కెప్టెన్సీకి బెయిలీ గుడ్ బై | George Bailey steps down as Australia's T20 captain | Sakshi
Sakshi News home page

కెప్టెన్సీకి బెయిలీ గుడ్ బై

Published Sun, Sep 7 2014 1:44 PM | Last Updated on Sat, Sep 2 2017 1:01 PM

George Bailey steps down as Australia's T20 captain

మెల్బోర్న్: ఆస్ట్రేలియా టి-20 జట్టు కెప్టెన్ పదవి నుంచి జార్జి బెయిలీ వైదొలిగాడు. టెస్టు కెరీర్పై పూర్తిగా దృష్టిసారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు బెయిలీ చెప్పాడు. 2012లో కెప్టెన్గా నియమితుడైన బెయిలీ 27 మ్యాచ్లకు సారథ్యం వహించాడు.

బెయిలీ రాజీనామాను క్రికెట్ ఆస్ట్రేలియా ధ్రువీకరించింది. 2016లో జరిగే ప్రపంచ కప్కు జట్టును పటిష్టం చేయడంపై దృష్టిసారిస్తోంది. ఆసీస్ పొట్టి ఫార్మాట్కు కొత్త కెప్టెన్ను ఎంపిక చేయాల్సివుంది. బెయిలీ స్థానంలో అరోన్ ఫించ్ను నియమించే అవకాశముంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement