సచిన్ స్థానాన్ని రోహిత్ భర్తీ చేస్తాడు: బెయిలీ | George Bailey feels Rohit Sharma can fill into big shoes of Sachin Tendulkar | Sakshi
Sakshi News home page

సచిన్ స్థానాన్ని రోహిత్ భర్తీ చేస్తాడు: బెయిలీ

Published Sun, Nov 3 2013 3:07 PM | Last Updated on Sat, Sep 2 2017 12:15 AM

సచిన్ స్థానాన్ని రోహిత్ భర్తీ చేస్తాడు: బెయిలీ

సచిన్ స్థానాన్ని రోహిత్ భర్తీ చేస్తాడు: బెయిలీ

బెంగళూరు: టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ సూపర్ ఇన్నింగ్స్పై  ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కెప్టెన్ జార్జి బెయిలీ ప్రశంసలు కురిపించాడు. భారత జట్టులో సచిన్ టెండూల్కర్ లేని లోటును అతడు పూడ్చగలడని పేర్కొన్నాడు. మాస్టర్ బ్లాస్టర్ రిటైర్మెంట్తో ఖాళీ అయిన స్థానాన్ని రోహిత్ భర్తీ చేస్తాగనే విశ్వాసాన్ని బెయిలీ వ్యక్తం చేశాడు.

ఆస్ట్రేలియాతో శనివారం జరిగిన చివరి వన్డేలో రోహిత్ శర్మ డబుల్ సెంచరీ సాధించాడు. 16 సిక్సర్లు కొట్టి అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. రోహిత్ శర్మ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడని మ్యాచ్ ముగిసిన తర్వాత బెయిలీ అన్నాడు. ఓపెనర్గా సచిన్ స్థానాన్ని అతడు భర్తీ చేయగలడని పేర్కొన్నాడు. నెమ్మదిగా ఇన్నింగ్స్ ఆరంభించి విరుచుపడిన రోహిత్ ఆటతీరు తననెంతో ఆకట్టుకుందని తెలిపాడు. చూడ చక్కని షాట్లతో కట్టిపడేశాడని కితాబిచ్చాడు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement