వాట్‌ ఏ క్యాచ్‌.. ఇది టీమ్‌ వర్క్‌ అంటే! | Call him Superman, Matthew Wade's freakish catch in slips | Sakshi
Sakshi News home page

వాట్‌ ఏ క్యాచ్‌.. ఇది టీమ్‌ వర్క్‌ అంటే!

Published Wed, Mar 20 2019 5:02 PM | Last Updated on Fri, Mar 22 2024 11:29 AM

క్రికెట్‌లో ఇప్పటివరకు బౌండరీ లైన్‌ వద్దనే ఫీల్డర్లు కళ్లు చెదిరే రీతిలో క్యాచ్‌ అందుకోవడం చూసుంటాం. కానీ స్లిప్‌లో మిరాకిల్‌ క్యాచ్‌లు చూడటం చాలా అరుదు. ఎందుకంటే అనూహ్యంగా వచ్చే బంతులను అందుకోవాలంటే.. ఫీల్డర్లు ఎంతో చురుకుగా, చాకచక్యంగా ఉండాలి. దీంతో బౌండరీల వద్ద కంటే స్లిప్‌లో ఫీల్డిండ్‌ చేయడమే యమా డేంజరు. అయితే స్లిప్‌లో అనూహ్య క్యాచ్‌లు అందుకొని జట్టుకు విజయాలు అందించిన ఆటగాళ్లు ఎందరో ఉన్నారు.  తాజాగా ఆస్ట్రేలియా క్రికెటర్‌ మాథ్యూ వేడ్‌ స్లిప్‌లో పట్టిన క్యాచ్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఈ వీడియో చూసిన ప్రతీ ఒక్కరూ వేడ్‌ను, ఆ జట్టు ఆటగాళ్లను తెగ మెచ్చుకుంటున్నారు. టీమ్‌ వర్క్‌ అంటే ఇది అని కామెంట్‌ చేస్తున్నారు. 

ఆసీస్‌లో జరుగుతున్న షెఫీల్డ్ షీల్డ్ ట్రోఫీలో భాగంగా న్యూసౌత్ వేల్స్, టాస్మానియా మధ్య జరిగిన మ్యాచ్‌లో మాథ్యూ వేడ్ పట్టిన క్యాచ్ క్రికెట్‌లోని అత్యుత్తమ క్యాచ్‌లలో ఒకటిగా విశ్లేషకులు అభిప్రాయపడతున్నారు. దాదాపు నేలపాలైందనుకున్న క్యాచ్‌ను వేడ్ ఎంతో చాకచ​క్యంగా అందుకున్నాడు. జాక్సన్ బర్డ్ బౌలింగ్‌లో న్యూ సౌత్ వేల్స్ బ్యాట్స్‌మన్ డేనియల్ హ్యూస్ ఇచ్చిన క్యాచ్‌ను రెండో స్లిప్‌లో ఉన్న అలెక్స్ డూలాన్ వదిలేశాడు. ఆ బాల్ నేలను తాకుతుందనగా.. క్షణాల్లో తన ఎడమవైపు డైవ్ చేసి దానిని అందుకున్నాడు మాథ్యూ వేడ్. సహజంగా వికెట్‌ కీపర్‌ అయిన వేడ్‌.. ఆ స్కిల్స్‌ను ఉపోయోగించి క్యాచ్‌ అందుకున్నాడు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement