ఆసియా కప్-2023లో భాగంగా పాకిస్తాన్‌తో ఇవాళ (సెప్టెంబర్ 10) జరుగుతున్న సూపర్-4 మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. ఓ రికార్డు సాధించాడు. ఆసియా కప్ వన్డే ఫార్మాట్‌లో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న అత్యధిక హాఫ్ సెంచరీల రికార్డును (భారత్ తరఫున) సమం చేశాడు. సచిన్ ఆసియా కప్ కెరీర్‌లో (వన్డేలు) మొత్తం 9 హాఫ్ సెంచరీలు చేయగా.. తాజాగా పాక్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఫిఫ్టి కొట్టడం ద్వారా హిట్‌మ్యాన్ (9) సచిన్ సరసన చేరాడు.
ఈ ఫిఫ్టితో రోహిత్ మరో రికార్డు కూడా నెలకొల్పాడు. వన్డేల్లో 80 సార్లు 50కి పైగా స్కోర్లు (30 శతకాలు, 50 అర్ధశతకాలు) చేసిన 13వ ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఈ విభాగంలొ సచిన్ టాప్‌లో (145 50 ప్లస్ స్కోర్లు) ఉండగా.. విరాట్ (111), ద్రవిడ్ (95), గంగూలీ (94), ధోని (83) రోహిత్‌కు ముందున్న భారత ఆటగాళ్లుగా ఉన్నారు.
పాక్‌తో మ్యాచ్‌లో 56 పరుగులు చేసి ఔటైన రోహిత్.. మరో 22 పరుగులు చేసుంటే, వన్డేల్లో 10000 పరుగుల మైలురాయిని కూడా తాకుండేవాడు. ప్రస్తుతం రోహిత్ 247 వన్డేల్లో 48.91 సగటున, 90.19 స్ట్రయిక్‌రేట్‌తో 9978 పరుగులు చేశాడు.
ఇదిలా ఉంటే, భారత్-పాక్‌ల మధ్య ఇవాళ జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. మ్యాచ్‌కు రేపు (సెప్టెంబర్ 11) రిజర్వ్ డేగా ఉండటంతో ఎక్కడ ఆగిపోయిందో అక్కడి నుంచి తిరిగి ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్ పూర్తి 50 ఓవర్ల మ్యాచ్‌గా సాగనుంది. అయితే, వరుణుడు రేపు కూడా ఆటకు ఆటంకం కలిగించవచ్చని కొలొంబో వాతావరణ శాఖ హెచ్చరించింది. మరి రాత్రికిరాత్రి పరిస్థితుల్లో ఏమైనా మార్పులు వస్తాయేమో వేచి చూడాలి. వర్షం కారణంగా ఇవాల్టి ముగిసే సమయానికి భారత్ స్కోర్ 24.1 ఓవర్లలో 147/2గా ఉంది. రోహిత్ (56), గిల్ (58) ఔట్ కాగా.. కోహ్లి (8), రాహుల్ (17) క్రీజ్‌లో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment