WI Vs SA: టి20 సిరీస్‌ కైవసం చేసుకున్న దక్షిణాఫ్రికా | WI Vs SA: South Africa Beat West Indies In 5th T20 Win Series | Sakshi
Sakshi News home page

WI Vs SA: టి20 సిరీస్‌ కైవసం చేసుకున్న దక్షిణాఫ్రికా

Published Mon, Jul 5 2021 7:40 AM | Last Updated on Mon, Jul 5 2021 8:30 AM

WI Vs SA: South Africa Beat West Indies In 5th T20 Win Series - Sakshi

దక్షిణాఫ్రికా జట్టు(ఫొటో కర్టెసీ: ఏఎఫ్‌పీ)

సెయింట్‌ జార్జెస్‌: వెస్టిండీస్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను దక్షిణాఫ్రికా సొంతం చేసుకుంది. నిర్ణాయక ఐదో మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 25 పరుగుల తేడాతో వెస్టిండీస్‌ను ఓడించి సిరీస్‌ను 3–2తో దక్కించుకుంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి 168 పరుగులు చేసింది. మార్క్‌రమ్‌ (48 బంతుల్లో 70; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), క్వింటన్‌ డికాక్‌ (42 బంతుల్లో 60; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ శతకాలతో రాణించారు.

వీరిద్దరు రెండో వికెట్‌కు 128 పరుగులు జోడించారు. లక్ష్యఛేదనలో వెస్టిండీస్‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 143 పరుగులు చేసి ఓడింది. ఎవిన్‌ లూయిస్‌ (34 బంతుల్లో 52; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఆకట్టుకున్నాడు. ఇన్‌గిడి 3 వికెట్లు తీయగా... రబడ, వియాన్‌ ముల్దర్‌ చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు. మార్క్‌రమ్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డును దక్కించుకోగా... ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’గా షమ్సీ నిలిచాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement