక పరుగుల సాధించిన మూడో ఆటగాడిగా మరో ఘనతన అందుకున్నాడు. ఈ జాబితాలో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ క్రిస్ వోక్స్(95 నాటౌట్, 2016లో శ్రీలంకపై)తొలి స్థానంలో ఉన్నాడు. ఇక ప్రపంచకప్‌లో తొలి 50 పరుగులలోపే నాలుగు వికెట్లు కోల్పోయి 250కి పైగా స్కోర్ సాధించిన రెండో జట్టుగా ఆసీస్ నిలిచింది. 38 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన ఆసీస్ స్మిత్, కౌల్టర్లు రాణించడంతో 288 పరుగులు చేసింది. ఈ జాబితాలో టీమిండియా తొలి స్థానంలో ఉంది. 1983 ప్రపంచకప్‌లో జింబాబ్వేతో మ్యాచ్‌లో 9 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి చివరికి 266 పరుగులు చేసింది. -
‘రోహిత్.. బౌన్సర్లను కాచుకో’
బ్రిస్బేన్: ప్రస్తుత ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టులో కెప్టెన్ విరాట్ కోహ్లి ఒక్కడే తమ టార్గెట్ కాదని అంటున్నాడు ఆసీస్ పేసర్ నాథన్ కౌల్టర్ నైల్. భారత జట్టులో చాలామంది అత్యుత్తమ ఆటగాళ్లు ఉన్నారని, అందులో రోహిత్ శర్మ చాలా ప్రమాదకరమైన ఆటగాడిగా పేర్కొన్నాడు. అయితే రోహిత్‌ను బౌన్సర్లతో టార్గెట్ చేస్తామని కౌల్టర్ నైల్ హెచ్చరించాడు. తమ బౌలర్ల నుంచి వచ్చే బౌన్సర్లను కాచుకునేందుకు రోహిత్ సిద్ధంగా ఉండాలన్నాడు. ‘రోహిత్ ఒక అసాధారణ ఆటగాడు. ప్రపంచ క్రికెట్లో రోహిత్‌కు చక్కటి రికార్డు ఉంది. మేము ప్రధానంగా దృష్టి సారించాల్సిన భారత ఆటగాళ్లలో రోహిత్ ఒకడు. గతంలో రోహిత్‌ను కొత్త బంతులతో ఇబ్బంది పెట్టిన సందర్భాలున్నాయి. బంతిని పుల్ చేయడంలో రోహిత్ దిట్ట అనడంలో ఎటువంటి సందేహం లేదు. అదే బౌన్సర్లకు రోహిత్ దొరికిపోతాడు కూడా. బ్రిస్బేన్‌లో భారీ షాట్లు ఆడటం అంత ఈజీ కాదు. రోహిత్‌కు ఊరించే బంతులు సంధించి అతన్ని తొందరగా పెవిలియన్ పంపడానికి యత్నిస్తాం’ అని కౌల్టర్ నైల్ తెలిపాడు. బుధవారం జరుగునున్న తొలి టీ20తో ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ ఆరంభం కానుంది. బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియంలో మధ్యాహ్నం గం. 1.20 ని.లకు మ్యాచ్ ప్రారంభం కానుంది. -
బౌన్సర్ దెబ్బకు హెల్మెట్ ఊడిపడింది!
న్యూఢిల్లీ: పుణెతో ఢిల్లీ డేర్ డేవిల్స్ మ్యాచ్ సందర్భంగా ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ జార్జ్ బెయిలీ ఒకింత భయానక అనుభవాన్ని ఎదుర్కొన్నాడు. రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ తరఫున బ్యాటింగ్ కు దిగిన బెయిలీని స్వదేశం ఆటగాడైన నాథన్ కౌల్టర్ నీల్ వేసిన బౌన్సర్ భయపెట్టింది. ఏడో ఓవర్లో కౌల్టర్ నీల్ వేసిన బౌన్సర్ బెయిలీ బ్యాటును తప్పించుకొని మరీ అతని హెల్మెట్‌ను బలంగా ఢీకొట్టింది. దీంతో అమాంతం తల నుంచి హెల్మెట్ ఊడి గాల్లోకి ఎగిరింది. ఈ ఘటనతో బెయిలీ బిత్తరపోయాడు. షాక్ తిన్న ఢిల్లీ డేర్ డేవిల్స్ ఫీల్డర్లు, బౌలరు బెయిలీ వద్దకు ఉరికొచ్చి.. అతనికి ఏమైనా అయిందా అని ఆరా తీశారు. ప్రమాదకరమైన బౌన్సర్ దూసుకొచ్చినప్పటికీ అదృష్టవశాత్తు అతనికి ఏం కాలేదు. యథాతథంగా బెయిలీ బ్యాటింగ్ కొనసాగించాడు. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఢిల్లీ డేర్ డేవిల్స్కు షాకిస్తూ.. పుణె జట్టు ఘన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. OUCH! A rapid Coulter-Nile bouncer sends George Bailey's helmet flying in #IPL2016 https://t.co/ph9pho4HVm pic.twitter.com/TAUWHkkUfk — ABC Grandstand (@abcgrandstand) 18 May 2016