న్యూజిలాండ్‌తో రెండో టెస్టుకు మందు దక్షిణాఫ్రికాకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్దార్ పేసర్ లుంగీ ఎంగిడీ వెన్ను నొప్పి కారణంగా రెండో టెస్ట్‌కు దూరమయ్యాడు. తొలి టెస్టుకు దూరమైన ఎంగిడి.. రెండో టెస్టుకు గాయం నుంచి కోలుకుంటాడాని టీమ్ మేనేజ్‌మెంట్ భావించింది. అయితే గాయం నుంచి కోలుకోపోవడంతో ఎంగిడి జట్టు నుంచి తప్పుకున్నట్లు ప్రోటిస్ కెప్టెన్ ఎల్గర్ తెలిపాడు. తొలి టెస్టుకు ముందు అతడు పూర్తిగా బౌలింగ్ చేయలేకపోయాడు. రెండో టెస్టుకు కోలుకుంటాడని భావించాం.
అయితే అతడు ఇంకా పూర్తిగా కోలుకోలేదు. అతడు మాతో ప్రాక్టీస్‌లో కూడా పాల్గోనడంలేదు. అతడు జట్టుకు దూరం కావడం మాకు పెద్ద ఎదురు దెబ్బ. ఎందుకుంటే మా బౌలింగ్ లైనప్‌లో అతడు చాలా కీలకం అని ఎల్గర్ పేర్కొన్నాడు. మరో వైపు స్టార్ బౌలర్ అన్రిచ్ నార్ట్జే కూడా కీవిస్ పర్యటనకు దూరమైన సంగతి తెలిసిందే. ఇక తొలి టెస్టులో ఘోర పరాజయం పొందిన దక్షిణాఫ్రికా తిరిగి పుంజుకోవాలని భావిస్తోంది. ఫిబ్రవరి 25న దక్షిణాఫ్రికా- న్యూజిలాండ్ మధ్య రెండో టెస్ట్ ప్రారంభం కానుంది.
చదవండి: Ajinkya Rahane : 'ఏంటి రహానే మరి మారవా.. మళ్లీ డకౌట్ అయ్యావా'
Comments
Please login to add a commentAdd a comment