ఎంగిడి(PC: CSA)- మెగర్క్(PC: CA)
ఐపీఎల్-2024 ఆరంభానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్‌కు మరో ఎదురుదెబ్బ! ఆ జట్టుతో ఒప్పందం కుదుర్చుకున్న సౌతాఫ్రికా పేసర్ లుంగి ఎంగిడి తాజా సీజన్ నుంచి తప్పుకొన్నాడు. గాయం కారణంగా పదిహేడో ఎడిషన్ మొత్తానికి ఎంగిడి దూరం కానున్నాడు.
ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ జేక్ ఫ్రేజర్ మెగర్క్‌తో లుంగి ఎంగిడి స్థానాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. ఈ నియామకానికి సంబంధించి ఫ్రాంఛైజీ ప్రకటన విడుదల చేసింది.
కాగా 21 ఏళ్ల హార్డ్ హిట్టింగ్ బ్యాటర్ మెగర్క్.. లెగ్ స్పిన్నర్ కూడా! మెల్‌బోర్న్‌కు చెందిన అతడు.. వెస్టిండీస్‌తో గత నెలలో జరిగిన వన్డే సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్‌లలో కలిపి 51 పరుగులు చేయగలిగాడు.
ఇక ఎంగిడి మడిమ నొప్పి కారణంగా క్యాపిటల్స్‌కు దూరం కావడంతో.. రూ. 50 లక్షల ధర(రిజర్వ్ ప్రైస్)కు యాజమాన్యం జేక్ ఫ్రేజర్ మెగర్క్‌ను జట్టులో చేర్చుకుంది. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ సైతం వ్యక్తిగత కారణాల దృష్ట్యా ఐపీఎల్-2024 సీజన్ మొత్తానికి దూరం కానున్నట్లు ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే.
ఢిల్లీ క్యాపిటల్స్ అతడి కోసం ఏకంగా రూ. 4 కోట్లు వెచ్చించి కొనుగోలు చేస్తే ఆఖరికి అతడు ఇలా హ్యాండిచ్చాడు. తాజాగా ఎంగిడి(రూ. 50 లక్షలు) కూడా దూరమయ్యాడు. ఇక ఐపీఎల్ పదిహేడో ఎడిషన్ మార్చి 22 నుంచి ఆరంభం కానుండగా.. క్యాపిటల్స్ మార్చి 23న తమ తొలి మ్యాచ్ ఆడనుంది. మొహాలీ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది.
Comments
Please login to add a commentAdd a comment