SA vs WI Shatter Record For Highest Aggregate Ever Scored in T20Is - Sakshi
Sakshi News home page

SA vs WI: టీ20 మ్యాచ్‌లో 517 పరుగులు.. దెబ్బకు ప్రపంచ రికార్డు బద్దలు! ఇదే తొలిసారి

Published Mon, Mar 27 2023 1:14 PM | Last Updated on Mon, Mar 27 2023 2:27 PM

SA vs WI shatter record for highest aggregate ever scored in T20Is - Sakshi

సెంచూరియన్‌ వేదికగా దక్షిణాఫ్రికా-వెస్టిండీస్‌ జట్ల మధ్య జరిగిన రెండో టీ20లో పరుగుల వరద పారింది. ఇరు జట్ల ఆటగాళ్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. సూపర్‌స్పోర్ట్ పార్క్ మైదానంలో బౌండరీల వర్షం కురిపించారు. ఈ మ్యాచ్‌లో రెండు  జట్లు కలిపి ఏకంగా 517 పరుగులు సాధించాయి. తొలుత బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి  258 పరుగుల భారీ స్కోర్‌ చేసింది.

అనంతరం 259 పరుగుల లక్ష్యాన్ని 18.5 ఓవర్లలోనే ఛేదించి దక్షిణాఫ్రికా ప్రపంచరికార్డు సృష్టించింది. టీ20 క్రికెట్‌ చరిత్రలోనే అత్యధిక టార్గెట్‌ను ఛేజ్‌ జట్టుగా సౌతాఫ్రికా నిలిచింది. అంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా (245/5) జట్టు పేరిట ఉంది.

2018లో న్యూజిలాండ్‌ జట్టుతో (20 ఓవర్లలో 243/6)తో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఈ రికార్డు నమోదు చేసింది. కాగా ప్రోటీస్‌ ఇన్నింగ్స్‌లో క్వింటన్‌ డి కాక్‌ (44 బంతుల్లో 100; 9 ఫోర్లు, 8 సిక్స్‌లు) దూకుడుగా ఆడి 43 బంతుల్లో శతకం బాదగా, హెన్‌డ్రిక్స్‌ (28 బంతుల్లో 68; 11 ఫోర్లు, 2 సిక్స్‌లు) అండగా నిలిచాడు.

ప్రపంచ రికార్డు సృష్టించిన విండీస్‌-దక్షిణాఫ్రికా మ్యాచ్‌
ఇక పరుగుల సునామీ సృష్టించిన విండీస్‌-దక్షిణాఫ్రికా రెండో టీ20 మ్యాచ్‌ మరో ప్రపంచ రికార్డును కూడా నమోదు చేసింది. టీ20 క్రికెట్‌ చరిత్రలోనే రెండు ఇన్నింగ్స్‌లు కలిపి అత్యధిక పరుగులు నమోదైన మ్యాచ్‌గా ఈ రెండో టీ20 నిలిచింది. ఈ మ్యాచ్‌లో విండీస్‌-ప్రోటీస్‌ జట్లు కలిపి 517 పరుగులు సాధించాయి.

ఇంతకుముందు ఈ రికార్డు పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌-2023లో భాగంగా క్వెట్టా గ్లాడియేటర్స్ , ముల్తాన్ సుల్తాన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌ పేరిట ఉండేది. ఈ మ్యాచ్‌లో రెండు జట్లు కలిపి 515 పరుగులు చేశాయి. తాజా మ్యాచ్‌లో విధ్వంసం సృష్టించిన విండీస్‌,దక్షిణాఫ్రికా జట్లు ఈ ప్రపంచ రికార్డును బ్రేక్‌ చేశాయి.
చదవండి: SA vs WI: చరిత్ర సృష్టించిన దక్షిణాఫ్రికా.. ప్రపంచంలోనే తొలి జట్టుగా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement