సిక్స్ కొట్టిన కోహ్లి.. బిత్తరపోయిన ఎంగిడి
జొహన్నెస్‌బర్గ్ : దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగో వన్డేలో టీమిండియా ఓడినా ఓ విషయం మాత్రం భారత అభిమానులను థ్రిల్ చేస్తోంది. అద్భుత ఫామ్‌తో చెలరేగుతున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఈ మ్యాచ్‌లో మరో హాఫ్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. అయితే సాధారణంగా కోహ్లి బంతిని గాల్లోకి లేపాడానికి ఇష్టపడడు. అవకాశం చిక్కినప్పుడే సిక్స్ కొడుతాడు. అలాగే నిన్నటి మ్యాచ్‌లో కోహ్లి ఓ సిక్స్ కొట్టాడు. లుంగి ఎంగిడి వేసిన 17 ఓవర్ రెండో బంతిని కోహ్లి ఒక అడుగు ముందుకేసి స్ట్రయిట్‌గా సిక్సు కొట్టాడు. ఈ స్ట్రేట్ డ్రైవ్ షాట్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ‘షాట్ ఆఫ్ ది సిరీస్’ అంటూ తమ ఆనందాన్ని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు.
75 పరుగులు చేసిన అనంతరం కోహ్లి క్యాచ్ అవుట్‌గా వెనుదిరిగాడు. శిఖర్ ధావన్(105) అజేయ సెంచరీతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసింది. వర్షం కారణంగా దక్షిణాఫ్రికా లక్ష్యాన్ని 28 ఓవర్లలో 202 పరుగులుగా నిర్ణయించగా... ఆ జట్టు 25.3 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసి గెలిచింది.
WHAT A SHOT 🙌
— Vιяαт Kσнℓι (@imPriyaVK) 10 February 2018
VIRAT INCREDIBLE KOHLI 👑@imVkohli #SAvIND 🇮🇳 pic.twitter.com/OnbmclPqCT
Comments
Please login to add a commentAdd a comment