Jake Fraser-McGurk
-
ఓపెనర్లుగా జేక్ ఫ్రేజర్, ట్రవిస్ హెడ్.. ప్రత్యర్థులకు దబిడిదిబిడే..!
స్టార్లతో నిండిన ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్‌కప్‌లో సూపర్-8 దశలోనే నిష్క్రమించిన విషయం తెలిసిందే. ఈ టోర్నీలో ఆసీస్.. స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేక సెమీస్‌లోనే ఇంటిదారి పట్టింది. సూపర్-8లో ఆసీస్.. ఆఫ్ఘనిస్తాన్, భారత్ చేతుల్లో ఓడి ఫైనల్ ఫోర్కు అర్హత సాధించలేకపోయింది. ప్రస్తుతం ఆసీస్ జట్టులోని కీలక సభ్యులందరూ మేజర్ లీగ్ క్రికెట్‌తో బిజీగా ఉన్నారు. ఆసీస్ అంతర్జాతీయ కమిట్మెంట్స్ సెప్టెంబర్ నుంచి ప్రారంభమవుతాయి. సెప్టెంబర్ 4 నుంచి 7 వరకు స్కాట్లాండ్తో టీ20 సిరీస్, ఆ వెంటనే (సెప్టెంబర్ 11- 29) ఇంగ్లండ్‌తో టీ20, వన్డే సిరీస్‌లు జరుగనున్నాయి. ఈ సిరీస్‌ల కోసం క్రికెట్ ఆస్ట్రేలియా వేర్వేరు జట్లను ప్రకటించింది. ఈ రెండు సిరీస్‌లలో టీ20తో పాటు వన్డే జట్టుకు కూడా మిచెల్ మార్షే సారథ్యం వహించనున్నాడు. ఆసీస్ సెలెక్టర్లు రెగ్యులర్ వన్డే కెప్టెన్ పాట్ కమిన్స్‌కు విశ్రాంతినిచ్చారు. స్కాట్లాండ్, ఇంగ్లండ్ సిరీస్‌ల కోసం ఎంపిక చేసిన జట్లలో చిచ్చరపిడుగు జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్‌కు చోటు కల్పించారు ఆసీస్ సెలెక్టర్లు. ఈ సిరీస్‌లలో ఫ్రేజర్.. మరో విధ్వంసకర ఆటగాడు ట్రవిస్ హెడ్‌తో కలిసి ఆసీస్ ఇన్నింగ్స్‌ను ఆరంభిస్తాడు. ఈ ఇద్దరు విధ్వంసకర ఆటగాళ్లు ఓపెనర్లుగా బరిలోకి దిగితే ఏ స్థాయి విధ్వంసం ఉంటుందో చూడాలని ప్రతి క్రికెట్ అభిమాని కోరుకుంటున్నాడు. ఫ్రేజర్, హెడ్ ఇద్దరు ఒకే మ్యాచ్‌లో క్లిక్ అయితే ప్రత్యర్ది బౌలర్లకు ఇబ్బందులు తప్పవు. వీరిద్దరు ఏ స్థాయిలో విధ్వంసం సృష్టించగలరో ఐపీఎల్ 2024లో చూశాం. ఈ ఎడిషన్‌లో జేక్ (ఢిల్లీ క్యాపిటల్స్) 234 స్ట్రయిక్‌రేట్‌తో 330 పరుగులు చేయగా.. హెడ్ 191.55 స్ట్రయిక్‌రేట్‌తో 567 పరుగులు చేశాడు. జేక్, హెడ్ల నుంచి ఇలాంటి ప్రదర్శన కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.స్కాట్లాండ్, ఇంగ్లండ్‌తో టీ20లకు ఆసీస్ జట్టు..మిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్లెట్, కూపర్ కొన్నోలీ, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్, కామెరాన్ గ్రీన్, ఆరోన్ హార్డీ, జోష్ హాజిల్‌వుడ్, ట్రవిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, స్పెన్సర్ జాన్సన్, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా.ఇంగ్లండ్‌తో వన్డేలకు ఆస్ట్రేలియా జట్టు..మిచెల్ మార్ష్ (కెప్టెన్), సీన్ అబాట్, అలెక్స్ కారీ, నాథన్ ఎల్లిస్, జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్, ఆరోన్ హార్డీ, కామెరాన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, ట్రవిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మార్నస్ లాబూషేన్, గ్లెన్ మాక్స్వెల్, మాథ్యూ షార్ట్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా. -
వారసుడిని ప్రకటించిన డేవిడ్ వార్నర్.. ఆసీస్ కొత్త ఓపెనర్ ఎవరంటే?
అంతర్జాతీయ క్రికెట్లో ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ప్రయాణం ముగిసింది. ఇప్పటికే వన్డేలకు, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన వార్నర్.. ఇప్పుడు టీ20ల నుంచి తప్పుకున్నాడు. టీ20 వరల్డ్‌కప్-2024లో అఫ్గానిస్తాన్- బంగ్లాదేశ్ మ్యాచ్ ఫలితంతో వార్నర్ అంతర్జాతీయ కెరీర్ ముగిసింది. ఇదివరకే టీ20 వరల్డ్‌కప్ అనంతరం తన రిటైర్ అవుతానని వార్నర్ ప్రకటించేశాడు. దీంతో తన చివరి మ్యాచ్‌ను వార్నర్ భారత్‌పై ఆడేశాడు. ఇక వార్నర్ తన వారసుడిగా ఆసీస్ యువ సంచలనం జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్‌ను ప్రకటించాడు. ప్రస్తుతం కరేబియన్ దీవుల్లో ఎంజాయ్ చేస్తున్న వార్నర్ జేక్ ఫ్రేజర్-మెక్గర్క్తో కలిసి ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు."ఇక నుంచి అంతా నీదే ఛాంపియన్ అంటూ" వార్నర్ క్యాప్షన్‌గా ఇచ్చాడు. కాగా మెక్‌గర్క్‌కు టీ20 వరల్డ్‌కప్ ప్రధాన జట్టులో చోటు దక్కకపోయినప్పటికి బ్యాకప్ ఓపెనర్‌గా రిజర్వ్‌లో ఉన్నాడు. మెక్‌గర్క్ కూడా ప్రస్తుతం ఓపెనర్‌గా సత్తాచాటుతున్నాడు. ఐపీఎల్-2024లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహించిన ఫ్రెజర్.. 9 మ్యాచ్‌ల్లో 230 పరుగులు చేశాడు. ఇక పరిమిత ఓవర్ల క్రికెట్లో ట్రావిస్ హెడ్‌తో కలిసి మెక్‌గర్క్ ఆసీస్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశముంది. ఇక ఆస్ట్రేలియా తరఫున 112 టెస్టులు, 161 వన్డేలు, 110 టీ20 మ్యాచ్‌లు ఆడిన వార్నర్.. ఆయా ఫార్మాట్లలో వరుసగా 8786, 6932, 3277 పరుగులు సాధించాడు. వార్నర్ ఇక పై ఫ్రాంచైజీ క్రికెట్లో కొనసాగనున్నాడు. David Warner passes the baton to Jake Fraser-McGurk 💛📸: David Warner pic.twitter.com/VwCFtjvIX0— CricTracker (@Cricketracker) June 25, 2024 -
T20: ఆస్ట్రేలియా ప్రపంచకప్ జట్టులో కొత్తగా ఇద్దరు.. స్మిత్‌కు మరోసారి!
టీ20 ప్రపంచకప్-2024 నేపథ్యంలో ఆస్ట్రేలియా జట్టులో కొత్తగా ఇద్దరు ఆటగాళ్లకు చోటు దక్కింది. ఐపీఎల్-2024లో దుమ్ములేపిన యువ సంచలనం జేక్ ఫ్రేజర్-మెగర్క్‌తో పాటు మరో క్రికెటర్ వరల్డ్‌కప్ జట్టుతో ప్రయాణించనున్నాడు.కాగా జూన్ 1 నుంచి అమెరికా- వెస్టిండీస్ వేదికగా పొట్టి ప్రపంచకప్ టోర్నీ ఆరంభం కానుంది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఇప్పటికే 15 మంది సభ్యులతో కూడిన ప్రధాన జట్టును ప్రకటించింది.అయితే, ఐసీసీ నిబంధనల ప్రకారం మే 25 వరకు జట్టులో మార్పులు, చేర్పులకు అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా ట్రావెలింగ్ రిజర్వ్స్‌గా ఇద్దరు బ్యాటర్లను ఎంపిక చేసింది. జేక్ ఫ్రేజర్- మెగర్క్‌తో మాథ్యూ షార్ట్‌కు కూడా అవకాశం ఇచ్చింది.స్టీవ్ స్మిత్‌తో పాటు వాళ్లకు మొండిచేయిఈ క్రమంలో సీనియర్ బ్యాటర్ స్టీవ్ స్మిత్‌తో పాటు జేసన్ బెహ్రాన్‌డార్ఫ్, తన్వీర్ సంగాల ఆశలకు గండిపడినట్లయింది. కాగా ఈసారి వరల్డ్‌కప్‌లో మిచెల్ మార్ష్ సారథ్యంలో ఆస్ట్రేలియా జూన్ 5న తమ తొలి మ్యాచ్ ఆడనుంది. బార్బడోస్ వేదికగా ఒమన్‌తో తలపడనుంది.దుమ్ములేపిన మెగర్క్ఐపీఎల్-2024లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహించిన జేక్ ఫ్రేజర్-మెగర్క్ సంచలన ఇన్నింగ్స్‌తో మెరిశాడు. లుంగి ఎంగిడి స్థానంలో జట్టులోకి వచ్చిన 22 ఏళ్ల ఈ రైట్ హ్యాండ్ బ్యాటర్ తొమ్మిది మ్యాచ్‌లు ఆడి 330 పరుగులు సాధించాడు.ఈ ఓపెనింగ్ బ్యాటర్ స్ట్రైక్‌రేటు ఏకంగా 234.04 ఉండటం విశేషం. ఇక ట్రావెలింగ్ రిజర్వ్‌గా ఆస్ట్రేలియా ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకున్న మెగర్క్.. 15 మంది సభ్యుల ప్రధాన జట్టులో కూడా స్థానం సంపాదించుకునే అర్హతలు కలిగి ఉన్నా సీనియర్లు ఉన్న కారణంగా సాధ్యం కాలేదు.అందుకే ఇలా జరిగిందిఆస్ట్రేలియా హెడ్‌కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ ఈ విషయం గురించి మాట్లాడుతూ.. ‘‘ఐపీఎల్లో జేక్ ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. వరల్డ్‌కప్ జట్టు ఫైనల్ 15 కోసం అతడి పేరును పరిగణనలోకి తీసుకునేలా చేశాడు.ఇక మాథ్యూ షార్ట్ సైతం బిగ్‌బాష్ లీగ్‌లో అద్భుతంగా రాణించాడు. అయితే, వీరిద్దరు టాపార్డర్ బ్యాటర్లు కావడం వల్లే మొదటి 15 మంది సభ్యుల జాబితాలో వాళ్లకు చోటు దక్కలేదు’’ అని మెక్‌డొనాల్డ్ పేర్కొన్నాడు.టీ20 ప్రపంచకప్-2024కు ఆస్ట్రేలియా జట్టుమిచెల్ మార్ష్ (కెప్టెన్), ఆస్టన్ అగర్, ప్యాట్ కమిన్స్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్వెల్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా.ట్రావెలింగ్ రిజర్వ్స్: జేక్ ఫ్రేజర్ మెగర్క్, మాథ్యూ షార్ట్.చదవండి: శివమ్ దూబేపై వేటు.. వరల్డ్‌కప్ జట్టులో ఫినిషర్‌కు చోటు! -
ఆసీస్ యువ సంచలనానికి లక్కీ ఛాన్స్.. వరల్డ్‌కప్ జట్టులో చోటు!?
ఐపీఎల్-2024లో ఆస్ట్రేలియా యువ సంచలనం, ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసిందే. ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఓపెనర్‌గా బరిలోకి దిగిన మెక్‌గర్క్ టోర్నీ ఆసాంతం అదరగొట్టాడు. ఈ ఏడాది సీజన్లో 9 మ్యాచ్‌లు ఆడిన మెక్‌గర్క్.. 234.04 స్ట్రైక్ రేటుతో 330 పరుగులు చేశాడు.ఈ క్రమంలో అతడికి ఆస్ట్రేలియా టీ20 వరల్డ్‌కప్ జట్టులో చోటు ఇవ్వాలని సెలక్టర్లు భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటికే టీ20 వరల్డ్‌కప్‌నకు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ఆస్ట్రేలియా క్రికెట్ ప్రకటించింది. ఈ జట్టులో మెక్‌గర్క్‌కు చోటు దక్కలేదు.కనీసం రిజర్వ్ జాబితాలో కూడా జేక్ ఫ్రేజర్‌కు అవకాశం ఇవ్వలేదు. సెలక్టర్ల నిర్ణయం అందరిని ఆశ్చర్యపరిచింది. అయితే ఆసీస్ సెలక్టర్లు ఇప్పుడు తమ మనసును మార్చుకున్నట్లు తెలుస్తోంది. జేక్ ఫ్రేజర్‌ను టీ20 వరల్డ్‌కప్‌నకు రిజర్వ్ ఆటగాడిగా ఎంపిక చేయాలని ఆసీస్ సెలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకున్నట్లు ఆసీస్ మీడియా వర్గాలు వెల్లడించాయి.ఆసీస్ స్టార్ డేవిడ్ వార్నర్‌కు బ్యాకప్‌గా మెక్‌గర్క్‌ను ఎంపిక చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక జాన్ 1 నుంచి పొట్టి ప్రపంచకప్ ఆరంభం కానుంది. ఆసీస్ తమ తొలి మ్యాచ్‌లో జూన్ 5న ఒమెన్తో తలపడనుంది.టీ20 ప్రపంచ కప్‌నకు ఆస్ట్రేలియా జట్టుమిచెల్ మార్ష్ (కెప్టెన్), ఆష్టన్ అగర్, పాట్ కమిన్స్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్. జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్వెల్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా. -
కేఎల్ రాహుల్ మాస్టర్ ప్లాన్.. మెక్ గర్క్ సిల్వర్ డక్! వీడియో
ఐపీఎల్-2024లో ఢిల్లీ క్యాపిటల్స్ యువ సంచలనం జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్ తొలిసారి నిరాశపరిచాడు. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో మెక్‌గుర్క్ ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. రెండు బంతులు ఎదుర్కొన్న జేక్ ఫ్రేజర్.. డైమండ్ డక్‌గా వెనుదిరిగాడు. లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ మాస్టర్ ప్లాన్‌తో మెక్‌గుర్క్‌ను ఆదిలోనే పెవిలియన్‌కు పంపాడు. ఢిల్లీ ఇన్నింగ్స్ తొలి ఓవర్ వేసిన ఆర్షద్ ఖాన్ రెండో బంతిని లెంగ్త్ డెలివరీగా సంధించాడు. ఈ క్రమంలో జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్ లాంగ్-ఆన్ దిశగా భారీ షాట్ ఆడాడు. అయితే మెక్‌గుర్క్ లాంగ్-ఆన్ దిశగా ఆడుతాడని ముందు గానే పసిగట్టిన రాహుల్.. లాంగ్ ఆన్ ఫీల్డర్లో సెట్ చేశాడు. ఈ క్రమంలో లాంగ్ ఆన్‌లో ఉన్న నవీన్ ఉల్-హాక్ ఈజీ క్యాచ్‌ను అందుకున్నాడు.ఇది చూసిన రాహుల్ వెంటనే నేను చెప్పా కదా అన్నట్లు నవ్వుతూ రియాక్షన్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా మెక్‌గర్క్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ ఏడాది సీజన్లో 8 మ్యాచ్‌లు ఆడిన మెక్ గుర్క్.. 330 పరుగులు చేశాడు. -
DC Vs RR: ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
ఐపీఎల్-2024లో భాగంగా అరుణ్‌జైట్లీ స్టేడియం వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 221 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఢిల్లీ బ్యాటర్లలో ఓపెనర్లు జెక్ ఫ్రెజర్ మెక్ గర్క్(20 బంతుల్లో 50), అభిషేర్ పోరెల్(65) అదరగొట్టారు. వీరిద్దరితో పాటు ఆఖరిలో ట్రిస్టన్ స్టబ్స్ మెరుపులు మెరిపించాడు.20 బంతులు ఎదుర్కొన్న స్టబ్స్.. 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 41 పరుగులు చేశాడు. రాజస్తాన్ బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ మూడువికెట్లు పడగొట్టగా.. చాహల్, బౌల్ట్, సందీప్ శర్మ తలా వికెట్ సాధించారు. -
జేక్ ఫ్రేజర్ విధ్వంసం.. కేవలం 19 బంతుల్లోనే! వీడియో వైరల్
ఐపీఎల్-2024లో ఢిల్లీ క్యాపిటల్స్ యువ ఓపెనర్ జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్ మరోసారి విధ్వంసం సృష్టించాడు. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో మెక్‌గుర్క్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. రాజస్తాన్ బౌలర్లను జేక్ ఫ్రేజర్ చుక్కలు చూపించాడు.ముఖ్యంగా రాజస్తాన్ పేసర్ అవేష్ ఖాన్‌ను అయితే మెక్‌గుర్క్ ఊచకోత కోశాడు. ఢిల్లీ ఇన్నింగ్స్ 4వ ఓవర్ వేసిన అవేష్ ఖాన్ బౌలింగ్‌లో మెక్‌గుర్క్ 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో ఏకంగా 28 పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలో కేవలం 19 బంతుల్లోనే మెక్‌గుర్క్ తన హాఫ్ సెంచరీని అందుకున్నాడు.ఓవరాల్‌గా 20 బంతులు ఎదుర్కొన్న జేక్ ఫ్రేజర్ 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 50 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడి ఇన్నింగ్స్‌కు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇక ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు ఆడిన మెక్‌గుర్క్.. 44.14 సగటుతో 309 పరుగులు చేశాడు. Most IPL fifties reached in less than 20 balls3 - Jake Fraser-McGurk2 - KL Rahul2 - Yashasvi Jaiswal2 - Kieron Pollard2 - Sunil Narine2 - Nicholas Pooran- This comes only in his 7th match!#DCvRRpic.twitter.com/lSzFmynl66— Kausthub Gudipati (@kaustats) May 7, 2024 -
‘అతడు 70 శాతం ఇండియన్.. 30 శాతం మాత్రమే ఆస్ట్రేలియన్’
‘‘నేను కలిసిన అత్యంత నిస్వార్థమైన వ్యక్తుల్లో అతడూ ఒకడు. తన దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికీ అతడు సమయం కేటాయించగలడు. సాయం చేయడానికి 24/7 అందుబాటులోనే ఉంటాడు.ఎక్కడి హోటల్‌కు వెళ్లినా నా గదికి రెండు గదుల అవతల అతడు ఉంటాడు. నాకు ఇష్టం వచ్చినప్పుడు అక్కడికి వెళ్లవచ్చు. ప్రతి రోజూ ఉదయం అక్కడే నేను కాఫీ తాగుతాను కూడా!ఇండియన్ అనడం బెటర్నిజం చెప్పాలంటే అతడు ఆస్ట్రేలియన్ అనడం కంటే ఇండియన్ అనడం బెటర్. అతడికి కూడా ఇదే మాట చెబుతూ ఉంటా. నా దృష్టిలో అతడు 70 శాతం ఇండియన్.కేవలం 30 శాతం మాత్రమే ఆస్ట్రేలియన్‌గా ఉంటాడు’’ అంటూ ఢిల్లీ క్యాపిటల్స్ యువ సంచలనం, ఆసీస్ స్టార్ జేక్ ఫ్రేజర్-మెగర్క్ సహచర ఆటగాడు డేవిడ్ వార్నర్‌పై ప్రశంసలు కురిపించాడు.తనకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా వెంటనే వార్నర్ దగ్గరికి వెళ్లి అడిగేంత చొరవ ఉందని తెలిపాడు. సీనియర్ అన్న పొగరు ఏమాత్రం చూపించడని.. అందరితోనూ సరదాగా ఉంటాడని మెగర్క్ చెప్పుకొచ్చాడు.హైదరాబాదీలతో బంధంకాగా ఆసీస్ వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఐపీఎల్ ద్వారా భారతీయులకు చేరువైన విషయం తెలిసిందే. ముఖ్యంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆడిన సమయంలో హైదరాబాదీలతో బంధం పెనవేసుకున్నాడు.టాలీవుడ్ స్టార్ హీరోల తెలుగు పాటలకు రీల్స్ చేస్తూ ఎప్పుడూ వార్తల్లో నిలిచే వార్నర్ భాయ్.. ఇటీవలే దర్శకధీరుడు రాజమౌళితో కలిసి ఓ యాడ్లోనూ నటించి మెప్పించాడు.ఈ నేపథ్యంలో మెగర్క్ వార్నర్ గురించి డీసీ(ఢిల్లీ క్యాపిటల్స్) పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. ఢిల్లీకి ఆడుతున్న సౌతాఫ్రికా స్టార్ ట్రిస్టన్ స్టబ్స్ సైతం వార్నర్‌తో తనకు మంచి అనుబంధం ఉందని.. అతడితో కలిసి గోల్ఫ్ ఆడటం తనకు ఇష్టమని పేర్కొన్నాడు.ఐపీఎల్-2024లో ఇలాకాగా ఐపీఎల్-2024లో ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటి వరకు ఆడిన 11 మ్యాచ్‌లలో ఐదు గెలిచి పాయింట్ల పట్టికలో ఆరోస్థానంలో ఉంది. మరోవైపు.. ఈ సీజన్‌తో క్యాష్ రిచ్ లీగ్‌లో అరంగేట్రం చేసిన 22 ఏళ్ల జేక్ ఫ్రేజర్-మెగర్క్ 6 ఇన్నింగ్స్‌లో కలిపి 259 పరుగులు చేశాడు.ఇక ట్రిస్టన్ స్టబ్స్ 10 ఇన్నింగ్స్ ఆడి 277 రన్స్ చేయగా.. డేవిడ్ వార్నర్ కేవలం 7 మ్యాచ్‌లలో భాగమై 167 పరుగులు చేయగలిగాడు. ఈ సీజన్లో ఇప్పటి వరకు వార్నర్ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. -
టీ20 వరల్డ్‌కప్ కోసం ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. విధ్వంసకర వీరుడికి నో ఛాన్స్
వెస్టిండీస్, యూఎస్ఏ వేదికగా జూన్ 1 నుంచి ప్రారంభంకాబోయే టీ20 వరల్డ్‌కప్ 2024 కోసం 15 మంది సభ్యుల ఆస్ట్రేలియా జట్టును ఇవాళ (మే 1) ప్రకటించారు. విధ్వంసకర వీరులతో నిండిన ఈ జట్టుకు మిచెల్ మార్ష్ సారథ్యం వహించనున్నాడు. ముందుగా ప్రచారం జరిగినట్లుగా స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్‌కు ఈ జట్టులో చోటు దక్కలేదు. ఎలాగైనా జట్టులోకి వస్తాడనుకున్న ఐపీఎల్ విధ్వంసకర బ్యాటర్ జేక్ ఫ్రేసర్ మెక్‌గుర్క్‌ను సెలెక్టర్లు పరిగణలోకి తీసుకోలేదు. మాట్ షార్ట్, జేసన్ బెహ్రెన్‌డార్ఫ్, ఆరోన్ హార్డీ, స్పెన్సర్ జాన్సన్, జేవియర్ బార్ట్లెట్ లాంటి ఆశావహులకు కూడా మొండిచెయ్యే ఎదురైంది. చివరి వరల్డ్‌కప్ అని ముందుగానే ప్రకటించిన డేవిడ్ వార్నర్‌ను సెలెక్టర్లు కరుణించారు. ఎండ్ ఓవర్స్ స్పెషలిస్ట్ నాథన్ ఎల్లిస్ ఎట్టకేలకు జట్టులోకి వచ్చాడు. దాదాపు 18 నెలలుగా టీ20 జట్టుకు దూరంగా ఉన్న ఆస్టన్ అగర్, కెమరూన్ గ్రీన్‌లకు సెలెక్టర్లు అవకాశం కల్పించారు. జోష్ ఇంగ్లిస్‌కు ప్రత్యామ్నాయ వికెట్‌కీపర్‌గా మాథ్యూ వేడ్ జట్టులోకి వచ్చాడు. పేస్ బౌలింగ్ త్రయం పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్‌వుడ్ కొనసాగనున్నారు. మిచ్ మార్ష్‌తో పాటు ట్రవిస్ హెడ్, టిమ్ డేవిడ్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్ ఆల్రౌండర్లుగా ఎంపికయ్యారు. స్పెషలిస్ట్ స్పిన్నర్ కోటా ఆడమ్ జంపా జట్టులోకి వచ్చాడు. మెగా టోర్నీలో ఆస్ట్రేలియా ప్రయాణం జూన్ 5న మొదలవుతుంది. ఆసీస్ తమ తొలి మ్యాచ్‌లో పసికూన ఒమన్‌తో తలపడుతుంది. గ్రూప్-బిలో ఆసీస్.. ఇంగ్లండ్, నమీబియా, స్కాట్లాండ్, ఒమన్‌లతో పోటీపడుతుంది.టీ20 వరల్డ్‌కప్ కోసం ఆస్ట్రేలియా జట్టు: మిచెల్ మార్ష్ (కెప్టెన్), అష్టన్ అగర్, పాట్ కమిన్స్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, కెమెరూన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్వెల్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా వరల్డ్‌కప్ విన్నర్లతో..క్రికెట్ ఆస్ట్రేలియా తమ వరల్డ్‌కప్ జట్టును వినూత్నంగా ప్రకటించింది. 2007 వన్డే వరల్డ్‌కప్ విన్నర్లు ఆసీస్ టీ20 వరల్డ్‌కప్ జట్టును అనౌన్స్ చేశారు. జట్టును ప్రకటించిన వారిలో దివంగత ఆండ్రూ సైమండ్స్ కొడుకు, కూతురు ఉండటం విశేషం. -
స్టీవ్ స్మిత్‌కు షాక్.. ఆసీస్ వరల్డ్‌కప్ జట్టులోకి విధ్వంసకర ఆటగాడు..!
ఆసీస్ సెలెక్టర్లు తమ స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్‌కు భారీ షాకివ్వనున్నారని తెలుస్తుంది. వరల్డ్‌కప్ జట్టులో స్మిత్ స్థానం గల్లంతు కావడం ఖాయమని ఆసీస్ మీడియా కోడై కూస్తుంది. స్మిత్ స్థానంలో ఐపీఎల్ నయా సెన్సేషన్, ఢిల్లీ క్యాపిటల్స్ విధ్వంసకర ఆటగాడు జేక్ ఫ్రేసర్ వరల్డ్‌కప్ జట్టులోకి వస్తాడని సమాచారం. జట్టు ప్రకటనకు మే 1 డెడ్‌లైన్ కావడంతో అన్ని జట్ల సెలెక్టర్లు తమతమ జట్లను ఫైనల్ చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఈ క్రమంలో ఆసీస్ సెలెక్టర్లు తమ జట్టుకు తుది రూపు తెచ్చినట్లు సమాచారం. నేడో రేపో 15 మంది సభ్యులతో కూడిన ఆసీస్ ప్రపంచకప్ జట్టును ప్రకటించే అవకాశం ఉంది. న్యూజిలాండ్ ఇవాళే తమ వరల్డ్‌కప్ జట్టును ప్రకటించగా.. టీమిండియాను ఇవాళ రాత్రి లేదా రేపు ఉదయం ప్రకటించే ఛాన్స్ ఉంది. ఈసారి టీమిండియా వరల్డ్‌కప్ జట్టుపై జనాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఒకరిద్దరి విషయంలో అభిమానులు చాలా పర్టికులర్‌గా ఉన్నారు. శివమ్ దూబే, రింకూ సింగ్ లాంటి ఆటగాళ్లను వరల్డ్‌కప్ జట్టుకు ఎంపిక చేయాలని పెద్ద ఎత్తును డిమాండ్లు వినిపిస్తున్నాయి. హార్దిక్, సంజూ శాంసన్, రిషబ్ పంత్ విషయంలో సెలెక్టర్ల నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.స్మిత్ విషయానికొస్తే.. ఈ ఆసీస్ స్టార్‌ను ఐపీఎల్ 2024 వేలంలో ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. స్మిత్ ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో కామెంటేటర్‌గా కొనసాగుతున్నాడు. ఇటీవలే స్మిత్‌కు జాతీయ జట్టు ఓపెనర్‌గా ప్రమోషన్ లభించినప్పటికీ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. నిదానంగా ఆడతాడన్న ముద్ర స్మిత్‌పై ఉండనే ఉంది. స్మిత్‌కు ప్రత్యామ్నాయాలు కూడా ఆసీస్‌కు చాలానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో వరల్డ్‌కప్ జట్టులో స్మిత్‌కు స్థానం దొరకకపోవడం ఆశ్చర్యకరమేమీ కాదు. -
Jake Fraser: కొడితే బౌండరీ లేకపోతే సిక్సర్..!
ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో ఇవాళ (ఏప్రిల్ 27) జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ ఓపెనింగ్ బ్యాటర్ జేక్ ఫ్రేసర్ మెక్‌గుర్క్ విధ్వంసం సృష్టించాడు. కేవలం 27 బంతుల్లోనే 11 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 84 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో జేక్ పడిన బంతిని పడినట్లు చితక బాదాడు. కొడితే బౌండరీ లేకపోతే సిక్సర్ అన్నట్లు జేక్ ఇన్నింగ్స్ సాగింది.ముంబై బౌలర్ల అదృష్టం కొద్ది జేక్ పియూశ్ చావ్లా బౌలింగ్‌లో నబీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. లేకపోతే ఈ మ్యాచ్‌లో ముంబై బౌలర్లు పడరాని పాట్లు పడాల్సి వచ్చేది. ఔట్ కాక ముందు జేక్ ఊపు చూస్తే క్రిస్ గేల్ ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు కూడా బద్దలయ్యేలా కనిపించింది. ఈ మ్యాచ్‌లో 15 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన జేక్.. ఈ సీజన్లో ఈ ఘనత సాధించడం ఇది రెండోసారి. సన్‌రైజర్స్‌తో జరిగిన తన అరంగ్రేటం మ్యాచ్‌లోనూ జేక్ 15 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. 95.23 శాతం పరుగులు బౌండరీలు, సిక్సర్ల రూపంలో..జేక్ ఇన్నింగ్స్‌లో ఆసక్తికర విషయమేమిటంటే.. అతను చేసిన 84 పరుగుల స్కోర్‌లో 95.23 శాతం పరుగులు బౌండరీలు, సిక్సర్ల రూపంలో వచ్చాయి. అంటే జేక్ సాధించిన 84 పరుగుల్లో 80 పరుగులు బౌండరీలు, సిక్సర్ల ద్వారా వచ్చాయి. కేవలం 4 పరుగులు మాత్రమే సింగిల్స్ రూపంలో వచ్చాయి. జేక్ ఇదే సీజన్లో సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ఇదే తరహాలోనే (90 శాతానికి పైగా పరుగులు బౌండరీలు, సిక్సర్ల రూపంలో) రెచ్చిపోయాడు.ఆ మ్యాచ్‌లో జేక్ చేసిన 65 పరుగుల్లో 62 పరుగులు బౌండరీలు, సిక్సర్ల రూపంలో వచ్చాయి. ఐపీఎల్లో అత్యధిక శాతం పరుగులు బౌండరీలు, సిక్సర్ల రూపంలో సాధించిన రికార్డు మిస్టర్ ఐపీఎల్ సురేశ్ రైనా పేరిట ఉంది. 2014 సీజన్లో పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో రైనా తాను చేసిన 87 పరుగుల్లో 84 పరుగులు బౌండరీలు, సిక్సర్ల రూపంలో సాధించాడు. తన 87 పరుగుల ఇన్నింగ్స్‌లో బౌండరీలు, సిక్సర్ల శాతం 96.55గా ఉంది. మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ.. 14 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 181పరుగులు చేసింది. జేక్ (84), అభిషేక్ (36), షాయ్ హోప్ (41) ఔట్ కాగా.. పంత్ (16), స్టబ్స్ (1) క్రీజ్‌లో ఉన్నారు. ఈ సీజన్లో జేక్ చేసిన స్కోర్లు..- 55(35).- 20(10).- 65(18).- 23(14).- 84(27). -
ఇదెక్కడి ఊచకోత.. కేవలం 27 బంతుల్లోనే! ప్రపంచంలోనే
ఐపీఎల్-2024లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్ విధ్వంసం సృష్టించాడు. ఓపెనర్‌గా వచ్చిన మెక్‌గుర్క్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ముంబై బౌలర్లను మెక్‌గుర్క్ ఊచకోత కోశాడు.ఆఖరికి ముంబై స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు సైతం జేక్ ఫ్రేజర్ చుక్కలు చూపించాడు. ఈ క్రమంలో కేవలం 15 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 27 బంతులు ఎదుర్కొన్న మెక్‌గర్క్.. 11 ఫోర్లు, 4 సిక్స్‌లతో 84 పరుగులు చేశాడు.ఇక ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో చెలరేగిన జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. టీ20 క్రికెట్లో 15 బంతుల లోపు రెండు సార్లు హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్న మూడో క్రికెటర్‌గా మెక్‌గర్క్ నిలిచాడు. కాగా ఈ ఏడాది సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లోనూ మెక్‌గర్క్ 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు.దీంతో ఈ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఘనత సాధించిన జాబితాలో మెక్‌గర్క్ కంటే ముందు వెస్టిండీస్ దిగ్గజాలు ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్ ఉన్నారు. -
అతడొక సర్ప్రైజ్.. వాళ్లిద్దరి వల్లే మా ఓటమి: కేఎల్ రాహుల్
ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓటమితో లక్నో సూపర్ జెయింట్స్ జైత్రయాత్రకు అడ్డుకట్ట పడింది. ఐపీఎల్-2024లో హ్యాట్రిక్ విజయాల తర్వాత సొంత మైదానంలో తొలి పరాజయాన్ని మూటగట్టుకుంది. తద్వారా 160కి పైగా పరుగుల స్కోరు చేస్తే.. లక్ష్య ఛేదనలో లక్నో కచ్చితంగా గెలుస్తుందనే రికార్డు చెరిగిపోయింది. ఈ నేపథ్యంలో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఓటమిపై విచారం వ్యక్తం చేశాడు. తాము కనీసం ఇంకో 15- 20 పరుగులు సాధిస్తే ఫలితం వేరేలా ఉండేదని అభిప్రాయపడ్డాడు. శుభారంభం లభించినా దానిని భారీ స్కోరుగా మలచడంలో విఫలమయ్యామని పేర్కొన్నాడు. పిచ్ పరిస్థితులను సద్వినియోగం చేసుకున్న ఢిల్లీ చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తమను దెబ్బకొట్టాడని కేఎల్ రాహుల్ అన్నాడు. ఇక కొత్త బ్యాటర్ జేక్ ఫ్రేజర్- మెక్‌గర్క్ ఎలా ఆడతాడన్న విషయంపై తమకు అవగాహన లేదని.. అయితే.. అతడు అద్భుత బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడని ప్రశంసించాడు. Maiden IPL FIFTY for Jake Fraser-McGurk on DEBUT! Hat-trick of sixes in this thoroughly entertaining knock 💥💥💥 Watch the match LIVE on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #LSGvDC pic.twitter.com/0hXuBkiBr3 — IndianPremierLeague (@IPL) April 12, 2024 ఢిల్లీ విజయంలో అతడికే ఎక్కువ క్రెడిట్ దక్కుతుందని కేఎల్ రాహుల్ ఈ సందర్భంగా పేర్కొన్నాడు. ఢిల్లీ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ను పవర్ ప్లేలోనే అవుట్ చేయాలన్న తమ వ్యూహం ఫలించినా.. క్రీజులో పాతుకుపోయిన రిషభ్ పంత్, మెక్‌గర్క్ కలిసి మ్యాచ్‌ను తమ నుంచి లాగేసుకున్నారని రాహుల్ అన్నాడు. Victory in Lucknow for the @DelhiCapitals 🙌 A successful chase power them to their second win of the season as they win by 6⃣ wickets! Scorecard ▶️ https://t.co/0W0hHHG2sq#TATAIPL | #LSGvDC pic.twitter.com/6R7an9Cy8g — IndianPremierLeague (@IPL) April 12, 2024 ఒకవేళ నికోలస్ పూరన్(0) గనుక కాసేపు నిలబడగలిగితే కచ్చితంగా ప్రమాదకారిగా మారేవాడని.. అయితే, అతడిని పెవిలియన్‌కు పంపడంలో కుల్దీప్ యాదవ్ సఫలమయ్యాడని రాహుల్ పేర్కొన్నాడు. ఏదేమైనా లోపాలు సరిచేసుకుని తదుపరి మ్యాచ్‌కు సిద్ధమవుతామని తెలిపాడు. ఇక ఢిల్లీతో మ్యాచ్‌లో లక్నో సారథి, వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ 22 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 39 పరుగులు చేశాడు. 177.27 స్ట్రైక్‌రేటు నమోదు చేసి ఎలక్ట్రిక్ స్ట్రైకర్ అవార్డు అందుకున్నాడు. కాగా లక్నో తదుపరి ఆదివారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్‌లో తలపడనుంది. లక్నో వర్సెస్ ఢిల్లీ స్కోర్లు: ►టాస్: లక్నో.. బ్యాటింగ్ ►లక్నో స్కోరు: 167/7 (20) ►ఢిల్లీ స్కోరు: 170/4 (18.1) ►ఫలితం: లక్నోపై ఆరు వికెట్ల తేడాతో ఢిల్లీ విజయం ►ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: కుల్దీప్ యాదవ్(3/20) ►రిషభ్ పంత్ స్కోరు: 41 రన్స్ ►ఓవరాల్ టాప్ స్కోరర్లు: జేక్ ఫ్రేజర్- మెక్‌గర్క్(ఢిల్లీ- 35 బంతుల్లో 55), ఆయుశ్ బదోని (లక్నో- 35 బంతుల్లో 55 నాటౌట్). చదవండి: అరంగేట్రంలోనే అదరగొట్టాడు.. ఎవరీ జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్? var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7552012696.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
LSG Vs DC: అరంగేట్రంలోనే అదరగొట్టాడు.. ఎవరీ జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్?
ఆస్ట్రేలియా యువ సంచలనం, ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్ తన ఐపీఎల్ అరంగేట్ర మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. ఐపీఎల్-2024లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌తో క్యాష్‌రిచ్ లీగ్‌లోకి అడుగుపెట్టిన మెక్‌గుర్క్.. తన ఆట తీరుతో అందరని ఆకట్టుకున్నాడు. వార్నర్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన మెక్‌గుర్క్ లక్నో బౌలర్లను ఊచకోత కోశాడు. జేక్ ఫ్రేజర్- తను ఎదుర్కొన్న రెండో బంతినే అద్భుతమైన సిక్స్‌గా మలిచాడు. క్రీజులో ఉన్నంత సేపు లక్నో బౌలర్లకు చుక్కలు చూపించాడు. ముఖ్యంగా లక్నో స్పిన్నర్ కృనాల్ పాండ్యాను ఓ ఆట ఆడేసుకున్నాడు. 13 ఓవర్ వేసిన పాండ్యా బౌలింగ్‌లో మెక్‌గుర్క్ హ్యాట్రిక్ సిక్స్‌లు బాదాడు. ఓవరాల్‌గా బంతులు ఎదుర్కొన్న ఈ యువ సంచలనం.. 2 ఫోర్లు ,5 సిక్స్‌లతో 55 పరుగులు చేశాడు. ఈ క్రమంలో ఎవరీ జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్ నెటిజనక్లు తెగ వెతికేస్తున్నారు. ఎవరీ జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్? 22 ఏళ్ల మెక్‌గుర్క్ ఏప్రిల్ 11, 2002న ఆస్ట్రేలియాలోని విక్టోరియాలో జన్మించాడు. జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో విక్టోరియాకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. 2019లో ఫస్ట్‌క్లాస్ క్రికెట్లోకి జేక్ అడుగుపెట్టాడు. అదే ఏడాది లిస్ట్-ఏ క్రికెట్లో అడుగుపెట్టాడు. లిస్ట్-ఏ క్రికెట్లోకి అదరగొట్టడంతో అతడికి బిగ్‌బాష్‌లో లీగ్ ఆడే అవకాశం వచ్చింది. బిగ్‌బాష్ లీగ్-2020 సీజన్లో మెల్బోర్న్ రెనెగేడ్స్ తరపున టీ20ల్లో అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు తన కెరీర్లో 37 టీ20 మ్యాచ్‌లు ఆడిన మెక్‌గుర్క్ 645 పరుగులు చేశాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 550 పరుగులు, లిస్ట్-ఏ క్రికెట్లో 525 పరుగులు మెక్‌గుర్క్ చేశాడు. అయితే జేక్ గతేడాదిలో లిస్ట్-ఏ క్రికెట్లో వరల్డ్ రికార్డు సృష్టించాడు. ఆస్ట్రేలియా దేశీవాళీ వన్డే టోర్నీలో కేవలం 29 బంతుల్లోనే సెంచరీ సాధించి చరిత్ర సృష్టించాడు. తద్వారా లిస్ట్-ఏ క్రికెట్లో ఫాస్టెస్ సెంచరీ చేసిన ఆటగాడిగా అతడు రికార్డులకెక్కాడు. ఈ క్రమంలో ఈ ఏడాది వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌తో మెక్‌గుర్క్ ఆసీస్ తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. అంతర్జాతీయ క్రికెట్లో కూడా అతడు ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో మెక్‌గుర్క్ ఐపీఎల్-2024 వేలంలో రూ. 50 లక్షల కనీస ధరతో తన పేరును నమోదు చేసుకున్నాడు. కానీ ఏ ఫ్రాంచైజీ కూడా అతడిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు. అయితే ఇంగ్లండ్ ఆటగాడు హ్యారీ బ్రూక్ వ్యక్తిగత కారణాలతో ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ నుంచి తప్పుకోవడంతో మెక్‌గుర్క్‌కు క్యాష్‌రిచ్ లీగ్‌లో భాగమయ్యే అవకాశం దక్కింది. రూ. 50 లక్షల బేస్ ప్రైస్‌కు మెక్గార్క్ను ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది. బ్రూక్ స్ధానాన్ని ఈ యువ కెరటంతో ఢిల్లీ భర్తీ చేసింది. Maiden IPL FIFTY for Jake Fraser-McGurk on DEBUT! Hat-trick of sixes in this thoroughly entertaining knock 💥💥💥 Watch the match LIVE on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #LSGvDC pic.twitter.com/0hXuBkiBr3 — IndianPremierLeague (@IPL) April 12, 2024 -
DC: ఢిల్లీ పవర్ హిట్టర్ దెబ్బ.. పాపం సొట్ట పడింది!
ఢిల్లీ క్యాపిటల్స్ యువ సంచలనం జేక్ ఫ్రేజర్ మెగర్క్ సంచలన షాట్‌తో మెరిశాడు. అతడి పవర్ హిట్టింగ్ కారణంగా కొత్త స్టేడియంలో ఓ స్టాండ్ టాప్‌నకు సొట్ట పడింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఢిల్లీ క్యాపిటల్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. కాగా ఐపీఎల్-2024 ఆరంభానికి ముందు సౌతాఫ్రికా పేసర్ లుంగి ఎంగిడి గాయం కారణంగా తప్పుకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అతడి స్థానాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మెగర్క్‌తో భర్తీ చేసింది. మెల్బోర్న్కు చెందిన 21 ఏళ్ల మెగర్క్ హార్డ్ హిట్టింగ్‌కు పెట్టింది పేరు. లెగ్ స్పిన్ బౌలర్ కూడా! ఏడాది జనవరిలో వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ సందర్భంగా ఆస్ట్రేలియా తరఫున అరంగేట్రం చేసిన అతడిని రూ. 50 లక్షలకు మెగర్క్‌ను ఢిల్లీ సొంతం చేసుకుంది. ఇక శుక్రవారం సీఎస్కే- ఆర్సీబీ మ్యాచ్‌తో చెపాక్‌లో ఐపీఎల్ పదిహేడో ఎడిషన్ ఆరంభం కానుండగా.. ఢిల్లీ క్యాపిటల్స్ శనివారం(మార్చి 23) తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఛండీగర్‌లోని మల్లన్పూర్లో కొత్తగా నిర్మించిన స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అక్కడికి చేరుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు మల్లన్‌పూర్ మైదానంలో ప్రాక్టీసు మొదలుపెట్టింది. ఇక బ్యాట్‌తో బరిలోకి దిగిన మెగర్క్ అద్భుత షాట్లతో అలరించాడు. ఈ క్రమంలో అతడు భారీ సిక్సర్ కొట్టగా మల్లన్‌పూర్ స్టేడియం స్టాండ్ పైభాగంలో సొట్టపడింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలను పంచుకుంటూ.. ‘‘ప్రియమైన మల్లన్‌పూర్ స్టేడియం.. క్షమించు.. హృదయపూర్వకంగా క్షమాపణలు’’ అంటూ జేక్ ఫ్రేజర్ మెగర్క్ పేరిట క్యాప్షన్ జతచేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా బిగ్‌బాష్ లీగ్‌లో మెరుపులు మెరిపించిన మెగర్క్.. ఢిల్లీ క్యాపిటల్స్ మిడిలార్డర్లో హ్యారీ బ్రూక్ లేని లోటును తీర్చేందుకు సిద్ధమయ్యాడు. చదవండి: IPL 2024: రూ. 24.75 కోట్ల ఆటగాడు... ఎన్ని వికెట్లు తీస్తాడంటే?! View this post on Instagram A post shared by Delhi Capitals (@delhicapitals) -
IPL 2024: స్టార్ పేసర్ అవుట్.. నయా సంచలనం ఎంట్రీ
ఐపీఎల్-2024 ఆరంభానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్‌కు మరో ఎదురుదెబ్బ! ఆ జట్టుతో ఒప్పందం కుదుర్చుకున్న సౌతాఫ్రికా పేసర్ లుంగి ఎంగిడి తాజా సీజన్ నుంచి తప్పుకొన్నాడు. గాయం కారణంగా పదిహేడో ఎడిషన్ మొత్తానికి ఎంగిడి దూరం కానున్నాడు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ జేక్ ఫ్రేజర్ మెగర్క్‌తో లుంగి ఎంగిడి స్థానాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. ఈ నియామకానికి సంబంధించి ఫ్రాంఛైజీ ప్రకటన విడుదల చేసింది. కాగా 21 ఏళ్ల హార్డ్ హిట్టింగ్ బ్యాటర్ మెగర్క్.. లెగ్ స్పిన్నర్ కూడా! మెల్బోర్న్కు చెందిన అతడు.. వెస్టిండీస్‌తో గత నెలలో జరిగిన వన్డే సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్‌లలో కలిపి 51 పరుగులు చేయగలిగాడు. ఇక ఎంగిడి మడిమ నొప్పి కారణంగా క్యాపిటల్స్‌కు దూరం కావడంతో.. రూ. 50 లక్షల ధర(రిజర్వ్ ప్రైస్)కు యాజమాన్యం జేక్ ఫ్రేజర్ మెగర్క్‌ను జట్టులో చేర్చుకుంది. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ సైతం వ్యక్తిగత కారణాల దృష్ట్యా ఐపీఎల్-2024 సీజన్ మొత్తానికి దూరం కానున్నట్లు ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. ఢిల్లీ క్యాపిటల్స్ అతడి కోసం ఏకంగా రూ. 4 కోట్లు వెచ్చించి కొనుగోలు చేస్తే ఆఖరికి అతడు ఇలా హ్యాండిచ్చాడు. తాజాగా ఎంగిడి(రూ. 50 లక్షలు) కూడా దూరమయ్యాడు. ఇక ఐపీఎల్ పదిహేడో ఎడిషన్ మార్చి 22 నుంచి ఆరంభం కానుండగా.. క్యాపిటల్స్ మార్చి 23న తమ తొలి మ్యాచ్ ఆడనుంది. మొహాలీ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది. చదవండి: IPL 2024- RCB: విరాట్ కోహ్లి లేకుండానే..