‘ఎనిమిది’లో వచ్చి.. దంచికొట్టాడు | World Cup 2019 Nathan Coulter Nile Sets Cricket Records | Sakshi
Sakshi News home page

‘ఎనిమిది’లో వచ్చి.. దంచికొట్టాడు

Published Thu, Jun 6 2019 8:29 PM | Last Updated on Thu, Jun 6 2019 9:05 PM

World Cup 2019 Nathan Coulter Nile Sets Cricket Records - Sakshi

నాటింగ్‌హామ్‌: ప్రపంచకప్‌లో భాగంగా వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఫాస్ట్‌ బౌలర్‌ నాథన్‌ కౌల్టర్‌ నైల్‌ బ్యాట్‌తో మెరిశాడు. విండీస్‌ బౌలర్ల ధాటికి ఆసీస్‌ ఒకానొక దశలో 147 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ తరుణంలో స్టీవ్‌ స్మిత్‌తో కలిసి కౌల్టర్‌ నైల్‌ రెచ్చిపోయాడు. వచ్చిరాగనే కరేబియన్‌ బౌలర్లపై విరుచకుపడ్డాడు. దీంతో సెంచరీ సాధిస్తాడునుకున్న తరుణంలో 92 పరుగుల వద్ద బ్రాత్‌వైట్‌ బౌలింగ్‌లో క్యాచ్‌ఔట్‌గా వెనుదిరుగుతాడు. అయితే ఈ సమయంలో కౌల్టర్‌ నైల్‌ పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. 

ప్రపంచకప్‌లో ఎనిమిది, ఆ తర్వాతి స్థానంలో బ్యాటింగ్‌కు దిగి అత్యధిక పరుగులు(92) సాధించిన ఆసీస్‌ ఆటగాడిగా కౌల్టర్‌ రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో ఆండీ బికెల్‌(65 పరుగులు, 2003లో ఇంగ్లండ్‌పై)రికార్డును అధిగమించాడు. ఇక ఓవరాల్‌గా వన్డేల్లో ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి అత్యధిక పరుగుల సాధించిన మూడో ఆటగాడిగా మరో ఘనతన అందుకున్నాడు. ఈ జాబితాలో ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ క్రిస్‌ వోక్స్‌(95 నాటౌట్‌, 2016లో శ్రీలంకపై)తొలి స్థానంలో ఉన్నాడు.   

ఇక ప్రపంచకప్‌లో తొలి 50 పరుగులలోపే నాలుగు వికెట్లు కోల్పోయి 250కి పైగా స్కోర్‌ సాధించిన రెండో జట్టుగా ఆసీస్‌ నిలిచింది. 38 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన ఆసీస్‌ స్మిత్‌, కౌల్టర్‌లు రాణించడంతో 288 పరుగులు చేసింది. ఈ జాబితాలో టీమిండియా తొలి స్థానంలో ఉంది. 1983 ప్రపంచకప్‌లో జింబాబ్వేతో మ్యాచ్‌లో 9 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి చివరికి 266 పరుగులు చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement