
చెన్నై : చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు, దక్షిణాఫ్రికా కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ కొంత ఆలస్యంగా తన ఐపీఎల్ జట్టుతో చేరతాడు. అతని భార్య రెండో బిడ్డకు జన్మనివ్వనుండటంతో ఆమెతో ఉండాలని ప్లెసిస్ నిర్ణయించుకున్నాడు. మరో సహచర దక్షిణాఫ్రికా క్రికెటర్ లుంగీ ఇన్‌గిడితో కలిసి సెప్టెంబర్ 1న అతను యూఏఈలో జట్టుతో కలుస్తాడు. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్, సీఎస్‌కే కోచ్ ఫ్లెమింగ్, బ్యాటింగ్ కోచ్ మైక్ హస్సీ నేరుగా ఆగస్టు 22న దుబాయ్ చేరుకుంటారు. చెన్నై జట్టులోని ఇతర విదేశీ ఆటగాళ్లు డ్వేన్ బ్రేవో, సాన్‌ట్నర్, తాహిర్ ప్రస్తుతం కరీబియన్ ప్రీమియర్ లీగ్ ఆడుతున్నారు. వారు ఎప్పుడొస్తారనేదానిపై స్పష్టత లేదు. ఇంగ్లండ్– ఆస్ట్రేలియా వన్డే సిరీస్ ముగిసిన తర్వాతే స్యామ్ కరన్, జోష్ హాజల్‌వుడ్ తమ ఐపీఎల్ జట్లతో కలిసే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment