Matthew Wade
-
రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా వరల్డ్‌కప్ విన్నర్
ఆస్ట్రేలియా వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ మాథ్యూ వేడ్ అంతర్జాతీయ క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. రిటైర్మెంట్ అనంతరం వేడ్ ఆండ్రీ బోరోవెక్ నేతృత్వంలోని ఆస్ట్రేలియా కోచింగ్ బృందంలో జాయిన్ అవుతాడు. వచ్చే నెలలో పాకిస్తాన్‌తో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్ నుంచి వేడ్ కొత్త బాధ్యతలు చేపడతాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరైన వేడ్.. దేశవాలీ క్రికెట్లో, బిగ్‌బాష్ లీగ్‌లో కొనసాగుతాడు. ఈ ఏడాది జూన్‌లో (టీ20 వరల్డ్‌కప్) తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన వేడ్.. తన 13 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో 36 టెస్ట్‌లు, 97 వన్డేలు, 92 టీ20లు ఆడి 4700 పైచిలుకు పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు, 19 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. రిటైర్మెంట్ సందర్భంగా వేడ్ తన సహచరులతో పాటు కోచింగ్ స్టాఫ్‌కు, కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపాడు. 36 ఏళ్ల వేడ్ ఆస్ట్రేలియా టీ20 వరల్డ్‌కప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. వేడ్‌కు ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లోనూ ప్రవేశముంది. వేడ్ ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. కాగా, పాకిస్తాన్ జట్టు నవంబర్ 4 నుంచి ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఈ పర్యటనలో పాక్ మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. నవంబర్ 4, 8, 10 తేదీల్లో మూడు వన్డేలు జరుగనుండగా.. నవంబర్ 14, 16, 18 తేదీల్లో టీ20లు జరుగనున్నాయి. ఈ సిరీస్‌ల అనంతరం ఆస్ట్రేలియా స్వదేశంలో భారత్‌తో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆడుతుంది. చదవండి: ప్రొఫెషనల్ బ్యాటర్లా మారిన చహల్ -
రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్.. ఇకపై
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ మాథ్యూ వేడ్ రిటైర్మెంట్ ప్రకటించాడు. టెస్టు ఫార్మాట్ నుంచి తాను వైదొలుగుతున్నట్లు వెల్లడించాడు. అయితే, పరిమిత ఓవర్ల క్రికెట్లో మాత్రం కొనసాగుతానని వేడ్ స్పష్టం చేశాడు. ‘‘సంప్రదాయ ఫార్మాట్లో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడాన్ని ఎంతగానో ఆస్వాదించాను. వైట్‌బాల్ క్రికెట్లో కొనసాగినా.. బ్యాగీ గ్రీన్‌తో దేశం తరఫున బరిలోకి దిగడమే నా కెరీర్లో ఎప్పటికైనా హైలైట్‌గా నిలుస్తుంది’’ అని మాథ్యూ వేడ్ ఉద్వేగపూరిత ప్రకటన చేశాడు. ఆస్ట్రేలియా తరఫున టెస్టులు ఆడటం అంతర్జాతీయ కెరీర్లో తనకు అత్యంత ప్రత్యేకమైందని పేర్కొన్నాడు. ది షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో టాస్మానియా- వెస్టర్న్ ఆస్ట్రేలియా మధ్య మార్చి 21న మొదలుకానున్న ఫైనల్ మ్యాచ్ తన రెడ్ బాల్ క్రికెట్లో ఆఖరిదని వేడ్ వెల్లడించాడు. కాగా 2012లో ఆస్ట్రేలియా తరఫున టెస్టుల్లో అడుగుపెట్టిన వికెట్ కీపర్ బ్యాటర్ మాథ్యూ వేడ్.. 2021లో తన చివరి మ్యాచ్ ఆడాడు. అలెక్స్ క్యారీ రాకతో అతడికి అవకాశాలు సన్నగిల్లాయి. ఈ క్రమంలో టీమిండియాతో గాబా మైదానంలో ఆఖరిగా టెస్టు మ్యాచ్ బరిలో దిగాడు. ఇక కెరీర్లో మొత్తంగా 36 టెస్టులు ఆడిన మాథ్యూ వేడ్.. 1613 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు ఉన్నాయి. ఇక పరిమిత ఓవర్ల క్రికెట్ విషయానికొస్తే.. టీ20 ఫార్మాట్లో ఫినిషర్‌గా వేడ్ గుర్తింపు పొందాడు. టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో ఆస్ట్రేలియా టైటిల్ గెలవడంలో అతడిదే కీలక పాత్ర. పాకిస్తాన్‌తో సెమీ ఫైనల్లో కేవలం 17 బంతుల్లోనే 41 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును ఫైనల్‌కు చేర్చాడు. కెరీర్లో చిరస్థాయిగా నిలిచిపోయే ఇన్నింగ్స్ అది! ఇదిలా ఉంటే.. ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్‌కు మాథ్యూ వేడ్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అయితే, తాజా ఎడిషన్ ఆరంభ మ్యాచ్‌లకు మాత్రం అతడు దూరం కానున్నాడు. ఇక టీ20 వరల్డ్‌కప్-2024లో సత్తా చాటడమే లక్ష్యంగా పెట్టుకున్న మాథ్యూ వేడ్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. చదవండి: హార్దిక్ రిటైర్ అవ్వటమే బెటర్: భారత మాజీ పేసర్ షాకింగ్ కామెంట్స్ -
వావ్.. క్రికెట్ చరిత్రలోనే సూపర్ క్యాచ్! వీడియో వైరల్
ఆక్లాండ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో 72 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. దీంతో మరో మ్యాచ్ మిగిలూండగానే మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0 తేడాతో ఆసీస్ సొంతం చేసుకుంది. కాగా ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా వికెట్ కీపర్ మాథ్యూ వేడ్ సంచలన క్యాచ్‌తో మెరిశాడు. అద్భుతమైన క్యాచ్‌తో కివీస్ ఓపెనర్ విల్ యంగ్‌ను వేడ్ పెవిలియన్‌కు పంపాడు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేసిన ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్‌లో తొలి బంతిని యంగ్ పుల్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే షాట్ మిస్టైమ్ కావడంతో బంతి గాల్లోకి లేచింది. ఈ క్రమంలో వికెట్ కీపర్ వేడ్ పరిగెత్తుకుంటూ వెళ్లి బ్యాక్వర్డ్ స్క్వేర్ లెగ్‌లో డైవ్ చేస్తూ స్టన్నింగ్ క్యాచ్‌ను అందుకున్నాడు. ఇది చూసిన యంగ్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఇరు జట్ల మధ్య మూడో టీ20 ఫిబ్రవరి 25న జరగనుంది. pic.twitter.com/Wkw2LZb1JX — Sitaraman (@Sitaraman112971) February 23, 2024 -
ఆస్ట్రేలియాపై భారత్ విజయం.. టీ20 సిరీస్ కైవసం (ఫొటోలు)
-
టాస్ ఓడిన టీమిండియా.. ఆసీస్ విధ్వంసకర వీరుడి రీఎంట్రీ
ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా తిరువనంతపురం వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఇవాళ (నవంబర్ 26) రెండో టీ20 జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో ఆసీస్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా తొలి మ్యాచ్‌లో ఆడిన జట్టునే యధాతథంగా కొనసాగించగా.. ఆసీస్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. బెహ్రాన్‌డార్ఫ్, ఆరోన్ హార్డీ స్థానాల్లో గ్లెన్ మ్యాక్స్‌వెల్, ఆడమ్ జంపా ఆసీస్ జట్టులోకి వచ్చారు. టీమిండియా: యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్(వికెట్‌కీపర్), సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, రింకూ సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్, ప్రసిద్ధ్ కృష్ణ ఆస్ట్రేలియా: స్టీవెన్ స్మిత్, మాథ్యూ షార్ట్, జోష్ ఇంగ్లిస్, మార్కస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్, గ్లెన్ మాక్స్వెల్, మాథ్యూ వేడ్(కెప్టెన్), సీన్ అబాట్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, తన్వీర్ సంఘ -
IND VS AUS 1st T20: సెంచరీ కొట్టిన సూర్యకుమార్ యాదవ్
ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా విశాఖ వేదికగా ఆసీస్‌తో నిన్న (నవంబర్ 23) జరిగిన తొలి టీ20లో సూర్యకుమార్ యాదవ్ మెరుపు ఇన్నింగ్స్ ఆడి టీమిండియాను గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో 42 బంతులు ఎదుర్కొన్న సూర్య భాయ్ 9 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 80 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో కొట్టిన సిక్సర్లతో స్కై అంతర్జాతీయ టీ20ల్లో ఓ అరుదైన రికార్డు సాధించాడు. T20 format is so easy for Suryakumar Yadav. 🔥pic.twitter.com/8XcKGl6MO6 — Johns. (@CricCrazyJohns) November 23, 2023 బ్యాటింగ్ ఆర్డర్లో 3 అంతకంటే కింది స్థానాల్లో వచ్చి 100 సిక్సర్లు (47 ఇన్నింగ్స్‌ల్లో) బాదిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఈ విభాగంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ టాప్‌లో ఉన్నాడు. మోర్గాన్ 107 ఇన్నింగ్స్‌ల్లో 120 సిక్సర్లు బాదాడు. ఇతని తర్వాత ఈ విభాగంలో విరాట్ కోహ్లి (98 ఇన్నింగ్స్‌ల్లో 106 సిక్సర్లు), డేవిడ్ మిల్లర్ (98 ఇన్నింగ్స్‌ల్లో 105) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఓవరాల్‌గా స్కై తన 51 ఇన్నింగ్స్‌ల టీ20 కెరీర్లో 108 సిక్సర్లు బాదాడు. ఇదిలా ఉంటే, ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. జోష్ ఇంగ్లిస్ (50 బంతుల్లో 110; 11 ఫోర్లు, 8 సిక్సర్లు) శతక్కొట్టడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 208 పరుగుల భారీ స్కోర్ చేసింది. స్టీవ్ స్మిత్ (52) అర్ధసెంచరీతో రాణించాడు. 209 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్.. సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ (39 బంతుల్లో 58; 2 ఫోర్లు, 5 సిక్సర్లు), రింకూ సింగ్ (14 బంతుల్లో 22 నాటౌట్; 4 ఫోర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లతో విజృంభించడంతో ఆఖరి బంతికి విజయం సాధించింది. -
ఆఖరి బంతికి సిక్సర్ కొట్టిన రింకూ.. మ్యాచ్ గెలిచాం, కానీ..!
ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా విశాఖ వేదికగా ఆసీస్‌తో నిన్న (నవంబర్ 23) జరిగిన తొలి టీ20లో టీమిండియా 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఉత్కంఠగా సాగిన ఈ సమరంలో ఆసీస్ నిర్ధేశించిన 209 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఆఖరి బంతికి ఛేదించింది. సీన్ అబాట్ బౌలింగ్‌లో రింకూ సింగ్ ఆఖరి బంతికి సిక్సర్ బాదాడు. అయితే రింకూ ఈ సిక్సర్ కొట్టినందుకు టీమిండియా గెలవలేదు. భారత్ గెలుపుకు ఆఖరి బంతికి సింగిల్ అవసరం కాగా.. అబాట్ నో బాల్ వేశాడు. అంపైర్లు రింకూ సిక్సర్‌ను పరిగణలోకి తీసుకోకుండా నో బాల్ ద్వారా లభించిన పరుగుతోనే టీమిండియా గెలిచినట్లు ప్రకటించారు. దీంతో రింకూ సింగ్ సిక్సర్ వృధా అయ్యింది. The Finisher Rinku Singh is here to rule for India. 💪🫡pic.twitter.com/p3TtZOm7iC — Johns. (@CricCrazyJohns) November 23, 2023 కాగా, ఛేదనలో అప్పటిదాకా సాఫీగా సాగిన టీమిండియా ప్రయాణం ఆఖరి ఓవర్లో కీలక మలుపులు తిరిగింది. చివరి ఓవర్లో భారత్ గెలుపుకు 7 పరుగులు మాత్రమే అవసరం కాగా.. రింకూ సింగ్ తొలి బంతికే బౌండరీ బాది భారత్‌ను గెలుపు వాకిటికి చేర్చాడు. అనంతరం రెండో బంతికి బైస్ రూపంలో మరో పరుగు వచ్చింది. దీంతో భారత్ గెలుపుకు మరింత చేరువగా వెళ్లింది. ఇక భారత్ గెలవాలంటే 4 బంతుల్లో కేవలం 2 పరుగులు మాత్రమే చేయాలి. ఇక్కడే మ్యాచ్ మలుపులు తిరిగింది. మూడు (అక్షర్ క్యాచ్ ఔట్), నాలుగు (బిష్ణోయ్ రనౌట్), ఐదు బంతులకు (అర్షదీప్) భారత్ వికెట్లు కోల్పోయింది. ఐదో బంతికి అర్షదీప్ రెండో పరుగుకు వెళ్తూ రనౌటయ్యాడు. దీంతో భారత్ గెలవాలంటే ఆఖరి బంతికి ఒక్క పరుగు చేయాల్సి వచ్చింది. స్ట్రయిక్‌లో ఉన్న రింకూ సింగ్ అబాట్ వేసిన బంతిని సిక్సర్‌గా మలిచాడు. మ్యాచ్ చూస్తున్నవారంతా రింకూ సిక్సర్ కారణంగానే భారత్ గెలిచినందని అనున్నారు. కానీ, అబాట్ ఆఖరి బంతి క్రీజ్ దాటి బౌలింగ్ చేయడంతో భారత్ ఖాతాలోని పరుగు చేరి శ్రమ లేకుండానే టీమిండియాకు విజయం దక్కింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. జోష్ ఇంగ్లిస్ (50 బంతుల్లో 110; 11 ఫోర్లు, 8 సిక్సర్లు) శతక్కొట్టడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 208 పరుగుల భారీ స్కోర్ చేసింది. స్టీవ్ స్మిత్ (52) అర్ధసెంచరీతో రాణించాడు. 209 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్.. సూర్యకుమార్ యాదవ్ (42 బంతుల్లో 80; 9 ఫోర్లు, 4 సిక్సర్లు), ఇషాన్ కిషన్ (39 బంతుల్లో 58; 2 ఫోర్లు, 5 సిక్సర్లు), రింకూ సింగ్ (14 బంతుల్లో 22 నాటౌట్; 4 ఫోర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లతో విజృంభించడంతో ఆఖరి బంతికి విజయం సాధించింది. -
బాగానే ఆడాం.. గెలుస్తామని అనుకున్నాం.. కానీ అతను అలా..!: ఆసీస్ కెప్టెన్
ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా విశాఖ వేదికగా టీమిండియాతో నిన్న (నవంబర్ 23) జరిగిన తొలి టీ20లో ఆసీస్ 2 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో ఆసీస్ భారీ స్కోర్ సాధించినప్పటికీ.. సూర్యకుమార్ యాదవ్ (42 బంతుల్లో 80; 9 ఫోర్లు, 4 సిక్సర్లు), ఇషాన్ కిషన్ (39 బంతుల్లో 58; 2 ఫోర్లు, 5 సిక్సర్లు), రింకూ సింగ్ (14 బంతుల్లో 22 నాటౌట్; 4 ఫోర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి భారత్‌ను గెలిపించారు. చివరి ఓవర్లో భారత్ 3 బంతుల్లో 3 వికెట్లు కోల్పోయి ఓటమిపాలయ్యేలా కనిపించినప్పటికీ.. రింకూ సింగ్ చివరి బంతికి సిక్సర్ బాది టీమిండియాను గెలిపించాడు. అంతకుముందు జోష్ ఇంగ్లిస్ (50 బంతుల్లో 110; 11 ఫోర్లు, 8 సిక్సర్లు) శతక్కొట్టడంతో ఆసీస్ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 208 పరుగుల భారీ స్కోర్ చేసింది. స్టీవ్ స్మిత్ (52) అర్ధసెంచరీతో రాణించాడు. ఇంగ్లిస్ విధ్వంసం ధాటికి భారత బౌలర్లంతా ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. మ్యాచ్ అనంతరం ఆసీస్ కెప్టెన్ మాథ్యూ వేడ్ మాట్లాడుతూ ఇలా అన్నాడు. ఓవరాల్‌గా మంచి మ్యాచ్. ఇంగ్లిస్ మాకు మంచి స్కోర్ అందించాడు. డిఫెండ్ చేసుకోగలమని భావించాం. కానీ సూర్యకుమార్ మా నుంచి మ్యాచ్ లాగేసుకున్నాడు. మ్యాచ్ గెలిచేందుకు ఆఖరి ఓవర్లోనూ అవకాశం వచ్చింది. అయితే రింకూ సింగ్ సిక్సర్ బాది ఖేల్ ఖతం చేశాడు. యువ భారత ఆటగాళ్లకు ఐపీఎల్‌తో పాటు స్థానిక దేశవాలీ టీ20లు ఆడటం బాగా కలిసొచ్చింది. మా వరకు మేము బౌలింగ్ బాగానే చేశాం. అయితే యార్కర్లు సంధించడంలో విఫలమయ్యాం. ఈ గేమ్ నుండి చాలా పాజిటివ్‌లు తీసుకోవాలి. ఇంగ్లిస్ క్లాసీ బ్యాటింగ్. 19వ ఓవర్లో ఇల్లిస్ కట్టుదిట్టమైన బౌలింగ్. మొత్తంగా మా వైపు నుంచి అద్బుత ప్రదర్శన చేశాం. కానీ, టీమిండియా ఆటగాళ్లు మా కంటే మెరుగైన ప్రదర్శన కనబర్చి మాపై పైచేయి సాధించారు. సూర్య విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడినప్పటికీ చివరి బంతి వరకు మ్యాచ్‌ను తీసుకెళ్లామంటే మా ప్రదర్శన బాగానే ఉన్నట్లు అనుకుంటున్నామని వేడ్ అన్నాడు. -
India vs Australia 1st T20I: రింకూ ది ఫినిషర్.. ఆస్ట్రేలియాపై భారత్ విజయం
విశాఖపట్నం వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో 2 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. 209 పరుగుల భారీ లక్ష్యాన్ని 19. 5 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి టీమిండియా ఛేదించింది. భారత బ్యాటర్లలో స్టాండింగ్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 42 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్‌లతో 80 పరుగులు చేసి జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. అతడితో పాటు ఇషాన్ కిషన్(58), రింకూ సింగ్(22) కీలక ఇన్నింగ్స్ ఆడారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి ఏకంగా 208 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో జోష్ ఇంగ్లీష్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. కేవలం 50 బంతుల్లో 9 ఫోర్లు, 8 సిక్స్‌లతో ఇంగ్లీష్ 110 పరుగులు చేశాడు. అతడితో పాటు స్టీవ్ స్మిత్(52), డేవిడ్ (19) పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో బిష్ణోయ్, ప్రసిద్ద్ కృష్ణ తలా వికెట్ సాధించారు. సూర్యకుమార్ యాదవ్ ఔట్.. విజయానికి మరో 15 పరుగులు అవసరమైన సమయంలో సూర్యకుమార్ యాదవ్ వికెట్‌ను టీమిండియా కోల్పోయింది. 80 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్.. బెహ్రెండార్ఫ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి అక్షర్ పటేల్ వచ్చాడు. విజయం దిశగా భారత్.. తొలి టీ20లో టీమిండియా విజయం దిశగా అడుగులు వేస్తోంది. 18 బంతుల్లో భారత్ విజయానికి కేవలం 20 పరుగులు కావాలి. క్రీజులో సూర్యకుమార్ యాదవ్(76), రింకూ సింగ్(11) పరుగులతో ఉన్నారు. నాలుగో వికెట్ డౌన్.. తిలక్ వర్మ ఔట్ 154 పరుగుల వద్ద టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. 12 పరుగులు చేసిన తిలక్ వర్మ.. సంఘా బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. 16 ఓవర్లకు భారత్ స్కోర్: 171/4. టీమిండియా విజయానికి 24 బంతుల్లో 38 పరుగులు కావాలి. క్రీజులో సూర్యకుమార్(65), రింకూ సింగ్(10) పరుగులతో ఉన్నారు. సూర్యకుమార్ హాఫ్ సెంచరీ.. టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 29 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో సూర్య హాఫ్ సెంచరీ సాధించాడు. టీమిండియా మూడో వికెట్ డౌన్.. ఇషాన్ కిషన్ ఔట్ ఇషాన్ కిషన్ రూపంలో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. హాప్ సెంచరీతో అదరగొట్టిన గిల్(39 బంతుల్లో 58).. సంఘా బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. క్రీజులోకి తిలక్ వర్మ వచ్చాడు. భారత విజయానికి 42 బంతుల్లో 74 పరుగులు కావాలి. దూకుడుగా ఆడుతోన్న సూర్యకుమార్, కిషన్ సూర్యకుమార్ యాదవ్(48), ఇషాన్ కిషన్(48) అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడుతున్నారు. వీరిద్దరూ 12 ఓవర్లు ముగిసే సరికి 102 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 12 ఓవర్లకు టీమిండియా స్కోర్: 124/2 9 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 98/2 209 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 9 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి 98 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్(37), ఇషాన్ కిషన్(36) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. భారత్ విజయానికి 66 బంతుల్లో 111 పరుగులు కావాలి. 5 ఓవర్లకు భారత్ స్కోర్: 54/2 5 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 2 వికెట్ల నష్టానికి 54 పరుగులు చేసింది. క్రీజులో సూర్యకుమార్ యాదవ్(18), ఇషాన్ కిషన్(13) పరుగులతో ఉన్నారు. రెండో వికెట్ డౌన్.. జైశ్వాల్ ఔట్ 22 పరుగుల వద్ద 22 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. 21 పరుగులు చేసిన యశస్వీ జైశ్వాల్.. షార్ట్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వచ్చాడు. టీమిండియా తొలి వికెట్ డౌన్.. రుత్‌రాజ్ ఔట్ 209 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. 11 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. రుత్‌రాజ్ గైక్వాడ్ డైమండ్ డక్‌గా వెనుదిరిగాడు. క్రీజులోకి ఇషాన్ కిషన్ వచ్చాడు. చెలరేగిన ఆసీస్ బ్యాటర్లు.. విశాఖ వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి టీ20లో ఆస్ట్రేలియా బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్.. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి ఏకంగా 208 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో జోష్ ఇంగ్లీష్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. కేవలం 50 బంతుల్లో 9 ఫోర్లు, 8 సిక్స్‌లతో ఇంగ్లీష్ 110 పరుగులు చేశాడు. అతడితో పాటు స్టీవ్ స్మిత్(52), డేవిడ్ (19) పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో బిష్ణోయ్, ప్రసిద్ద్ కృష్ణ తలా వికెట్ సాధించారు. ఆసీస్ మూడో వికెట్ డౌన్.. ఆస్ట్రేలియా మూడో వికెట్ కోల్పోయింది. సెంచరీతో విధ్వంసం సృష్టించిన జోష్ ఇంగ్లీష్.. ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 50 బంతుల్లో 9 ఫోర్లు, 8 సిక్స్‌లతో ఇంగ్లీష్ 110 పరుగులు చేశాడు. 19 ఓవర్లకు ఆస్ట్రేలియా స్కోర్: 203/3, క్రీజులో స్టోయినిష్(5), టిమ్ డేవిడ్(10) ఉన్నారు. జోష్ ఇంగ్లీస్ సెంచరీ.. భారీ స్కోర్ దిశగా ఆసీస్ వైజాగ్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి టీ20లో ఆసీస్ వికెట్ కీపర్ బ్యాటర్ జోష్ ఇంగ్లీష్ సెంచరీతో చెలరేగాడు. కేవలం 47 బంతుల్లో 9 ఫోర్లు, 8 సిక్స్‌లతో తన తొలి టీ20 సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 17 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 179/2 ఆసీస్ రెండో వికెట్ డౌన్.. స్మిత్ ఔట్ 161 పరుగుల వద్ద ఆస్ట్రేలియా రెండో వికెట్ కోల్పోయింది. 52 పరుగులు చేసిన స్టీవ్ స్మిత్ రనౌట్ రూపంలో పెవిలియన్‌కు చేరాడు. క్రీజులోకి స్టోయినిష్ వచ్చాడు. దంచి కొడుతున్న ఆస్ట్రేలియా బ్యాటర్లు.. ఆస్ట్రేలియా బ్యాటర్లు దంచి కొడుతున్నారు. ముఖ్యంగా ఆసీస్ వికెట్ కీపర్ బ్యాటర్ జోష్ ఇంగ్లీష్ టీమిండియా బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. బౌండరీలతో బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు. కేవలం 38 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్‌లతో 75 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. అతడితో పాటు స్టీవ్ స్మిత్(40) పరుగులతో క్రీజులో ఉన్నాడు. 14 ఓవర్లకు ఆస్ట్రేలియా స్కోర్: 130/1 దూకుడుగా ఆడుతోన్న ఇంగ్లీష్.. 9 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ వికెట్ నష్టానికి 75 పరుగులు చేసింది. క్రీజులో జోష్ ఇంగ్లీష్(37), స్టీవ్ స్మిత్(23) పరుగులతో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన ఆసీస్.. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన ఆస్ట్రేలియా 31 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. 13 పరుగులు చేసిన మాథ్యూ షార్ట్‌ను రవి బిష్ణోయ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. క్రీజులోకి జోష్ ఇంగ్లీష్ వచ్చాడు. 2 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 20/0 టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన ఆస్ట్రేలియా 2 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 20 పరుగులు చేసింది. క్రీజులో స్టీవ్ స్మిత్(13), మాథ్యూ షార్ట్(4) పరుగులతో ఉన్నారు. భారత్-ఆస్ట్రేలియా మధ్య టీ20 సిరీస్ సమరానికి రంగం సిద్దమైంది. ఈ సిరీస్‌లో భాగంగా విశాఖపట్నం వేదికగా తొలి టీ20లో టీమిండియా-ఆస్ట్రేలియా జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ సిరీస్‌కు రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మ, కోహ్లి, హార్దిక్‌తో పాటు సీనియర్ ఆటగాళ్లు దూరమయ్యారు. దీంతో యువ భారత జట్టుకు సూర్యకుమార్ యాదవ్ సారథ్యం వహిస్తున్నాడు. మరోవైపు వరల్డ్ ఛాంపియన్స్ ఆస్ట్రేలియా జట్టుకు సీనియర్ ఆటగాళ్లు అందుబాటులో లేరు. ఈ సిరీస్‌లో ఆస్ట్రేలియా జట్టును వెటరన్ మాథ్యూ వేడ్ నడిపించనున్నాడు. తుది జట్లు ఆస్ట్రేలియా: మాథ్యూ వేడ్ (కెప్టెన్), జోష్ ఇంగ్లిస్, మాథ్యూ షార్ట్, నాథన్ ఎల్లిస్, సీన్ ఆంథోనీ అబాట్, స్టీవ్ స్మిత్, టిమ్ డేవిడ్, ఆరోన్ హార్డీ, జాసన్ బెహ్రెండార్ఫ్, మార్కస్ స్టోయినిస్, తన్వీర్ సంఘా భారత్: యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకు సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్ -
ఆసీస్‌తో తొలి టీ20.. టీమిండియాలో ఎవరెవరు..?
భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఇవాళ (నవంబర్ 23) తొలి మ్యాచ్ జరుగనుంది. వైజాగ్ వేదికగా జరుగబోయే ఈ మ్యాచ్ రాత్రి 7 గంటల నుంచి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో ఆసీస్‌పై గెలిచి వరల్డ్‌కప్ ఫైనల్లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. ఈ సిరీస్‌లో సూర్యకుమార్ యాదవ్ టీమిండియా సారధిగా వ్యవహరించనున్నాడు. మాథ్యూ వేడ్ ఆసీస్ కెప్టెన్‌గా బరిలో ఉంటాడు. ఈ సిరీస్ కోసం భారత సెలెక్టర్లు సీనియర్లకు విశ్రాంతినిచ్చి యువ జట్టును ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఆసీస్ సైతం పలువురు రెగ్యులర్ ఆటగాళ్లకు విశ్రాంతి కల్పించింది. కెప్టెన్ పాట్ కమిన్స్, వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్, పేసర్లు స్టార్క్, హాజిల్‌వుడ్, ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ వరల్డ్‌కప్ ముగిసిన అనంతరం స్వదేశానికి వెళ్లిపోయారు. వరల్డ్‌కప్ హీరోలు ట్రవిస్ హెడ్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, ఆడమ్ జంపా జట్టులో ఉన్నప్పటికీ వారు తొలి మ్యాచ్ ఆడకపోవచ్చు. ఆసీస్ మేనేజ్మెంట్ వారికి విశ్రాంతి కల్పించవచ్చు. ఆసీస్ ఇన్నింగ్స్‌ను మాథ్యూ షార్ట్, స్టీవ్ స్మిత్ ఆరంభించే అవకాశం ఉంది. ఇతర సభ్యులుగా మ్యాథ్యూ వేడ్, జోష్ ఇంగ్లిస్, ఆరోన్ హర్డీ, మార్కస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్, సీన్ అబాట్, నాథన్ ఇల్లిస్, జేసన్ బెహ్రన్‌డార్ఫ్, తన్వీర్ సంగా బరిలోకి దిగే అవకాశం ఉంది. టీమిండియా విషయానికొస్తే.. ఓపెనింగ్ విషయంలో తీవ్ర పోటీ నెలకొంది. యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్‌లలో ఎవరికి అవకాశం ఇస్తారో వేచి చూడాలి. ఇషాన్ కిషన్‌తో పాటు వీరిద్దరిలో ఎవరో ఒకరు బరిలోకి దిగుతారు. వన్‌డౌన్‌లో తిలక్ వర్మ, ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్, రింకూ సింగ్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, ఆర్షదీప్ సింగ్, ప్రసిద్ద్ కృష్ణ, ముకేశ్ కుమార్ బరిలోకి దిగుతారు. అదనపు బ్యాటర్‌తో బరిలోకి దిగాలనుకుంటే ఓ పేసర్ బదులు రుతురాజ్, యశస్విలలో ఎవరో ఒకరు బరిలోకి దిగుతారు. -
భారత్-ఆసీస్ తొలి టీ20.. వైజాగ్‌లో వాతావరణ పరిస్థితి ఏంటి..?
ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా వైజాగ్‌లోని వైఎస్సార్ ఏసీఏ–వీడీసీఏ స్టేడియం వేదికగా ఇవాళ భారత్-ఆస్ట్రేలియా మధ్య తొలి మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ రాత్రి ఏడు గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే వైజాగ్‌లో ప్రస్తుత వాతావరణ పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉండటంతో మ్యాచ్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనాల కారణంగా వైజాగ్‌లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మ్యాచ్ జరిగే సమయానికి వర్షం పడే అవకాశాలు ఉండటంతో టాస్ ఆలస్యమవ్వవచ్చని స్థానికులు అంటున్నారు. వర్షం కారణంగా మ్యాచ్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదమేమీ లేనప్పటికీ, ప్రస్తుత వాతావరణ పరిస్థితి మాత్రం కాస్త ఆందోళనకరంగానే ఉన్నట్లు సమాచారం. కాగా, భారత సెలెక్టర్లు ప్రధాన ఆటగాళ్లకంతా విశ్రాంతినివ్వడంతో ఈ సిరీస్‌లో యువ జట్టు బరిలోకి దిగనుంది. ఈ జట్టుకు సూర్యకుమార్ యాదవ్ నాయకత్వం వహించనున్నాడు. వరల్డ్‌కప్ ఫైనల్లో ఎదురైన పరాభవం నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న భారత క్రికెటర్లు.. వైజాగ్ టీ20లో ఆసీస్‌ను మట్టికరిపించాలని పట్టుదలగా ఉన్నారు. ఈ సిరీస్ కోసం ఆసీస్ సైతం కొందరు ప్రధాన ఆటగాళ్లకు విశ్రాంతి కల్పించింది. వరల్డ్‌కప్ అనంతరం కెప్టెన్ పాట్ కమిన్స్, వెటరన్ డేవిడ్ వార్నర్, పేసర్లు స్టార్క్, హాజిల్‌వుడ్, ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ స్వదేశానికి వెళ్లిపోయారు. ఈ సిరీస్‌లో మాథ్యూ వేడ్ ఆస్ట్రేలియా కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. తొలి మ్యాచ్‌కు మ్యాక్స్‌వెల్, ట్రవిస్ హెడ్, ఆడమ్ జంపా దూరంగా ఉండనున్నారని సమాచారం. తుది జట్లు (అంచనా).. భారత్: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్ ), ఇషాన్ కిషన్, యశస్వి/రుతురాజ్, తిలక్ వర్మ, శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, ప్రసిధ్ కృష్ణ, ముకేశ్ కుమార్. ఆస్ట్రేలియా: మాథ్యూ వేడ్ (కెప్టెన్ ), స్మిత్, షార్ట్, హార్డీ, ఇన్‌గ్లిస్, స్టొయినిస్, టిమ్ డేవిడ్, సీన్ అబాట్, ఎలిస్, బెహ్రన్‌డార్ఫ్, తన్విర్ సంఘా. -
IND VS AUS 1st T20: మనదే పైచేయి.. విశాఖలోనూ మనోళ్లే..!
భారత్-ఆస్ట్రేలియా మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఇవాళ (నవంబర్ 23) తొలి మ్యాచ్ జరుగనుంది. వైజాగ్ వేదికగా జరుగబోయే ఈ మ్యాచ్ రాత్రి 7 గంటల నుంచి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో ఆసీస్‌పై గెలిచి వరల్డ్‌కప్ ఫైనల్లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. ఈ సిరీస్‌లో సూర్యకుమార్ యాదవ్ టీమిండియా సారధిగా వ్యవహరించనున్నాడు. ఈ సిరీస్ కోసం భారత సెలెక్టర్లు సీనియర్లకు విశ్రాంతినిచ్చి యువ జట్టును ఎంపిక చేశారు. ఆసీస్ సైతం వారి కెప్టెన్ పాట్ కమిన్స్, వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌లకు విశ్రాంతి కల్పించింది. వరల్డ్‌కప్ ఫైనల్ హీరో ట్రవిస్ హెడ్ జట్టులో ఉన్నప్పటికీ తొలి టీ20కి ఆడే అవకాశం లేదు. అతనితో పాటు మ్యాక్స్‌వెల్, ఆడమ్ జంపా విశ్రాంతి తీసుకోనున్నట్లు తెలుస్తుంది. ఆసీస్ తమ రిజర్వ్ బెంచ్ ఆటగాళ్లను తొలి మ్యాచ్‌లో అడించే అవకాశం ఉంది. సీనియర్లకు విశ్రాంతి కల్పించినప్పటికీ టీమిండియా ఆసీస్‌తో పోలిస్తే పటిష్టంగా కనిపిస్తుంది. కెప్టెన్ స్కై, ఇషాన్ కిషన్, యశస్వి, తిలక్ వర్మ, శివమ్ దూబే, రింకూ సింగ్ లాంటి విధ్వంసకర ఆటగాళ్లతో భారత బ్యాటింగ్ చాలా పటిష్టంగా ఉంది. అక్షర్, బిష్ణోయ్‌లతో భారత స్పిన్ విభాగం పటిష్టంగా కనిపిస్తుంది. ఆర్షదీప్, ప్రసిద్ద్, ముకేశ్ కుమార్‌లతో కూడిన పేస్ విభాగమే కాస్త వీక్‌గా ఉంది. మనదే పైచేయి.. ఇరు జట్ల మధ్య జరిగిన టీ20ల తీరును పరిశీలిస్తే.. ఆసీస్‌పై భారత్ స్పష్టమైన ఆధిక్యత కలిగి ఉందని తెలిస్తుంది. ఈ రెండు జట్లు ఇప్పటివరకు 26 టీ20ల్లో ఎదురెదురుపడగా.. భారత్ 15, ఆసీస్ 10 మ్యాచ్‌ల్లో గెలిచాయి. ఓ మ్యాచ్ రద్దైంది. స్వదేశంలో ఆస్ట్రేలియాతో 10 మ్యాచ్‌లు ఆడగా భారత్ 6 మ్యాచ్‌ల్లో గెలిచి, 4 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. విశాఖలోనూ మనోళ్లే..! విశాఖపట్నంలో టీమిండియా ఇప్పటి వరకు మూడు అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడగా రెండింటిలో (2016లో శ్రీలంకపై, 2022లో దక్షిణాఫ్రికాపై) గెలిచి, ఓ మ్యాచ్‌లో (2019లో ఆ్రస్టేలియా) ఓటమిపాలైంది. -
కళ్లు చెదిరే ఫీల్డింగ్.. 35 ఏళ్ల వయసులో విన్యాసాలేంటి బ్రో?
క్రికెట్లో 35 ఏళ్లు దాటాయంటే సదరు ఆటగాళ్లు రిటైర్మెంట్కు దగ్గరైనట్లే. ఈ వయసులో ఫిట్నెస్ను కాపాడుకుంటూ జట్టులో కొనసాగడమే ఒక్కోసారి కష్టంగా మారుతుంటుంది. అలాంటిది ఆస్ట్రేలియా ఆటగాడు మాథ్యూ వేడ్ 35 ఏళ్ల వయసులోనూ తన ఫీల్డింగ్ విన్యాసాలతో అభిమానులను అబ్బురపరుస్తున్నాడు. ప్రస్తుతం వేడ్ హండ్రెడ్ మెన్స్ కాంపిటీషన్ టోర్నీలో లండన్ స్పిరిట్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. బుధవారం లండన్ స్పిరిట్, ఓవల్ ఇన్విజబుల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో వేడ్ సూపర్ ఫీల్డింగ్‌తో మెరిశాడు. ఓవల్ ఇన్విజబుల్స్ ఇన్నింగ్స్ 94వ బంతికి ఇది చోటుచేసుకుంది. జోర్డాన్ థాంప్సన్ వేసిన బంతిని గస్ అత్కిన్సన్ డీప్‌స్వ్కేర్ లెగ్ దిశగా భారీ షాట్ ఆడాడు. అయితే అక్కడే ఉన్న మాథ్యూ వేడ్ అమాంతం గాల్లోకి ఎగిరి ఒంటిచేత్తో బంతిని పట్టుకొని బౌండరీ ఇవతలకు విసిరేశాడు. ఒకవేళ వేడ్ పట్టుతప్పి ఉంటే కచ్చితంగా సిక్స్ వచ్చేదే. కానీ వేడ్ ఫీల్డింగ్ పుణ్యానా కేవలం రెండు పరుగులు మాత్రమే వచ్చాయి. వేడ్ అద్బుత విన్యాసానికి స్టాండ్స్‌లోని ప్రేక్షకులు నోరెళ్లబెట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఓవల్ ఇన్విజబుల్స్ మూడు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన లండన్ స్పిరిట్ వంద బంతుల్లో 131 పరుగులు చేసింది. అనంతరం ఓవల్ ఇన్విజబుల్స్ 99 బంతుల్లో విజయాన్ని అందుకుంది. బౌలింగ్‌లో రెండు వికెట్లు తీయడంతో పాటు బ్యాటింగ్‌లో చివర్లో 5 బంతుల్లో 13 పరుగులు చేసి జట్టును గెలిపించిన నరైన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. We'll have that on repeat, Matthew Wade! 😮💨🔁#TheHundred pic.twitter.com/LvxjWhgP7T — The Hundred (@thehundred) August 2, 2023 చదవండి: WI Vs IND 1st T20: తొలి టి20.. భారత్ ముంగిట అరుదైన రికార్డు; పాక్ మనకంటే ముందే? Lionel Messi: ఏ ముహూర్తంలో జాయిన్ అయ్యాడో కానీ అంతా శుభమే.. -
మాథ్యూ వేడ్ వీరవిహారం.. రసెల్, నరైన్ మెరుపులు వృధా
మేజర్ లీగ్ క్రికెట్-2023 సీజన్లో భాగంగా లాస్ ఏంజెలెస్ నైట్ రైడర్స్‌తో ఇవాళ (జులై 19) జరిగిన మ్యాచ్‌లో శాన్ఫ్రాన్సిస్కో యునికార్న్స్ 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన యునికార్న్స్, నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ మాథ్యూ వేడ్ (41 బంతుల్లో 78; 7 ఫోర్లు, 5 సిక్సర్లు) బౌండరీలు, సిక్సర్లతో వీరవిహారం చేయగా.. మరో ఓపెనర్ ఫిన్ అలెన్ 2 సిక్సర్లు, బౌండరీతో 20 పరుగులు, స్టోయినిస్ 37 (18 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు), కోరె ఆండర్సన్ 39 పరుగులు (20 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు) చేశారు. కెప్టెన్ ఫించ్ 12 పరుగులతో (10 బంతుల్లో 2 ఫోర్లు) అజేయంగా నిలిచాడు. నైట్‌రైడర్స్ బౌలర్లలో ఆడమ్ జంపా 3 వికెట్లు పడగొట్టగా.. అలీ ఖాన్, ఆండ్రీ రసెల్, సునీల్ నరైన్ తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం 213 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నైట్‌రైడర్స్.. 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 191 పరుగులకే పరిమితమైంది. ఆరంభంలో జేసన్ రాయ్ (21 బంతుల్లో 45; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), నితీశ్ కుమార్ (23 బంతుల్లో 31; 3 ఫోర్లు, సిక్స్).. ఆఖర్లో ఆండ్రీ రసెల్ (26 బంతుల్లో 42 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), సునీల్ నరైన్ (17 బంతుల్లో 28 నాటౌట్; 3 సిక్సర్లు) రాణించినప్పటికీ నైట్‌రైడర్స్ విజయతీరాలకు చేరలేకపోయింది. నైట్ రైడర్స్ ఇన్నింగ్స్‌లో రిలీ రొస్సో (8) నిరాశపరిచాడు. యునికార్న్స్ బౌలర్లలో షాదాబ్ ఖాన్ 2 వికెట్లు పడగొట్టగా.. హరీస్ రౌఫ్, బిష్ణోయ్, ఆండర్సన్ తలో వికెట్ చేజిక్కించుకున్నారు. ఈ ఓటమితో నైట్‌రైడర్స్ లీగ్‌లో హ్యాట్రిక్ ఓటములను నమోదు చేసింది. కోల్‌కతా నైట్ రైడర్స్ అనుబంధ ఫ్రాంచైజీ అయిన లాస్ ఏంజెలెస్ నైట్ రైడర్స్ మేజర్ లీగ్ క్రికెట్ సీజన్ 2023లో ఇంకా బోణీ కొట్టాల్సి ఉంది. -
తుస్సుమన్న షాహీన్ అఫ్రిది.. మెరిసిన జేమ్స్ విన్స్, మాథ్యూ వేడ్
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2023 సీజన్లో కరాచీ కింగ్స్ బోణీ కొట్టింది. ఈ సీజన్లో ఆడిన 3 మ్యాచ్‌ల్లో ఓటమిపాలైన కింగ్స్ ఎట్టకేలకు నాలుగో మ్యాచ్‌లో విజయం సాధించింది. లహోర్ ఖలందర్స్‌తో నిన్న (ఫిబ్రవరి 19) జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ 67 పరుగుల తేడాతో విజయ ఢంకా మోగించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కింగ్స్.. ఓపెనర్లు మాథ్యూ వేడ్ (24 బంతుల్లో 36; 4 ఫోర్లు, సిక్స్), జేమ్స్ విన్స్ (36 బంతుల్లో 46; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), కెప్టెన్ ఇమాద్ వసీం (19 బంతుల్లో 35 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. లాహోర్ బౌలర్లలో కెప్టెన్ షాహీన్ అఫ్రిది, జమాన్ ఖాన్, హరీస్ రౌఫ్, లియామ్ డాసన్ తలో వికెట్ పడగొట్టారు. అఫ్రిది వికెట్ పడగొట్టినప్పటికీ ధారళంగా పరుగులు సమర్పించుకున్నాడు. అనంతరం 186 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఖలందర్స్.. కింగ్స్ బౌలర్లు అకీఫ్ జావిద్ (4/28), అమెర్ యామిన్ (2/18), బెన్ కట్టింగ్ (2/12), మహ్మద్ అమీర్ (1/12) ధాటికి 17.3 ఓవర్లలో 118 పరుగులకే కుప్పకూలింది. ఖలందర్స్ ఇన్నింగ్స్‌లో మీర్జా తాహిర్ బేగ్ (39 బంతుల్లో 45; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలువగా.. కమ్రాన్ గులామ్ (23), సికందర్ రజా (18), ఫకర్ జమాన్ (15) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ముల్తాన్ సుల్తాన్స్ టాప్‌లో (4 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో 6 పాయింట్లు) ఉండగా.. కరాచీ కింగ్స్ (4 మ్యాచ్‌ల్లో ఒక్క విజయంతో 2 పాయింట్లు), ఇస్లామాబాద్ యునైటెడ్ (2 మ్యాచ్‌ల్లో ఒక్క విజయంతో 2 పాయింట్లు), క్వెట్టా గ్లాడియేటర్స్ (2 మ్యాచ్‌ల్లో ఒక్క విజయంతో 2 పాయింట్లు), పెషావర్ జల్మీ (2 మ్యాచ్‌ల్లో ఒక్క విజయంతో 2 పాయింట్లు), లాహోర్ ఖలందర్స్ (2 మ్యాచ్‌ల్లో ఒక్క విజయంతో 2 పాయింట్లు) వరుసగా 2 నుంచి 6 స్థానాల్లో ఉన్నాయి. లీగ్‌లో తదుపరి మ్యాచ్‌లో ఇవాళ క్వెట్టా గ్లాడియేటర్స్, పెషావర్ జల్మీ తలపడనున్నాయి. -
IPL 2023: ఆ ఫ్రాంచైజీలకు వారిపై ఎంత నమ్మకమో.. దారుణంగా విఫలమైనా..!
కొచ్చి వేదికగా డిసెంబర్ 23న జరుగబోయే ఐపీఎల్ 2023 సీజన్ మినీ వేలం కోసం ఇప్పటి నుంచే సన్నాహకాలు మొదలయ్యాయి. వేలంలో ప్రక్రియలో భాగంగా ఆటగాళ్లను అట్టిపెట్టుకుని, వదిలించుకునే ప్రాసెస్ రెండు రోజుల కిందటే (నవంబర్ 15) పూర్తయ్యింది. ఇక మిగిలింది మినీ వేలం ప్రక్రియ మాత్రమే. వచ్చే నెలలో జరిగే ఈ తంతులో ఆయా ఫ్రాంచైజీలు వదులుకున్న ఆటగాళ్లతో పాటు కొత్త ఆటగాళ్లు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఐపీఎల్ 16వ ఎడిషన్ భారత్ వేదికగా 2023 మార్చి 20-మే 28 మధ్యలో జరుగనున్న విషయం తెలిసిందే. దాదాపు రెండు నెలల పాటు సాగే ఈ సీజన్లో మొత్తం 74 మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఇదిలా ఉంటే, గత సీజన్లో ఆశించిన మేరకు రాణించలేకపోయినా కొందరు ఆటగాళ్లను ఆయా ప్రాంచైజీలు అట్టిపెట్టుకోవడం విశేషం. 2022 సీజన్లో దారుణంగా విఫలమైన వెంకటేశ్ అయ్యర్ (కేకేఆర్), సునీల్ నరైన్ (కేకేఆర్), మాథ్యూ వేడ్ (గుజరాత్ టైటాన్స్), షారుఖ్ ఖాన్ (పంజాబ్ కింగ్స్), రియాన్ పరాగ్ (రాజస్థాన్ రాయల్స్)లపై సంబంధిత ఫ్రాంచైజీలు పూర్తి నమ్మకంతో వారిని కొనసాగించేందుకు సుముఖత వ్యక్తం చేశాయి. గత రెండు సీజన్లుగా కేకేఆర్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న వెంకటేశ్ అయ్యర్, 2021 సీజన్లో అద్భుతాలు చేసినప్పటికీ.. గత సీజన్లో దారుణంగా విఫలమయ్యాడు. 2022 సీజన్లో అతనాడిన 12 మ్యాచ్‌ల్లో 107.69 స్ట్రయిక్ రేట్‌తో కేవలం 182 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఒకే ఒక హాఫ్ సెంచరీ ఉంది. పార్ట్ టైమ్ ఆల్‌రౌండర్ అయిన అయ్యర్ సీజన్ మొత్తంలో ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు. సునీల్ నరైన్ విషయానికొస్తే.. కేకేఆర్కే ప్రాతినిధ్యం వహించే ఈ విండీస్ ఆల్‌రౌండర్ గత సీజన్లో దారుణంగా నిరాశపరిచాడు. 2022 సీజన్లో అతను ఆడిన 14 మ్యాచ్‌ల్లో కేవలం 71 పరుగులు మాత్రమే చేసి, 9 వికెట్లు పడగొట్టాడు. 11 ఏళ్ల తర్వత ఐపీఎల్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన ఆసీస్ వికెట్‌కీపర్ మాథ్యూ వేడ్.. 2022 సీజన్లో డిఫెండింగ్ ఛాంపియన్స్ గుజరాత్ టైటాన్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఆ సీజన్లో మొత్తం 10 మ్యాచ్‌లు ఆడిన వేడ్.. 113.77 స్ట్రయిక్ రేట్‌తో కేవలం 157 పరుగులు మాత్రమే చేశాడు. వేడ్‌కు 2011 ఐపీఎల్ సీజన్లో ఏమంత మెరుగైన రికార్డు లేదు. ఆ సీజన్లో 3 మ్యాచ్‌లు ఆడిన అతను 66.66 స్ట్రయిక్ రేట్‌తో కేవలం 22 పరుగులు మాత్రమే చేశాడు. 2022 మెగా వేలంలో పంజాబ్ కింగ్స్ ఏకంగా 9 కోట్ల పెట్టి దక్కించుకున్న షారుఖ్ ఖాన్.. గత సీజన్లో 8 మ్యాచ్‌లు ఆడి 108 స్ట్రయిక్ రేట్‌తో కేవలం 117 పరుగులు మాత్రమే చేసి ఫ్రాంచైజీ అతనిపై పెట్టుకున్న ఆశలను అడియాశలు చేశాడు. అండర్-19 వరల్డ్‌కప్ ద్వారా వెలుగులోకి వచ్చి 2019 సీజన్లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన రియాన్ పరాగ్, గత సీజన్లో రాజస్తాన్ రాయల్స్ తరఫున ఘోరంగా విఫలమయ్యాడు. ఆ సీజన్లో 17 మ్యాచ్‌లు ఆడిన పరాగ్ 138. 64 స్ట్రయిక్ రేట్‌తో కేవలం 183 పరుగులు మాత్రమే చేశాడు. బౌలింగ్‌లో ఒక్క వికెట్ దక్కించుకున్నాడు. పై పేర్కొన్న ఐదుగురు ఆటగాళ్లు గత సీజన్లో అట్టర్ ఫ్లాప్ అయినప్పటికీ.. సంబంధిత జట్లు వారిపై విశ్వాసం వ్యక్తం చేసి మరో అవకాశాన్ని ఇచ్చాయి. ముఖ్యంగా భారీ ధర పెట్టి సొంతం చేసుకున్న షారుఖ్ ఖాన్, సునీల్ నరైన్, వెంకటేశ్ అయ్యర్, రియాన్ పరాగ్‌లను వారి ఫ్రాంచైజీలు రిలీజ్ చేయకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. చదవండి: స్టార్ ఆటగాళ్లకు షాకిచ్చిన ఐపీఎల్ జట్లు.. మొత్తం రిటెన్షన్ జాబితా ఇదే! -
అతడిని తప్పించారా? టీమ్ బస్సు మిస్ అయ్యాడా? నాకేం అర్థం కావడం లేదు!
ICC Mens T20 World Cup 2022- Australia vs Afghanistan: టీ20 ప్రపంచకప్-2022 టోర్నీలో ముందుకు సాగాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్‌ను తప్పించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అతడు లేకపోవడం జట్టుకు పెద్ద లోటు అని, ఒంటిచేత్తో టీమ్‌ను గెలిపించగల సత్తా ఉన్న బౌలర్‌ను పక్కనపెట్టడం ఏమిటని క్రీడా పండితులు ప్రశ్నిస్తున్నారు. కాగా గ్రూప్-1లో ఉన్న డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా.. అఫ్గనిస్తాన్‌తో శుక్రవారం నాటి మ్యాచ్‌లో తప్పక గెలవాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో భారీ తేడాతో విజయం సాధిస్తేనే సెమీస్ ఆశలు సజీవంగా ఉంటాయి. ఇలాంటి తరుణంలో కెప్టెన్ ఆరోన్ ఫించ్ గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. దీంతో వికెట్ కీపర్ బ్యాటర్ మాథ్యూ వేడ్ సారథ్య బాధ్యతలు చేపట్టాడు. ఇక టిమ్ డేవిడ్ స్థానంలో స్టీవ్ స్మిత్ జట్టులోకి రాగా.. స్టార్క్ స్థానంలో కేన్ రిచర్డ్సన్ను తుది జట్టులోకి తీసుకున్నట్లు వేడ్ వెల్లడించాడు. ఫించ్ స్థానాన్ని కామెరూన్ గ్రీన్‌తో భర్తీ చేసినట్లు తెలిపాడు. ఈ నేపథ్యంలో కీలక మ్యాచ్‌లో స్టార్క్ లేకపోవడంపై ఆసీస్ మాజీలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ మేరకు మార్క్ వా ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. ‘‘ఆసీస్ జట్టులో మిచెల్ స్టార్క్ లేడు. అతడు గాయపడ్డాడా లేదంటే తప్పించారా?’’ అని అసహనం వ్యక్తం చేశాడు. ఇక టామ్ మూడీ సైతం... ‘‘మిచెల్ స్టార్క్‌ను తప్పించారా లేదంటే అతడు టీమ్ బస్ మిస్సయ్యాడా’’ అంటూ సెటైరికల్‌గా ట్వీట్ చేశాడు. ఇక మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ సైతం స్టార్క్ తుది జట్టులో లేకపోవడంపై విస్మయం వ్యక్తం చేశాడు. ‘‘తను లేకుండా ఈరోజు మ్యాచ్ జరుగుతుందని నేను అనుకోవడం లేదు. కేవలం గాయపడితే తప్ప తనను పక్కనపెట్టడం సాధ్యం కాదు. అఫ్గనిస్తాన్ బ్యాటింగ్ ఆర్డర్‌ను కుప్పకూల్చ గల బౌలర్ తను. అతడు లేకుండా ఆసీస్ మ్యాచ్ ఆడటం ఏమిటో నాకైతే ఏం అర్థం కావడం లేదు’’ అని ఈ కామెంటేటర్ పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే.. స్టార్క్ వంటి కీలక బౌలర్‌ను తప్పించిన ఆసీస్ భారీ మూల్యం చెల్లించకతప్పదంటూ అతడి ఫ్యాన్స్ క్రికెట్ ఆస్ట్రేలియాపై మండిపడుతున్నారు. కాగా ప్రపంచకప్ టోర్నీలో స్టార్క్ ఇప్పటి వరకు మూడు వికెట్లు మాత్రమే పడగొట్టాడు. ఇక ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో ఆరంభంలో 2 వికెట్లు తీసినా 4 ఓవర్లలో ఏకంగా 43 పరుగులు సమర్పించుకుని తేలిపోయాడు. ఈ నేపథ్యంలో అఫ్గన్‌తో మ్యాచ్‌లో అతడికి చోటు లేకపోవడం గమనార్హం. ఇదిలా ఉంటే.. అఫ్గనిస్తాన్‌తో కీలక పోరులో నిర్ణీత 20 ఓవర్లలో ఆస్ట్రేలియా 8 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. చదవండి: T20 WC 2022 Final: టీమిండియాతో ఫైనల్ ఆడే జట్టు ఇదేనన్న ఆసీస్ దిగ్గజం.. అయితే! Aussie team no Mitchell Starc. Is he injured or dropped.? — Mark Waugh (@juniorwaugh349) November 4, 2022 Mitchell Starc dropped or just miss the team bus? #AUSvAFG #ICCT20WorldCup — Tom Moody (@TomMoodyCricket) November 4, 2022 -
ఆసీస్‌కు భారీ షాక్.. మరో ప్లేయర్‌కు కరోనా, బ్యాకప్ కూడా లేడు..!
టీ20 వరల్డ్‌కప్-2022లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాను కరోనా మహమ్మారి పట్టి పీడిస్తుంది. శ్రీలంకతో మ్యాచ్‌కు ముందు స్టార్ స్పిన్నర్ ఆడమ్ జంపా కోవిడ్ బారిన పడగా.. రేపు (అక్టోబర్ 28)ఇంగ్లండ్‌తో జరుగబోయే కీలక పోరుకు ముందు జట్టులో ఉన్న ఏకైక వికెట్ కీపర్ మాథ్యూ వేడ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ఱారణ అయ్యింది. జట్టులో బ్యాకప్ వికెట్‌కీపర్ కూడా లేకపోవడంతో ఆసీస్ యాజమాన్యం ఆందోళన చెందుతుంది. తొలుత వరల్డ్‌కప్ స్క్వాడ్‌లో బ్యాకప్ వికెట్‌కీపర్‌గా జోష్ ఇంగ్లిస్‌ను ఎంపిక చేసినప్పటికీ.. గాయం కారణంగా అతను టోర్నీ ఆరంభానికి ముందే నిష్క్రమించాడు. ఈ గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆసీస్ యాజమాన్యం వేడ్నే ఎలాగైనా బరిలోకి దించాలని యోచిస్తుంది. ప్రస్తుతానికి వేడ్‌లో కోవిడ్ లక్షణాలు స్వల్పంగానే ఉన్నాయని, ఇంగ్లండ్‌తో మ్యాచ్ చాలా కీలకం కావడంతో వేడ్‌ను తప్పనిసరిగా బరిలోకి దించే అవకాశం ఉందని క్రికెట్ ఆస్ట్రేలియాకు చెందిన కీలక వ్యక్తి వెల్లడించారు. ఒకవేళ మ్యాచ్ సమయానికి వేడ్‌లో కోవిడ్ లక్షణాలు అధికమైతే.. అతని స్థానంలో మ్యాక్స్‌వెల్, వార్నర్‌లతో ఎవరో ఒకరికి కీపింగ్ బాధ్యతలు అప్పజెప్పాలని సీఏ భావిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే ఇవాళ మ్యాక్స్‌వెల్, వార్నర్ ఇద్దరూ కీపింగ్ ప్రాక్టీస్ కూడా చేశారు. కాగా, కోవిడ్ బారిన పడ్డ ఆటగాళ్లు కూడా బరిలోకి దిగవచ్చని ఇటీవలే ఐసీసీ ప్రకటించిన విషయం తెలిసిందే. అక్టోబర్ 23న శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఐర్లాండ్ ఆల్‌రౌండర్ జార్జ్ డాక్రెల్ కోవిడ్ నిర్ధారణ అయ్యినప్పటికీ బరిలోకి దిగాడు. ఇదిలా ఉంటే, టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో చిత్తైన ఆతిధ్య జట్టుకు.. ఇంగ్లండ్‌పై గెలిస్తేనే సెమీస్ అవకాశాలు మెరుగవుతాయి. కాబట్టి రేపటి మ్యాచ్‌లో ఆసీస్ ఎలాంటి ప్రయోగాలకు పోకుండా పూర్తి స్థాయి జట్టుతో బరిలోకి దిగాలని యోచిస్తుంది. -
మాథ్యూ వేడ్ తొండాట.. క్యాచ్ పట్టబోయిన మార్క్ వుడ్‌ను తోసేసి..!
AUS VS ENG 1st T20: 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడేందుకు ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న ఇంగ్లండ్ ఇవాళ (అక్టోబర్ 9) తొలి మ్యాచ్ ఆడింది. ఆథ్యంతం ఉత్కంఠభరితంగా సాగిన ఈ హై స్కోరింగ్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. ఓపెనర్లు జోస్ బట్లర్ (32 బంతుల్లో 68; 8 ఫోర్లు, 4 సిక్సర్లు), అలెక్స్ హేల్స్ (51 బంతుల్లో 84; 12 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 208 పరుగుల భారీ స్కోర్ చేయగా.. ఛేదనలో ఆసీస్ వీరోచితంగా పోరాడి ఓడింది. ఈ మ్యాచ్‌లో ఆసీస్ లక్ష్యాన్ని ఛేదిస్తున్న సందర్భంగా చోటు చేసుకున్న ఓ సన్నివేశం ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. వుడ్ వేసిన ఇన్నింగ్స్ 17వ ఓవర్ మూడవ బంతికి వేడ్ పుల్ షాట్ ఆడే ప్రయత్నం చేయగా.. బంతి టాప్ ఎడ్జ్ తీసుకుని గాల్లోకి లేచింది. క్యాచ్ అందుకునేందుకు వుడ్ స్ట్రయికర్ ఎండ్‌కు పరుగెడుతుండగా.. అప్పటికీ క్రీజ్ దిశగా బయల్దేరిన వేడ్.. వుడ్‌ను ఉద్దేశపూర్వకంగా గట్టిగా తోసేసి క్యాచ్ నేలపాలయ్యేలా చేశాడు. The CEO of Sportsman Spirit, M Wade, stopping M Wood from catching the ball!!The OZs@azkhawaja1 pic.twitter.com/zAsJl6gpqz— WaQas Ahmad (@waqasaAhmad8) October 9, 2022 ఐసీసీ నిబంధనల ప్రకారం క్యాచ్ అందుకునేందుకు ప్రయత్నిస్తున్న ఫీల్డర్ని ఉద్దేశపూర్వకంగా ఆపితే సదరు బ్యాటర్‌ని అవుట్‌గా ప్రకటిస్తారు. అయితే ఇక్కడ ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ అప్పీల్ చేయకపోవడంతో చేసేదేమీ లేక అంపైర్లు మ్యాచ్‌ను కొనసాగించారు. మ్యాచ్ అనంతరం బట్లర్‌ను ఈ విషయమై ప్రశ్నించగా.. ఆసీస్ పర్యటనలో ఈ సిరీస్‌తో పాటు వరల్డ్‌కప్ కూడా ఆడాల్సి ఉన్నందున విషయాన్ని పెద్దది చేయదల్చుకోలేదని సమాధానం చెప్పాడు. కాగా, ఇంగ్లండ్ నిర్దేశించిన 209 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఆరంభం నుంచే ప్రత్యర్ధిపై ఎదురుదాడికి దిగింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ (44 బంతుల్లో 73; 8 ఫోర్లు, 2 సిక్సర్లు), ఆతర్వాత మిచెల్ మార్ష్ (26 బంతుల్లో 36; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), స్టోయినిస్ (15 బంతుల్లో 35; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో ఓ దశలో ఆసీస్ సునాయాసంగా గెలిచేలా కనిపించింది. అయితే ఆఖర్లో మార్క్ వుడ్ (3/34) వరుస క్రమంలో వికెట్లు తీయడంతో ఆసీస్ లక్ష్యానికి 9 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఆసీస్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసి 8 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. -
ఉత్కంఠపోరులో విండీస్‌పై ఆసీస్ విజయం
క్వీన్స్‌ల్యాండ్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20లో ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అఖరి వరకు ఉత్కంత భరితంగా జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బ్యాటర్ మాథ్యూ వేడ్ తమ జట్టును విజయ తీరాలకు చేర్చాడు. అఖరి ఓవర్లో విజయానికి 11 పరుగులు అవసరమ్వగా.. వేడ్, స్టార్క్ తమ జట్టు విజయాన్ని లాంఛనం చేశారు. 147 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 58 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్రమంలో ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్, వేడ్ ఇన్నింగ్స్‌ను చక్క దిద్దారు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 69 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. అనంతరం ఫించ్ ఔటైనప్పటికీ.. వేడ్ మాత్రం ఆచితూచి ఆడూతూ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఫించ్ 52 బంతుల్లో 58 పరుగులు చేయగా.. వేడ్ 29 బంతుల్లో 39 పరుగులు సాధించాడు. కాగా విండీస్ బౌలర్లలో కాట్రెల్, జోషఫ్ తలా రెండు వికెట్లు సాధించగా.. హోల్డర్, కారియా, స్మిత్ చెరో వికెట్ సాధించారు. ఇక అంతకుముందు బ్యాటింగ్ చేసిన విండీస్.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 145 పరుగులు చేసింది. విండీస్ బ్యాటర్లలో కైల్ మైయర్స్ 39 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో జోష్ హాజిల్ వుడ్ మూడు వికెట్లతో అదరగొట్టగా.. స్టార్క్, కమ్మిన్స్ చెరో రెండు వికెట్లు సాధించారు. చదవండి: Womens Asia Cup 2022: పాకిస్తాన్‌కు భారీ షాకిచ్చిన థాయ్‌లాండ్.. క్రికెట్ చరిత్రలో తొలి విజయం -
T20 World Cup 2022: ఆస్ట్రేలియా బ్యాకప్ కెప్టెన్‌గా మథ్యూ వేడ్!
టీ20 ప్రపంచకప్-2022లో ఆస్ట్రేలియా బ్యాకప్ కెప్టెన్‌గా వికెట్ కీపర్ మాథ్యూ వేడ్ ఎంపికయ్యే అవకాశం ఉంది. ఈ విషయాన్ని సిడ్నీ మార్నింగ్ ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా ఈ మెగా ఈవెంట్లో రెగ్యులర్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ గాయపడిన లేదా మరే ఇతర కారణాల వల్ల జట్టుకు దూరమైతే వేడ్ సారథ్య బాధ్యతలు చేపట్టనున్నాడు. కాగా వేడ్ ప్రస్తుతం తన కెరీర్లోనే అత్యున్నత ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవల టీమిండియాతో జరిగిన టీ20 సిరీస్‌లోనూ వేడ్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఇక అంతకుముందు 2020లో సిడ్నీ వేదికగా భారత్‌తో జరిగిన ఓ టీ20 మ్యాచ్‌లో ఆసీస్ జట్టు కెప్టెన్‌గా వేడ్ బాధ్యతలు నిర్వహించాడు. అదే విధంగా దేశీవాళీ టోర్నీల్లో కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహించిన అనుభవం కూడా ఉంది. మరోవైపు బిగ్‌బాష్ లీగ్‌లో హోబర్ట్ హరికేన్స్ సారథిగా వేడ్ కొనసాగుతున్నాడు. ఇది ఇలా ఉండగా.. క్రికెట్ ఆస్ట్రేలియా సెంట్రల్ కాంట్రక్ట్ జాబితాలో వేడ్ లేక పోవడం గమనార్హం. ఈ ఏడాది ఆరంభంలో క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించిన సెంట్రల్ కాంట్రక్ట్ లిస్ట్ లో వేడ్ పేరు లేదు. ప్రస్తుతం వేడ్ కేవలం ఇంక్రిమెంటల్ కాంట్రాక్టును మాత్రమే కలిగి ఉన్నాడు. చదవండి: IND Vs SA: పద్మనాభస్వామి ఆలయంలో సందడి చేసిన దక్షిణాఫ్రికా స్టార్ స్పిన్నర్ -
హార్ధిక్, రాహుల్ మెరుపులు వృధా.. తొలి టి20లో టీమిండియా ఓటమి
ఆస్ట్రేలియాపై టి20ల్లో అత్యధిక స్కోరు సాధించిన ఆనందం భారత్‌కు దక్కలేదు. హార్దిక్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ దూకుడైన బ్యాటింగ్‌తో 208 పరుగులు సాధించినా అవి విజయానికి సరిపోలేదు. బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్, వేగవంతమైన అవుట్ ఫీల్డ్‌పై అదే రీతిలో జవాబిచ్చిన ఆస్ట్రేలియా భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో సఫలమైంది. ఆరంభంలో గ్రీన్, చివర్లో వేడ్ చెలరేగి ఆ జట్టుకు సిరీస్‌లో ఆధిక్యాన్ని అందించారు. ఇద్దరు ప్రధాన పేసర్లు భువనేశ్వర్, హర్షల్ కలిపి ఒక్క వికెట్ తీయకుండా 8 ఓవర్లలో 101 పరుగులు ఇవ్వడం టీమిండియా ఓటమికి ప్రధాన కారణంగా నిలిచింది. తాజా మ్యాచ్ ఫలితం ప్రపంచకప్‌కు ముందు భారత్ సరిదిద్దుకోవాల్సిన లోపాలను గుర్తు చేసింది. మొహాలి: భారత్‌పై టి20 సిరీస్‌లో ఆస్ట్రేలియా శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన తొలి మ్యాచ్‌లో ఆసీస్ నాలుగు వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా (30 బంతుల్లో 71 నాటౌట్; 7 ఫోర్లు, 5 సిక్స్‌లు), కేఎల్ రాహుల్ (35 బంతుల్లో 55; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు చేయగా, సూర్యకుమార్ యాదవ్ (25 బంతుల్లో 46; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) రాణించాడు. అనంతరం ఆస్ట్రేలియా 19.2 ఓవర్లలో 6 వికెట్లకు 211 పరుగులు సాధించి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కామెరాన్ గ్రీన్ (30 బంతుల్లో 61; 8 ఫోర్లు, 4 సిక్స్‌లు), మాథ్యూ వేడ్ (21 బంతుల్లో 45 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), స్టీవ్ స్మిత్ (24 బంతుల్లో 35; 3 ఫోర్లు, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఇరు జట్ల మధ్య రెండో టి20 శుక్రవారం నాగపూర్‌లో జరుగుతుంది. రాహుల్ అర్ధ సెంచరీ... భారత్ ఇన్నింగ్స్ ధాటిగా ప్రారంభమైనా... తక్కువ వ్యవధిలోనే రోహిత్ (11), కోహ్లి (2) వెనుదిరిగారు. అయితే మరో ఎండ్‌లో రాహుల్ ఆరంభం నుంచే దూకుడు ప్రదర్శించాడు. తన స్ట్రయిక్‌రేట్‌పై వస్తున్న విమర్శలకు సమాధానాలివ్వాలనే కసి అతనిలో కనిపించింది. సూర్యకుమార్ కూడా తనదైన శైలిలో మెరుపు షాట్లు ఆడటంతో స్కోరు వేగంగా దూసుకుపోయింది. పవర్‌ప్లేలో భారత్ 46 పరుగులు చేయగా, 10 ఓవర్లలో స్కోరు 86 పరుగులకు చేరింది. 32 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించిన రాహుల్ ఈ క్రమంలో అంతర్జాతీయ టి20ల్లో 2 వేల పరుగులు కూడా పూర్తి చేసుకున్నాడు. అయితే మరో భారీ షాట్‌కు ప్రయత్నించి అతను వెనుదిరగ్గా, జంపా ఓవర్లో రెండు భారీ సిక్సర్లు కొట్టిన సూర్యకుమార్ త్రుటిలో అర్ధ సెంచరీని చేజార్చుకున్నాడు. ఆ తర్వాత హార్దిక్ విధ్వంసకర బ్యాటింగ్‌తో భారత్ భారీ స్కోరు సాధించగలిగింది. చివరి 7 ఓవర్లలో భారత్ 89 పరుగులు సాధించగా, ఇందులో హార్దిక్ ఒక్కడే 69 పరుగులు చేయడం విశేషం. హాజల్‌వుడ్ ఓవర్లో 2 ఫోర్లు, కమిన్స్ ఓవర్లో 6, 4 కొట్టిన అతను 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీని అందుకున్నాడు. గ్రీన్ వేసిన ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో చివరి 3 బంతులను అతను వరుసగా 6, 6, 6 బాది ఘనంగా ఇన్నింగ్స్‌ను ముగించాడు. టి20ల్లో ఆస్ట్రేలియాపై భారత్‌కు ఇదే అత్యధిక స్కోరు. గాయం నుంచి కోలుకున్న బుమ్రాను ముందు జాగ్రత్తగా భారత్ ఈ మ్యాచ్‌లో ఆడించలేదు. వేడ్ మెరుపులు... భువనేశ్వర్ వేసిన ఇన్నింగ్స్ తొలి బంతినే సిక్సర్‌గా మలచిన ఆరోన్ ఫించ్ (13 బంతుల్లో 22; 3 ఫోర్లు, 1 సిక్స్) అతని మలి ఓవర్లో 3 ఫోర్లు కొట్టాడు. మరోవైపు మూడున్నరేళ్ల తర్వాత తొలి అంతర్జాతీయ టి20 మ్యాచ్ ఆడిన ఉమేశ్ యాదవ్ తన తొలి ఓవర్లోనే గ్రీన్‌కు నాలుగు ఫోర్లు సమర్పించుకున్నాడు. ఫించ్‌ను అవుట్ చేసి అక్షర్ ప్రత్యర్థి జోరుకు బ్రేక్ వేసినా... గ్రీన్, స్మిత్ భాగస్వామ్యం (40 బంతుల్లో 70 పరుగులు) ఆసీస్‌ను విజయం వైపు నడిపించింది. అక్షర్, రాహుల్ చెరో క్యాచ్ వదిలేయడం కూడా ప్రత్యర్థికి కలిసొచ్చింది. చహల్ ఓవర్లో 2 సిక్స్‌లు, ఫోర్ కొట్టిన గ్రీన్, అక్షర్ బౌలింగ్‌లో భారీ సిక్సర్‌తో 26 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 10 ఓవర్లలో స్కోరు 109 పరుగులకు చేరింది. విజయానికి 60 బంతుల్లో 109 పరుగులు చేయాల్సి ఉండగా, 14 పరుగుల వ్యవధిలో 3 వికెట్లు తీసి భారత్ కాస్త ఒత్తిడి పెంచింది. గ్రీన్‌ను అక్షర్ అవుట్ చేయగా... ఉమేశ్ ఒకే ఓవర్లో స్మిత్, మ్యాక్స్‌వెల్ (1)లను వెనక్కి పంపాడు. ఈ రెండు నిర్ణయాలు డీఆర్ఎస్ ద్వారానే భారత్‌కు అనుకూలంగా రాగా, ఇన్‌గ్లిస్ (17) కూడా ఎక్కువసేపు నిలవలేకపోయాడు. అయితే వేడ్ మెరుపు బ్యాటింగ్ మ్యాచ్‌ను మలుపు తిప్పింది. భువీ ఓవర్లో రెండు ఫోర్ల తర్వాత హర్షల్ ఓవర్లో రెండు భారీ సిక్సర్లు బాదిన అతను... భువీ వేసిన 19వ ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు కొట్టడంతో ఆసీస్ గెలుపు ఖాయమైంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) స్కోరు వివరాలు... భారత్ ఇన్నింగ్స్: రాహుల్ (సి) ఎలిస్ (బి) హాజల్‌వుడ్ 55; రోహిత్ (సి) ఎలిస్ (బి) హాజల్‌వుడ్ 11; కోహ్లి (సి) గ్రీన్ (బి) ఎలిస్ 2; సూర్యకుమార్ (సి) వేడ్ (బి) గ్రీన్ 46; హార్దిక్ (నాటౌట్) 71; అక్షర్ (సి) గ్రీన్ (బి) ఎలిస్ 6; కార్తీక్ (ఎల్బీ) (బి) ఎలిస్ 6; హర్షల్ (నాటౌట్) 7; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 208. వికెట్ల పతనం: 1–21, 2–35, 3–103, 4–126, 5–146, 6–176. బౌలింగ్: హాజల్‌వుడ్ 4–0–39–2, కమిన్స్ 4–0–47–0, జంపా 4–0–36–0, ఎలిస్ 4–0–30–3, గ్రీన్ 3–0–46–1, మ్యాక్స్‌వెల్ 1–0–10–0. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: ఫించ్ (బి) అక్షర్ 22; గ్రీన్ (సి) కోహ్లి (బి) అక్షర్ 61; స్మిత్ (సి) కార్తీక్ (బి) ఉమేశ్ 35; మ్యాక్స్‌వెల్ (సి) కార్తీక్ (బి) ఉమేశ్ 1; ఇన్‌గ్లిస్ (బి) అక్షర్ 17; టిమ్ డేవిడ్ (సి) హార్దిక్ (బి) చహల్ 18; వేడ్ (నాటౌట్) 45; కమిన్స్ (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (19.2 ఓవర్లలో 6 వికెట్లకు) 211. వికెట్ల పతనం: 1–39, 2–109, 3–122, 4–123, 5–145, 6–207. బౌలింగ్: భువనేశ్వర్ 4–0–52–0, ఉమేశ్ యాదవ్ 2–0–27–2, అక్షర్ పటేల్ 4–0–17–3, చహల్ 3.2–0–42–1, హర్షల్ పటేల్ 4–0–49–0, హార్దిక్ పాండ్యా 2–0–22–0. -
SL Vs Aus: అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. సిరీస్ ఆస్ట్రేలియాదే!
Australia tour of Sri Lanka, 2022- కొలంబో: శ్రీలంకతో జరుగుతున్న మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్‌ను ఆస్ట్రేలియా మరో మ్యాచ్ మిగిలుండగానే 2–0తో కైవసం చేసుకుంది. కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో బుధవారం జరిగిన రెండో టి20లో ఆసీస్ 3 వికెట్లతో గెలిచింది. మొదట లంక 20 ఓవర్లలో 9 వికెట్లకు 124 పరుగులు చేసింది. అసలంక (39), కుశాల్ మెండిస్ (36) రాణించారు. కేన్ రిచర్డ్సన్ 4 వికెట్లు తీశాడు. తర్వాత ఆసీస్ 17.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 126 పరుగులు చేసి గెలిచింది. 26 బంతులు ఎదుర్కొని 26 పరుగులు సాధించిన ఆసీస్ వికెట్ కీపర్ బ్యాటర్ మాథ్యూ వేడ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. లంక ఆల్‌రౌండర్ వనిందు హసరంగకు నాలుగు వికెట్లు దక్కాయి. ఈ నేపథ్యంలో ఓటమిపై స్పందించిన ఆతిథ్య శ్రీలంక జట్టు కెప్టెన్ దసున్ షనక.. టాపార్డర్ విఫలం కావడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇక ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ మాట్లాడుతూ.. తమ బౌలింగ్ విభాగం అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుందని బౌలర్లను కొనియాడాడు. శ్రీలంకను తక్కువ స్కోరుకే పరిమితం చేశారన్న ఫించ్.. మాథ్యూ వేడ్ అనుభవం జట్టును విజయాలకు చేర్చడంలో ఉపకరించిందని పేర్కొన్నాడు. కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆస్ట్రేలియా పర్యటనలో 4-1 తేడాతో సిరీస్ చేజార్చుకున్న లంక రాత స్వదేశంలోనైనా మారుతుందనుకుంటే అలా జరుగలేదు. ఆఖరి మ్యాచ్ మిగిలి ఉండగానే పర్యాటక ఆసీస్ జట్టు సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇక నామమాత్రపు మూడో టీ20 మ్యాచ్ జూన్ 11న పల్లెకెలెలో జరుగుతుంది. శ్రీలంక వర్సెస్ ఆస్ట్రేలియా రెండో టీ20: టాస్- ఆస్ట్రేలియా- తొలుత బౌలింగ్ శ్రీలంక స్కోరు: 124/9 (20) ఆస్ట్రేలియా స్కోరు: 126/7 (17.5) చదవండి: Mithali Raj: మిథాలీరాజ్ పెళ్లి చేసుకోకపోవడం వెనుక కారణం? Ind Vs SA: కుర్రాళ్లకు భలే చాన్సులే.. ఇక్కడ మెరిస్తే డైరెక్ట్‌గా ఆస్ట్రేలియాకు! -
Matthew Wade: డ్రెస్సింగ్ రూమ్ వినాశనం; వార్నింగ్‌తో సరి..
గుజరాత్ టైటాన్స్ వికెట్ కీపర్ మాథ్యూ వేడ్ తాను ఔట్ కాదంటూ డ్రెస్సింగ్ రూమ్‌లో చేసిన రచ్చ సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. థర్డ్ అంపైర్ తప్పుడు నిర్ణయానికి బలైన వేడ్ తన కోపాన్ని డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లాకా హెల్మెట్, బ్యాట్‌పై చూపించాడు. వాటిని విసిరేసి.. బ్యాట్‌ను పలుమార్లు నేలకేసి కొడుతూ అసహనం వ్యక్తం చేశాడు. కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక వినాశనం సృష్టించిన వేడ్‌ను ఐపీఎల్ మేనేజ్మెంట్ హెచ్చరికతో సరిపెట్టింది. డ్రెస్సింగ్‌రూమ్‌లో బ్యాట్‌ను, హెల్మెట్‌ను విసిరేసి వేడ్ ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లెవెల్-1 నిబంధన ఉల్లఘించాడు. అయితే ఎవరిపై తన కోపాన్ని వ్యక్తం చేయకుండా.. కేవలం తన వస్తువులను మాత్రమే నాశనం చేశాడు. దీనిని పరిగణలోకి తీసుకొని వేడ్‌ది మొదటి తప్పుగా భావిస్తూ హెచ్చరికతో వదిలేస్తున్నామని.. ఎటువంటి జరిమానా విధించడం లేదని ఐపీఎల్ మేనేజ్మెంట్ తెలిపింది. PC: IPL Twitter ఈ సీజన్లో మాథ్యూ వేడ్ పెద్దగా రాణించింది లేదు. అసలే సరిగా ఆడడం లేదన్న బాధ.. థర్డ్ అంపైర్ నిర్ణయం వేడ్‌కు మరింత చికాకు తెప్పించాయి. అందుకే సహనం కోల్పోయిన వేడ్ డ్రెస్సింగ్‌రూమ్‌లో తన కోపాన్ని ప్రదర్శించాడు. ఆ సమయంలో పక్కన ఎవరైన ఉండి అతను గాయపడితే పరిస్థితి వేరుగా ఉండేదే. ఇక మ్యాచ్‌లో 16 పరుగులు చేసిన వేడ్ మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. ఇక మ్యాచ్‌లో ఆర్సీబీ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత టైటాన్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 168 పరుగులు చేసింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా (47 బంతుల్లో 62 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), మిల్లర్ (25 బంతుల్లో 34; 3 సిక్సర్లు) రాణించారు. తర్వాత బెంగళూరు 18.4 ఓవర్లలో 2 వికెట్లే కోల్పోయి 170 పరుగులు చేసి గెలిచింది. కోహ్లి (54 బంతుల్లో 73; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) పాత కోహ్లిలా చెలరేగాడు. డుప్లెసిస్ (38 బంతుల్లో 44; 5 ఫోర్లు) రాణించాడు. బౌలింగ్‌లో కీలకమైన వికెట్, అద్భుతమైన క్యాచ్ పట్టిన మ్యాక్స్‌వెల్ (18 బంతుల్లో 40 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుపు బ్యాటింగ్‌తో జట్టును చకచకా లక్ష్యానికి చేర్చాడు. చదవండి: IPL 2022: మరోసారి చెత్త అంపైరింగ్.. కోపంతో రగిలిపోయిన మాథ్యూ వేడ్ pic.twitter.com/IOmnppKBWb — Cred Bounty (@credbounty) May 19, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4301451426.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
మరోసారి చెత్త అంపైరింగ్.. కోపంతో రగిలిపోయిన మాథ్యూ వేడ్
ఐపీఎల్ 2022 సీజన్లో అంపైర్లు తీసుకున్న కొన్ని నిర్ణయాలు వివాదాస్పదంగా మారాయి. బ్యాట్స్‌మన్ రివ్యూలు తీసుకున్నప్పటికి డీఆర్ఎస్లు సరిగా పనిచేయక ఇబ్బంది కలిగిస్తున్నాయి. తాజాగా గుజరాత్ టైటాన్స్, ఆర్సీబీ మధ్య మ్యాచ్‌లో అలాంటి ఘటనే చోటుచేసుకుంది. 16 పరుగులు చేసిన మాథ్యూ వేడ్ థర్డ్ అంపైర్ వివాదాస్పద నిర్ణయానికి బలయ్యాడు. విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్ ఆరో ఓవర్ మ్యాక్స్‌వెల్ వేశాడు. ఓవర్ రెండో బంతిని స్వీప్‌షాట్ ఆడే ప్రయత్నంలో బంతి బ్యాట్‌కు తాకి ప్యాడ్లను తాకింది. దీంతో ఆర్సీబీ అప్పీల్ వెళ్లగా.. ఫీల్డ్ అంపైర్ ఔట్ ఇచ్చాడు. అయితే వేడ్ వెంటనే రివ్యూకు వెళ్లాడు. రిప్లేలో బంతి బ్యాట్‌కు తగిలినట్లు కనిపించినా అల్ట్రాఎడ్జ్‌లో ఎక్కడా స్పైక్ కనిపించలేదు. ఆ తర్వాత బంతి ఆఫ్‌స్టంప్‌ను ఎగురగొట్టినట్లు చూపించింది. థర్డ్ అంపైర్ మాత్రం ఫీల్డ్ అంపైర్ నిర్ణయానికి కట్టుబడి ఔట్ ఇచ్చాడు. థర్డ్ అంపైర్ నిర్ణయంతో షాక్ తిన్న వేడ్..ఇదేం నిర్ణయం అంటూ భారంగా పెవిలియన్ చేరాడు. డ్రెస్సింగ్ రూమ్‌కు చేరుకున్న వేడ్.. చీటింగ్ అంటూ థర్డ్ అంపైర్‌పై కోపంతో రగిలిపోయాడు. హెల్మెట్‌ను నేలకేసి కొట్టిన వేడ్.. ఆ తర్వాత బ్యాట్‌ను కూడా కోపంతో విసిరేయడం కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇటీవలే ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ క్యాచ్ ఔట్ విషయంలో థర్డ్ అంపైర్ నిర్ణయం విమర్శలకు దారి తీసింది. బంతి బ్యాట్‌కు తగలడానికి ముందే స్పైక్ కనిపించడం.. ఆ తర్వాత బ్యాట్‌ను బంతి దాటి వెళ్లిన తర్వాత స్పైక్ కనిపించలేదు. అయితే థర్డ్ అంపైర్ మాత్రం రోహిత్ ఔట్ అంటూ ప్రకటించాడు. అంతకముందు కోహ్లి ఔట్ విషయంలోనూ థర్డ్ అంపైర్ చెత్త నిర్ణయం తీసుకోవడం విమర్శలకు దారి తీసింది. చదవండి: Asif Ali: రెండేళ్ల క్రితం దూరమైంది.. పాక్ క్రికెటర్ ఇంట్లో వెల్లివిరిసిన సంతోషం Matthew Wade reaction in dressing room!#RCBvGT #mathewwade#Wade pic.twitter.com/iKPxIe2vW2 — Kavya Sharma (@Kavy2507) May 19, 2022 -
మాథ్యూ వేడ్ పేరుతో పాక్ బౌలర్‌ను ఎగతాళి చేసిన ఫ్యాన్స్
Fans Distract Shaheen Afridi With Matthew Wade Chants: బంగ్లాదేశ్- పాకిస్తాన్ తొలి టెస్ట్‌లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. పాకిస్తాన్ స్టార్ పేసర్ షాహీన్ షా అఫ్రిది బౌండరీలైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తుండగా.. స్టాండ్స్‌లోని ప్రేక్షకులు మాథ్యూ వేడ్ అంటూ పదే పదే హేళన చేశారు. తాజాగా ముగిసిన టీ20 వరల్డ్‌కప్-2021 సెమీఫైనల్లో భాగంగా షాహీన్ షా అఫ్రిది బౌలింగ్‌లో వేడ్.. వరుసగా మూడు సిక్సర్లు బాది ఆసీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఫైనల్‌కు చేరిన ఆరోన్ ఫించ్ బృందం ఏకంగా విజేతగా నిలిచింది. ఇక బంగ్లా- పాక్ మ్యాచ్ విషయానికొస్తే.. తొలి టెస్ట్‌లో అఫ్రిది అద్భుతంగా బౌలింగ్ చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు పడగొట్టగా, రెండో ఇన్నింగ్స్‌లో మూడు కీలక వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో అఫ్రిది ఏకాగ్రతను దెబ్బ తీయడానికి బంగ్లా అభిమానులు ప్రయత్నం చేశారు. అందుకే మాథ్యూ వేడ్ పేరును పదే పదే జపం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: IPL 2022 Auction: రాహుల్, రషీద్ ఖాన్‌ను లాక్కొన్నారు.. పంజాబ్, హైదరాబాద్ లబోదిబో! You troll Shaheen ??? He makes sure to give it back 🤛 5fer loading ... pic.twitter.com/6r1vcSyaTN — CricMadness (@CricMady) November 28, 2021 -
ఫైనల్‌కు ముందు రాత్రంతా.. గాయంతో బాధపడినా గానీ..
Matthew Wade Spoke About Situation 24 Hours Before Played T20 World Cup 2021 Final With an Injury: టీ20 ప్రపంచకప్-2021ను ఆస్ట్రేలియా కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆ జట్టు ఫైనల్ చేరడంలో వికెట్ కీపర్ మాథ్యూ వేడ్ కీలక పాత్ర పోషించాడు. కాగా న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్లో మాథ్యూ వేడ్ గాయంతో బరిలోకి దిగినట్లు తాజాగా వెల్లడైంది. ఈ విషయాన్ని వేడ్ స్వయంగా క్రికెట్ ఆస్ట్రేలియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు. "ఫైనల్‌కు ముందు రోజు రాత్రి నేను కొంచెం ఆందోళన చెందాను. ఎందకంటే ఆరోజు నేను ప్రక్కటెముకల నొప్పితో బాధపడుతున్నాను. నేను ఆ రాత్రంతా మేల్కొని ఉన్నాను. మ్యాచ్ రోజు నాకు కొంత ఊపశమనం లభించడంతో నేను ఆడగలిగాను. ఒక వేళ మ్యాచ్ రోజు నా నొప్పి తగ్గకపోయింటే జట్టుకు దూరంగా ఉండేవాడిని, ఎందుకంటే నా వల్ల జట్టకు ఎటువంటి నష్టం జరగకూడదు" అని వేడ్ పేర్కొన్నాడు. ఫైనల్‌కు ముందు మాథ్యూ వేడ్ ఫిట్నెస్ గురించి ఆందోళన చెందినట్లు ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ కూడా తెలిపాడు. స్కానింగ్ లకు కూడా తీసుకెళ్లినట్లు అతడు చెప్పాడు. కానీ స్కానింగ్ రిపోర్ట్‌లను కూడా వేడ్ చూడలేదు అని ఫించ్ పేర్కొన్నాడు. గాయంతో బాధపడతున్నప్పటకీ టోర్నమెంట్‌లోని అత్యంత కీలకమైన మ్యాచ్‌లో వేడ్ ఆడినందుకు గర్విస్తున్నానని ఫించ్ తెలిపాడు. అయితే ఈ మ్యాచ్‌లో వేడ్‌కు బ్యాటింగ్ చేసే అవకాశం రానప్పటికీ.. వికెట్ కీపర్‌గా ఆ జట్టుకు సేవలు అందించాడు. చదవండి: వచ్చే ఏడాది ప్రపంచ కప్ నుంచి న్యూజిలాండ్ ఔట్.. కారణం ఏంటంటే! -
T20 WC Winner Australia: షూలో డ్రింక్స్ తాగుతూ సంబరాలు.. అరె ఏంట్రా ఇది!
T20 WC 2021 Winner Australia: Players Drink From Shoes Celebrations Video Viral: ఆస్ట్రేలియాకు మొట్టమొదటి టీ20 వరల్డ్‌కప్ అందించిన ఆరోన్ ఫించ్ బృందం సంబరాలు అంబరాన్నంటాయి. నవంబరు 14న న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో అద్భుత విజయం అందుకున్న ఆసీస్ జట్టు చాంపియన్‌గా అవతరించిన సంగతి తెలిసిందే. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కంగారూలు.. కివీస్ విధించిన 173 పరుగుల లక్ష్యాన్ని కేవలం రెండు వికెట్లు కోల్పోయి ఛేదించారు. డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్ అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టును గెలుపుబాట పట్టించారు. ఇక చారిత్రాత్మక, చిరస్మరణీయ విజయం సాధించిన నేపథ్యంలో డ్రెస్సింగ్ రూంలో వెరైటీగా సెలబ్రేట్ చేసుకుంది ఫించ్ టీమ్. బూట్ల(షూ)లో డ్రింక్స్ నింపుకుని వాటిని తాగుతూ ఆటగాళ్లు ఎంజాయ్ చేశారు. సెమీస్ హీరోలు మాథ్యూ వేడ్, మార్కస్ స్టొయినిస్ షూ విప్పేసి అందులో డ్రింక్స్ నింపుకుని తాగుతూ ఆనందంతో గంతులేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఐసీసీ షేర్ చేయగా వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు.. ‘‘అరె ఏంట్రా ఇది.. షూతో డ్రింక్స్ తాగటం... మీరు సూపర్.. వరల్డ్‌కప్ గెలిచారు కదా... మీ ఇష్టం కానీయండి.. కానీయండి’’ అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. కాగా షూలో డ్రింక్స్ తాగటం ఆస్ట్రేలియన్ల సంప్రదాయాల్లో ఒకటి. అదృష్టం వరించినప్పుడు సంతోషంతో లేదంటే.. ఏవైనా కఠిన శిక్షల బారిన పడినపుడు ఇలా చేయడం వారికి అలవాటు. చదవండి: T20 World Cup 2021 Prize Money: విజేత, రన్నరప్.. ఇతర జట్ల ప్రైజ్ మనీ ఎంతంటే.. How's your Monday going? 😅#T20WorldCup pic.twitter.com/Fdaf0rxUiV — ICC (@ICC) November 15, 2021 -
క్యాన్సర్ బారిన పడ్డ మాథ్యూ వేడ్.. ప్లంబర్‌గా, కార్పెంటర్‌గా.. చివరకు...
Matthew Wade Beat Testicular Cancer at 16 Worked as Carpenter: మాథ్యూ వేడ్.. ఈ పేరు క్రికెట్ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టీ20 ప్రపంచకప్-2021లో సెమీ ఫైనల్లో షాహీన్ షా అఫ్రిదీ బౌలింగ్‌లో వరుసుగా మూడు సిక్సర్లు బాది పాకిస్తాన్ ఫైనల్ ఆశలు గల్లంతు చేసిన కంగారూ బ్యాటర్. తన సంచలన ఇన్నింగ్స్ తో వేడ్ ఓవర్ నైట్ స్టార్‌గా మారాడు. ఇప్పటికీ పాకిస్తానీ అభిమానులు ఈ ఓటమిని జీర్ణీంచుకోలేకపోతున్నారు. పాకిస్తాన్‌కు చుక్కలు చూపించిన ఈ ఆసీస్ హీరో.. తన నిజ జీవితంలో ఎన్నో కష్టాలు పడి ఈ స్థాయికి చేరుకున్నాడు. 16 ఏళ్ల వయస్సులోనే క్యాన్సర్‌ను జయించిన మృత్యుంజయుడు వేడ్. అతను ఒక స్టార్ క్రికెటర్ గానే మాత్రమే చాలా మందికి తెలుసు. కానీ పొట్టకూటి కోసం కార్పెంటర్‌గా, ప్లంబర్‌గా వేడ్ పని చేశాడనే విషయం మీకు తెలుసా? ఆసీస్‌కు వేడ్ అనూహ్య విజయాన్ని అందించిన నేపథ్యంలో అతనికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. 16 ఏళ్ల వయసులో క్యాన్సర్.. మాథ్యూ వేడ్‌కు అప్పుడు 16 ఏళ్లు.. ఓ ఫుట్‌బాల్ టోర్నమెంట్లో ఆడుతుండగా అతడు గజ్జ గాయానికి గురయ్యాడు. ఈ క్రమంలో అతడిని ఆస్పత్రిలో చేర్పించగా.. ఒక భయంకర వార్త అతనికి తెలుస్తుంది. అదే అతడు క్యాన్సర్ బారిన పడ్డాడని. తర్వాత కీమోథెరపీతో చికిత్స పోందుతూనే తన శిక్షణను కొనసాగించాడు. ఈ మాటలు స్వయానా అతడే సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. కొన్నాళ్లు ప్లంబర్‌గా... క్యాన్సర్‌కు చికిత్స పొందుతున్నప్పడు అతడి క్రీడా జీవితం ప్రశ్నార్థకంలో పడింది. ఈ క్రమంలో ప్లంబర్‌గా అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ తీసుకున్నాడు. ఆ తర్వాత కొన్ని ఏళ్లు ప్లంబర్‌గా పని చేశాడు. అయితే చికిత్స సమయంలో శారీరకంగా బలహీనంగా ఉన్నానని, జుట్టు లేకుండా తొటి వాళ్లతో తిరగడానికి చాలా ఇబ్బంది పడ్డానని వేడ్ ఇంటర్వ్యూలో తెలిపాడు. వర్ణాంధత్వం.. మాథ్యూ వేడ్‌కు వర్ణాంధత్వం కూడా ఒక సమస్యగా ఉండేది. ముఖ్యంగా పింక్ బాల్‌తో డే అండ్ నైట్ క్రికెట్లో వర్ణాంధత్వం వల్ల అనేక సమస్యలను అతడు ఎదుర్కొన్నాడు. "కొన్ని సమయాల్లో బంతి ఎలా వస్తుందో చూడడానికి కొంచెం కష్టంగానే ఉండేది..అదే విధంగా ఆస్ట్రేలియా మాజీ టెస్ట్ ఓపెనర్ క్రిస్ రోజర్స్ కూడా వర్ణాంధత్వంతో బాధపడ్డాడు. దీంతో 2014లో ఫస్ట్ క్లాస్ క్రికెట్లో పింక్-బాల్ మ్యాచ్ నుంచి రోజర్స్ వైదొలిగాడు "అని వేడ్ చెప్పుకొచ్చాడు. కార్పెంటర్‌గా.. ఫామ్ లేమి కారణంగా 2018లో అతడు జాతీయ జట్టుకు దూరమైనప్పడు కార్పెంటర్‌గా అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ తీసుకున్నాడు. 9-10 నెలలు తన ఇంటిలోనే కార్పెంటర్‌గా పనిచేశాడు. దీనిపై స్పందించిన వేడ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను జట్టుకు దూరమైనా చాలా విషయాలు నేర్చుకోవడం వైపు అడుగులు వేశాను. నేను వారానికి మూడు రోజులు కార్పెంటర్‌గా పని చేసాను, మిగితా రోజులు నా ఫ్యామిలితో గడిపాను. అయితే, నా క్రికెట్ జీవితాన్ని కొంత కాలం పాటు కోల్పోయాను. కార్పెంటర్‌గా పనిచేయడంతో సాధారణ జీవితాన్ని ఎలా గడపాలో తెలుసుకున్నాను. గుంతలు తవ్వడం, బోరింగ్ కాంక్రీట్ వంటి పనుల్లో ప్రజలు ఎంత కష్టపడతున్నారో చూశాను. నేను ప్రస్తుతం క్రికెట్ ఫీల్డ్‌లో ఉన్నానడంలో ఇవన్నీ కీలకమైన పాత్ర పోషించాయి’ అని వేడ్ గత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు. అతడి కెరీర్ వెనుక జూలియా మాథ్యూ వేడ్ మళ్లీ అంతర్జాతీయ క్రికెట్లో పునరాగమనం వెనుక అతడి భార్య జూలియా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే.. యాషెస్ సిరీస్‌కు ముందు అతడిని ఆస్ట్రేలియా- ఎ జట్టుకు ఎంపిక చేశారు. అయితే అదే సమయంలో అతడి భార్య గర్భవతిగా ఉంది. ఈ క్రమంలో తన భార్య జూలియాకు ఫోన్ చేసి.. నాకు ఈ పర్యటనకు వెళ్లడం ఇష్టం లేదని సెలెక్టర్లకు తెలియజేస్తానని అతడు చెప్పాడు. కానీ అతడి భార్య దానికి భిన్నంగా స్పందించింది. మీరు తప్పనిసరిగా ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లాలని, ఎందుకంటే మీ స్ధానంలో వేరొకరిని ఎంపిక చేస్తారు. మీరు ఈ అవకాశం కోసం ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. ఇంత కష్టపడి వచ్చిన అవకాశాన్ని వదులుకోవడం చాలా బాధకరమైన విషయమని వేడ్‌కు ఆమె సర్దిచెప్పింది. ఆమె ఇచ్చిన పోత్సాహంతో వేడ్ ఆస్ట్రేలియా-ఎ తరపున ఇంగ్లండ్ బయల్దేరి వెళ్లాడు. తదనంతరం మెరుగ్గా రాణించి జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు. తన సక్సెస్ వెనుక భార్య జూలియా పాత్ర మరువలేనిదని చాలా ఇంటర్వ్యూల్లో వేడ్ పేర్కొన్నాడు. చదవండి: 'కోహ్లి అన్ని ఫార్మాట్లలో కెప్టెన్‌గా తప్పుకుంటే మంచిది'.. లేదంటే: అఫ్రిది -
Aus Vs Pak: అందుకే వార్నర్ రివ్యూకు వెళ్లలేదు: మాథ్యూ వేడ్
Matthew Wade Explains Why Warner Didn't Review His Dismissal Against Pakistan: టీ20 వరల్డ్‌కప్-2021 టోర్నీలో భాగంగా పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో మార్కస్ స్టొయినిస్, మాథ్యూ వేడ్ అద్భుతమే చేశారు. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన రెండో సెమీ ఫైనల్లో వరుసగా 40, 41 పరుగులతో రాణించి జట్టును విజయతీరాలకు చేర్చారు. ముఖ్యంగా 19వ ఓవర్లో వేడ్ వరుసగా మూడు సిక్సర్లు బాదడం మ్యాచ్‌కు హైలెట్‌గా నిలిచింది. ఒకవేళ వేడ్ గనుక మెరుపు ఇన్నింగ్స్‌తో రాణించి ఉండకపోతే ఫలితం వేరేలా ఉండేదనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే, ఈ మ్యాచ్‌లో అర్ధ సెంచరీ సాధించే అవకాశం తృటిలో మిస్ చేసుకున్నాడు ఓపెనర్ డేవిడ్ వార్నర్. 30 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 49 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. అయితే, వార్నర్ అవుట్ అయిన విధానం.. అందునా అతడు రివ్యూకు వెళ్లకపోవడం అభిమానులను నిరాశపరిచింది. కెప్టెన్ ఆరోన్ ఫించ్ అవుటైన తర్వాత 49 పరుగులతో క్రీజులో ఉన్న వార్నర్.. షాబాద్ ఖాన్ వేసిన ఇన్నింగ్స్ 11వ ఓవర్ తొలి బంతిని ఫ్లిక్ చేయగా.. కీపర్ రిజ్వాన్ చేతిలో పడింది. ఈ క్రమంలో పాకిస్తాన్ అప్పీల్‌కు వెళ్లగా అంపైర్ అవుట్‌గా తేల్చాడు. కానీ.. అల్ట్రాఎడ్జ్‌లో మాత్రం బ్యాట్‌కు బంతి ఎక్కడా తగలినట్లు కనిపించలేదు. దీంతో వార్నర్ రివ్యూకు వెళ్లకుండా తప్పుచేశాడనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం వేడ్ మాట్లాడుతూ... ‘‘ఈ విషయం గురించి మాట్లాడుకునేందుకు ఎక్కువగా సమయం దొరకలేదు. వార్నర్ కూడా కాన్ఫిడెంట్‌గా లేడు. తన బ్యాట్ బంతిని తాకిందో లేదో అన్న విషయంపై క్లారిటీ లేదు. అయితే, నాన్ స్ట్రైక్‌లో ఉన్న గ్లెన్ (మాక్స్వెల్) మాత్రం శబ్దం విన్నాడట. అయితే, తను కూడా ఎటూ చెప్పలేకపోయాడు. అది నిజంగా కఠిన సమయం’’ అని చెప్పుకొచ్చాడు. చదవండి: AUS Vs NZ: ఆసీస్‌తో ఫైనల్‌కు ముందు న్యూజిలాండ్‌కు బిగ్ షాక్.. ఇక కష్టమే -
Babar Azam: ఆ క్యాచ్ వదిలేయడం మా కొంప ముంచింది.. అందుకే ఓడిపోయాం!
T20 World Cup 2021 Pak Vs Aus: Australia Beat Pakistan Babar Azam Comments: ‘‘ముందుగా ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లుగానే వీలైనన్ని ఎక్కువ పరుగులు రాబట్టడానికి ప్రయత్నించాం. అయితే, ఆస్ట్రేలియా వంటి జట్టుకు ఆఖర్లో అవకాశం ఇస్తే ఎంతటి భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందో తెలుసు. ఆ క్యాచ్(మాథ్యూ వేడ్)ను వదిలేయడమే మ్యాచ్‌ను మలుపు తిప్పింది. ఒకవేళ ఆ క్యాచ్‌ను గనుక అందుకుని ఉంటే ఫలితం వేరేలా ఉండేది. ఒక్కటి మాత్రం నిజం.. టోర్నీ మొత్తంలో మా జట్టు ఆడిన విధానం పట్ల కెప్టెన్‌గా నేను సంతృప్తిపడుతున్నాను. కీలక మ్యాచ్‌లో ఓడిపోవడం బాధాకరమే అయినా.. దీని నుంచి నేర్చుకున్న గుణపాఠం.. తదుపరి ఈవెంట్లో ఇలాంటి తప్పులు పునరావృతం చేయకుండా ఉండేందుకు దోహదం చేస్తుంది. టోర్నీ ఆసాంతం ఎంత బాగా ఆడినా.. ఒక్క చిన్నతప్పు కారణంగా భారీ మూల్యమే చెల్లించాల్సి వస్తుంది కదా. ఏదేమైనా మా ఆటగాళ్లు ఎవరి పాత్రను వారు చక్కగా నెరవేర్చారు. ప్రేక్షకుల నుంచి మాకు గట్టి మద్దతు లభించడం సంతోషకరం. దుబాయ్‌లో ఆడటాన్ని ఎల్లప్పుడూ మేము పూర్తిగా ఆస్వాదిస్తాం’’ అని పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ఉద్వేగభరితంగా మాట్లాడాడు. కాగా టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో సూపర్ 12 దశలో ఐదింటికి ఐదు మ్యాచ్‌లు గెలిచి అజేయంగా నిలిచిన పాకిస్తాన్.. రెండో సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో 5 వికెట్ల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. దీంతో ఫైనల్ చేరాలన్న బాబర్ ఆజమ్ బృందం ఆశలు గల్లంతయ్యాయి. ముఖ్యంగా మార్కస్ స్టొయినిస్(40 పరుగులు), మాథ్యూ వేడ్(41 పరుగులు) మెరుపు ఇన్నింగ్స్ పాకిస్తాన్‌ను దెబ్బకొట్టింది. ప్రధానంగా షాహిన్ ఆఫ్రిది బౌలింగ్‌లో వేడ్.. ఇచ్చిన క్యాచ్‌ను హసన్ అలీ మిస్ చేయడం.. ఆ తర్వాత అతడు వరుసగా మూడు సిక్సర్లు బాది ఇంకో ఓవర్ మిగిలి ఉండగానే ఆసీస్ గెలుపును ఖాయం చేయడం చకచకా జరిగిపోయాయి. దీంతో ఆరోన్ ఫించ్ బృందం ఫైనల్‌కు చేరింది. ఇప్పటి వరకు అందని ద్రాక్షగా ఉన్న టీ20 వరల్డ్‌కప్ టైటిల్ కోసం నవంబరు 14న న్యూజిలాండ్‌తో తలపడనుంది. స్కోర్లు: పాకిస్తాన్- 176/4 (20) ఆస్ట్రేలియా- 177/5 (19) (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: T20 World Cup 2021 Pak Vs Aus: అప్పుడు మైక్ హస్సీ.. ఇప్పుడు వేడ్.. పాక్‌ను దెబ్బకొట్టారు! -
T20 World Cup 2021: ఫైనల్‌కు ఆస్ట్రేలియా.. పాకిస్తాన్ ఇంటికి
-
Pak Vs Aus: అప్పుడు మైక్ హస్సీ.. ఇప్పుడు వేడ్.. పాక్‌కు చుక్కలే!
T20 World Cup 2021 Pak Vs Aus: Matthew Wade Innings Resembles Mike Hussey in 2010: టీ20 వరల్డ్‌కప్-2021 రెండో సెమీ ఫైనల్లో పాకిస్తాన్‌పై ఆస్ట్రేలియా మెరుపు దాడి చూసినవారికి 2010 టి20 ప్రపంచకప్‌లో ఈ రెండు జట్ల మధ్యే జరిగిన రెండో సెమీఫైనల్ మ్యాచ్ గుర్తుకు రాకమానదు. పాక్ 191 పరుగులు చేయగా... ఆస్ట్రేలియా 7 వికెట్లకు 197 పరుగులు సాధించింది. నవంబరు 11న మాథ్యూ వేడ్ తరహాలో మైక్ హస్సీ చివర్లో చెలరేగి జట్టును గెలిపించాడు. ఇప్పుడు పాక్ ప్రధానాస్త్రం షాహిన్ అఫ్రిది ఓవర్లో వేడ్ 3 సిక్సర్లు బాదగా... నాడు పాక్ టాప్ స్పిన్నర్ అజ్మల్ వేసిన చివరి ఓవర్లో హస్సీ వరుసగా 6, 6, 4, 6 విధ్వంసం సృష్టించాడు. ఆ మ్యాచ్‌లో ఆసీస్ విజయం కోసం చివరి 5 ఓవర్లలో 70 పరుగులు కావాల్సి ఉండగా...ఈ సారి ఆసీస్‌కు ఆఖరి 5 ఓవర్లలో 62 పరుగులు అవసరమయ్యాయి. రెండు సార్లు కీలక సమయాల్లో ఒత్తిడిని అధిగమించిన చాంపియన్ తరహా ఆటను ప్రదర్శించిన కంగారూలదే పైచేయి అయింది. పాకిస్తాన్‌ను 5 వికెట్ల తేడాతో మట్టికరిపించి ఫైనల్‌కు చేరుకుంది. నవంబరు 14న న్యూజిలాండ్‌తో జరిగే తుదిపోరులో ఆస్ట్రేలియా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. చదవండి: Eng Vs Nz: ఆ రెండు జట్లే మమ్మల్ని ఓడించగలవు.. హా.. మరి మేము బూర్జ్ ఖలీఫా చూడటానికి వచ్చాం! -
Aus Vs Pak: వరుసగా 6, 6, 6. అంతే!! ఇంకో ఓవర్ ఉన్నా... పాక్ పనైపోయింది!
T20 World Cup 2021: Australia Beat Pakistan By 5 Wickets Enters Final: ఆస్ట్రేలియా లక్ష్యం 177. దూకుడుగా ఆడుతున్న వార్నర్ జట్టు స్కోరు 89 పరుగుల వద్ద నిష్క్రమించాడు. ఇంకో 7 పరుగులకే హార్డ్ హిట్టర్ మ్యాక్స్‌వెల్ చేతులెత్తేశాడు. వందలోపే ప్రధాన బ్యాట్స్‌మెన్ అందరూ పెవిలియన్‌లో ప్రేక్షకులయ్యారు. స్టొయినిస్, మ్యాథ్యూ వేడ్ తర్వాత బ్యాట్స్‌మెనే లేడు. ఆసీస్ గెలుస్తుందన్న ఆశ కూడా లేదు. పాకిస్తాన్ బౌలింగ్ పట్టు బిగించిన వేళ... అంతో ఇంతో స్టొయినిస్ పోరాడుతున్నాడు... కానీ వేడ్ 13 ఓవర్లో క్రీజులోకి వచచ్చినా... 17 ఓవర్లు ముగిసినా పది పరుగులైనా చేయలేదు. అప్పటికి అతని స్కోరు 8! ఆసీస్ గెలవాలంటే 18 బంతుల్లో 37 పరుగులు చేయాలి. 18వ ఓవర్లో సిక్స్, ఫోర్ కొట్టాడు. ఆఖరి 12 బంతుల్లో 22 పరుగుల సమీకరణం. షాహిన్ అఫ్రిది 19వ ఓవర్ వేశాడు. మూడో బంతికి క్యాచ్ మిస్ కావడంతో వేడ్ బతికిపోయాడు. 2 పరుగులు తీసి తనే స్ట్రయిక్ తీసుకున్నాడు. ఆ తర్వాత చూస్తే చుక్కలే!! వరుసగా 6, 6, 6. అంతే!! ఇంకో ఓవర్ ఉన్నా... పాక్ పనైపోయింది. Australia Beat Pakistan By 5 Wickets In Semis: తొలి సెమీస్‌కు రిపీట్‌గా రెండో సెమీస్ జరిగినట్లుగా కనిపించింది. కివీస్‌ను నీషమ్ మెరుపు ఇన్నింగ్స్ పట్టాలెక్కిస్తే... వేడ్ (17 బంతుల్లో 41 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) సంచలన ఇన్నింగ్స్ ఆస్ట్రేలియాను ఫైనల్‌కు చేర్చింది. గురువారం జరిగిన రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియా 5 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌పై జయభేరి మోగించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. ఓపెనర్ రిజ్వాన్ (52 బంతుల్లో 67; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), ఫఖర్ జమాన్ (32 బంతుల్లో 55 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) రాణించారు. తర్వాత ఆస్ట్రేలియా 19 ఓవర్లలో 5 వికెట్లకు 177 పరుగులు చేసి గెలిచింది. వార్నర్ (30 బంతుల్లో 49; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) ధాటిగా ఆడాడు. స్టొయినిస్ (31 బంతుల్లో 40 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. రాణించిన రిజ్వాన్ పాకిస్తాన్‌కు ఓపెనర్లు చక్కని ఆరంభమిచ్చారు. రిజ్వాన్, కెప్టెన్ బాబర్ అజమ్ (34 బంతుల్లో 39; 5 ఫోర్లు) కలిసి అర్ధ సెంరీ భాగస్వామ్యం నమోదు చేశారు. పదో ఓవర్ వేసిన జంపా ఆఖరి బంతికి బాబర్‌ను అవుట్ చేశాడు. జంపా 12వ ఓవర్లో స్లాగ్‌స్వీప్ షాట్‌తో స్కేర్ లెగ్‌లో భారీ సిక్సర్ బాదాడు. మరుసటి బంతికి బైస్ రూపంలో 4 పరుగులతో మొత్తం 14 పరుగులొచ్చాయి. అనంతరం హాజల్‌వుడ్ వేసిన 14వ ఓవర్లో ఐదో బంతిని రిజ్వాన్ సిక్సర్‌గా తరలించడంతో పాక్ స్కోరు వందకు చేరింది. ఆ తర్వాతి బంతికే అతని అర్ధసెంచరీ (41 బంతుల్లో; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) కూడా పూర్తయ్యింది. స్టార్క్ వేసిన 20వ ఓవర్లో రెండు వరుస సిక్సర్లతో అతను 31 బంతుల్లో (3 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధశతకం సాధించాడు. తొలి 10 ఓవర్లలో 71/1 స్కోరు చేసిన పాకిస్తాన్ మరో 10 ఓవర్లలో 106 పరుగులు చేసింది. ఆదిలోనే ఎదురుదెబ్బ ఇన్నింగ్స్ ఆరంభమైన ఓవర్లోనే కెప్టెన్ ఫించ్ (0) డకౌటయ్యాడు. పాక్ స్పీడ్‌స్టర్ షాహిన్ అఫ్రిది తన మూడో బంతికే అతన్ని వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. మరో ఓపెనర్ వార్నర్‌కు జతయిన మిచెల్ మార్ష్ చకచకా పరుగులు చేశాడు. ఇమాద్ నాలుగో ఓవర్లో వార్నర్ వరుసగా 6, 4, 4తో 17 పరుగులు పిండుకున్నాడు. దీంతో ఆస్ట్రేలియా 30 బంతుల్లో 50 పరుగులు చేసింది. పవర్ ప్లేలో అంతా బాగానే ఉంది. లెగ్‌స్పిన్నర్ షాదాబ్ ఖాన్ మాయ మొదలయ్యాక ఆసీస్ ఆట తలకిందులైంది. ఏడో ఓవర్లో జోరు మీదున్న మార్ష్ (22 బంతుల్లో 28; 3 ఫోర్లు, 1 సిక్స్)ను అవుట్ చేశాడు. హఫీజ్ వేసిన 8వ ఓవర్లో, షాదాబ్ వేసిన మరుసటి ఓవర్లో వార్నర్ కళ్లు చెదిరే సిక్సర్లతో అలరించగా, రెండు బంతుల తర్వాత స్మిత్ (5)ను షాదాబ్ బోల్తా కొట్టించాడు. అయినప్పటికీ 10 ఓవర్లలో ఆసీస్ స్కోరు 89/3తో మెరుగ్గానే ఉంది. ఈ దశలో వార్నర్ పెవిలియన్ చేరాడు. బంతి బ్యాట్‌కు తగలకున్నా కీపర్ రిజ్వాన్ చేతుల్లో పడింది. అప్పీల్ చేయడంతో అంపైర్ అవుటిచ్చాడు. ఆశ్చర్యంగా వార్నర్ రివ్యూకు వెళ్లకుండా పెవిలియన్‌కు వెళ్లాడు. మ్యాక్స్‌వెల్ (7) వికెట్ అతని ఖాతాలోనే పడింది. ఆశల్లేని కంగారూ జట్టు శిబిరంలో అంతా కంగారే! అయితే వేడ్ సంచలన ఇన్నింగ్స్ ఆసీస్‌ను గెలిపించింది. స్కోరు వివరాలు పాకిస్తాన్ ఇన్నింగ్స్: రిజ్వాన్ (సి) స్మిత్ (బి) స్టార్క్ 67; బాబర్ (సి) వార్నర్ (బి) జంపా 39; ఫకర్ జమన్ నాటౌట్ 55; ఆసిఫ్ (సి) స్మిత్ (బి) కమిన్స్ 0; షోయబ్ మాలిక్ (బి) స్టార్క్ 1; హఫీజ్ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 176. వికెట్ల పతనం: 1–71, 2–143, 3–158, 4–162. బౌలింగ్: స్టార్క్ 4–0–38–2, హాజల్‌వుడ్ 4–0–49–0, మ్యాక్స్‌వెల్ 3–0–20–0, కమిన్స్ 4–0–30–1, జంపా 4–0–22–1, మిచెల్ మార్ష్ 1–0–11–0. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: వార్నర్ (సి) రిజ్వాన్ (బి) షాదాబ్ 49; ఫించ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) షాహిన్ అఫ్రిది 0; మార్ష్ (సి) ఆసిఫ్ (బి) షాదాబ్ 28; స్మిత్ (సి) ఫఖర్ (బి) షాదాబ్ 5; మ్యాక్స్‌వెల్ (సి) రవూఫ్ (బి) షాదాబ్ 7; స్టొయినిస్ నాటౌట్ 40; వేడ్ నాటౌట్ 41; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (19 ఓవర్లలో 5 వికెట్లకు) 177. వికెట్ల పతనం: 1–1, 2–52, 3–77, 4–89, 5–96 బౌలింగ్: షాహిన్ అఫ్రిది 4–0–35–1, ఇమాద్ 3–0–25–0, రవూఫ్ 3–0–32–0, హసన్ 4–0–44–0, షాదాబ్ 4–0–26–4, హఫీజ్ 1–0–13–0. చదవండి: Team India Coaching Staff: ద్రవిడ్ జట్టును ఖరారు చేసిన బీసీసీఐ..! -
'ఆ మ్యాచ్ ఆడేందుకు త్యాగాలకు కూడా సిద్ధం'
సిడ్నీ: టీమిండియాతో నాలుగో టెస్ట్‌ను బ్రిస్బేన్‌లో ఆడటానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆస్ట్రేలియా వికెట్ కీపర్ మాథ్యూ వేడ్ అన్నాడు. క్వారంటైన్ ఉన్నా కూడా తమకు ఎలాంటి ఇబ్బంది లేదని.. దీనికోసం కొన్ని త్యాగాలకు కూడా తాము సిద్ధంగా ఉన్నట్లు చెప్పాడు. వాస్తవానికి ఆసీస్ టీమ్‌కు బ్రిస్బేన్ వేదిక బాగా కలిసొచ్చింది. ఇక్కడ 1988 నుంచి ఆసీస్ ఆడిన ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. అందుకే ఆ గ్రౌండ్లో మ్యాచ్ జరగాలని తాను కోరుకుంటున్నట్లు వేడ్ స్పష్టం చేశాడు. అక్కడ తమ రికార్డు బాగుందని.. తమకు ఆ గ్రౌండ్ అంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చాడు. అయితే సిడ్నీలోనే రెండు వరుస టెస్టులు ఆడటానికి తాము సిద్ధంగా లేమని.. షెడ్యూల్ ప్రకారమే బ్రిస్బేన్‌లో ఆడటానికే మొగ్గు చూపుతున్నట్లు తెలిపాడు.(చదవండి: టాస్ వేశారు.. కాని కాయిన్‌తో కాదు) క్వీన్స్‌ల్యాండ్‌లో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతుండడంతో అక్కడి ప్రభుత్వం కఠిన క్వారంటైన్ నిబంధనలను అమలు చేస్తుంది. దీంతో బ్రిస్బేన్ వేదికగా జరగనున్న నాలుగో టెస్టులో టీమిండియా ఆడడానికి అంగీకరించడం లేదు. మరోసారి క్వారంటైన్లో ఉండేది లేదని టీమిండియా తేల్చి చెప్పింది. దీంతో నాలుగో టెస్ట్ జరుగుతుందా లేదా అన్న దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే క్రికెట్ ఆస్ట్రేలియా మాత్రం ఇరు జట్ల మధ్య నాలుగో టెస్ట్ మ్యాచ్ జరుగుతుందని తెలిపింది. ఒకవేళ టీమిండియా బ్రిస్బేన్‌లో ఆడడానికి ఒప్పుకోకుంటే సిడ్నీలోనే నాలుగో టెస్టును నిర్వహించడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. (చదవండి: ‘సింగిల్ తీయకపోతే, నీకు ఉంటది’) -
అంత వద్దు పంత్.. ఒకసారి బిగ్ స్ర్కీన్‌పై చూసుకో!
మెల్బోర్న్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా పట్టుబిగించింది. భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 326 పరుగులు చేయడంతో 131 పరుగుల ఆధిక్యం దక్కింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ తన రెండో ఇన్నింగ్స్‌లో భాగంగా ఆరు వికెట్ల నష్టానికి 133 పరుగులతో ఉంది. దాంతో ఆసీస్‌కు రెండు పరుగుల ఆధిక్యం మాత్రమే లభించింది. రేపటి ఆటలో ఆసీస్‌ను తొందరగా పెవిలియన్‌కు పంపితే టీమిండియా విజయానికి ఢోకా ఉండదు. కాగా, ఆసీస్ తన రెండో ఇన్నింగ్స్ ఆటలో ఓపెనర్‌గా వచ్చిన వేడ్(40;137 బంతుల్లో 3 ఫోర్లు) మాత్రమే ఆకట్టుకున్నాడు. (ధోనికి ‘స్పిరిట్ ఆఫ్ ద డెకేడ్’.. కారణం ఇదే!) కాగా, వేడ్ సుదీర్ఘంగా బ్యాటింగ్ చేసే క్రమంలో టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ ఎక్కువ భాగం నవ్వుతూ కనిపించాడు. అయితే అలా ఎందుకు చేశాడనేది ఎవరికీ అర్థం కాకపోయినా అది మాత్రం వేడ్‌కు కోపం తెప్పించింది. దాంతో పంత్‌పై స్లెడ్జింగ్‌కు దిగాడు వేడ్. ‘ ఎందుకలా నవ్వుతున్నావ్.. అంత అవసరం లేదు. ఒకసారి బిగ్స్క్రీన్పై తిరిగి చూసుకో. స్క్రీన్‌పై అది చాలా ఫన్నీగా కనిపిస్తోంది’ అంటూ వేడ్ తన నోటికి పని చెప్పాడు. ఇది వికెట్ల వద్దనున్న మైక్ ద్వారా బయట పడింది. పంత్‌ను స్లెడ్జ్ చేయడంపై వేడ్ టీ బ్రేక్‌లో మాట్లాడుతూ..‘ నవ్వుతూనే ఉన్నాడు. ఎందుకలా చేశాడో నాకైతే అర్థం కాలేదు. నన్ను చూస్తూ నవ్వుతూ ఉన్నాడు. నా బ్యాటింగ్ తీరును చూసి అలా చేసి ఉండొచ్చు’ అని వేడ్ వివరణ ఇచ్చాడు. The Wade-Pant verbals continue 🗣🍿 #AUSvIND pic.twitter.com/VjZ9hDm24I— cricket.com.au (@cricketcomau) December 28, 2020 -
క్యాచ్ మిస్ అనుకున్నాం.. కానీ జడేజా పట్టేశాడు
మెల్బోర్న్ : టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా మెరుపు ఫీల్డింగ్‌కు పెట్టింది పేరు. ఆసీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో గాయపడిన జడేజా మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టు ద్వారా మళ్లీ జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. వచ్చీ రావడంతోనే ఫీల్డింగ్ నైపుణ్యం ప్రదర్శిస్తూ స్టన్నింగ్ క్యాచ్‌తో ఆకట్టుకున్నాడు. అసలు విషయంలోకి వెళితే.. రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో మాథ్యూ వేడ్ భారీ షాట్ ఆడాడు. (చదవండి : బాక్సింగ్ డే టెస్టు : స్టీవ్ స్మిత్ డకౌట్) మిడాన్‌లో ఉన్న జడేజా క్యాచ్ అందుకోవడానికి పరిగెత్తుకు రాగా.. కమ్యునికేషన్ గ్యాప్ రావడంతో మిడాఫ్‌లో ఉన్న గిల్ కూడా పరిగెత్తుకు వచ్చాడు. జడేజా క్యాచ్‌ను అందుకునే క్రమంలో అతని చేయి గిల్‌ను తాకింది. దీంతో క్యాచ్ మిస్సవుతుందని అంతా భావించారు. కానీ జడేజా మాత్రం బంతిని వదలకుండా చేతిలోనే ఒడిసిపట్టుకోవడంతో వేడ్ అవుట్‌గా వెనుదిరిగాడు. ఈ వీడియోనూ క్రికెట్ ఆస్ట్రేలియా తన ట్విటర్లో షేర్ చేసింది. క్యాచ్ మిస్ అనుకున్నాం.. కానీ జడేజా పట్టేశాడు. అంటూ క్యాప్షన్ జత చేసింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఆసీస్ టీ విరామం అనంతరం 5 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. కామెరాన్ గ్రీన్ 7, కెప్టెన్ టిమ్ పైన్ 6 పరుగులతో క్రీజులో ఉన్నారు. టాస్ గెలిచిన ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకోగా.. టీమిండియా బౌలర్ బుమ్రా ఆసీస్ ఓపెనర్ బర్న్స్‌ను డకౌట్ చేశాడు.దీంతో ఆసీస్ 10 పరుగుల వద్ద మొదటి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన మార్నస్ లబుషేన్‌తో కలిసి మరో ఓపెనర్ మాథ్యూ వేడ్ ఇన్నింగ్స్‌ను నిర్మించే ప్రయత్నం చేశాడు. వీరి జోడి బలపడుతున్న తరుణంలో బౌలింగ్‌కు వచ్చిన రవిచంద్రన్ అశ్విన్ వేడ్‌ను 30 పరుగుల వద్ద ఔట్ చేయడంతో ఆసీస్ 35 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన స్టార్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ క్రీజులో కుదురుకోవడానికి ఇబ్బంది పడ్డాడు. (చదవండి : బాక్సింగ్ డే టెస్టు : స్టీవ్ స్మిత్ డకౌట్) Almost disaster! But Jadeja held his ground and held the catch! @hcltech | #AUSvIND pic.twitter.com/SUaRT7zQGx — cricket.com.au (@cricketcomau) December 26, 2020 ఈ దశలో మరోసారి బౌలింగ్‌కు వచ్చిన అశ్విన్ స్మిత్‌ను డకౌట్‌గా పెవిలియన్ చేర్చాడు. దీంతో ఆసీస్ 38 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన హెడ్‌తో కలిసి మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. లబుషేన్,హెడ్లు భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ ఆచితూచి ఆడారు. టీ విరామానికి ముందు బుమ్రా బౌలింగ్‌లో 38 పరుగులు చేసిన హెడ్ ఔట్ కాగా.. కాసేపటికే అర్థసెంచరీకి రెండు పరుగుల దూరంలో ఉన్న లబుషేన్‌ను సిరాజ్ ఔట్ చేయడంతో ఆసీస్ 5 వికెట్లు కోల్పోయింది. కాగా సిరాజ్ లబుషేన్‌ను అవుట్ చేయడం ద్వారా అంతర్జాతీయ టెస్టు క్రికెట్లో మెయిడెన్ వికెట్ తీశాడు. భారత బౌలర్లలో అశ్విన్ 2, బుమ్రా 2, సిరాజ్ ఒక వికెట్ తీశాడు. -
అచ్చం ధోని తరహాలో..
అడిలైడ్ : ఆసీస్‌తో జరిగిన పింక్ బాల్ టెస్టులో టీమిండియా ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. టీమిండియా వైఫల్యాన్ని అభిమానులు అంత తొందరగా జీర్ణించుకోలేకపోతున్నారు. భారత్ విధించిన 90 పరుగుల విజయలక్ష్యాన్ని ఆసీస్ 21 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. అయితే ఆసీస్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ మాథ్యూ వేడ్‌ను వృద్ధిమాన్ సాహా రనౌట్ చేశాడు. సాహా రనౌట్ చేసిన తీరు అచ్చం టీమిండియా మాజీ ఆటగాడు ఎంఎస్ ధోనిని గుర్తుకుతెస్తుంది. రవిచంద్రన్ అశ్విన్ వేసిన 18వ ఓవర్ రెండో బంతిని వేడ్ ఫ్లిక్ చేయగా.. అది కీపర్ సాహా చేతికి చిక్కింది. వెంటనే సాహా.. ధోని తరహాలో తన కాళ్ల సందుల నుంచి బంతిని వికెట్లకు గిరాటేశాడు. అప్పటికే క్రీజు దాటి ముందుకు పరిగెత్తిన వేడ్ రనౌట్‌గా వెనుదిరిగాడు. (చదవండి : 96 ఏళ్ల చరిత్రను రిపీట్ చేశారు) ఈ వీడియోనూ క్రికెట్ ఆస్ట్రేలియా తన ట్విటర్లో షేర్ చేసింది. ' అలర్ట్.. అద్భుతమైన రనౌట్.. సాహా నుంచి వచ్చిన ఈ సిగ్నల్ దేనిని సూచిస్తుందో చెప్పగలరా..' అంటూ క్యాప్షన్ జత చేసింది. కాగా ఇరుజట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ మెల్బోర్న్ వేదికగా డిసెంబర్ 26న మొదలుకానుంది. విరాట్ కోహ్లి పెటర్నిటీ సెలవులపై స్వదేశం వెళ్లనున్న నేపథ్యంలో అజింక్యా రహానే మిగిలిన టెస్టులకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. Bizarre dismissal alert! What about that from Saha?! #AUSvIND pic.twitter.com/OqMLnSNgCE — cricket.com.au (@cricketcomau) December 19, 2020 -
నేను అంపైర్‌తో మాట్లాడాను.. కానీ: కోహ్లి
సిడ్నీ: ‘‘నేను రాడ్‌తో(టకర్ రాడ్, అంపైర్) చర్చించా. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయొచ్చు అని అడిగాను. ఇది టీవీ వల్ల జరిగిన తప్పిదం.. మనం ఇంకేం చేయలేమని అతడు నాతో చెప్పాడు’’ అని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మంగళవారం నాటి మ్యాచ్‌లో జరిగిన ‘‘రివ్యూ డ్రామా’’ గురించి చెప్పుకొచ్చాడు. ఆస్ట్రేలియాతో జరిగిన చివరి టీ20లో టీమిండియా ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో 12 పరుగుల తేడాతో ఆసీస్ కోహ్లి సేనపై గెలుపొందింది. ఓపెనర్ వేడ్, మ్యాక్స్‌వెల్ హాఫ్ సెంచరీలకు తోడు స్పిన్నర్ల పొదుపైన బౌలింగ్‌తో ఆతిథ్య జట్టుకు ఊరట విజయం లభించింది. అయితే 11వ ఓవర్లో టీమిండియా వేగంగా స్పందించి రివ్యూ కోరి ఉంటే ఫలితం వేరేలా ఉండేదని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ ఓవర్లో భారత బౌలర్ నటరాజన్ వేసిన నాలుగో బంతి ఓపెనర్ మాథ్యూ వేడ్ ప్యాడ్లను తాకింది. దీని గురించి నటరాజన్, వికెట్ కీపర్ రాహుల్ అప్పీల్ చేయగా అంపైర్ నాటౌట్‌గా ప్రకటించాడు. (చదవండి: చిన్నప్పటి నుంచి నేనింతే: నటరాజన్) ఇక ఈ అంశంపై టీమిండియా రివ్యూ కోరే లోపే భారీ స్క్రీన్‌పై రీప్లే కనిపించింది. దీంతో కెప్టెన్ కోహ్లి రివ్యూ కోరే లోపే థర్డ్ అంపైర్ అతడి అభ్యర్థన చెల్లదని ప్రకటించాడు. దాంతో ఫీల్డ్ అంపైర్ నిర్ణయానికే భారత జట్టు కట్టుబడింది. అయితే చివరకు రీప్లేలో అది స్పష్టంగా అవుట్ అయినట్లు కనిపించడంతో తాము అన్యాయంగా వికెట్ చేజార్చుకున్నామని కోహ్లి సేన బాధపడాల్సి వచ్చింది. ఈ విషయంపై స్పందించిన కోహ్లి.. సమయం ముగిసేలోపే రివ్యూ కోరినట్లు వెల్లడించాడు. ‘‘ఆ ఎల్బీడబ్ల్యూ విచిత్రమైంది. రివ్యూకు వెళ్లాలా.. వద్దా అని మేం చర్చించుకునే లోపే.. అంపైర్ తన నిర్ణయం ప్రకటించాడు. రివ్యూ కోరాలని నిర్ణయించుకునే లోపే స్క్రీన్‌పై కూడా ప్లే అయ్యింది. ఎంతో ముఖ్యమైన మ్యాచ్‌లో ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోవడం సరికాదు. టీవీ వాళ్ల చిన్న తప్పిదం కారణంగా భారీ మూల్యం చెల్లించాల్సి న పరిస్థితులు తలెత్తాయి. ఇలాంటివి పునరావృతం కాకూడదు. మా స్థానంలో ఎవరు ఉన్నా సరే ఇలా వికెట్‌ను మిస్ చేసుకోవడాన్ని ఇష్టపడరు కదా’’ అని పేర్కొన్నాడు. -
కోహ్లి ఆలస్యం చేశావు.. వెంటనే రివ్యూ కోరుంటే
సిడ్నీ : ఆసీస్‌తో జరుగుతున్న మూడో టీ20లో ఆసీస్ బ్యాటింగ్ సమయంలో ఒక ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఇన్నింగ్స్ 11వ ఓవర్లో టి. నటరాజన్ బౌలింగ్‌కు వచ్చాడు. అప్పటికే మాథ్యూ వేడ్ హాఫ్ సెంచరీతో ధాటిగా ఆడుతున్నాడు. ఓవర్లో నటరాజన్ వేసిన నాలుగో బంతి వేడ్ ప్యాడ్లను తాకింది. కానీ నటరాజన్.. కీపర్ రాహుల్ ఎల్బీపై అంపైర్‌కు అప్పీల్ చేసినా ఎటుంటి స్పందన రాలేదు... టీమిండియా కూడా రివ్యూ కోరలేదు. (చదవండి : అయ్యో! చహల్ ఎంత పని జరిగింది) అయితే థర్డ్ అంపైర్ చూపించిన రిప్లైలో మాత్రం వేడ్ ఔట్ అయినట్లుగా తెలుస్తుంది. ఆ తర్వాత మైదానంలోని బిగ్స్క్రీన్పై వేడ్ ఔట్ అయినట్లు కనిపించడంతో షాక్ తిన్న కోహ్లి రివ్యూ కోరాడు. కానీ అంపైర్ కోహ్లి రివ్యూను తిరస్కరించారు. సమయం మించిన తర్వాత రివ్యూ కోరావని.. అందుకే తిరస్కరించామని అంపైర్లు చెప్పడంతో కోహ్లి ఏం చేయలేకపోయాడు. ఒకవేళ కోహ్లి రివ్యూ కోరుంటే 50 పరుగుల వద్ద వేడ్ ఔటయ్యేవాడు. అలా బతికిపోయిన వేడ్ ఆ తర్వాత మరో 30 పరుగులు రాబట్టాడు.కోహ్లి ఆలస్యం చేశావు.. వెంటనే రివ్యూ కోరుంటే ఫలితం వేరేలా ఉండేది అని అభిమానులు పేర్కొంటున్నారు. (చదవండి : స్టాండ్స్‌లోకి పంపుదామనుకుంటే స్టన్ అయ్యాడు..) -
చెలరేగిన వేడ్, మ్యాక్స్‌వెల్..
సిడ్నీ : ఆసీస్ ఓపెనర్ మాథ్యూ వేడ్ విధ్వంసకర ఇన్నింగ్స్‌కు తోడు ఆల్‌రౌండర్ మ్యాక్స్‌వెల్ చెలరేగడంతో మూడో టీ20లో ఆసీస్ భారీ స్కోరు నమోదు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. టీమిండియాకు 187 పరుగులు టార్గెట్‌ను నిర్ధేశించింది. ముందుగా టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకొని ఆసీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఓపెనర్ ఆరోన్ ఫించ్ రెండో ఓవర్ వేసిన వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు. అయితే ఈ ఆనందం టీమిండియాకు ఎంతోసేపు నిలవలేదు. ఫించ్ వెనుదిరిగిన అనంతరం క్రీజులోకి వచ్చిన స్మిత్‌తో కలిసి మరో ఓపెనర్ వేడ్ చెలరేగిపోయాడు. అయితే మరోసారి బౌలింగ్‌కు వచ్చిన సుందర్ 24 పరుగులు చేసిన స్మిత్‌ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. దీంతో ఆసీస్ 79 పరుగులు వద్ద రెండో వికెట్‌ను కోల్పోయింది. తర్వాత వచ్చిన మ్యాక్స్‌వెల్ దాటిగా ఆడడంతో స్కోరుబోర్డు పరుగులెత్తింది. ఈ దశలో వేడ్ టోర్నీలో వరుసగా రెండో హాఫ్ సెంచరీ సాధించాడు. హాఫ్ సెంచరీ తర్వాత మరింత రెచ్చిపోయిన వేడ్.. ఫోర్లు, సిక్సర్లు బాదేశాడు. మ్యాక్స్‌వెల్ కూడా బ్యాట్‌కు పనిజెప్పడంతో ఆసీస్‌కు పరుగులు వేగంగా వచ్చాయి. ఈ నేపథ్యంలో మ్యాక్స్‌వెల్ కూడా 30 బంతుల్లో టోర్నీలో తొలి ఫిప్టీ సాధించాడు. అయితే స్కోరును పెంచే ప్రయత్నంలో వేడ్, మ్యాక్స్‌వెల్ అవుటవడం.. చివరి రెండు ఓవర్లు భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌల్ చేయడంతో ఆసీస్ 20 ఓవర్లలో 186 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ముగించింది. టీమిండియా బౌలర్లలో సుందర్ 2, నటరాజన్, ఠాకూర్లు చెరో వికెట్ తీశారు. -
అతడు గొప్ప కెప్టెన్.. అవకాశం వస్తే: వేడ్
సిడ్నీ: ‘‘ స్మిత్, మోజెస్ హెన్రిక్స్(బీబీఎల్ టీం సారథి) వంటి ఎంతో మంది గొప్ప నాయకులు, అనుభవజ్ఞులు మా జట్టులో ఉన్నారు. ఫించీ మా కెప్టెన్. తను బాగా ఆడితే మేం కూడా మెరుగ్గా రాణిస్తాం. నిజానికి స్మిత్ కూడా గొప్ప కెప్టెన్. సుదీర్ఘకాలం పాటు సారథిగా సేవలు అందించాడు. మళ్లీ అవకాశం వస్తే అంతే గొప్పగా జట్టును ముందుండి నడిపిస్తాడు. అయినప్పటికీ నాకు కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం దక్కింది. సీనియర్లంతా చాలా సేపు చర్చించుకున్న తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. అయినా మేమంతా ఎల్లప్పుడూ కలిసికట్టుగానే ఉంటాం. సమిష్టిగా ఆడతాం’’ అని ఆస్ట్రేలియా వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ మాథ్యూ వేడ్ అన్నాడు. ఆదివారమిక్కడ టీమిండియాతో జరిగిన టీ20 మ్యాచ్‌లో ఆరోన్ ఫించ్ గాయపడటంతో అతడు కెప్టెన్సీ బాధ్యతలు వేడ్ తలకెత్తుకున్న సంగతి తెలిసిందే. (చదవండి: టీమిండియాకు గొప్ప ఆటగాడు దొరికాడు: మెక్‌గ్రాత్) ఇక ఈ మ్యాచ్‌లో కెప్టెన్‌గా విఫలమైనా వ్యక్తిగతంగా మెరుగ్గానే రాణించాడు. భారత బౌలర్లను వేటాడుతూ.. వరుస బౌండరీలు బాదుతూ... 25 బంతుల్లో (10 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. ఈ నేపథ్యంలో తన ప్రదర్శన గురించి వేడ్ మాట్లాడుతూ.. ‘‘అవును.. నాకిప్పుడు 32 ఏళ్లు. చాలా కాలం నుంచి క్రికెట్ ఆడుతున్నా. అయితే నేనొక డిఫరెంట్ ప్లేయర్‌ను అని చెప్పగలను. అవును.. మాథ్యూ వేడ్ వికెట్ కీపర్- బ్యాటర్. గతంలో కంటే ఎంతో భిన్నంగా ఆడుతున్నాడు. మూడేళ్లుగా తన ఆట తీరులో మార్పు వచ్చింది. రెండేళ్ల క్రితం కెరియర్ని రీస్టార్డ్ చేసిన ఫీలింగ్ తనది. ముప్పైవ ఏట మరోసారి అరంగేట్రం’’ అని చెప్పుకొచ్చాడు. కాగా ఈ మ్యాచ్‌లో ఆసీస్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించిన కోహ్లి సేన సిరీస్‌ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా బాల్ టాంపరింగ్ వివాదం చోటుచేసుకోవడంతో స్మిత్‌కు కెప్టెన్‌గా ఉద్వాసన పలికిన సంగతి తెలిసిందే.(చదవండి: ధావన్.. నేను ధోనిని కాదు: వేడ్) -
ధావన్.. నేను ధోనిని కాదు: వేడ్
సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను ఇంకా మ్యాచ్ ఉండగానే కైవసం చేసుకుంది. ఆసీస్ నిర్దేశించిన 195 పరుగుల టార్గెట్‌ను టీమిండియా 19.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ధావన్(52), రాహుల్(30)ల ఆరంభానికి మిడిల్ ఆర్డర్లో కోహ్లి(40) మెరుపులు కూడా తోడయ్యాయి. చివర్లో హార్దిక్ పాండ్యా(42 నాటౌట్) బ్యాట్ ఝుళిపించడంతో టీమిండియా ఎటువంటి ఒత్తిడి లేకుండానే విజయం సొంతం చేసుకుంది. కాగా, ధావన్‌ను స్టంపింగ్ చేయడానికి యత్నించిన మథ్యూ వేడ్ విఫలమయ్యాడు. టీమిండియా ఇన్నింగ్స్‌లో భాగంగా స్వెప్సన్ వేసిన 9 ఓవర్ ఐదో బంతిని ధావన్ ఆఫ్‌సైడ్ చేయడానికి యత్నించాడు. అది కాస్తా మిస్ కావడంతో వేడ్ వెంటనే స్టంపింగ్ చేశాడు. దానికి గట్టిగా అప్పీల్ చేశాడు వేడ్. (చదవండి: సెకండ్ చాన్స్ ఇవ్వని కోహ్లి..!) దీనిపై థర్డ్ అంపైర్ సమీక్ష తర్వాత ధావన్‌ను నాటౌట్‌గా ప్రకటించారు ఫీల్డ్ అంపైర్లు. ఆ తర్వాత వేడ్ నోటి నుంచి వచ్చిన మాటలు అక్కడ ఉన్న ధావన్‌కు నవ్వు తెప్పించింది. ఇంతకీ ధావన్‌ను చూస్తూ వేడ్ అన్నది ఏమిటంటే.. ‘నేను ధోనిని కాదు.. ధోని తరహాలో వేగంగా స్టంపింగ్ చేయడానికి’ అని జోక్స్ పేల్చాడు. ఇది బాగా వైరల్ అయ్యింది. ప్రపంచ క్రికెట్లో ధోని ఒక అత్యుత్తమ వికెట్ కీపర్‌గా పేరు తెచ్చుకున్నాడు. ప్రత్యేకంగా స్టంపింగ్‌లో ధోని చాలా క్విక్‌గా రియాక్ట్ అవుతాడు. దీన్నిఉద్దేశించే వేడ్ మాట్లాడాడు. ఒకవేళ తానే ధోనిని అయ్యుంటే అది కచ్చితంగా స్టంపౌట్ అయ్యేదని ధావన్‌కు పరోక్షంగా తెలియజేశాడు వేడ్. నిన్నటి మ్యాచ్‌కు ఆసీస్ పరిమిత ఓవర్ల కెప్టెన్ అరోన్ ఫించ్ గాయం కారణంగా దూరం కావడంతో వేడ్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. (చదవండి; ‘వారు లేకుండా గెలిచాం.. ఇంతకంటే ఏం కావాలి’) -
వాట్ ఏ క్యాచ్.. ఇది టీమ్ వర్క్ అంటే!
-
వాట్ ఏ క్యాచ్.. ఇది టీమ్ వర్క్ అంటే!
హోబర్ట్ : క్రికెట్లో ఇప్పటివరకు బౌండరీ లైన్ వద్దనే ఫీల్డర్లు కళ్లు చెదిరే రీతిలో క్యాచ్ అందుకోవడం చూసుంటాం. కానీ స్లిప్‌లో మిరాకిల్ క్యాచ్‌లు చూడటం చాలా అరుదు. ఎందుకంటే అనూహ్యంగా వచ్చే బంతులను అందుకోవాలంటే.. ఫీల్డర్లు ఎంతో చురుకుగా, చాకచక్యంగా ఉండాలి. దీంతో బౌండరీల వద్ద కంటే స్లిప్‌లో ఫీల్డిండ్ చేయడమే యమా డేంజరు. అయితే స్లిప్‌లో అనూహ్య క్యాచ్‌లు అందుకొని జట్టుకు విజయాలు అందించిన ఆటగాళ్లు ఎందరో ఉన్నారు. తాజాగా ఆస్ట్రేలియా క్రికెటర్ మాథ్యూ వేడ్ స్లిప్‌లో పట్టిన క్యాచ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన ప్రతీ ఒక్కరూ వేడ్‌ను, ఆ జట్టు ఆటగాళ్లను తెగ మెచ్చుకుంటున్నారు. టీమ్ వర్క్ అంటే ఇది అని కామెంట్ చేస్తున్నారు. ఆసీస్‌లో జరుగుతున్న షెఫీల్డ్ షీల్డ్ ట్రోఫీలో భాగంగా న్యూసౌత్ వేల్స్, టాస్మానియా మధ్య జరిగిన మ్యాచ్‌లో మాథ్యూ వేడ్ పట్టిన క్యాచ్ క్రికెట్లోని అత్యుత్తమ క్యాచ్లలో ఒకటిగా విశ్లేషకులు అభిప్రాయపడతున్నారు. దాదాపు నేలపాలైందనుకున్న క్యాచ్‌ను వేడ్ ఎంతో చాకచక్యంగా అందుకున్నాడు. జాక్సన్ బర్డ్ బౌలింగ్‌లో న్యూ సౌత్ వేల్స్ బ్యాట్స్‌మన్ డేనియల్ హ్యూస్ ఇచ్చిన క్యాచ్‌ను రెండో స్లిప్‌లో ఉన్న అలెక్స్ డూలాన్ వదిలేశాడు. ఆ బాల్ నేలను తాకుతుందనగా.. క్షణాల్లో తన ఎడమవైపు డైవ్ చేసి దానిని అందుకున్నాడు మాథ్యూ వేడ్. సహజంగా వికెట్ కీపర్ అయిన వేడ్.. ఆ స్కిల్స్‌ను ఉపోయోగించి క్యాచ్ అందుకున్నాడు. -
నీకిదే చివరి మ్యాచ్..!
నాగ్ పూర్:గత కొంతకాలంగా పేలవ ప్రదర్శన కొనసాగిస్తున్న ఆస్ట్రేలియా వికెట్ కీపర్ మాథ్యూ వేడ్ కు ఆ దేశ సెలక్టర్లు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. త్వరలో జరగబోయే యాషెస్ సిరీస్ లో స్థానం దక్కాలంటే భారత్ తో జరిగే చివరి వన్డేను లక్ష్యంగా నిర్దేశించారు. టీమిండియాతో జరిగే ఆఖరి వన్డేలో సత్తాచాటుకోవాల్సిన అవసరం ఉందంటూ వేడ్ కు నోటీసులు అందజేశారు. ఒకవేళ ఇక్కడ విఫలమైతే ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ నుంచి అతన్ని తప్పించాలని నిర్ణయించారు. గత చాంపియన్స్ ట్రోఫీ నుంచి చూస్తే మాథ్యూ వేడ్ ఏ మ్యాచ్ లోనూ తొమ్మిది పరుగుల్ని మించి చేయలేదు. దీన్ని తీవ్రంగా పరిగణించిన క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) సెలక్టరు.. మాథ్యూ వేడ్ 'చివరి'అవకాశం ఇచ్చారు. భారత్ తో ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా కోల్ కతా వన్డేలో ఆస్ట్రేలియా జట్టు కష్టాల్లో పడ్డ సమయంలో మాథ్యూ వేడ్ బాధ్యతారాహిత్యంగా ఆడి అవుటయ్యాడు. దాంతో అతనిపై ఇండోర్ వన్డేలో వేటు వేశారు. 'ఈ సిరీస్ లో ఇప్పటివరకూ నేను చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. ఈ కారణంతోనే మూడో వన్డే నుంచి తప్పించారు. అక్కడ నన్ను ఎందుకు పక్కన పెట్టారు అనేది ఇప్పుడు విషయం కాదు. ఇక నన్ను నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. యాషెస్ సిరీస్ కు ఎంపిక కావాలంటే నేను బాగా ఆడాల్సి ఉంది. నా అవకాశాలు క్లిష్టం కావొచ్చు. నాకు రాబోయే మ్యాచ్ ల గురించి ఆందోళన లేదు. నేను ఏ సమయంలోనైనా పరుగులు చేయాలి. అదే నా ముందున్న లక్ష్యం.నేను శ్రమించాల్సిన అవసరం ఉంది'అని మాథ్యూవేడ్ తెలిపాడు. -
అతనిపై వేటు తప్పదు: స్టీవ్ స్మిత్
చిట్టగాంగ్: గత కొంతకాలంగా తీవ్రంగా నిరాశపరుస్తున్న తమ వికెట్ కీపర్ మాథ్య వేడ్ ను బంగ్లాదేశ్ జరిగే రెండో టెస్టుకు పక్కన పెడుతున్నట్లు ఆస్ట్రేలియా క్రికెట్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ స్పష్టం చేశాడు. అతని ఫామ్ ను బట్టి చూస్తూ వేటు తప్పడం లేదన్నాడు. 'వేడ్ బ్యాట్ నుంచి ఆశించిన ప్రదర్శన రావడం లేదు. అతను తరచు విఫలం కావడంతోనే బంగ్లాదేశ్ మ్యాచ్ కు అతన్ని బెంచ్ కే పరిమితం చేస్తున్నాం. వేడ్ బ్యాటింగ్ లో విఫలమవుతున్న సంగతి అతనికి కూడా తెలుసు. జట్టులో సమతుల్యతో కావాలంటే కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవు. వికెట్ కీపర్ బాధ్యతల్ని హ్యాండ్ స్కాంబ్ కు అప్పచెప్పే అవకాశం ఉంది. వేడ్ ను కూర్చొబెట్టడం కాస్త కఠిన నిర్ణయమే. అయినా తప్పదు'అని స్మిత్ తెలిపాడు. బంగ్లాదేశ్ తో జరిగిన తొలి టెస్టులో ఆసీస్ 20 పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఇరు జట్ల మధ్య సోమవారం నుంచి రెండో టెస్టు ఆరంభం కానుంది. సిరీస్ ను సమం చేయాలంటే రెండో టెస్టులో ఆసీస్ గెలవాల్సి ఉంది. ఈ క్రమంలోనే రేపటి మ్యాచ్ కోసం తీవ్ర కసరత్తులు చేస్తోంది. గాయపడ్డ హజల్ వుడ్ స్థానంలో స్పిన్నర్ ఓకెఫీకీ చోటు దక్కే అవకాశం ఉంది. -
ఓడిపోయాక డిన్నర్ చేద్దాం లే..
-
ఓడిపోయాక డిన్నర్ చేద్దాం లే..
రెండో రోజు మ్యాచ్ సజావుగానే సాగినా సోమవారం ఆట మాత్రం వాడివేడిగా సాగింది. జడేజా అర్ధ సెంచరీ చేసిన అనంతరం అలవాటులో భాగంగా తన బ్యాట్‌ను కత్తిసాము చేసినట్టుగా తిప్పడాన్ని వేడ్ అవహేళన చేశాడు. ‘ఎందుకు ఇలా చేస్తుంటావు? నీ ఇన్‌స్టాగ్రామ్‌లో అంతా ఇలాంటి చెత్తే ఉంటుంది’ అని రెచ్చగొట్టాడు. జడేజా అంపైర్ దగ్గరికి వెళ్లి ‘తను ఆపకపోతే నేను ప్రారంభించాల్సి ఉంటుంది’ అని చెప్పడంతో అంపైర్ జోక్యం చేసుకుని ఆటపై దృష్టి పెట్టండి అని హితవు పలికారు. ఇక ఆసీస్ రెండో ఇన్నింగ్స్ 33వ ఓవర్లో మ్యాక్స్‌వెల్ అవుట్ కాగా తను రివ్యూ కోరాడు. రీప్లేలో తను అవుట్ అయినట్టు తేలగా మైదానం వీడుతున్నప్పుడు వేడ్... జడేజాతో మరోసారి వాగ్వాదానికి దిగాడు. మధ్యలో అశ్విన్ కల్పించుకుని సముదాయించగా క్రీజులోకి వెళ్లిన వేడ్.. అక్కడ విజయ్‌తోనూ వాదనకు దిగాడు. అంపైర్లు పరిస్థితి సద్దుమణిగేలా చేశారు. ఆ తర్వాత తమ మధ్య జరిగిన సంభాషణను జడేజా బయటపెట్టాడు. ‘ఏమీ జరగలేదు. మీరు ఓడిపోయాక అంతా కలిసి డిన్నర్ చేద్దాం’ అని వేడ్‌తో అన్నట్టు తెలిపాడు. -
మెరుగైన ఆటతో ఓడిస్తాం: వేడ్
రాంచీ: రెండో టెస్టులో నెగ్గి దూకుడు మీదున్న భారత జట్టుపై మూడో టెస్టులో మరింత మెరుగైన ఆటతీరుతో రాణిస్తామని ఆస్ట్రేలియా వికెట్ కీపర్ మాథ్యూ వేడ్ అన్నాడు. అయితే తొలి టెస్టులో దారుణంగా ఓడిన అనంతరం రెండో టెస్టుకు టీమిండియాలో అనూహ్య మార్పు వచ్చిందని చెప్పాడు. ‘రెండో టెస్టుకు భారత క్రికెటర్లలో వచ్చిన మార్పు మమ్మల్ని షాక్‌కు గురిచేసింది. మూడో రోజు కసిగా బ్యాటింగ్ చేశారు. మేమది ఊహించాము. నిజానికి భారత జట్టు ఎప్పుడూ దూకుడుగానే ఆడుతుంది. కోహ్లితో పోలిస్తే ధోని కెప్టెన్సీ విభిన్నంగా ఉంటుంది. అయితే ఈ తేడా వారిద్దరి వ్యక్తి్తత్వం వల్లే వచ్చింది. ఇక మూడో టెస్టులో మేం నైపుణ్యంతో కూడిన క్రికెట్ ఆడి దెబ్బకొడతాం’ అని వేడ్ అన్నాడు. బరిలోకి దిగాక అత్యుత్తమ ఆటతీరును చూపేందుకు ప్రయత్నిస్తానని 29 ఏళ్ల వేడ్ చెప్పాడు. భారత్, ఆస్ట్రేలియాల మధ్య మూడో టెస్టు ఈనెల 16న రాంచీలో ప్రారంభమవుతుంది. -
తొలి వన్డే ఆసీస్‌దే
బ్రిస్బేన్: 78 పరుగులకే 5 వికెట్లు పడిన దశలో వికెట్ కీపర్ మాథ్యూ వేడ్ (100 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆస్ట్రేలియా జట్టుకు ఆపద్బాంధవుడిలా నిలిచాడు. ఇన్నింగ్స్ చివరి బంతికి సెం చరీ సాధించి ఆస్ట్రేలియాకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. ఫలితంగా పాకిస్తాన్‌తో జరిగిన తొలి వన్డేలో ఆసీస్ 92 పరుగుల తేడా తో నెగ్గింది. రెండో వన్డే రేపు మెల్బోర్న్లో జరుగుతుంది. తొలుత 50 ఓవర్లలో 9 వికెట్లకు 268 పరుగులు చేయగా... పాక్ 42.4 ఓవర్లలో 176 పరుగులకే కుప్పకూలింది. ఫాల్క్‌నర్‌కు నాలుగు, కమ్మిన్స్‌కు మూడు వికెట్లు దక్కాయి. -
చివరి బంతికి సెంచరీ కొట్టి...
-
చివరి బంతికి సెంచరీ కొట్టి...
బ్రిస్ బేన్: పాకిస్థాన్‌తో జరుగతున్న తొలి వన్డేలో ఆస్ట్రేలియా వికెట్ కీపర్ మథ్యూ వాడే రెచ్చిపోయాడు. ఇన్నింగ్స్ చివరి ఓవర్లో చివరి బంతి సహాయంతో కెరీర్లో తొలి సెంచరీ సాధించాడు. పీకల్లోతు కష్టాల్లో ఉన్న ఆసీస్‌ను అద్భుత సెంచరీతో ఆదుకున్నాడు. 7(ఫోర్లు), 2(సిక్సర్లు)తో శతకాన్ని నమోదు చేశాడు. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్‌కు వచ్చిన ఆసీస్‌కు మహ్మద్ అమీర్ రూపంలో గట్టి ఎదురు దెబ్బతగిలింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ (7), కెప్టెన్ స్టీవ్ స్మీత్ వికెట్లను (0) వెనువెంటనే కోల్పోయింది. ఒక దశలో 78 పరుగులకు అయిదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టుకు మథ్యూ వాడే ఆపద్బాంధవుడులా నిలిచాడు. తీవ్ర ఒత్తిడిలో ఆచితూచి ఆడుతూ ఆల్ రౌండర్ మ్యాక్స్ వెల్‌తో కలిసి 82 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. మరో వైపు మ్యాక్స్ వెల్ వికెట్ల మధ్య చురుకుగా కదులుతూ అద్భుతమైన రివర్స్ స్వీప్స్, చూడచక్కని షాట్లతో 56 బంతుల్లో 60 (7ఫోర్లు) పరుగులు చేశాడు. పాకిస్థాన్ బౌలర్ హసన్ అలీ వేసిన 31వ ఓవర్లో మిడ్ వికెట్ మీదుగా బంతిని తరలించబోయి మహ్మద్ హఫీజ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. సొంత గ్రౌండ్ గబ్బాలో తొలి వన్డే ఆడుతున్న క్రిష్ లిన్ 16 (12) అమీర్ వేసిన ఓవర్లో ఏకంగా 97 మీటర్ల భారీ సిక్సర్ ను కొట్టిన అనంతరం హసన్ అలీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ట్రావిస్ హెడ్ స్వ్కేర్, కవర్ డ్రైవ్స్ తో బంతిని పరుగులు పెట్టించాడు.ఈ క్రమంలో 39 పరుగులు అనంతరం స్పిన్నర్ ఇమాద్ వసీంకు దొరికి పోయాడు. ఇన్నింగ్స్ చివరి బంతికి మథ్యూ సెంచరీ చేసి ఆసిస్ గౌరవ ప్రదమైన స్కోరు చేయడంలో తన వంతు కృషి చేశాడు. టేలెండర్స్తో కలిసి మాథ్యూ చేసిన ఒంటరి పోరాటం ఫలితంగా ఆస్ట్రేలియా 268 పరుగులు చేయగలిగింది. పాక్ వికెట్ కీపర్ సర్పరాజ్ అహ్మద్ తన తల్లికి సీరియస్ గా ఉండటంతో స్వదేశానికి వెళ్లగా.. అతని స్థానంలో జట్లులోకి వచ్చిన రిజ్వాన్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. మ్యాచ్ లో నాలుగు క్యాచ్ లు అందుకుని అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ ఇన్నింగ్స్ లో తొమ్మిది ఓవర్లు వేసిన హాసన్ 65 పరుగులిచ్చి, మూడు వికెట్లు తీశాడు. బ్యాట్స్మెన్ల పేలవ ప్రదర్శనతో పాక్ 176 పరుగులకే ఆలౌటైంది. ఫాల్క్‌నర్ 4, కమ్మిన్స్ 3 వికెట్లు తీసి పాక్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేశారు. దీంతో 92 పరుగుల తేడాతో ఆసిస్ ఘన విజయం సాధించింది. పాక్‌లో బాబర్ అజమ్ 33 పరుగులతో పాక్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. -
మ్యాక్స్‌వెల్‌పై జరిమానా
సిడ్నీ: సహచర ఆటగాడు మాథ్యూ వేడ్‌ను అగౌరవపరిచేలా మాట్లాడినందుకు డాషింగ్ బ్యాట్స్‌మన్ గ్లెన్ మ్యాక్స్‌వెల్‌పై జరిమానా విధించారు. షెఫీల్డ్ షీల్డ్ మ్యాచ్‌లో విక్టోరియా తరఫున ఆడినప్పుడు వికెట్ కీపర్ వేడ్ తర్వాత ఆరో స్థానంలో బ్యాటింగ్ చేయడం చాలా బాధించిందని, దీంతో దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో ఎంపికపై ప్రభావం చూపిందని గత గురువారం అన్నాడు. అరుుతే ఈ వ్యాఖ్యలతో ఆసీస్ జట్టులో ప్రతీ ఒక్కరు బాధపడ్డారని కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. అంతేకాకుండా జట్టుతో పాటు ఆస్ట్రేలియా లీడర్షిప్ గ్రూప్ కూడా మ్యాక్స్‌వెల్‌పై జరిమానా విధించింది. -
మాథ్యూ వేడ్‌పై వేటు
సిడ్నీ:త్వరలో భారత్ లో జరుగనున్న వరల్డ్ టీ 20లో భాగంగా మంగళవారం ప్రకటించిన ఆస్ట్రేలియా క్రికెట్ జట్టులో వికెట్ కీపర్ మాథ్యూ వేడ్ పై వేటు పడింది. గత ఏడాది వరల్డ్ కప్ అనంతరం వికెట్ కీపర్ గా ఆస్ట్రేలియా క్రికెట్ జట్టులోకి వచ్చిన మాథ్యూవేడ్‌ను తొలగిస్తూ క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) సెలక్టర్లు నిర్ణయం తీసుకున్నారు. బ్రాడ్ హాడిన్ రిటైర్మెంట్ ప్రకటించడంతో అతని స్థానంలో వేడ్ జట్టులోకి వచ్చాడు. అయితే అటు కీపింగ్ లోనూ, బ్యాటింగ్‌లోనూ ఆకట్టుకోని వేడ్ కు ఆసీస్ సెలక్టర్లు ఉద్వాసన పలికారు. అతని స్థానంలో కీపర్ పీటర్ నేవిల్ను 15 మంది సభ్యులతో కూడిన జట్టులో స్థానం కల్పించారు. ఇదిలాఉండగా, ఆరోన్ ఫించ్ ను టీ 20 కెప్టెన్సీ నుంచి తప్పించారు. అతని స్థానంలో వన్డే, టెస్టు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న స్టీవ్ స్మిత్‌నే టీ 20 సారథిగా నియమించారు. -
ఢీ అంటే ఢీ!
♦ ఆసీస్‌తో ఇలాగే తలపడాలి ♦ పోరుకు సిద్ధమన్న రోహిత్ శర్మ పెర్త్: భారత్, ఆస్ట్రేలియాల మధ్య మ్యాచ్ అంటే ఎప్పుడైనా హోరాహోరీ తప్పదని... ఈసారి కూడా అదే విధంగా సిరీస్ కొనసాగే అవకాశం ఉందని భారత బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. గతేడాదిలో ప్రపంచ కప్‌కు ముందు ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లలో తాము గట్టి పోటీ ఇచ్చిన విషయాన్ని అతను గుర్తు చేశాడు. ‘ఆస్ట్రేలియా జట్టు అంత సులువుగా ప్రత్యర్థి ముందు తలవంచదు. వారిపై బాగా ఆడి గెలవడం ఒక పరీక్షలాంటిదే. ప్రతీ పరుగు కోసం పోరాడాల్సి ఉంటుంది. అయితే ఇలాంటి సవాళ్లను నేను ఇష్టపడతాను. ఇక్కడ రాణిస్తే వచ్చే గుర్తింపు వేరు. నేను కూడా బాగా ఆడాలని పట్టుదలగా ఉన్నాను’ అని రోహిత్ చెప్పాడు. వన్డే సిరీస్‌కు వారం రోజులు ముందు రావడం వల్ల ఇక్కడ పరిస్థితులపై తమకు అంచనా ఏర్పడుతుందని, ముఖ్యంగా తొలి వన్డే జరిగే పెర్త్ పిచ్‌పై తమకు పూర్తి అవగాహన ఉందని అతను చెప్పాడు. ఇక్కడా భారత అభిమానులే: వేడ్ ఆస్ట్రేలియాలో జరిగే మ్యాచ్‌లలో కూడా తమకంటే భారత ఆటగాళ్లకే ప్రేక్షకుల మద్దతు ఎక్కువగా ఉం డటం కాస్త ఒత్తిడి పెంచే అంశమని ఆసీస్ వికెట్ కీపర్ మ్యాథ్యూ వేడ్ అభిప్రాయపడ్డాడు. ‘భారీ సంఖ్యలో ఉండే ప్రేక్షకుల మధ్యలో మ్యాచ్ ఆడటం ఉత్సాహాన్నిస్తుంది. అయితే ఇక్కడ కూడా మాకంటే భారత అభిమానులే ఎక్కువగా మ్యాచ్‌కు వచ్చి వారికి అండగా నిలుస్తున్నారు’ అని వేడ్ అన్నాడు. మరోవైపు ఇరు జట్లూ దూకుడైన క్రికెట్‌కు మారుపేరని... కాబట్టి సిరీస్ ఆసక్తికరంగా సాగే అవకాశం ఉందని ఆస్ట్రేలియా కోచ్ డారెన్ లీమన్ వ్యాఖ్యానించారు. వ్యక్తిగత కారణాలతో విశ్రాంతికి అవకాశం ఉన్నా... భారత్‌తో పోరుకు దూరం కాకూడదని స్మిత్, వార్నర్ గట్టిగా నిర్ణయించుకున్నట్లు కోచ్ వెల్లడించారు. -
ఆసీస్‌దే తొలి వన్డే
59 పరుగుల తేడాతో ఇంగ్లండ్ ఓటమి సౌతాంప్టన్ : మాథ్యూ వేడ్ (50 బంతుల్లో 71 నాటౌట్; 12 ఫోర్లు), డేవిడ్ వార్నర్ (67 బంతుల్లో 59; 6 ఫోర్లు) రాణించడంతో గురువారం రాత్రి జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా 59 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో కంగారూ జట్టు 1-0 ఆధిక్యంలో నిలిచింది. రోస్ బౌల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో... టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 50 ఓవర్లలో 6 వికెట్లకు 305 పరుగులు చేసింది. బర్న్స్ (44), వార్నర్ తొలి వికెట్‌కు 76 పరుగులు జోడించి శుభారంభాన్నిచ్చారు. స్మిత్ (44), మార్ష్ (40 నాటౌట్)లు ఫర్వాలేదనిపించారు. వార్నర్, స్మిత్ రెండో వికెట్‌కు 57 పరుగులు జోడిస్తే.. చివర్లో వేడ్, మార్ష్‌లు ఏడో వికెట్‌కు 13 ఓవర్లలో అజేయంగా 112 పరుగులు సమకూర్చడంతో భారీ స్కోరు సాధ్యమైంది. ఆదిల్ రషీద్ 4 వికెట్లు తీశాడు. తర్వాత ఇంగ్లండ్ 45.3 ఓవర్లలో 246 పరుగులకు ఆలౌటై ఓడింది. రాయ్ (64 బంతుల్లో 67; 11 ఫోర్లు) టాప్ స్కోరర్. టేలర్ (49), మోర్గాన్ (38) మినహా మిగతా వారు నిరాశపర్చారు. టాప్ ఆర్డర్ నిలకడతో ఓ దశలో ఇంగ్లండ్ 5 వికెట్లకు 194 పరుగులు చేసింది. అయితే మిడిల్, లోయర్ ఆర్డర్ వైఫల్యంతో 52 పరుగుల తేడాతో చివరి ఐదు వికెట్లు చేజార్చుకుంది. స్టార్క్, కోల్టర్‌నీల్, కమిన్స్, వాట్సన్ తలా రెండు వికెట్లు తీశారు. వేడ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.