Lungi Ngidi
-
Afg vs SA: ఇలా అవుటవుతానని ఊహించి ఉండడు!
అఫ్గనిస్తాన్- సౌతాఫ్రికా మధ్య మూడో వన్డే సందర్భంగా ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. అఫ్గన్ బ్యాటర్ రహ్మత్ షా అవుటైన తీరు నెట్టింట వైరల్ అవుతోంది. కాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా అఫ్గనిస్తాన్.. సౌతాఫ్రికాతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడింది.అనూహ్య రీతిలో తొలి రెండు మ్యాచ్ గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకుని సరికొత్త చరిత్ర సృష్టించింది. అయితే, నామమాత్రపు మూడో వన్డేలో మాత్రం ప్రొటిస్ జట్టు అఫ్గన్‌పై పైచేయి సాధించింది. ఆతిథ్య జట్టు ఆధిక్యాన్ని 2-1కు తగ్గించింది. షార్జా వేదికగా ఆదివారం జరిగిన చివరి వన్డేలో 7 వికెట్ల తేడాతో అఫ్గనిస్తాన్‌ను చిత్తు చేసింది.రహ్మనుల్లా గుర్బాజ్ ఒంటరి పోరాటంఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన అఫ్గన్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసి.. 34 ఓవర్లలో 169 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ (94 బంతుల్లో 89; 7 ఫోర్లుర, 4 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేయగా... ఘజన్‌ఫార్ (15 బంతుల్లో 31 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) చివర్లో మెరుపులు మెరిపించాడు. రహ్మత్ షా (1), అబ్దుల్ మాలిక్ (9), కెప్టెన్ హష్మతుల్లా (10), అజ్మతుల్లా (2), ఇక్రామ్ (4), నబీ (5) విఫలమయ్యారు.ఇక సఫారీ బౌలర్లలో ఎంగిడి, పీటర్, ఫెలుక్వాయో తలా రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో దక్షిణాఫ్రికా 33 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. ఎయిడెన్ మార్క్రమ్ (67 బంతుల్లో 69 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆకట్టుకున్నాడు. ఇదిలా ఉంటే.. అఫ్గన్ ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్‌ను ప్రొటిస్ పేసర్ లుంగి ఎంగిడి వేశాడు.అప్పుడు రహ్మనుల్లా గుర్బాజ్ క్రీజులో ఉండగా.. రహ్మత్ షా నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్నాడు. ఈ క్రమంలో ఎంగిడి ఓవర్లో ఐదో బంతికి షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు రహ్మనుల్లా. దీంతో సింగిల్ తీసేందుకు రెడీగా ఉన్న రహ్మత్ అప్పటికే క్రీజు నుంచి బయటకు రాగా.. రహ్మనుల్లా సైతం నాన్ స్ట్రైకర్ ఎండ్‌వైపు పరుగు మొదలుపెట్టాడు.పాపం.. ఊహించి ఉండడుఅయితే, ఆ కొద్ది సమయంలోనే ఊహించని సంఘటన జరిగింది. రహ్మనుల్లా కొట్టిన బంతిని ఆపేందుకు ఎంగిడి చేయి అడ్డం పెట్టాడు. అయితే, బంతి అతడి చేతికి చిక్కకపోయినా.. చేయిని గీసుకుంటూ.. రహ్మత్‌కు తాకి స్టంప్స్‌ను ఎగురగొట్టింది. ఫలితంగా రహ్మత్ రనౌట్‌గా వెనుదిరగాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ‘‘అయ్యో పాపం.. ఇలా అవుటవుతాడని ఊహించి ఉండడు’’ అంటూ క్రికెట్ ప్రేమికులు రహ్మత్ షా(1)ను ఉద్దేశించి కామెంట్లు చేస్తున్నారు.చదవండి: కెప్టెన్‌గా రహానే.. జట్టులోకి ఇద్దరు టీమిండియా స్టార్లు!This is how Rahmat Shah got out Against South Africa ❤️😂😂😂 pic.twitter.com/kw9VSJb9sl— Sports Production (@SportsProd37) September 22, 2024 -
IPL 2024: స్టార్ పేసర్ అవుట్.. నయా సంచలనం ఎంట్రీ
ఐపీఎల్-2024 ఆరంభానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్‌కు మరో ఎదురుదెబ్బ! ఆ జట్టుతో ఒప్పందం కుదుర్చుకున్న సౌతాఫ్రికా పేసర్ లుంగి ఎంగిడి తాజా సీజన్ నుంచి తప్పుకొన్నాడు. గాయం కారణంగా పదిహేడో ఎడిషన్ మొత్తానికి ఎంగిడి దూరం కానున్నాడు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ జేక్ ఫ్రేజర్ మెగర్క్‌తో లుంగి ఎంగిడి స్థానాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. ఈ నియామకానికి సంబంధించి ఫ్రాంఛైజీ ప్రకటన విడుదల చేసింది. కాగా 21 ఏళ్ల హార్డ్ హిట్టింగ్ బ్యాటర్ మెగర్క్.. లెగ్ స్పిన్నర్ కూడా! మెల్బోర్న్కు చెందిన అతడు.. వెస్టిండీస్‌తో గత నెలలో జరిగిన వన్డే సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్‌లలో కలిపి 51 పరుగులు చేయగలిగాడు. ఇక ఎంగిడి మడిమ నొప్పి కారణంగా క్యాపిటల్స్‌కు దూరం కావడంతో.. రూ. 50 లక్షల ధర(రిజర్వ్ ప్రైస్)కు యాజమాన్యం జేక్ ఫ్రేజర్ మెగర్క్‌ను జట్టులో చేర్చుకుంది. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ సైతం వ్యక్తిగత కారణాల దృష్ట్యా ఐపీఎల్-2024 సీజన్ మొత్తానికి దూరం కానున్నట్లు ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. ఢిల్లీ క్యాపిటల్స్ అతడి కోసం ఏకంగా రూ. 4 కోట్లు వెచ్చించి కొనుగోలు చేస్తే ఆఖరికి అతడు ఇలా హ్యాండిచ్చాడు. తాజాగా ఎంగిడి(రూ. 50 లక్షలు) కూడా దూరమయ్యాడు. ఇక ఐపీఎల్ పదిహేడో ఎడిషన్ మార్చి 22 నుంచి ఆరంభం కానుండగా.. క్యాపిటల్స్ మార్చి 23న తమ తొలి మ్యాచ్ ఆడనుంది. మొహాలీ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది. చదవండి: IPL 2024- RCB: విరాట్ కోహ్లి లేకుండానే.. -
మిల్లర్ కిల్లర్ ఇన్నింగ్స్.. నిప్పులు చెరిగిన ఎంగిడి
సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో భాగంగా నిన్న (జనవరి 14) జరిగిన హై స్కోరింగ్ మ్యాచ్‌లో పార్ల్ రాయల్స్ ఆటగాళ్లు చెలరేగిపోయాడు. ప్రిటోరియా క్యాపిటల్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత రాయల్స్ బ్యాటర్లు డేవిడ్ మిల్లర్ (42 బంతుల్లో 75 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్సర్లు), వాన్ బురెన్ (40 బంతుల్లో 72 నాటౌట్; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), జోస్ బట్లర్ (23 బంతుల్లో 39; 5 ఫోర్లు, సిక్స్) విజృంభించగా.. ఆతర్వాత బౌలింగ్‌లో లుంగి ఎంగిడి (4-0-39-4) నిప్పులు చెరిగాడు. ఫలితంగా రాయల్స్ 10 పరుగుల తేడాతో క్యాపిటల్స్‌పై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్స్.. మిల్లర్, బురెన్, బట్లర్ చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోర్ చేసింది. రాయల్స్ ఇన్నింగ్స్‌లో జేసన్ రాయ్ (5), విహాన్ లుబ్బే (12) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. క్యాపిటల్స్ బౌలర్లలో డుపవిల్లోన్, జేమ్స్ నీషమ్, ఆదిల్ రషీద్ తలో వికెట్ పడగొట్టారు. ఛేదనలో క్యాపిటల్స్ అద్భుతమైన పోరాటపటిమ కనబర్చినప్పటికీ.. లుంగి ఎంగిడి (4/39) ధాటికి ఓడక తప్పలేదు. ఎంగిడి నిప్పులు చెరిగే బంతులతో వికెట్లు తీసి క్యాపిటల్స్ పతనాన్ని శాశించాడు. విల్ జాక్స్ (34 బంతుల్లో 58; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), రిలీ రొస్సో (45 బంతుల్లో 82; 10 ఫోర్లు, 3 సిక్సర్లు), నీషమ్ (9 బంతుల్లో 20; 4 ఫోర్లు) క్యాపిటల్స్‌ను గెలిపించేందుకు తమవంతు ప్రయత్నం చేశారు. నిర్ణీత ఓవర్లలో ఆ జట్టు 7 వికెట్లు కోల్పోయి లక్ష్యానికి 11 పరుగుల దూరంలో నిలిచిపోయింది. క్యాపిటల్స్ హిట్టర్లు ఫిల్ సాల్ట్ (0), డి బ్రూయిన్ (4), కొలిన్ ఇన్‌గ్రామ్ (1) నిరాశపరిచారు. -
ప్రొటిస్ బ్యాటింగ్ ఆర్డర్ బలహీనం: భారత్ గెలవాలంటే అదొక్కటే మార్గం
South Africa vs India, 2nd Test : సౌతాఫ్రికాతో రెండో టెస్టులో టీమిండియా గెలుపు అవకాశాలపై భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గత మ్యాచ్ సెంచరీ హీరో డీన్ ఎల్గర్‌ను తొందరగా అవుట్ చేస్తే రోహిత్ సేన పని సులువు అవుతుందని పేర్కొన్నాడు. కేప్‌టౌన్‌లో ఎల్గర్ కేవలం బ్యాటర్‌గా మాత్రమే కాకుండా కెప్టెన్‌గానూ బరిలోకి దిగుతున్న కారణంగా అతడిపై సహజంగానే ఒత్తిడి ఉంటుందన్న ఈ మాజీ ఓపెనర్.. టీమిండియా బౌలర్లు దీనిని తమకు అనుకూలంగా మార్చుకోవాలని సూచించాడు. ఎల్గర్‌ను పెవిలియన్‌కు పంపితే సౌతాఫ్రికా బ్యాటింగ్ ఆర్డర్‌ను కుప్పకూల్చడం కష్టమేమీ కాబోదని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. కేప్‌టౌన్‌లో అంత ఈజీ కాదు కాగా సౌతాఫ్రికాతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బాక్సింగ్ డే టెస్టులో ఓడిన టీమిండియా కేప్‌టౌన్‌లో గెలిచి సిరీస్ సమం చేయాలని భావిస్తోంది. అయితే, సీమర్లకు స్వర్గధామమైన న్యూల్యాండ్స్ పిచ్‌పై ఆతిథ్య జట్టు బౌలర్లు మరోసారి చెలరేగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇలాంటి తరుణంలో రోహిత్ సేన ఎలాంటి ప్రణాళికలు అమలు చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. కెప్టెన్ కాబట్టి ఒత్తిడి సహజం ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘డీన్ ఎల్గర్ కెరీర్లో ఇది ఆఖరి టెస్టు. తెంబా బవుమా జట్టుతో లేడు కాబట్టి ఎల్గర్ కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు. ఇప్పుడు తన దృష్టి మొత్తం కేవలం రన్స్ తీయడం కాకుండా.. ట్రోఫీ గెలవడం పైనే ఉందని ఇప్పటికే ఎల్గర్ స్పష్టం చేశాడు. కాబట్టి అతడిపై ఒత్తిడి ఉండటం సహజం. నా దృష్టిలో అయితే.. సౌతాఫ్రికా బ్యాటింగ్ ఆర్డర్ బలహీనంగానే ఉంది. డీన్ ఎల్గర్ బ్యాటింగ్ కూడా సాధారణంగానే ఉంది. అయితే, అతడిని అవుట్ చేయడం అంత తేలికేమీ కాదు. ఒక్కసారి ఎల్గర్‌ను పెవిలియన్‌కు పంపితే మాత్రం మిగతా బ్యాటర్లు కూడా క్యూ కట్టడం ఖాయం’’ అని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. కేశవ్ మహరాజ్‌ను ఆడిస్తారు! అదే విధంగా.. పేసర్ గెరాల్డ్ కోయెట్జీ గాయపడటం సౌతాఫ్రికాకు ఎదురుదెబ్బేనన్న ఆకాశ్ చోప్రా.. అతడి స్థానంలో లుంగీ ఎంగిడీ జట్టులోకి వచ్చే అవకాశం లేదన్నాడు. ఎంగిడి దాదాపు ఏడాది కాలంగా ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు కాబట్టి మేనేజ్మెంట్ అతడి వైపు మొగ్గు చూపకపోవచ్చని అభిప్రాయపడ్డాడు. స్పిన్నర్ కేశవ్ మహరాజ్‌ను రెండో టెస్టులో ఆడించే అవకాశాలు ఉన్నాయని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. చదవండి: T20 WC 2024: రోహిత్, కోహ్లి విషయంలో బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అగార్కర్ కీలక నిర్ణయం! -
టీమిండియాతో టీ20 సిరీస్.. సౌతాఫ్రికాకు ఊహించని షాక్! ఇక అంతే సంగతి
స్వదేశంలో టీమిండియాతో టీ20 సిరీస్‌కు ముందు దక్షిణాఫ్రికాకు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ పేసర్ లుంగి ఎంగిడి గాయం కారణంగా టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు. ప్రాక్టీస్ సెషన్లో ఎంగిడి ఎడమ కాలి చీలమండకు గాయమైంది. ఈ క్రమంలోనే అతడిని టీ20 జట్టు నుంచి దక్షిణాఫ్రికా క్రికెట్ రిలీజ్ చేసింది. ఈ స్టార్‌పేసర్ వన్డే సిరీస్‌కూ దూరమయ్యే ఛాన్స్ ఉంది. ఇక టీ20 సిరీస్‌లో ఎంగిడీ స్ధానాన్ని వెటరన్ పేసర్ బ్యూరాన్ హెండ్రిక్స్‌తో సౌతాఫ్రికా సెలక్టర్లు భర్తీ చేశారు. 2014లో ప్రోటీస్ తరపున టీ20ల్లో అరంగేట్రం చేసిన హెండ్రిక్స్.. ఇప్పటివరకు 19 మ్యాచ్‌లు ఆడి 25 వికెట్లు తీశాడు. ఇక ఆదివారం(డిసెంబర్ 10)న జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఇప్పటికే భారత జట్టు దక్షిణాఫ్రికా గడ్డపై అడుగుపెట్టింది. భారత టీ20జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, రింకు సింగ్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), జితేష్ శర్మ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, దీపక్ చాహర్. దక్షిణాఫ్రికా టీ 20 జట్టు: ఐడెన్ మార్క్రమ్ (కెప్టెన్), ఒట్నీల్ బార్ట్‌మన్, మాథ్యూ బ్రీట్జ్కే, నాండ్రే బర్గర్, గెరాల్డ్ కోయెట్జీ, డొనొవాన్ ఫెరీరా, రీజా హెండ్రిక్స్, మార్కో జాన్సన్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహారాజ్, డేవిడ్ మిల్లర్, హెండ్రిక్స్, ఆండిలే ఫెహ్లుక్వాయో, షంసి, ట్రిస్టన్ స్టబ్స్, లిజాడ్ విలియమ్స్. -
ఓటమి బాధలో ఉన్న దక్షిణాఫ్రికాకు భారీ షాక్!
వన్డే ప్రపంచకప్-2023లో సెమీఫైనల్స్‌కు ముందు దక్షిణాఫ్రికాకు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ లుంగీ ఎంగిడి గాయం కారణంగా టోర్నీలో మిగిలిన మ్యాచ్‌లకు దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఆదివారం కోల్‌కతా వేదికగా టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో ఎంగిడీ గాయపడ్డాడు. భారత ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో జడేజా కొట్టిన బంతిని అపే క్రమంలో ఎంగిడి కాలికి గాయమైంది. దీంతో నొప్పితో విల్లావిల్లాడిన ఎంగిడీ ఓవర్ పూర్తి చేయకుండానే ఫీల్డ్‌ను వదిలి వెళ్లాడు. మిగిలిన ఓవర్‌ను జానెసన్ పూర్తి చేశాడు. తర్వాత ఎంగిడి బ్యాటింగ్‌కు వచ్చినప్పటకీ జడేజా బౌలింగ్‌లో డకౌటయ్యాడు. అయితే అతడికి రెండు వారాల విశ్రాంతి అవసరమని ప్రోటీస్ వైద్యబృందం సూచించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఎంగిడీ మిగిలిన టోర్నీకి దూరం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా అతడికి బ్యాకప్‌గా రిలీ రూసోను దక్షిణాఫ్రికా జట్టు మేనెజ్మెంట్ భారత్‌కు రప్పించింది. అయితే ప్రస్తుతం దక్షిణాఫ్రికా జట్టులో విలియమ్స్ రూపంలో మరో అదనపు పేసర్ ఉన్నాడు. ఒక వేళ ఎంగిడి దూరమైతే కోట్జే లేదా విలియమ్స్ తుది జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది. కాగా టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో 243 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా ఘోర ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. చదవండి: WC 2023: బంగ్లాదేశ్ అప్పీలు.. మాథ్యూస్ అవుట్! అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి! -
రాణించిన బట్లర్, ఎంగిడి.. రాయల్స్ ఖాతాలో మూడో విజయం
సౌతాఫ్రికా టీ20 లీగ్-2023లో పార్ల్ రాయల్స్ టీమ్ కీలక విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ప్రిటోరియా క్యాపిటల్స్‌తో ఇవాళ (జనవరి 22) జరిగిన మ్యాచ్‌లో రాయల్స్ 6 వికెట్ల తేడాతో గెలుపొంది, పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి (7 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో 13 పాయింట్లు) ఎగబాకింది. మరోవైపు సీజన్లో రెండో ఓటమి చవిచూసినా క్యాపిటల్స్ తన అగ్రస్థానాన్ని (6 మ్యాచ్‌ల్లో 4 విజయాలతో 18 పాయింట్లు) పదిలంగా కాపాడుకుంది. ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్, సూపర్ కింగ్స్, సూపర్ జెయింట్స్ పాయింట్ల పట్టికలో వరుసగా 2, 4, 5, 6 స్థానాల్లో ఉన్నాయి. Paarl Royals registered a much-needed win for their #SA20 campaign. 📸: Jio Cinema#CricTracker #DavidMiller #PCvPR #SA20 pic.twitter.com/sepbANPv16 — CricTracker (@Cricketracker) January 22, 2023 క్యాపిటల్స్‌తో సాదాసీదాగా సాగిన ఇవాల్టి మ్యాచ్‌లో తొలుత బౌలింగ్ చేసిన రాయల్స్.. లుంగి ఎంగిడి (4-0-19-1), ఫెరిస్కో ఆడమ్స్ (4-0-38-2), ఇవాన్ జోన్స్ (3-0-25-1), ఫోర్టిన్ (4-0-32-1), షంషి (4-0-29-1) రాణించడంతో ప్రత్యర్ధిని నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 158 పరుగులకు కట్టడి చేసింది. క్యాపిటల్స్ ఇన్నింగ్స్‌లో కుశాల్ మెండిస్ (37), థెనిస్ డి బ్ర్యూన్ (53) రాణించారు. అనంతరం రాయల్స్.. జట్టులో అందరూ తలో చేయి వేయడంతో 19.4 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది. జోస్ బట్లర్ (37) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. జేసన్ రాయ్ (21), విహాన్ లుబ్బే (29), డానీ విలాస్ (24), డేవిడ్ మిల్లర్ (28 నాటౌట్), మిచెల్ వాన్ బురెన్ (12 నాటౌట్) ఓ మోస్తరుగా రాణించారు. క్యాపిటల్స్ బౌలర్లలో విల్ జాక్స్ 2, ఈథన్ బోష్, ఆదిల్ రషీద్ తలో వికెట్ పడగొట్టారు. -
భారత బ్యాటర్లు ఓపికగా ఆడితే బాగుండేది! ప్రొటిస్ మమ్మల్ని సైతం ఓడించి..
ICC Mens T20 World Cup 2022- India vs South Africa: ‘‘ఇండియా మా సెమీస్ అవకాశాలను గల్లంతు చేసింది. భారత్ పరాజయం మమ్మల్ని తీవ్రంగా బాధించింది. అయినా ఇందులో వాళ్ల తప్పేమీ లేదు. మేమే చెత్తగా ఆడి.. మా తలరాతను ఇతరులు నిర్ణయించే దుస్థితిలో ఉన్నాం’’ అని పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ అన్నాడు. కాగా టీ20 ప్రపంచకప్-2022లో భాగంగా ఆదివారం సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో టీమిండియా 5 వికెట్ల తేడాతో ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ సెమీస్ అవకాశాలు దాదాపుగా మూసుకుపోయినట్లయింది. అద్భుతాలు జరిగితే తప్ప బాబర్ ఆజం బృందం టోర్నీలో ముందుకు వెళ్లే పరిస్థితి లేదు. ఈ క్రమంలో షోయబ్ అక్తర్ మాట్లాడుతూ.. ఐసీసీ టోర్నీలో పాక్ ఆట తీరుపై విమర్శలు గుప్పించాడు. టీమిండియా మమ్మల్ని నిరాశపరిచింది అదే సమయంలో రోహిత్ సేన.. దక్షిణాఫ్రికాపై విజయం సాధించి ఉంటే తమకు కాస్త మేలు చేసిన వాళ్లు అయ్యేవారంటూ వ్యాఖ్యానించాడు. టీమిండియా- సౌతాఫ్రికా మ్యాచ్ ఫలితంపై తన యూట్యూబ్ చానెల్లో స్పందించిన అక్తర్.. ‘‘పెర్త్ లాంటి పిచ్‌లపై ఆడటం కాస్త కష్టమే. ఏదేమైనా టీమిండియా మమ్మల్ని నిరాశకు గురిచేసింది. భారత బ్యాటర్లు కాస్త ఓపికగా ఆడి ఉంటే బాగుండేది. పెవిలియన్‌కు క్యూ కట్టకుండా.. కనీసం 150 పరుగులు స్కోరు చేసి ఉంటే ప్రయోజనకరంగా ఉండేది. మమ్మల్ని కూడా ఓడిస్తారు! అయితే, దక్షిణాఫ్రికా తన అనుభవజ్ఞులైన ఆటగాళ్ల సేవలను చక్కగా ఉపయోగించుకుంది. మిల్లర్ నిజంగా కిల్లర్ ఇన్నింగ్స్ ఆడాడు. మార్కరమ్‌తో కలిసి తన అనుభవన్నంతా ఉపయోగించి అద్భుత ప్రదర్శన కనబరిచాడు. లుంగి ఎంగిడి అద్భుతాలు చేయగలడని మరోసారి నిరూపించాడు. నిజానికి ఈ మ్యాచ్‌లో ఇండియా గెలిస్తే మాకు ఆశలు మిగిలి ఉండేవి. కానీ అలా జరుగలేదు. ఇక సౌతాఫ్రికా ఇప్పుడు.. టీమిండియా లాగే మమ్మల్ని సైతం ఓడించేందుకు సన్నద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది’’ అని పేర్కొన్నాడు. కాగా పాకిస్తాన్ తమ తదుపరి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో తలపడనున్న విషయం తెలిసిందే. టీ20 ప్రపంచకప్-2022 సూపర్-12: ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా మ్యాచ్ స్కోర్లు: ఇండియా- 133/9 (20) దక్షిణాఫ్రికా- 137/5 (19.4) 5 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా విజయం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: లుంగి ఎంగిడి(4 ఓవర్లలో 29 పరుగులు ఇచ్చి 4 వికెట్లు) చదవండి: T20 WC 2022: టీమిండియా మిగిలిన రెండు మ్యాచ్‌లు గెలిస్తేనే! పాక్ దింపుడు కల్లం ఆశలు.. T20 WC 2022: ఇదేమి బెంగళూరు వికెట్ కాదు.. దినేశ్ కార్తిక్‌పై సెహ్వాగ్ సెటైర్లు! ఇప్పటికైనా var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1971406958.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
న్యూజిలాండ్‌తో రెండో టెస్టు.. దక్షిణాఫ్రికాకు భారీ షాక్!
న్యూజిలాండ్‌తో రెండో టెస్టుకు మందు దక్షిణాఫ్రికాకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్దార్ పేసర్ లుంగీ ఎంగిడీ వెన్ను నొప్పి కారణంగా రెండో టెస్ట్‌కు దూరమయ్యాడు. తొలి టెస్టుకు దూరమైన ఎంగిడి.. రెండో టెస్టుకు గాయం నుంచి కోలుకుంటాడాని టీమ్ మేనేజ్మెంట్ భావించింది. అయితే గాయం నుంచి కోలుకోపోవడంతో ఎంగిడి జట్టు నుంచి తప్పుకున్నట్లు ప్రోటిస్ కెప్టెన్ ఎల్గర్ తెలిపాడు. తొలి టెస్టుకు ముందు అతడు పూర్తిగా బౌలింగ్ చేయలేకపోయాడు. రెండో టెస్టుకు కోలుకుంటాడని భావించాం. అయితే అతడు ఇంకా పూర్తిగా కోలుకోలేదు. అతడు మాతో ప్రాక్టీస్‌లో కూడా పాల్గోనడంలేదు. అతడు జట్టుకు దూరం కావడం మాకు పెద్ద ఎదురు దెబ్బ. ఎందుకుంటే మా బౌలింగ్ లైనప్‌లో అతడు చాలా కీలకం అని ఎల్గర్ పేర్కొన్నాడు. మరో వైపు స్టార్ బౌలర్ అన్రిచ్ నార్ట్జే కూడా కీవిస్ పర్యటనకు దూరమైన సంగతి తెలిసిందే. ఇక తొలి టెస్టులో ఘోర పరాజయం పొందిన దక్షిణాఫ్రికా తిరిగి పుంజుకోవాలని భావిస్తోంది. ఫిబ్రవరి 25న దక్షిణాఫ్రికా- న్యూజిలాండ్ మధ్య రెండో టెస్ట్ ప్రారంభం కానుంది. చదవండి: Ajinkya Rahane : 'ఏంటి రహానే మరి మారవా.. మళ్లీ డకౌట్ అయ్యావా' -
Ind Vs Sa 3rd Test: మా వాళ్లు సూపర్.. అందుకే కోహ్లి అలా చేశాడు: ప్రొటిస్ బౌలర్
Ind Vs Sa 3rd Test- Elgar DRS Call- Kohli Reaction Viral: దక్షిణాఫ్రికాతో మూడో టెస్టులో భాగంగా విరాట్ కోహ్లి బృందం వ్యవహరించిన తీరుపై ప్రొటిస్ బౌలర్ లుంగి ఎంగిడి స్పందించాడు. ఒత్తిడిని తట్టుకోలేకే అసహనం ప్రదర్శించారని వ్యాఖ్యానించాడు. అసలేం జరిగిందంటే... దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 21వ ఓవర్లో అశ్విన్ బౌలింగ్‌లో బంతి కెప్టెన్ డీన్ ఎల్గర్ ప్యాడ్లను తాకుతూ ఆఫ్‌స్టంప్ దిశగా కీపర్ పంత్ చేతుల్లో పడింది. అశ్విన్ అప్పీల్‌కు వెళ్లగా.. ఫీల్డ్ అంపైర్ అవుట్ ఇచ్చాడు. కానీ.. ఎల్గర్ మాత్రం రివ్యూకు వెళ్లాడు. ‘బాల్ ట్రాకింగ్’ను ప్రసారకర్తలు తప్పుగా చూపించడంతో.. ఫీల్డ్ ఎంపైర్ ఎల్గర్‌ను నాటౌట్‌గా ప్రకటించడం జరిగాయి. దీంతో టీమిండియా కెప్టెన్ కోహ్లి సహా అశ్విన్, కేఎల్ రాహుల్ ప్రసారకర్తల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. కోహ్లి అయితే.. స్టంప్స్ వద్ద నిలబడి ‘ఎప్పుడూ మా మీదే దృష్టి పెడితే ఎలా. మీ జట్టును కూడా కాస్త చూసుకోండి’ అంటూ సెటైర్లు వేశాడు. ఇక ఆ తర్వాత రివ్యూ ద్వారానే భారత్‌కు బుమ్రా బౌలింగ్‌లో ఎల్గర్ వికెట్ దక్కడం విశేషం. ఈ విషయంపై స్పందించిన ఎంగిడి.. ‘‘ఎల్గర్, పీటర్సన్ మెరుగైన భాగస్వామ్యం నమోదు చేశారు. ఈ ద్వయాన్ని విడదీయాలని వాళ్లు(టీమిండియా) ఎంతగానో ప్రయత్నించారు. కానీ.. అది కష్టతరంగా మారింది. దాంతో వాళ్లు అసహనానికి గురయ్యారు. అయినా ఒక్కొక్కరి భావోద్వేగాలు ఒక్కోలా ఉంటాయి. అసహనం, విసుగు వంటి ఉద్వేగాలను ప్రదర్శించడం సహజమే. అంతేగానీ, ఎవరు కూడా ఉద్దేశపూర్వంగా అలా చేయరు. నిజానికి టీమిండియా ఒత్తిడిలో ఉంది. మైదానంలో వారు వ్యవహరించిన తీరే ఇందుకు నిదర్శనం’’ అని వ్యాఖ్యానించాడు. కాగా ఆఖరిదైన మూడో టెస్టులో గెలిస్తేనే టీమిండియా సఫారీ గడ్డపై టెస్టు సిరీస్ గెలవాలన్న చిరకాల కోరిక నెరవేరుతుంది. కానీ.. ప్రొటిస్ జట్టు బలంగా నిలబడి.. మన ఆశలపై నీళ్లు చల్లేలా అద్భుత ప్రదర్శన కనబరుస్తోంది. నాలుగో రోజు ఆటలో మన బౌలర్లు ఎంత త్వరగా ఎనిమిది వికెట్లు పడగొడుతారన్న అంశంపైనే మన విజయం ఆధారపడి ఉంది. లేదంటే మరోసారి రిక్తహస్తాలతో వెనుదిరగాల్సిందే. ఈ నేపథ్యంలో కోహ్లి సేన కాస్త ఒత్తిడికి గురవడం సహజమే! చదవండి: అదే తీరు.. ఈసారి పంత్‌తో పెట్టుకున్నాడు pic.twitter.com/00dPXQv8sK — Addicric (@addicric) January 13, 2022 pic.twitter.com/HtZwoo9Lm7 — Bleh (@rishabh2209420) January 13, 2022 Lungi Ngidi producing the goods with three game changing wickets✅ #SAvIND #FreedomTestSeries #BePartOfIt | @Betway_India | @JohnnieWalkerSA pic.twitter.com/BDoD3z25nT — Cricket South Africa (@OfficialCSA) January 13, 2022 -
Ind VS Sa: 327 అనేది మరీ చెత్త స్కోరేమీ కాదులే.. మనోళ్లు తక్కువేం కాదు!
Ind VS Sa 1st Test: టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు లుంగి ఎన్గిడి. వరుసగా వికెట్లు పడగొట్టి కోహ్లి సేనను దెబ్బకొట్టాడు. మొత్తంగా 6 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. కగిసో రబడ సైతం ఎన్గిడికి తోడు కావడంతో 272 పరుగుల స్కోరు వద్ద మూడో రోజు ఆట ఆరంభించిన భారత్.. కేవలం యాభై పరుగుల వ్యవధిలోనే మిగిలిన 6 వికెట్లు కోల్పోయింది. 327 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ ముగించింది. ఎన్గిడికి 6, రబడకు 3, జాన్సెన్కు ఒక వికెట్ దక్కాయి. దీంతో ప్రొటిస్ బౌలర్లను ప్రశింసిస్తూనే.. టీమిండియా బ్యాటింగ్ తీరును ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. ‘‘ఎన్గిడి, రబడ సూపర్... టీమిండియా భారీ స్కోరు చేస్తుందనుకుంటే.. కేవలం 36 పరుగుల వ్యవధిలోనే ఐదు వికెట్లు కోల్పోయింది’’ అని కామెంట్లు చేస్తున్నారు. అయితే, మాజీ ఆటగాడు పార్థివ్ పటేల్ మాత్రం భారత జట్టుకు అండగా నిలిచాడు. ‘‘సెంచూరియన్ టెస్టు... మూడో రోజు ఆటలో టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలిన విధానాన్ని విమర్శించడం తేలికే. కానీ... 327 అనేది మరీ చెత్త స్కోరేమీ కాదు. టాస్ గెలిచిన తర్వాత తొలి ఇన్నింగ్స్‌లో ఈ మాత్రం స్కోరు చేయడం మంచి విషయం’’అని ట్వీట్ చేశాడు. అదే విధంగా... టీమిండియా మాజీ క్రికెటర్ ఆర్పీ సింగ్ సైతం.. ‘‘50 పరుగుల వ్యవధిలో చివరి 6 వికెట్లు! తమ బౌలింగ్ అటాక్ ఎలా ఉంటుందో దక్షిణాఫ్రికా బౌలర్లు మరోసారి నిరూపించారు. తమను తక్కువగా అంచనా వేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయో చూపించారు. అయితే, భారత బౌలర్లు కూడా ఇలాంటి పిచ్‌పై అద్భుతాలు చేయగలరు’’ అని చెప్పుకొచ్చాడు. అన్నట్లుగానే భారత పేసర్లు ప్రొటిస్ బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నారు. చదవండి: IPL 2022- Ambati Rayudu : "నాకు ఐపీఎల్లో ఆ జట్టుకు ఆడాలి అని ఉంది" Last 6 wickets for less than 50 runs! It’s definitely not a good morning for Team India. South Africa has once again shown that their bowling attack can’t be taken lightly but I am sure Indian bowling can do even better in these conditions. #SAvsIND #INDvsSA — R P Singh रुद्र प्रताप सिंह (@rpsingh) December 28, 2021 It is easy to critise the dramatic collapse on the 3rd day at #Centurion but I feel 327 is still a very good score in the first innings after winning the toss. pic.twitter.com/MEzUW527jk — parthiv patel (@parthiv9) December 28, 2021 🇿🇦 👏 What a performance with ball in hand from Lungi Ngidi 6/71.#SAvIND #FreedomTestSeries #BePartOfIt #KeepWalking | @johnniewalker_ pic.twitter.com/6FxrTZCKwt — Cricket South Africa (@OfficialCSA) December 28, 2021 -
Ind Vs Sa: మూడోరోజు ముగిసిన ఆట.. 146 పరుగుల ఆధిక్యంలో టీమిండియా
Ind Vs Sa 1st Centurion Test Day 3 Live Updates టీమిండియా, సౌతాఫ్రికాల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మూడోరోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 16 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 5, శార్దూల్ ఠాకూర్ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం టీమిండియా తొలి ఇన్నింగ్స్ కలుపుకొని 146 పరుగుల ఆధిక్యంలో ఉంది. అంతకముందు సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 197 పరుగులకు ఆలౌట్ అయింది. కాగా మూడోరోజు ఆటలో తొలి సెషన్లో సౌతాఫ్రికా ఆధిపత్యం చూపించగా.. మిగిలిన రెండు సెషన్లలో టీమిండియా పూర్తి ఆధిపత్యం చెలాయించింది. నాలుగో రోజు ఆటలో టీమిండియా తొలి రెండు సెషన్ల పాటు ఆడి భారీ స్కోరు చేస్తే సౌతాఫ్రికా ఓటమి నుంచి తప్పించుకోవడం కష్టమే. 20:56 PM: టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 197 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో టీమిండియాకు 130 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. టీమిండియా బౌలర్ల కట్టుదిట్టమైన బంతులకు సౌతాఫ్రికా బ్యాట్స్‌మన్ పరుగులు తీయడంలో ఇబ్బందులు పడ్డారు. ప్రొటీస్ బ్యాటింగ్‌లో టెంబా బవుమా 52 పరుగులు చేయగా.. క్వింటన్ డికాక్ 34 పరుగులు చేశాడు. టీమిండియా బౌలర్లలో మహ్మద్ షమీ 5 వికెట్లతో దుమ్మురేపగా.. బుమ్రా, శార్దూల్ చెరో రెండు, సిరాజ్ ఒక వికెట్ తీశారు. 7:31 PM : తొలి టెస్టులో టీమిండియా చెలరేగుతుండడంతో సౌతాఫ్రికా బ్యాటర్స్ పెవిలియన్‌కు క్యూ కడుతున్నారు. తాజాగా 12 పరుగులు చేసిన ముల్డర్ షమీ బౌలింగ్‌లో పంత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో దక్షిణాఫ్రికా ఆరో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం 44 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. టెంబా బవుమా 48 పరుగులతో ఒంటరి పోరాటం చేస్తున్నాడు. 6:35 PM : శార్ధూల్ ఠాకూర్ అద్బుత బౌలింగ్‌తో దక్షిణాఫ్రికా ఐదో వికెట్ కోల్పోయింది. ఇన్నింగ్స్ 34వ ఓవర్ తొలి బంతికి డికాక్ క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా 37 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. బవుమా 31, ముల్డర్ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు. 4: 47 PM: భారత బౌలర్లు దక్షిణాఫ్రికాకు చుక్కలు చూపిస్తున్నారు. వరుస విరామాల్లో వికెట్లు పడగొడుతున్నారు. దీంతో 32 పరుగులకే ప్రొటిస్ నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ప్రస్తుతం తెంబా బవుమా, క్వింటన్ డికాక్ క్రీజులో ఉన్నారు. బుమ్రా ఒకటి, షమీ రెండు, సిరాజ్ ఒక వికెట్ పడగొట్టారు. 4: 22PM- మహ్మద్ షమీ బౌలింగ్‌లో ప్రొటిస్ బ్యాటర్ కీగన్ పీటర్సన్ అవుటయ్యాడు. దీంతో 30 పరుగుల వద్ద దక్షిణాఫ్రికా రెండో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం మార్కరమ్, రసే వాన్ డెర్ డసెన్ క్రీజులో ఉన్నారు. 4: 22PM: రెండో వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా 3: 50 PM: లంచ్ బ్రేక్ సమయానికి ప్రొటిస్ జట్టు స్కోరు: 21/1 (7). పీటర్సన్(11), మార్కరమ్(9) క్రీజులో ఉన్నారు. 3: 10 PM: టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో దక్షిణాఫ్రికా మొదటి వికెట్ కోల్పోయింది. బుమ్రా బౌలింగ్‌లో ప్రొటిస్ కెప్టెన్ డీన్ ఎల్గర్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. కేవలం ఒకే ఒక్క పరుగు చేసి నిష్క్రమించాడు. ఎయిడెన్ మార్కరమ్, కీగన్ పీటర్సన్ క్రీజులో ఉన్నారు. 2: 52 PM: దక్షిణాఫ్రికా బౌలర్ల ధాటికి టీమిండియా ఆటగాళ్లు చేతులెత్తేశారు. దీంతో మూడో రోజు ఆటలో భాగంగా 327 పరుగులకు టీమిండియా ఆలౌట్ అయింది. కాగా తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ మూడు వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. అయితే, వర్షం కారణంగా రెండో రోజు ఆట రద్దు కాగా... మంగళవారం ఆట ప్రారంభించిన కొద్ది సేపటికే ఆలౌట్ అయింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఎంగిడికి అత్యధికంగా 6 వికెట్లు దక్కగా... రబడ 3, జాన్సెన్ ఒక వికెట్ పడగొట్టారు. ఇక టీమిండియా ఆటగాళ్లలో కేఎల్ రాహుల్ 123 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మయాంక్ అగర్వాల్(60), కోహ్లి(35), రహానే(48), బుమ్రా (14) మినహా మిగతా ఆటగాళ్లంతా సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. ►టీమిండియా తొలి ఇన్నింగ్స్: 327 పరుగులు, ఆలౌట్ 2: 37 PM: టీమిండియా తొమ్మిదో వికెట్ కోల్పోయింది. మహ్మద్ షమీ ఎంగిడి బౌలింగ్‌లో డికాక్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ క్రీజులో ఉన్నారు. 2: 26 PM: ప్రొటిస్ బౌలర్ కగిసో రబడ విశ్వరూపం చూపిస్తున్నాడు. వరుసగా వికెట్లు తీస్తూ టీమిండియాను దెబ్బకొడుతున్నాడు. ఇప్పటి వరకు మొత్తంగా అతడు 3 వికెట్లు తీయగా.. ఎంగిడి 5 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. 2: 26 PM: కోహ్లి సేన నిమిదో వికెట్ కోల్పోయింది. శార్దూల్ ఠాకూర్ 4 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్ చేరాడు. 2: 15 PM: టీమిండియాకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. మూడో రోజు ఆట ఆరంభం కాగానే వరుసగా వికెట్లు కోల్పోతోంది. కేఎల్ రాహుల్, అజింక్య రహానే, అశ్విన్, రిషభ్ పంత్ రూపంలో నాలుగు వికెట్లు కోల్పోయింది. వరుణుడు కరుణించడంతో దక్షిణాఫ్రికా- భారత్ మధ్య తొలి టెస్ట్ మూడో రోజు ఆట ప్రారంభమైంది. కాగా ఆరంభంలోనే రెండు కీలక వికెట్లను భారత్ కోల్పోయింది. సెంచరీ సాధించి మంచి టచ్‌లో కనిపించిన కేఎల్ రాహుల్, రబడ బౌలింగ్‌లో వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఎంగిడీ బౌలింగ్‌లో రహానే కూడా వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. తుదిజట్లు: భారత్: కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి(కెప్టెన్), అజింక్య రహానే, రిషభ్ పంత్(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్. దక్షిణాఫ్రికా: డీన్ ఎల్గర్(కెప్టెన్), ఎయిడెన్ మార్కరమ్, కీగన్ పీటర్సన్, రసే వాన్ డెర్ డసెన్, తెంబా బవుమా, క్వింటన్ డికాక్(వికెట్ కీపర్), వియాన్ మల్దర్, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, లుంగి ఎంగిడి. -
మయాంక్ అగర్వాల్ ఔట్ విషయంలో ఫ్యాన్స్ అసంతృప్తి
టీమిండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్ సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో అర్థసెంచరీతో మెరిసిన సంగతి తెలిసిందే. రోహిత్ గైర్హాజరీలో కేఎల్ రాహుల్‌తో కలిసి తొలి వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యం నమోదు చేసి టీమిండియాను పటిష్టస్థితిలో నిలిపాడు. 37 పరుగుల వద్ద మయాంక్ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఇక 149 బంతుల్లో 10 బౌండరీల సాయంతో 60 పరుగులు చేసిన మయాంక్.. ఎన్గిడి బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. చదవండి: Virat Kohli: మళ్లీ అదే నిర్లక్క్ష్యం.. మంచి ఆరంభం వచ్చాకా కూడా! ఎన్గిడి బంతిని ఆఫ్‌స్టంప్ లైన్ మీదుగా విసరగా ఇన్సైడ్ ఎడ్జ్ అయి మయాంక్ ప్యాడ్లను తాకింది. దక్షిణాఫ్రికా అప్పీల్‌కు వెళ్లగా.. అంపైర్ ఔట్ ఇవ్వలేదు. దీంతో డీఆర్ఎస్కు వెళ్లి ప్రొటీస్ ఫలితం రాబట్టింది. అల్ట్రాఎడ్జ్‌లో బంతి టాప్ఎండ్ నుంచి లెగ్‌స్టంప్‌ను ఎగురగొట్టినట్లు కనిపించడంతో మయాంక్ ఔటయ్యాడు. అయితే ఈ నిర్ణయంపై టీమిండియా ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేశారు. బంతి అంత హైట్‌లో వెళ్తున్నప్పుడు అంపైర్ కాల్ తీసుకోవాల్సింది అంటూ కామెంట్స్ చేశారు. ఇక మయాంక్ ఔటైన తర్వాతి బంతికే పుజారా గోల్డెన్ డక్ అయ్యాడు. ఇన్నింగ్స్ 40వ ఓవర్ మూడో బంతి పుజారా డిఫెన్స్ చేసే ప్రయత్నంలో బ్యాట్ ఇన్సైడ్ ఎడ్జ్ అయి కీగన్ పీటర్సన్ చేతిలో పడింది. ఇక సౌతాఫ్రికా గడ్డపై పుజారా గోల్డెన్ డక్ కావడం ఇది రెండోసారి. యాదృశ్చికంగా రెండుసార్లు ఎన్గిడి బౌలింగ్‌లోనే పుజారా ఔట్ కావడం ఇక్కడ మరో విశేషం.ఇక తొలిరోజు ఆటలో అన్ని సెషన్లలో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన టీమిండియా 3 వికెట్ల నష్టానికి 272 పరుగుల వద్ద తొలిరోజు ఆటను ముగించింది. కేఎల్ రాహుల్ 122 పరుగులు, రహానే 40 పరుగులతో ఆడుతున్నారు. చదవండి: KL Rahul: కేఎల్ రాహుల్ శతకం.. టెస్టు ఓపెనర్‌గా పలు రికార్డులు బద్దలు Mayank Agarwal LBW Wicket, India vs South Africa 1st Test#Wicket#SAvIND #Mayank#Agarwal#Ngidi#Cricket pic.twitter.com/j6ayNJW1RT — Error in Thinking (@Errorinthinking) December 26, 2021 -
WI Vs SA: టి20 సిరీస్ కైవసం చేసుకున్న దక్షిణాఫ్రికా
సెయింట్ జార్జెస్: వెస్టిండీస్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను దక్షిణాఫ్రికా సొంతం చేసుకుంది. నిర్ణాయక ఐదో మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 25 పరుగుల తేడాతో వెస్టిండీస్‌ను ఓడించి సిరీస్‌ను 3–2తో దక్కించుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి 168 పరుగులు చేసింది. మార్క్రమ్ (48 బంతుల్లో 70; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), క్వింటన్ డికాక్ (42 బంతుల్లో 60; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ శతకాలతో రాణించారు. వీరిద్దరు రెండో వికెట్‌కు 128 పరుగులు జోడించారు. లక్ష్యఛేదనలో వెస్టిండీస్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 143 పరుగులు చేసి ఓడింది. ఎవిన్ లూయిస్ (34 బంతుల్లో 52; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఆకట్టుకున్నాడు. ఇన్‌గిడి 3 వికెట్లు తీయగా... రబడ, వియాన్ ముల్దర్ చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు. మార్క్రమ్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డును దక్కించుకోగా... ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా షమ్సీ నిలిచాడు. 🔥 Wiaan Mulder had a dream performance in the 5th T20I, claiming 2 massive wickets 🎥 Full Highlights https://t.co/3nINbKmCMS#WIvSA #ThatsOurGame pic.twitter.com/T62eYNDeHN — Cricket South Africa (@OfficialCSA) July 4, 2021 -
డు ప్లెసిస్ కాస్త ఆలస్యంగా...
చెన్నై : చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు, దక్షిణాఫ్రికా కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ కొంత ఆలస్యంగా తన ఐపీఎల్ జట్టుతో చేరతాడు. అతని భార్య రెండో బిడ్డకు జన్మనివ్వనుండటంతో ఆమెతో ఉండాలని ప్లెసిస్ నిర్ణయించుకున్నాడు. మరో సహచర దక్షిణాఫ్రికా క్రికెటర్ లుంగీ ఇన్‌గిడితో కలిసి సెప్టెంబర్ 1న అతను యూఏఈలో జట్టుతో కలుస్తాడు. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్, సీఎస్కే కోచ్ ఫ్లెమింగ్, బ్యాటింగ్ కోచ్ మైక్ హస్సీ నేరుగా ఆగస్టు 22న దుబాయ్ చేరుకుంటారు. చెన్నై జట్టులోని ఇతర విదేశీ ఆటగాళ్లు డ్వేన్ బ్రేవో, సాన్‌ట్నర్, తాహిర్ ప్రస్తుతం కరీబియన్ ప్రీమియర్ లీగ్ ఆడుతున్నారు. వారు ఎప్పుడొస్తారనేదానిపై స్పష్టత లేదు. ఇంగ్లండ్– ఆస్ట్రేలియా వన్డే సిరీస్ ముగిసిన తర్వాతే స్యామ్ కరన్, జోష్ హాజల్‌వుడ్ తమ ఐపీఎల్ జట్లతో కలిసే అవకాశం ఉంది. -
'ఎన్గిడి... నిజంగా నువ్వు మూర్ఖుడివి'
జోహన్నెస్‌బర్గ్ : అమెరికా నల్ల జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ హత్య తరువాత ప్రపంచవ్యాప్తంగా జాతి వివక్షపై నిరసనలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ హత్యోదంతం తర్వతా బ్లాక్ లైవ్స్ మేటర్ అంశంపై ప్రచారం విస్తృతంగా పెరిగింది. దీనిపై పలువురు వెస్టిండీస్ క్రికెటర్లు కూడా తమ గళం విప్పారు. క్రికెట్లోనూ వర్ణ వివక్ష ఎదుర్కొన్నామంటూ డారెన్ సామి, క్రిస్ గేల్, మైఖేల్ హోల్డింగ్ లాంటి ఆటగాళ్లు పేర్కొన్నారు. తాజాగా 'బ్లాక్ లైవ్స్ మేటర్' ఉద్యమానికి తాను మద్దతు ఇస్తానని దక్షిణాఫ్రికా స్టార్ బౌలర్ లుంగి ఎన్గిడి శుక్రవారం పేర్కొన్నాడు. ఎన్గిడి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెట్లో పెను దుమారాన్నే రేపుతున్నాయి.(అండర్సన్.. మొన్ననేగా పొగిడాం ఇంతలోనే) 'బ్లాక్ లైవ్స్ మేటర్‌కు నేను మద్దతు ఇస్తున్నా.. ఈ అంశంలో ఇతర ఆటగాళ్ల మద్దతు నాకు ఉంటుందనే ఆశిస్తున్నా. గడిచిన కొన్ని సంవత్సరాల్లో దక్షిణాఫ్రికాలోనూ జాత్యాహంకారం జరగుతుంది.. క్రికెట్లోనూ ఇది కొనసాగుతుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న బ్లాక్ లైవ్స్ మేటర్‌కు మా జట్టులోని ఆటగాళ్లు కూడా కలిసి వస్తారని ఆశిస్తున్నా’అని తెలిపాడు.' అయితే ఎన్గిడి వ్యాఖ్యలపై పలువురు మాజీ దక్షిణాఫ్రికా ఆటగాళ్లు విరుచుకుపడ్డారు. 'ఎన్గిడి నువ్వు నిజంగా మూర్ఖుడివి.. బ్లాక్ లైవ్స్ మేటర్‌కు మద్దతు ఇవ్వాలా వద్దా అనేది నీ ఇష్టం. నువ్వు మద్దతు ఇవ్వాలనుకుంటే ఇవ్వు. కానీ మొత్తం దక్షిణాఫ్రికా ప్రజలను ఇందులోకి లాగొద్దు.' అంటూ దక్షిణాఫ్రికా మాజీ స్పిన్నర్ పాట్ సిమ్‌కాక్స్ పేర్కొన్నాడు. ' బ్లాక్ లైవ్స్ మేటర్ ప్రచారం వెనుక రాజకీయ ఉద్యమం తప్ప మరొకటి లేదని నేను భావిస్తున్నా. ఎన్గిడి.. మద్దతు ఇచ్చే ముందు థామస్ సోవల్, లారీ ఎల్డర్, వాల్టర్ విలిమమ్స్ లాంటి తెల్లజాతి రైతులపై జరిగిన దారుణాలను గుర్తు తెచ్చుకోవాలి. ఈ విషయంలో నువ్వు సానుభూతి ప్రకటిస్తే బ్లాక్ లైవ్స్ మేటర్ ప్రచారంలో నేను నీతో పాటు వస్తా 'అంటూ మాజీ బ్యాట్స్‌మన్ బొటా డిప్పెనార్ తెలిపాడు. అయితే ఎన్గిడి వ్యాఖ్యలకు తాను మద్దతిస్తున్నట్లు విండీస్ మాజీ కెప్టెన్ డారెన్ సామి తెలిపాడు.' బ్లాక్ లైవ్స్ మేటర్ ప్రచారానికి ఎన్గిడి మద్దతివ్వడం చాలా సంతోషంగా ఉంది. నీ వెనుక ఎవరు లేకున్నా మేమంతా నీతోనే ఉన్నాం . ఈ విషయలంలో కలిసి పోరాడుదాం' అంటూ ట్విటర్లో పేర్కొన్నాడు. ఒకప్పుడు వర్ణ వివక్ష అన్న కారణంతోనే దక్షిణాఫ్రికా దశాబ్దాలకు పైగా క్రికెట్ ఆడలేదన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.('ధోనికున్న మద్దతు కోహ్లికి లేదు..') -
దక్షిణాఫ్రికాకు దెబ్బ మీద దెబ్బ
లండన్ : వరుస పరాజయాలతో ఉక్కిరి బిక్కిరవుతున్న దక్షిణాఫ్రికాకు మరో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆతిథ్య ఇంగ్లండ్‌తో జరిగిన టోర్నీ ఆరంభ మ్యాచ్, బుధవారం బంగ్లాదేశ్‌తో జరిగిన మరుసటి మ్యాచ్‌ను చేజార్చుకున్న సఫారీలు.. బుధవారం భారత్‌తో జరిగే మ్యాచ్‌లోనైనా నెగ్గి శుభారంభం చేయాలని భావించారు. అయితే ఆ జట్టు స్టార్ బౌలర్ లుంగి ఎంగిడి గాయంతో ఆ మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఆదివారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో లుంగి ఎంగిడి తొడకండరాలు పట్టేయడంతో అర్ధాంతరంగా మైదానాన్ని వీడాడు. కేవలం 4 ఓవర్లు మాత్రమే వేసిన లుంగి ఎంగిడి 38 పరుగులు సమర్పించుకున్నాడు. భారత్‌తో జరిగే మ్యాచ్‌కు లుంగి ఎంగిడి అందుబాటులో ఉండటం లేదని దక్షిణాఫ్రికా జట్టు మేనేజర్ మహ్మద్ మూసాజీ స్పష్టం చేశాడు. వెస్టిండీస్‌తో జరిగే మ్యాచ్‌కు ఎంగిడి అందుబాటులోకి వస్తాడని పేర్కొన్నాడు. ‘ప్రస్తుతానికి అతని గాయం తీవ్రత తెలియదు. రేపు పరీక్షలు జరుపుతాం. వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు అందుబాటులో ఉండేలా ప్రణాళికలు రచిస్తాం’ అని ఐసీసీ వెబ్సైట్లో పేర్కొన్నారు. మరోవైపు కీలక ఆటగాళ్లు సైతం గాయాలతో సతమతమవుతుండటం.. పూర్తి ఫిట్నెస్ సాధించకపోవడం ఆ జట్టును కలవరపెడుతోంది. కెప్టెన్ డూప్లెసిస్, స్టార్ బౌలర్ స్టెయిన్, బ్యాట్స్‌మెన్ ఆమ్లాలు గాయాలతో సతమతమవుతున్న విషయం తెలిసిందే. 80 శాతం మాత్రమే ఫిట్‌గా ఉన్న స్టెయిన్, తొలి మ్యాచ్‌లో జోఫ్రా ఆర్చర్ బౌన్సర్‌కు గాయపడ్డ ఆమ్ల భారత్‌తో జరిగే మ్యాచ్‌కు అందుబాటులోకి వస్తారని జట్టు యాజమాన్యం భావిస్తోంది. ఇక బంగ్లాదేశ్, ఇంగ్లండ్‌తో పరాజయం పొందడం సఫారి జట్టు ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసింది. ఈ క్రమంలో నెం 2 ర్యాంకర్ అయిన కోహ్లిసేనను ఏ మేరకు ఎదుర్కోగలదో చూడాలి. -
వైరల్ : లుంగీ1, ప్యాంట్0
సోషల్ మీడియాలో ప్రత్యర్థులపై పంచ్‌లతో విరుచుకుపడుతూ.. మిత్రులను సరదాగా ఆటపట్టిస్తూ.. ఉండే మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ట్విటర్లో మరోసారి తన చతురతను చాటుకున్నాడు. తాజాగా లుంగీ 1, ప్యాంట్ 0 అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఐపీఎల్లో భాగంగా నిన్న(సోమవారం) చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ డేర్‌డెవిల్స్ మధ్య జరిగిన ఉత్కంఠ పోరులో చెన్నై 13 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌ని ఉద్దేశించి సెహ్వాగ్ ఇలా సరదాగా స్పందించారు. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ చివరివరకు పోరాడి ఓడింది. అయితే చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోని అద్భుతమైన బ్యాటింగ్‌తో ఆకట్టుకోగా, ఈ మ్యాచ్‌తోనే ఐపీఎల్లో అరంగేట్రం చేసిన దక్షిణాఫ్రికా పేసర్ లుంగి ఎన్గిడి చివరి ఓవర్లలో పొదుపైన బౌలింగ్ ద్వారా చెన్నై విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఢిల్లీ తరఫున రిషబ్ పంత్ అద్భుతమైన పోరాట పటిమను ప్రదర్శించాడు. రిషబ్ అద్భుతంగా రాణిస్తున్న సమయంలో ఎన్గిడి బౌలింగ్‌లో ఔటవ్వడం ఢిల్లీని దెబ్బతీసింది. అయితే ఈ మ్యాచ్‌ని ఎన్గిడి, పంత్‌ల మధ్య పోరుగా అభివర్ణిస్తూ.. సెహ్వాగ్ లుంగీ 1, ప్యాంటు(పంత్) 0 గా ట్వీట్ చేశారు. పంత్ గొప్పగా పోరాడాడని కొనియాడారు. సెహ్వాగ్ ట్వీట్‌పై క్రికెట్ అభిమానులు అదే తరహలో స్పందిస్తున్నారు. Lungi 1, Pant 0. But well played Pant !#CSKvDD — Virender Sehwag (@virendersehwag) April 30, 2018 సెహ్వాగ్ ట్వీట్‌పై అభిమానుల స్పందన pic.twitter.com/C6zp35wdjs — Priya Prakash Varrier (@PriyaPVarrierFA) April 30, 2018 #CSKvDD #WhistlePodu #DilDilli pic.twitter.com/bF5bBAvw0q — 🇮🇳 Anuradha 🇮🇳 (@AnuRadha9082) April 30, 2018 -
ఐపీఎల్: చెన్నైకి మరో షాక్!
సాక్షి, పుణే: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-11లో వరుస విజయాల మీదున్న చెన్నై సూపర్ కింగ్స్‌పై ముంబై ఇండియన్స్ నెగ్గి రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. అయినా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోనే కొనసాగుతున్న చెన్నై జట్టుకు ముంబై మ్యాచ్‌తో మరో షాక్ తగిలింది. ఫామ్‌లో ఉన్న పేసర్ దీపక్ చహర్ జట్టుకు దూరమయ్యాడు. గాయం కారణంగా కనీసం రెండు వారాల పాటు అతడు చెన్నైకి సేవలు అందించలేడని కోచ్ స్టిఫెన్ ప్లెమింగ్ వెల్లడించాడు. శనివారం రాత్రి ముంబైతో జరిగిన మ్యాచ్‌లో తొలి ఓవర్ వేసిన చహర్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. ఆపై ఇన్నింగ్స్ మూడో ఓవర్ వేశాడు. ఇన్నింగ్స్ 5వ ఓవర్ వేసిన చహర్ కాలి కండరాలు పట్టేయడంతో మైదానాన్ని వీడిన విషయం తెలిసిందే. దీనిపై చెన్నై సూపర్ కింగ్స్ కోచ్ ఫ్లెమింగ్ మాట్లాడుతూ.. 'ఇదివరకే కాలి కండరాల నొప్పితో ఉన్న పేసర్ చహర్‌కు సమస్య మళ్లీ తిరగబెట్టింది. కనీసం రెండు వారాలపాటు అతడికి విశ్రాంతి ఇవ్వాల్సి ఉంటుందని' చెప్పాడు. ఐపీఎల్ 11లో 7 మ్యాచ్‌లాడిన చహర్ 6 వికెట్లు తీశాడు. ముఖ్యంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్‌లో చహర్ ఆకట్టుకున్నాడు. నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసిన చహర్ కేవలం 15 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు తీసి సన్‌రైజర్స్ ఓటమిని శాసించాడు. ఎంగిడి వచ్చేశాడు.. తండ్రి మరణంతో టోర్నీ ప్రారంభం సమయంలో దక్షిణాఫ్రికా వెళ్లిన పేసర్ లుంగి ఎంగిడి భారత్ వచ్చేశాడు. చెన్నై జట్టుతో కలిసి అతడు ప్రాక్టీస్ చేస్తున్నాడు. చెన్నై తమ తదుపరి మ్యాచ్‌లకు స్టార్ పేసర్ ఎంగిడిని తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
తండ్రి మరణంతో ఐపీఎల్‌కు దూరం!
చెన్నై : ‘మూలిగే నక్కమీద తాటి పండు పడ్డట్లుంది’ ఈ సీజన్ ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ పరిస్థితి. రెండేళ్ల నిషేదం తర్వాత పునరాగమనం చేసిన చెన్నైకి అన్నీ ఎదురుదెబ్బలే. ఇప్పటికే గాయాలతో స్టార్ ఆలౌరౌండర్ కేదార్ జాదవ్ టోర్నీ నుంచి నిష్క్రమించగా.. సురేశ్ రైనా రెండు మ్యాచ్‌లకు దూరమైన విషయం తెలిసిందే. మరో వైపు కావేరి ఆందోళనలతో హోం మ్యాచ్‌లన్నీ పుణెకు తరలించబడ్డాయి. అయితే ఇప్పుడు ఆ జట్టు స్టార్ బౌలర్ లుంగి ఎంగిడి టోర్నీ నుంచి దూరమయ్యే అవకాశం కనిపిస్తోంది. శుక్రవారం ఉదయం లుంగీ తండ్రి జీరోమ్ ఎంగిడి మరణించారు. తండ్రి మరణంతో స్వదేశానికి తిరుగుపయనమైన సఫారీ బౌలర్ మళ్లీ టోర్నీలో పాల్గొనడంపై అనుమానాలు నెలకొన్నాయి. ఈ ఏడాది ఆరంభంలో భారత్.. దక్షిణాఫ్రికా పర్యటన సమయంలో ఎంగిడి తెరపైకి వచ్చాడు. ప్రొటీస్ గడ్డపై టెస్టు సిరీస్ గెలవాలనుకున్న భారత్ ఆశలపై ఎంగిడి నీళ్లు చల్లిన విషయం తెలిసిందే. అరంగేట్రం చేసిన సెంచూరియన్ టెస్టులో (6/39)తో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకుని అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ ప్రదర్శనతో ఈ సఫారీ ఆటగాడిని వేలంలో చెన్నై పోటీ పడి దక్కించుకుంది. ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఎంగిడికి రిజర్వ్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. విదేశీ ఆటగాళ్ల జాబితాలో మిచెల్ సాంట్నర్ దూరం కావడం, మార్క్‌వుడ్ అనుకున్న రీతిలో ప్రదర్శన చేయకపోవడంతో తదుపరి మ్యాచ్‌ల్లో ఎంగిడికి అవకాశం ఇచ్చే యోచనలో చెన్నై ఉండగా అనూహ్యంగా ఎంగిడి దూరమయ్యాడు. ఈ స్టార్ ఆటగాడి తండ్రి మరణంపై దక్షిణాఫ్రికా కెప్టెన్, చెన్నై సహచర ఆటగాడు డుప్లెసిస్ సంతాపం వ్యక్తం చేశాడు. ‘లుంగి ఎంగిడి తండ్రి జీరోమ్ మరణవార్త జట్టు సభ్యులందరినీ కలచివేసింది. అతనికి, అతని కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం. లుంగి ఎంగిడీకి ఇది ఎంతో కఠినమైన సమయం’ అని తెలిపాడు. క్రికెట్ సౌతాఫ్రికా అధ్యక్షుడు క్రిస్ నెన్ జానీ సైతం ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశాడు. ఇక చెన్నై సూపర్ కింగ్స్ తర్వాతి మ్యాచ్‌ను కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో ఆడనుంది. తల్లిదండ్రులతో లుంగిఎంగిడి -
ఆ సిక్స్‌కు ఫ్యాన్స్ థ్రిల్.!
జొహన్నెస్‌బర్గ్ : దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగో వన్డేలో టీమిండియా ఓడినా ఓ విషయం మాత్రం భారత అభిమానులను థ్రిల్ చేస్తోంది. అద్భుత ఫామ్‌తో చెలరేగుతున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఈ మ్యాచ్‌లో మరో హాఫ్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. అయితే సాధారణంగా కోహ్లి బంతిని గాల్లోకి లేపాడానికి ఇష్టపడడు. అవకాశం చిక్కినప్పుడే సిక్స్ కొడుతాడు. అలాగే నిన్నటి మ్యాచ్‌లో కోహ్లి ఓ సిక్స్ కొట్టాడు. లుంగి ఎంగిడి వేసిన 17 ఓవర్ రెండో బంతిని కోహ్లి ఒక అడుగు ముందుకేసి స్ట్రయిట్‌గా సిక్సు కొట్టాడు. ఈ స్ట్రేట్ డ్రైవ్ షాట్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ‘షాట్ ఆఫ్ ది సిరీస్’ అంటూ తమ ఆనందాన్ని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. 75 పరుగులు చేసిన అనంతరం కోహ్లి క్యాచ్ అవుట్‌గా వెనుదిరిగాడు. శిఖర్ ధావన్(105) అజేయ సెంచరీతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసింది. వర్షం కారణంగా దక్షిణాఫ్రికా లక్ష్యాన్ని 28 ఓవర్లలో 202 పరుగులుగా నిర్ణయించగా... ఆ జట్టు 25.3 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసి గెలిచింది. WHAT A SHOT 🙌 VIRAT INCREDIBLE KOHLI 👑@imVkohli #SAvIND 🇮🇳 pic.twitter.com/OnbmclPqCT — Vιяαт Kσнℓι (@imPriyaVK) 10 February 2018 -
అరంగేట్రం అదుర్స్.. భారత్ పతనాన్ని శాసించాడు!
సెంచూరియన్ : దక్షిణాఫ్రికా గడ్డ మీద ఆతిథ్య జట్టుపై టీమిండియాకు టెస్ట్ సిరీస్ విజయాన్ని అందించడంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ విఫలమయ్యాడు. నేడు జరిగిన రెండో టెస్టులో టీమిండియాను ఓడించిన ప్రొటీస్ జట్టు మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో టెస్ట్ సిరీస్‌ను కైవసం చేసుకుంది. అయితే సెంచూరియన్ టెస్టులోనే అరంగేట్రం చేసిన సౌతాఫ్రికా యువ సంచలనం, పేసర్ లుంగిసాని ఎంగిడి టీమిండియా పతనాన్ని శాసించాడు. ఆడుతున్నది తొలి టెస్టు.. అందులోనూ టెస్టుల్లో నెంబర్ వన్ టీమ్ భారత్‌తో ఆట అంటే అంత తేలిక కాదు. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం ఒకే వికెట్ తీసినా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల ఇన్నింగ్స్‌తో చెలరేగిపోయాడు. అందుకు ఈ యువ పేసర్ గణాంకాలే (6/39) నిదర్శనంగా నిలిచాయి. తద్వారా అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు ఎంగిడి. జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన ఎంగిడి తొలిటెస్టులోనే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ సొంతం చేసుకున్నాడు. అరంగేట్ర టెస్టులోనే భారత్ జట్టుపై ఐదు వికెట్ల ఇన్నింగ్స్‌తో చెలరేగిన రెండో దక్షిణాఫ్రికా బౌలర్‌గా నిలిచాడు. 21 ఏళ్ల తర్వాత ఈ ఫీట్ సాధించడం గమనార్హం. 1996లో భారత్‌తో జరిగిన కోల్‌కతా టెస్టులో సఫారీ అరంగేట్ర బౌలర్ లాన్స్ క్లూసెనర్ తొలి వికెట్ల ఇన్నింగ్స్ (8/64)తో రాణించాడు. కీలకమైన ప్రత్యర్థి జట్టు రెండో ఇన్నింగ్స్‌లోనే ఈ అరంగేట్ర బౌలర్లు రాణించి తమ జట్టుకు విజయాన్ని అందించారు. పార్థీవ్ పటేల్ వికెట్‌తో ఎంగిడి తన తొలి టెస్టు వికెట్ సాధించగా, రెండో ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, హార్థిక్ పాండ్యాతో పాటు అశ్విన్, షమీ, బూమ్రా వికెట్లు తీసి భారత్ ఓటమిని శాసించాడు. ఈ 24న ప్రారంభంకానున్న నామమాత్రమైన మూడో టెస్టులోనూ యువ సంచలనం ఎంగిడి తన సత్తా చాటాలని భావిస్తున్నాడు.