ఆసీస్ సెలెక్టర్లు తమ స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్‌కు భారీ షాకివ్వనున్నారని తెలుస్తుంది. వరల్డ్‌కప్ జట్టులో స్మిత్ స్థానం గల్లంతు కావడం ఖాయమని ఆసీస్ మీడియా కోడై కూస్తుంది. స్మిత్ స్థానంలో ఐపీఎల్ నయా సెన్సేషన్, ఢిల్లీ క్యాపిటల్స్ విధ్వంసకర ఆటగాడు జేక్ ఫ్రేసర్ వరల్డ్‌కప్ జట్టులోకి వస్తాడని సమాచారం.
జట్టు ప్రకటనకు మే 1 డెడ్‌లైన్ కావడంతో అన్ని జట్ల సెలెక్టర్లు తమతమ జట్లను ఫైనల్ చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఈ క్రమంలో ఆసీస్ సెలెక్టర్లు తమ జట్టుకు తుది రూపు తెచ్చినట్లు సమాచారం. నేడో రేపో 15 మంది సభ్యులతో కూడిన ఆసీస్ ప్రపంచకప్ జట్టును ప్రకటించే అవకాశం ఉంది.
న్యూజిలాండ్ ఇవాళే తమ వరల్డ్‌కప్ జట్టును ప్రకటించగా.. టీమిండియాను ఇవాళ రాత్రి లేదా రేపు ఉదయం ప్రకటించే ఛాన్స్ ఉంది. ఈసారి టీమిండియా వరల్డ్‌కప్ జట్టుపై జనాల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
ఒకరిద్దరి విషయంలో అభిమానులు చాలా పర్టికులర్‌గా ఉన్నారు. శివమ్ దూబే, రింకూ సింగ్ లాంటి ఆటగాళ్లను వరల్డ్‌కప్ జట్టుకు ఎంపిక చేయాలని పెద్ద ఎత్తును డిమాండ్లు వినిపిస్తున్నాయి. హార్దిక్, సంజూ శాంసన్, రిషబ్ పంత్ విషయంలో సెలెక్టర్ల నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
స్మిత్ విషయానికొస్తే.. ఈ ఆసీస్ స్టార్‌ను ఐపీఎల్ 2024 వేలంలో ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. స్మిత్ ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో కామెంటేటర్‌గా కొనసాగుతున్నాడు. ఇటీవలే స్మిత్‌కు జాతీయ జట్టు ఓపెనర్‌గా ప్రమోషన్ లభించినప్పటికీ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. నిదానంగా ఆడతాడన్న ముద్ర స్మిత్‌పై ఉండనే ఉంది. స్మిత్‌కు ప్రత్యామ్నాయాలు కూడా ఆసీస్‌కు చాలానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో వరల్డ్‌కప్ జట్టులో స్మిత్‌కు స్థానం దొరకకపోవడం ఆశ్చర్యకరమేమీ కాదు.
Comments
Please login to add a commentAdd a comment