టీ20 వరల్డ్‌కప్-2024కు వెస్టిండీస్, అమెరికా సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే. జూన్ 1 నుంచి ఈ మెగా టోర్నీ ఆరంభం కానుంది. అయితే ఈ క్రికెట్ మహా సంగ్రామానికి ఇంకా నాలుగు నెలల సమయం ఉన్నప్పటికి మాజీ క్రికెటర్లు అంచనాలు, అభిప్రాయాలు ఇప్పటి నుంచే మొదలెట్టేశారు. తాజాగా ఆసీస్ మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ టీ20 వరల్డ్‌కప్‌కు తమ జట్టు ప్లేయింగ్ ఎలెవన్‌ను ఎంపిక చేశాడు.
తాజాగా ఈఎస్పీఎన్ అరౌండ్ ది వికెట్ షోలో ఫించ్ పాల్గోనున్నాడు. ఈ క్రమంలో పొట్టి వరల్డ్‌కప్‌లో భాగమయ్యే ఆసీస్ ప్లేయింగ్ ఎలెవన్‌ను ఫించ్ ఎంచుకున్నాడు. ఓపెనర్లగా డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్‌ను ఎంపిక చేసిన ఫించ్.. స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్‌కు తన తుది జట్టులో చోటు ఇవ్వలేదు. వరుసగా ఫస్ట్, సెకెండ్ డౌన్‌లో మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్‌కు చోటు కల్పించారు.
అదే విధంగా పిచ్ పరిస్ధితులను బట్టి మార్కస్ స్టోయినిస్ లేదా మాథ్యూ షార్ట్‌లో ఒకరికి ఛాన్స్ ఇవ్వాలని ఫించ్ అభిప్రాయపడ్డాడు. అదే విధంగా వికెట్ కీపర్‌గా జోష్ ఇంగ్లీష్‌ను ఆరోన్ ఎంపిక చేశాడు. పినిషర్‌గా యువ ఆటగాడు టిమ్ డేవిడ్‌కు చోటు ఇచ్చాడు. ఇక ఫాస్ట్ బౌలర్ల కోటాలో పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్ చోటు దక్కింది. స్పెషలిస్ట్ స్పిన్నర్ల కోటాలో ఆడమ్ జంపా ఒక్కడికే చోటు దక్కింది.
ఫించ్ ఎంపిక చేసిన ఆసీస్ ప్లేయింగ్ ఎలెవన్: డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, జోష్ ఇంగ్లిస్, మార్కస్ స్టోయినిస్ లేదా మాథ్యూ షార్ట్ (పరిస్థితులపై బట్టి), టిమ్ డేవిడ్, పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్
Comments
Please login to add a commentAdd a comment