క్వీన్స్‌ల్యాండ్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20లో ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అఖరి వరకు ఉత్కంత భరితంగా జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బ్యాటర్ మాథ్యూ వేడ్ తమ జట్టును విజయ తీరాలకు చేర్చాడు. అఖరి ఓవర్‌లో విజయానికి 11 పరుగులు అవసరమ్వగా.. వేడ్, స్టార్క్ తమ జట్టు విజయాన్ని లాంఛనం చేశారు. 147 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 58 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఈ క్రమంలో ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్, వేడ్ ఇన్నింగ్స్‌ను చక్క దిద్దారు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 69 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. అనంతరం ఫించ్ ఔటైనప్పటికీ.. వేడ్ మాత్రం ఆచితూచి ఆడూతూ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఫించ్ 52 బంతుల్లో 58 పరుగులు చేయగా.. వేడ్ 29 బంతుల్లో 39 పరుగులు సాధించాడు.
కాగా విండీస్ బౌలర్లలో కాట్రెల్, జోషఫ్ తలా రెండు వికెట్లు సాధించగా.. హోల్డర్, కారియా, స్మిత్ చెరో వికెట్ సాధించారు. ఇక అంతకుముందు బ్యాటింగ్ చేసిన విండీస్.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 145 పరుగులు చేసింది. విండీస్ బ్యాటర్లలో కైల్ మైయర్స్ 39 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో జోష్ హాజిల్ వుడ్ మూడు వికెట్లతో అదరగొట్టగా.. స్టార్క్, కమ్మిన్స్ చెరో రెండు వికెట్లు సాధించారు.
చదవండి: Womens Asia Cup 2022: పాకిస్తాన్‌కు భారీ షాకిచ్చిన థాయ్‌లాండ్.. క్రికెట్ చరిత్రలో తొలి విజయం
Comments
Please login to add a commentAdd a comment