
సౌతాఫ్రిక్రా ఫాస్ట్ బౌలర్ లుంగి ఎంగిడి(Lungi Ngidi) కీలక మైలురాయిని చేరుకున్నాడు. వన్డే ఫార్మాట్లో వంద వికెట్ల క్లబ్‌లో చేరాడు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో భాగంగా ఇంగ్లండ్‌తో మ్యాచ్ సందర్భంగా ఎంగిడి ఈ ఘనత సాధించాడు. అంతేకాదు.. తక్కువ బంతుల్లోనే వన్డేల్లో వంద వికెట్లు(100 ODI Wickets) తీసిన రెండో సౌతాఫ్రికా బౌలర్‌గానూ ఈ రైటార్మ్ పేసర్ రికార్డులకెక్కాడు.
పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19న మొదలైన చాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ ముగింపు దశకు చేరుకుంటోంది. గ్రూప్-‘ఎ’ నుంచి భారత్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, పాకిస్తాన్.. గ్రూప్-‘బి’ నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్ పోటీపడుతున్న ఈ వన్డే టోర్నీలో ఇప్పటికే సెమీస్ బెర్తులు ఖరారయ్యాయి.
38.2 ఓవర్లలోనే ఖేల్ ఖతం
గ్రూప్-‘ఎ’ నుంచి భారత్, న్యూజిలాండ్ సెమీ ఫైనల్లో అడుగుపెట్టగా.. గ్రూప్-‘బి’ నుంచి ఆస్ట్రేలియాతో పాటు సౌతాఫ్రికా కూడా సెమీస్‌కు అర్హత సాధించింది. లీగ్ దశలో తమ చివరి మ్యాచ్‌లో భాగంగా శనివారం నాటి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను 179 పరుగులకే ఆలౌట్ చేసిన క్రమంలో సెమీ ఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంది.
ఇంగ్లండ్‌తో కరాచీ వేదికగా టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసిన సౌతాఫ్రికా.. 38.2 ఓవర్లలోనే ప్రత్యర్థి ఆట కట్టించింది. పేసర్లలో మార్కో యాన్సెన్, వియాన్ ముల్దర్ మూడేసి వికెట్లతో చెలరేగగా.. కగిసో రబడ, లుంగి ఎంగిడి ఒక్కో వికెట్ పడగొట్టారు. స్పిన్నర్ కేశవ్ మహరాజ్ రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంగ్లండ్ బ్యాటర్లలో 37 పరుగులతో జో రూట్ టాప్ రన్‌స్కోరర్‌గా నిలిచాడు.
మిగతా వాళ్లలో బెన్ డకెట్(24), బట్లర్(21), జోఫ్రా ఆర్చర్(25) మాత్రమే ఇరవై పరుగుల మార్కు దాటారు. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్‌ను అవుట్ చేయడం ద్వారా తన కెరీర్‌లో కీలక మైలురాయిని అందుకున్నాడు. ఎంగిడి బౌలింగ్‌లో 21 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద.. కేశవ్ మహరాజ్‌కు క్యాచ్ ఇచ్చి బట్లర్ నిష్క్రమించాడు.
ఇక ఎంగిడికి ఇది వన్డేల్లో వందో వికెట్ కావడం విశేషం. అంతేకాదు.. సౌతాఫ్రికా తరఫున తక్కువ బంతుల్లోనే ఈ ఫీట్ అందుకున్న రెండో బౌలర్‌గానూ ఎంగిడి నిలిచాడు. ఇక ఓవరాల్‌గా సౌతాఫ్రికా బౌలర్లలో ఈ ఘనత సాధించిన పదమూడో బౌలర్ ఎంగిడి.
వన్డేల్లో సౌతాఫ్రికా తరఫున తక్కువ బంతుల్లోనే వంద వికెట్లు తీసిన బౌలర్లు
1. మోర్నీ మోర్కెల్- 2859 బంతుల్లో వంద వికెట్లు
2. లుంగి ఎంగిడి- 3048 బంతుల్లో వంద వికెట్లు
3. ఇమ్రాన్ తాహిర్- 3050 బంతుల్లో వంద వికెట్లు.
ఇంగ్లండ్ వర్సెస్ సౌతాఫ్రికా తుదిజట్లు
సౌతాఫ్రికా
ట్రిస్టన్ స్టబ్స్, ర్యాన్ రికెల్టన్, రాసీ వాన్ డెర్ డస్సెన్, ఐడెన్ మార్క్రమ్(కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), డేవిడ్ మిల్లర్, వియాన్ ముల్డర్, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, లుంగి ఎంగిడి.
ఇంగ్లండ్
ఫిలిప్ సాల్ట్, బెన్ డకెట్, జామీ స్మిత్(వికెట్ కీపర్), జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్(కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జామీ ఓవర్టన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, సకీబ్ మహమూద్.
చదవండి: Karun Nair: మళ్లీ శతక్కొట్టాడు.. సెలబ్రేషన్స్‌తో సెలక్టర్లకు స్ట్రాంగ్ మెసేజ్!
A tough outing for #JosButtler ends as #LungiNgidi finally gets his wicket.
The English batter departs after battling hard in a challenging situation.#ChampionsTrophyOnJioStar 👉 #SAvENG | LIVE NOW on Star Sports 2 & Sports18-1 pic.twitter.com/fFMdIRyYeS— Star Sports (@StarSportsIndia) March 1, 2025
Comments
Please login to add a commentAdd a comment