Photo: IPL Twitter
లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్ మ్యాచ్ ద్వారా ఐపీఎల్‌లో మరో సంచలనం పుట్టుకొచ్చాడు. మ్యాచ్‌లో పంజాబ్ ఓడినప్పటికి తాను మాత్రం గెలిచాడు. కొండంత లక్ష్యం కనబడుతున్నా ఏ మాత్రం బెదరక ఇన్నింగ్స్ ఆడిన తీరు అద్భుతమని చెప్పొచ్చు. అతనే అథర్వ తైదే.
23 ఏళ్ల తైదే పంజాబ్ కింగ్స్ తరపున ఐపీఎల్‌లో తొలి అర్థసెంచరీ సాధించాడు. 33 బంతుల్లో 66 పరుగులు చేసిన తైదే.. 26 బంతుల్లో ఫిఫ్టీ మార్క్ అందుకున్నాడు. అతని ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. ఇక మ్యాచ్ విషయానికి వస్తే 258 పరుగుల కష్టసాధ్యమైన లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ 19.5 ఓవర్లలో 201 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో లక్నో 56 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది.
ఎవరీ అథర్వ తైదే?
మహారాష్ట్రలోని అకోలా ప్రాంతానికి చెందిన అథర్వ తైదే 2018-19సీజన్‌లో విజయ్ హజారే ట్రోఫీ ద్వారా లిస్ట్- ఏ క్రికెట్‌లో విదర్భ తరపున అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత రంజీ ట్రోఫీ ద్వారా ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లోనూ అడుగుపెట్టాడు. ఇక 2019 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ద్వారా టి20 క్రికెట్‌లో అడుగుపెట్టాడు. 2022లో జరిగిన ఐపీఎల్ మెగావేలంలో పంజాబ్ కింగ్స్ అథర్వ తైదేను కొనుగోలు చేసింది. 15 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో 887 పరుగులు, 24 లిస్ట్-ఏ మ్యాచ్‌ల్లో 758 పరుగులతో పాటు 8 వికెట్లు, 33 టి20 మ్యాచ్‌ల్లో 774 పరుగులతో పాటు 10 వికెట్లు తీశాడు.
A well made FIFTY by Atharva Taide off 26 deliveries.
— IndianPremierLeague (@IPL) April 28, 2023
Live - https://t.co/6If1I4omN0 #TATAIPL #PBKSvLSG #IPL2023 pic.twitter.com/P3iMu1KQu6
Time and Taide wait for no man 😉#IPLonJioCinema #PBKSvLSG #TATAIPL #IPL2023 pic.twitter.com/OMsyXX67z3
— JioCinema (@JioCinema) April 28, 2023
చదవండి: లక్నో సూపర్ జెయింట్స్‌ది రికార్డే.. ఆర్‌సీబీని మాత్రం కొట్టలేకపోయింది
Comments
Please login to add a commentAdd a comment