అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగాలనుకున్న డేవిడ్ వార్నర్ ఆశలపై ఆస్ట్రేలియా చీఫ్ సెలెక్టర్ జార్జ్ బెయిలీ నీళ్లు చల్లాడు. వచ్చే ఏడాది పాక్ వేదికగా జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి వార్నర్‌ను పరిగణలోకి తీసుకోవడం లేదని వెల్లడించాడు. వార్నర్ ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్‌కప్ 2024తో క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలికాడు. అనంతరం కొద్ది రోజుల్లోనే మనసు మార్చుకుని ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి అందుబాటులో ఉంటానని ప్రకటించాడు.
వార్నర్ ప్రకటనపై తాజాగా జార్జ్ బెయిలీ స్పందించాడు. తమ ఫ్యూచర్ ప్లాన్స్‌లో వార్నర్ లేడని స్పష్టం చేశాడు. తమకున్న సమాచారం మేరకు వార్నర్ మూడు ఫార్మాట్ల నుంచి రిటైరయ్యాడని తెలిపాడు. వార్నర్ ఎప్పుడు జోక్ చేస్తాడో.. ఎప్పుడు సీరియస్‌గా ఉంటాడో తెలీదని అన్నాడు.
వార్నర్ కెరీర్ అద్బుతంగా సాగిందని గుర్తు చేశాడు. తమ ప్రణాళికల్లో కొత్త ఆటగాళ్లు ఉన్నారని పేర్కొన్నాడు. బెయిలీ మాటలను బట్టి చూస్తే వార్నర్ తిరిగి జట్టులోకి రావాలనుకున్నా అవకాశం లేదన్న విషయం స్పష్టమవుతుంది.
ఇదిలా ఉంటే, టీ20 వరల్డ్‌కప్ 2024లో సూపర్-8 దశలోనే నిష్క్రమించిన ఆస్ట్రేలియా.. త్వరలో ఇంగ్లండ్, స్కాట్లాండ్‌తో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం సన్నద్దమవుతుంది. ఈ రెండు సిరీస్‌లకు ఆసీస్ సెలెక్టర్లు ఇవాళ (జులై 15) జట్లను ప్రకటించారు.
ఆస్ట్రేలియా తొలుత స్కాట్లాండ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ (సెప్టెంబర్ 4, 6, 7) ఆడనుంది. అనంతరం సెప్టెంబర్ 11 నుంచి ఇంగ్లండ్ పర్యటన మొదలవుతుంది. ఈ పర్యటనలో ఆసీస్ మూడు టీ20లు (సెప్టెబంర్ 11, 13, 15).. ఐదు వన్డేలు (సెప్టెంబర్ 19, 21, 24, 27, 29) ఆడనుంది.
స్కాట్లాండ్, ఇంగ్లండ్‌తో టీ20లకు ఆసీస్ జట్టు..
మిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్‌లెట్, కూపర్ కొన్నోలీ, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్, కామెరాన్ గ్రీన్, ఆరోన్ హార్డీ, జోష్ హాజిల్‌వుడ్, ట్రవిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, స్పెన్సర్ జాన్సన్, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా.
ఇంగ్లండ్‌తో వన్డేలకు ఆస్ట్రేలియా జట్టు..
మిచెల్ మార్ష్ (కెప్టెన్), సీన్ అబాట్, అలెక్స్ కారీ, నాథన్ ఎల్లిస్, జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్, ఆరోన్ హార్డీ, కామెరాన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, ట్రవిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మార్నస్ లాబూషేన్, గ్లెన్ మాక్స్‌వెల్, మాథ్యూ షార్ట్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా.
Comments
Please login to add a commentAdd a comment