అంతర్జాతీయ టీ20ల్లో దక్షిణాఫ్రికా స్టార్ ఓపెనర్ క్వింటన్ డికాక్ అరుదైన ఘనత సాధించాడు. టీ20ల్లో అత్యంత వేగవంతంగా హాఫ్ సెంచరీ చేసిన దక్షిణాఫ్రికా ఆటగాడిగా డికాక్ రికార్డు సృష్టించాడు. ఆదివారం సెంచూరియన్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన రెండో టీ20లో.. కేవలం 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్న డికాక్ ఈ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.
ఇక ఓవరాల్‌గా ప్రపంచక్రికెట్‌లో ఈ ఘనత సాధించిన జాబితాలో డికాక్ ఐదో స్థానంలో నిలిచాడు. తొలి స్థానంలో టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ఉన్నాడు. 2007 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో యువీ కేవలల 12 బంతుల్లోనే అర్ధసెంచరీ సాధించాడు.
ఇక రెండో టీ20లో డికాక్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. 44 బంతులు ఎదుర్కొన్న డికాక్ 9 పోర్లు, 8 సిక్స్‌ల సాయంతో 100 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో విండీస్‌పై దక్షిణాఫ్రికా రికార్డు విజయం సాధించింది. 259 పరుగుల లక్ష్యాన్ని 18.5 ఓవర్లలోనే ఛేదించి దక్షిణాఫ్రికా ప్రపంచరికార్డు సృష్టించింది.
చదవండి: SA vs WI: టీ20 మ్యాచ్‌లో 517 పరుగులు.. దెబ్బకు ప్రపంచ రికార్డు బద్దలు! ఇదే తొలిసారి
That was special 🔥#SAvWI #BePartOfIt pic.twitter.com/rruu4aYa0h
— Proteas Men (@ProteasMenCSA) March 26, 2023
Comments
Please login to add a commentAdd a comment