స్టార్లతో నిండిన ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్‌కప్‌లో సూపర్-8 దశలోనే నిష్క్రమించిన విషయం తెలిసిందే. ఈ టోర్నీలో ఆసీస్.. స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేక సెమీస్‌లోనే ఇంటిదారి పట్టింది. సూపర్-8లో ఆసీస్.. ఆఫ్ఘనిస్తాన్, భారత్ చేతుల్లో ఓడి ఫైనల్ ఫోర్‌కు అర్హత సాధించలేకపోయింది. ప్రస్తుతం ఆసీస్ జట్టులోని కీలక సభ్యులందరూ మేజర్ లీగ్ క్రికెట్‌తో బిజీగా ఉన్నారు.
ఆసీస్ అంతర్జాతీయ కమిట్‌మెంట్స్ సెప్టెంబర్ నుంచి ప్రారంభమవుతాయి. సెప్టెంబర్ 4 నుంచి 7 వరకు స్కాట్లాండ్‌తో టీ20 సిరీస్, ఆ వెంటనే (సెప్టెంబర్ 11- 29) ఇంగ్లండ్‌తో టీ20, వన్డే సిరీస్‌లు జరుగనున్నాయి. ఈ సిరీస్‌ల కోసం క్రికెట్ ఆస్ట్రేలియా వేర్వేరు జట్లను ప్రకటించింది. ఈ రెండు సిరీస్‌లలో టీ20తో పాటు వన్డే జట్టుకు కూడా మిచెల్ మార్షే సారథ్యం వహించనున్నాడు. ఆసీస్ సెలెక్టర్లు రెగ్యులర్ వన్డే కెప్టెన్ పాట్ కమిన్స్‌కు విశ్రాంతినిచ్చారు.
స్కాట్లాండ్, ఇంగ్లండ్ సిరీస్‌ల కోసం ఎంపిక చేసిన జట్లలో చిచ్చరపిడుగు జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్‌కు చోటు కల్పించారు ఆసీస్ సెలెక్టర్లు. ఈ సిరీస్‌లలో ఫ్రేజర్.. మరో విధ్వంసకర ఆటగాడు ట్రవిస్ హెడ్‌తో కలిసి ఆసీస్ ఇన్నింగ్స్‌ను ఆరంభిస్తాడు. ఈ ఇద్దరు విధ్వంసకర ఆటగాళ్లు ఓపెనర్లుగా బరిలోకి దిగితే ఏ స్థాయి విధ్వంసం ఉంటుందో చూడాలని ప్రతి క్రికెట్ అభిమాని కోరుకుంటున్నాడు.
ఫ్రేజర్, హెడ్ ఇద్దరు ఒకే మ్యాచ్‌లో క్లిక్ అయితే ప్రత్యర్ది బౌలర్లకు ఇబ్బందులు తప్పవు. వీరిద్దరు ఏ స్థాయిలో విధ్వంసం సృష్టించగలరో ఐపీఎల్ 2024లో చూశాం. ఈ ఎడిషన్‌లో జేక్ (ఢిల్లీ క్యాపిటల్స్) 234 స్ట్రయిక్‌రేట్‌తో 330 పరుగులు చేయగా.. హెడ్ 191.55 స్ట్రయిక్‌రేట్‌తో 567 పరుగులు చేశాడు. జేక్, హెడ్‌ల నుంచి ఇలాంటి ప్రదర్శన కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
స్కాట్లాండ్, ఇంగ్లండ్‌తో టీ20లకు ఆసీస్ జట్టు..
మిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్‌లెట్, కూపర్ కొన్నోలీ, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్, కామెరాన్ గ్రీన్, ఆరోన్ హార్డీ, జోష్ హాజిల్‌వుడ్, ట్రవిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, స్పెన్సర్ జాన్సన్, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా.
ఇంగ్లండ్‌తో వన్డేలకు ఆస్ట్రేలియా జట్టు..
మిచెల్ మార్ష్ (కెప్టెన్), సీన్ అబాట్, అలెక్స్ కారీ, నాథన్ ఎల్లిస్, జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్, ఆరోన్ హార్డీ, కామెరాన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, ట్రవిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మార్నస్ లాబూషేన్, గ్లెన్ మాక్స్‌వెల్, మాథ్యూ షార్ట్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా.
Comments
Please login to add a commentAdd a comment