PBKS Vs LSG: Fans Says No Place For De-Kock-Kyle Mayers Hit 54 Runs In 24 Balls Against PBKS - Sakshi
Sakshi News home page

#KyleMayers: ఏమా విధ్వంసం.. ఇలా ఆడితే డికాక్‌కు కష్టమే!

Published Fri, Apr 28 2023 8:26 PM | Last Updated on Sat, Apr 29 2023 12:12 PM

Fans Says No Place For De-Kock-Kyle Mayers Hit-24 Balls-54 Runs Vs PBKS - Sakshi

Photo: IPL Twitter

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో కైల్‌ మేయర్స్‌ తన సంచలన ప్రదర్శన కొనసాగిస్తున్నాడు. ఈ సీజన్‌తోనే ఐపీఎల్‌లో డెబ్యూ ఇచ్చిన మేయర్స్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో చెలరేగుతున్నాడు. తాజాగా పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో కైల్‌ మేయర్స్‌ తుఫాన్‌ ఇన్నింగ్స్‌తో విరుచుకుపడ్డాడు.

పంజాబ్‌ బౌలర్లను ఉతికారేసిన మేయర్స్‌ ఏడు ఫోర్లు,  4 సిక్సర్లు బాదాడు. 44 పరుగుల వద్ద సిక్సర్‌ బాదిన మేయర్స్‌ 20 బంతుల్లో హాఫ్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.  అయితే 24 బంతుల్లోఈ సీజన్‌లో మేయర్స్‌కు ఇది నాలుగో అర్థసెంచరీ కాగా.. మొత్తంగా 8 మ్యాచ్‌లాడిన మేయర్స్‌ 297 పరుగులు చేశాడు.

అయితే కైల్‌ మేయర్స్‌ తన సూపర్‌ ఫామ్‌ కనబరుస్తుండడంతో క్వింటన్‌ డికాక్‌ బెంచ్‌కే పరిమితం అయ్యాడు. మేయర్స్‌ తప్పించే సాహసం కేఎల్‌ రాహుల్‌ చేయడం లేదు. ఒకవేళ కైల్‌ మేయర్స్‌ విధ్వంసం ఇలాగే కొనసాగితే మాత్రం డికాక్‌ ఈ సీజన్‌లో ఒక్క మ్యాచ్‌ కూడా ఆడకపోవచ్చు.   

చదవండి: పంజాబ్‌, లక్నో మ్యాచ్‌కు పొంచిఉన్న ముప్పు.. ఏ క్షణమైనా!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement