రిటైర్మెంట్‌ ప్రకటించిన ఆస్ట్రేలియా వరల్డ్‌కప్‌ విన్నర్‌ | Australia's Matthew Wade Announces His Retires From International Cricket, Joins Coaching Team | Sakshi
Sakshi News home page

Matthew Wade Retirement: రిటైర్మెంట్‌ ప్రకటించిన ఆస్ట్రేలియా వరల్డ్‌కప్‌ విన్నర్‌

Published Tue, Oct 29 2024 7:59 AM | Last Updated on Tue, Oct 29 2024 9:36 AM

Matthew Wade Retires From International Cricket

ఆస్ట్రేలియా వికెట్‌కీపర్‌ కమ్‌ బ్యాటర్‌ మాథ్యూ వేడ్‌ అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. రిటైర్మెంట్‌ అనంతరం వేడ్‌ ఆండ్రీ బోరోవెక్‌ నేతృత్వంలోని ఆస్ట్రేలియా కోచింగ్‌ బృందంలో జాయిన్‌ అవుతాడు. వచ్చే నెలలో పాకిస్తాన్‌తో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌ నుంచి వేడ్‌ కొత్త బాధ్యతలు చేపడతాడు. 

అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైరైన వేడ్‌.. దేశవాలీ క్రికెట్‌లో, బిగ్‌బాష్‌ లీగ్‌లో కొనసాగుతాడు. ఈ ఏడాది జూన్‌లో (టీ20 వరల్డ్‌కప్‌) తన చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడిన వేడ్‌.. తన 13 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో 36 టెస్ట్‌లు, 97 వన్డేలు, 92 టీ20లు ఆడి 4700 పైచిలుకు పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు, 19 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. 

రిటైర్మెంట్‌ సందర్భంగా వేడ్‌ తన సహచరులతో పాటు కోచింగ్‌ స్టాఫ్‌కు, కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపాడు. 36 ఏళ్ల వేడ్‌ ఆస్ట్రేలియా టీ20 వరల్డ్‌కప్‌ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. వేడ్‌కు ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లోనూ ప్రవేశముంది. వేడ్‌ ఐపీఎల్‌లో గుజరాత్‌ టైటాన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. 

కాగా, పాకిస్తాన్‌ జట్టు నవంబర్‌ 4 నుంచి ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఈ పర్యటనలో పాక్‌ మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. నవంబర్‌ 4, 8, 10 తేదీల్లో మూడు వన్డేలు జరుగనుండగా.. నవంబర్‌ 14, 16, 18 తేదీల్లో టీ20లు జరుగనున్నాయి. ఈ సిరీస్‌ల అనంతరం​ ఆస్ట్రేలియా స్వదేశంలో భారత్‌తో బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ ఆడుతుంది. ‌

చదవండి: ప్రొఫెషనల్‌ బ్యాటర్‌లా మారిన చహల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement