Photo: IPL Twitter
లక్నో సూపర్ జెయింట్స్ ఓపెనర్ క్వింటన్ డికాక్ ఐపీఎల్ 16వ సీజన్‌లో తొలి మ్యాచ్ ఆడాడు. ఆదివారం గుజరాత్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో 31 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్న డికాక్ ఇన్నింగ్స్‌లో ఏడు ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. కాగా ఈ సీజన్‌లో తొలి రెండు మ్యాచ్‌లకు దూరంగా ఉన్న డికాక్ ఆ తర్వాత జట్టుతో కలిసినప్పటికి విదేశీ కోటాలో కైల్ మేయర్స్, స్టోయినిస్, నికోలస్ పూరన్, మార్క్‌వుడ్‌లు ఉండడంతో డికాక్ దాదాపు 10 మ్యాచ్‌లకు దూరంగా ఉండాల్సి వచ్చింది.
అందరూ మంచి ప్రదర్శన కనబరుస్తుండడంతో ఎవరిని తీయాలో కేఎల్ రాహుల్‌కు అర్థం కాలేదు. అయితే ఆర్‌సీబీతో మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన కెప్టెన్ కేఎల్ రాహుల్ తాజాగా టోర్నీ మొత్తానికి దూరం కావడంతో డికాక్ తుది జట్టులోకి వచ్చాడు. గతేడాది ఫామ్‌ను కంటిన్యూ చేసిన డికాక్.. వచ్చీ రావడంతోనే అర్థసెంచరీతో మెరిశాడు.
ఇక అహ్మదాబాద్ వేదికగా గుజరాత్‌తో జరుగుతున్న మ్యాచ్‌కు ఎండవేడిమి ఎక్కువగా ఉంది. దీనికి తోడు మ్యాచ్ మధ‍్యాహ్నం జరగడంతో స్టేడియంలో వడగాలులు వీచాయి. ఎండ వేడిమికి భరించలేని డికాక్ డీ హైడ్రేట్ అయినట్లు కనిపించాడు. అందుకే ఫిఫ్టీ మార్క్ అందుకున్నప్పటికి.. సీజన్‌లో తొలి అర్థసెంచరీ అయినప్పటికి ఎలాంటి సెలబ్రేషన్ చేసుకోలేకపోయాడు.
సింపుల్‌గా బ్యాట్ పైకెత్తిన డికాక్ నీరసంగా స్ట్రైక్ ఎండ్‌వైపు నడవడం కనిపించింది. అంతకముందు బ్రేక్ సమయంలోనూ డికాక్ ప్లూయిడ్స్ తీసుకోవడం కనిపించింది. దీన్నిబట్టి డికాక్ చాలా అలిసిపోయినట్లు అనిపించింది. ఓవరాల్‌గా 41 బంతుల్లో ఏడు ఫోర్లు, మూడు సిక్సర్లతో 71 పరుగులు చేసి ఔటయ్యాడు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
𝗕𝗮𝗰𝗸 𝘄𝗶𝘁𝗵 𝗮 𝗯𝗮𝗻𝗴 👊💥
— JioCinema (@JioCinema) May 7, 2023
Quinton de Kock marks his return to #TATAIPL action with a blistering 50 #GTvLSG #IPLonJioCinema #IPL2023 | @QuinnyDeKock69 pic.twitter.com/V1YuVeBOoX
Comments
Please login to add a commentAdd a comment